హిల్లరీని మరోసారి టార్గెట్ చేసిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ హిల్లరీగా భారీగానే టార్గెట్ చేశారు. ఎన్నికల్లో తనకు ప్రధానపోటీ ఇచ్చిన డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీని ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. తాను అధికారంలోకి వస్తే హిల్లరీ క్లింటన్ ను జైలుకు పంపిస్తానని పదే పదే హెచ్చరించిన ట్రంప్ ఆ వైపుగా పావులు కదుపుతున్నారు. క్లింటన్ పై దాడిని ఎక్కుపెడుతూ శుక్రవారం చేసిన ట్వీట్ ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. ఈ-మెయిల్స్ అస్త్రాన్ని మరోసారి వాడుకున్న ట్రంప్. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెకు అసలు పోటీచేసే అవకాశమే లేదన్నారు. కానీ ఆమె పట్ల చాలా ఉదాహరంగా వ్యవహరించారన్నారు. ఆమె తప్పుడు ప్రచారం చేశారు కనుకనే ఎన్నికల్లో ఓడిపోయారని.. ఇందులోఆశ్చర్యం ఏమీ లేదంటూ హిల్లరీ అనుచరులపై మండిపడ్డారు.
అలాగే యూఎస్ న్యాయాధికారి ఇనస్పెక్టర్ జనరల్ ఆండ్రూ నపోలిటానో గురువారం వ్యాఖ్యానించారు. హిల్లరీ ఈ-మెయిల్స్ వ్యవహారంపై ఎఫ్ బీఐ రెండుసార్లు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, మరోసారి విచారణ చేసే అవకాశం ఉందని ఆండ్రూ వెల్లడించారు. ఈ కేసు విచారణను పునః ప్రారంభించాలంటూ పిటిషన్ దాఖలు అయిందని వెల్లడించారు.
మరోవైపు దర్యాప్తునకు పూర్తి సహాకారాన్ని అందిస్తామని హిల్లరీ ప్రతినిధి బ్రియాన్ ఫల్లోన్, గురువారం చెప్పారు. అలాగే జనవరి 20 న ప్రమాణ స్వీకారం చేసే ట్రంప్ కు విచారణ రద్దుచేసే అధికారం ఉండదంటున్నారు.. ఫెడరల్ చట్టం ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్కు 30 రోజులు ముందుగానే రాతపూర్వక సమాధానం ఇవ్వాలని వాదిస్తున్నారు. కాగా విదేశాంగ శాఖ కార్యదర్శిగా హిల్లరీ కొనసాగిన సమయంలో, తన అధికారిక కార్యకలాపాలకు వ్యక్తిగత ఈ-మెయిల్స్ ను వాడారంటూ, ఆరోపణలు వచ్చాయి. దీంతో తన ప్రచారం సందర్భంగా ట్రంప్ హిల్లరీ శిక్ష నుంచి తప్పించుకోలేరని, ఆమెను పారిపోనివ్వమని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
What are Hillary Clinton's people complaining about with respect to the F.B.I. Based on the information they had she should never.....
— Donald J. Trump (@realDonaldTrump) January 13, 2017
have been allowed to run - guilty as hell. They were VERY nice to her. She lost because she campaigned in the wrong states - no enthusiasm!
— Donald J. Trump (@realDonaldTrump) 13 January 2017