
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టైన్ తమను లైంగికంగా వేధించినట్లు ఏంజిలినాజోలీతోపాటు ఎందరో నటీమణులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై హిల్లరీ ఓఇంటర్వ్యూలో మాట్లాడుతూ హార్వేను ట్రంప్‌తో పోల్చారు.
అత్యాచారానికి పాల్పడినట్లు ఒప్పుకున్న వ్యక్తినే తమ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఈ లైంగిక వేధింపుల సమస్య ఉందని చెప్పారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పైనా వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయని తెలిపారు. ఆయనకు సంబంధించి అనేక అభ్యంతరకర టేపులు విడుదలయ్యాయని, కానీ, వాటిలో ఏ ఒక్కటీ ట్రంప్ గెలుపును అడ్డుకోలేకపోయాయన్నారు. హార్వే ఎప్పటి నుంచో డెమొక్రటిక్ పార్టీకి బూరీ విరాళ దాత. పైగా ఒబామా కూతురు కూడా ఆయన వద్దే అప్రెంటిస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో టీవీ షోలో హార్వేకు సంబంధించిన విషయాన్ని హిల్లరీని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment