requests
-
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి: ప్రధానితో సీఎం జగన్
సాక్షి, అమరావతి: విభజన వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి వీడ్కోలు పలికిన సీఎం జగన్.. పలు విజ్ఞప్తులతో కూడిన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. విజ్ఞాపన పత్రంలోని ముఖ్యమైన అంశాలు ►రీసోర్సు గ్యాప్ గ్రాంటు అంశాన్ని ప్రస్తావిస్తూ.. రూ.34,125.5 కోట్ల రూపాయలను రీసోర్స్ గ్యాప్ కింద గ్రాంటుగా ఇవ్వాలని కోరారు. ► తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాలి. ► పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపండి. ► జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్ విషయంలో హేతు బద్ధత లేదు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోంది. దానిని సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలి. ► రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలి. ► భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్‌లు మంజూరుచేయాలి. ► ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. -
పరిశ్రమల సమస్యలపై డీజీపీకి టిఫ్ వినతి
సాక్షి, హైదరాబాద్: సుమారు 50 రోజుల తర్వాత పరిశ్రమలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డికి విన్నవించింది. పరిశ్రమలు నడిచేందుకు వీలుగా అనుబంధ సంస్థలు, ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. అనుబంధ సంస్థలు, ఇతర దుకాణాలు తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ వారికి హామీ ఇచ్చారు. జంట నగరాల పరిధిలోని పరిశ్రమలు రాణిగంజ్ మీద ఆధారపడిన నేపథ్యంలో జీహెచ్ఎంసీతో సంప్రదిస్తామన్నారు. లాక్డౌన్ మూలంగా ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులు తిరిగి హైదరాబాద్‌కు వచ్చేందుకు పాస్‌లు జారీ చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. పారిశ్రామిక వాడలోని స్పేర్‌పార్టులు, రిపేరింగ్ షాపులు, ఇతరత్రా ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీలకు కూడా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. పారిశ్రామికవాడల్లో కాకుండా ఇతర వాణిజ్య సముదాయాల్లో చిన్న చిన్న వ్యాపారాలు నడిచే శోభన కాలనీ, బాలానగర్, గీతానగర్, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు డీజీపీ అంగీకరించినట్లు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య వెల్లడించింది. డీజీపీని కలిసిన వారిలో తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య అధ్యక్షులు కొండవీటి సుధీర్‌రెడ్డి, కార్యదర్శి మిరుపాల గోపాల్‌రావు, పారిశ్రామికవేత్త షేక్ మదర్ సాహెబ్, బల్క్ డ్రగ్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ జానీమియా, జీడిమెట్ల ఐలా చైర్మన్ సదాశివరెడ్డి తదితరులు ఉన్నారు. -
చప్పట్లు కొట్టారు.. దీపాలు వెలిగించారు.. లాక్డౌన్ మరిచారు
సాక్షి, హైదరాబాద్: రెండు వారాల క్రితం జనతాకర్ఫ్యూ, రెండు రోజుల క్రితం ఐక్యతకు నిదర్శనంగా దీపాలు వెలిగించాలన్న ప్రధాని పిలుపునకు ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. చప్పట్లు చరచడం, దీపాలు వెలిగించడంలో చొరవ చూపిన జనం లాక్‌డౌన్‌ను అమలు చేసే విషయంలో మాత్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 75 శాతం ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పాలు, కూరలు లాంటి అత్యవసరాలు కొనేందుకు రోడ్డెక్కి ఆ తర్వాత ఇళ్లకే పరిమితమవుతున్నారు. కానీ మరో 25 శాతం మంది లాక్‌డౌన్‌ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అవసరం ఉన్నా లేకున్నా అదేపనిగా రోడ్డెక్కుతున్నారు. కనిపించిన పరిచయస్తులతో కబుర్లు చెబుతూ అకారణంగా జనసమూహాలకు కారణమవుతున్నారు. లాక్‌డౌన్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మర్కజ్ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత ఒక్కసారిగా వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో పరిస్థితి చేయిదాటకుండా లాక్‌డౌన్‌ను అత్యంత పకడ్బందీగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఏప్రిల్ 14తో లాక్డౌన్ గడువు పూర్తవుతున్నందున, దాన్ని మరికొన్ని వారాలు కొనసాగించాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీని కోరారు. అభివృద్ధి చెందుతున్న స్థితిలో ఉన్న మనదేశానికి కరోనాను నియంత్రించాలంటే లాక్డౌన్ తప్ప మరో గత్యంతరం లేదని సీఎం స్పష్టంగా చెబుతోన్న సమయంలో, బాధ్యత లేని కొంతమంది లాక్‌డౌన్‌ను బేఖాతరు చేస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల నిర్లక్ష్యం వల్ల పెను విపత్తుకు అవకాశం కలిగే ప్రమాదం ఉంటుందన్న హెచ్చరికలను వీరే మాత్రం పట్టించుకోవటం లేదు. లాక్డౌన్ విధించిన తొలిరోజు జనం ఇలాగే రోడ్లపైకి వచ్చారు. దేశవ్యాప్తంగా ఇలాంటి దృశ్యాలే కనిపించడంతో అప్పట్లో ప్రధాని మోదీ తీవ్రంగా పరిగణించి అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. వెంటనే మన పోలీసు శాఖ స్పందించి కట్టడి చేసింది. దీంతో కొన్ని రోజుల పాటు పరిస్థితి అదుపులో ఉంది. కానీ మళ్లీ కొన్ని ప్రాంతాల్లో అదుపు తప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో క్రమంగా పరిస్థితి మెరుగవుతోన్న తరుణంలో హైదరాబాద్‌లోని యావత్తు పాతనగరం సహా యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, చింతల్ బస్తీ, ముషీరాబాద్, జమిస్తాన్పూర్, మెహిదీపట్నం, నార్సింగి... ఇలా పలు ప్రాంతాల్లో జనం విచ్చలవిడిగా లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ విషయంలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల సూచనలు.. ♦ కూరగాయలు అమ్మేవారిపై ఆంక్షలు లేవు. ఫలితంగా సాధారణ రోజుల కంటే ఎక్కువ మంది విక్రేతలు కాలనీలు, మార్కెట్ల లో కూరగాయలు అమ్ముతున్నారు. కాలనీల్లో కూరలమ్మే వారి మధ్య కనీస దూరం ఉండేలా చూడాలి. ప్రజలు కూడా వందల సంఖ్యలో మార్కెట్లకు చేరుతున్నారు. అలా రాకుండా చర్యలు తీసుకోవాలి. మార్కెట్లకు సాధారణ ప్రజలను అనుమతించొద్దు. ♦ లాక్డౌన్ అమలులోకి రాగానే పోలీసు సిబ్బంది దుకాణాల వద్ద మీటరు దూరం చొప్పున నేలపై వృత్తాకారంలో గీతలు గీయించారు. ఒక్కో కొనుగోలుదారు ఆ వృత్తంలో ఉంటూ ముందుకు సాగి వస్తువులు కొనాలి. కానీ అది ఇప్పుడు అమలవ్వడం లేదు. జనం ఆ వృత్తాల్లోనే ఉండేలా చూసే బాధ్యతను దుకాణదారులకే అప్పగించాలి. ఎక్కడైనా గుంపుగా ఉంటే దుకాణదారులపై చర్యలు తీసుకోవాలి. ♦ మైకుల ద్వారా పోలీసులు హెచ్చరిస్తూ పహారాగా తిరుగుతుంటే జనంలో మార్పు వస్తుంది. అవసరమైతే గుంపులుగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి. చాలాచోట్ల యువకులు రోడ్లపై అనవసరంగా తిరుగుతున్నారు. అలాంటి వారి వాహనాలను జప్తు చేయాలి. అవసరమైతే లైసెన్సు కూడా రద్దు చేయాలి. ♦ దుకాణాలు తెరిచి ఉన్నంత సేపు జన సంచారం ఉంటోంది. అందుకే దుకాణాలను సాయంత్రం 6 వరకు కాకుండా మధ్యాహ్నమే మూతపడేలా చూడాలి. మందుల షాపులు మాత్రమే ఉండేలా చూడాలి. ♦ చాలా చోట్ల కేఫ్‌ల షట్టర్లు మూసి లోపల టీ తయారు చేసి ఫ్లాస్కోల ద్వారా బయట అమ్ముతున్నారు. పాన్షాపులదీ ఇదే తీరు. ఇలా అక్రమంగా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటే అవి మూతపడతాయి. ఇది హైదరాబాద్ పాత నగరంలోని జహనుమా రోడ్డుపై సోమవారం ఉన్న పరిస్థితి. లాక్డౌన్ అమలవుతోన్న తరుణంలో జనం ఇలా బాధ్యతారహితంగా రోడ్డెక్కారు. కరోనా బాధితుల సంఖ్య పాత నగరంలో పెరుగుతోన్న తరుణంలో అక్కడ మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉండగా, లాక్డౌన్ ఇలా అపహాస్యం పాలవుతోంది. -
మా పదవీ విరమణను 65 ఏళ్లకు పెంచాలి
సాక్షి, హైదరాబాద్: తమ రిటైర్మెంట్ వయసు కూడా 65 ఏళ్లకు పెంచాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు నిమ్స్ డాక్టర్లు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రొఫెసర్ల వయసును 65 ఏళ్లకు పెంచుతూ జూన్‌లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని కాలేజీల్లో ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినప్పటికీ, నిమ్స్‌లో మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు. నిమ్స్ అటానమస్ సంస్థ కావడంతో ఆ సంస్థ డైరెక్టర్ ఈ ఉత్తర్వులను అమలు చేయా ల్సి ఉంది. ఈ రెండు నెలల్లో ముగ్గురు ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఉందని, ఇకనైనా ఏజ్ హైక్ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని శనివారం మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు. -
ఎయిమ్స్‌కు నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: బీబీనగర్‌లో నిర్మితమవుతున్న ఎయిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాలల శాశ్వత భవనాలకు కేంద్ర బడ్జెట్లో రూ.1,028 కోట్ల నిధులను కేటాయించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. సోమవారం ఆయన ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యి పలు వినతి పత్రాలు అందించారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌లో మంజూరైన ఐటీఐఆర్ హబ్‌కు నిధులు కేటాయించాలని కోరారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో బ్లాక్ లెవల్ క్లస్టర్ల ఏర్పాటుకు వీలుగా రూ.1,013 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్–వరంగల్ వరకు జాతీయ రహదారి అభివృద్ధి పనులకు ఆర్థికపరమైన అనుమతులు ఇవ్వాలన్నారు. చేనేత కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలని కోరారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన పథకాల కింద చేనేత కార్మికులకు, 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వారికి ఆరోగ్య బీమా పథకం వర్తించేలా చర్యలు చేపట్టాల న్నారు. మూసీ నది ప్రక్షాళనకు ‘నమామి గంగా‘తరహాలో మిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. -
‘తెలంగాణకు ఉల్లి పంపండి’
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న ఉల్లి ధరలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణకు 500 టన్నుల ఉల్లి పంపాలని కేంద్ర పౌర సరఫరాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్టు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. కేంద్రం నుంచి ఉల్లిగడ్డ వచ్చే లోగా మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతు బజార్లలో బుధవారం నుంచి కిలో రూ.40కి అమ్మేందుకు మలక్‌పేట ఉల్లి హోల్‌సేల్ వ్యాపారస్తులు అంగీకరించారన్నారు. ఉల్లితోపాటు రాష్ట్రంలో జరుగుతు న్న పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్ సంచాలకుల కా ర్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కొ నుగోలు కేంద్రాలకు వచ్చిన పత్తిని ఏ రోజుకారో జు కొనేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం మా ర్కెట్‌కు 93 శాతానికిపైగా నాణ్యమైన తే మ శాతం ఉన్న పత్తి వస్తోందన్నారు. కేంద్రాల్లో తేమ కొలిచే యంత్రాలు.. అన్ని సీసీఐ కేంద్రాల్లో తేమ కొలిచే యం త్రాలు అవసరాల మేరకు సమకూర్చుకోవాలని పార్థసారథి సూచించారు. రోజు వారి కొనుగోళ్లు పూర్తయిన వెంటనే తక్కపట్టీలను బ్రాంచ్ మేనేజర్లకు పంపించి రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారంలో 6 రోజులు కొనుగోలు కేంద్రాలు పనిచేయాలని, కాటన్ సీడ్ విషయమై నెలకొన్న స్తబ్దత ను వెంటనే పరిష్కరించాలని సీసీఐ సీఎండీని కోరినట్లు తెలిపారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు ఆర్.లక్ష్మణుడు, పి.రవికుమార్, పత్తి మార్కెట్ కమిటీ కార్యదర్శులు, జిల్లా మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు. -
రూపాయి లేదు..వైద్యమెలా!
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: కష్టాలు, కన్నీళ్లు దిగమింగి బీటెక్ పూర్తి చేసిందామె. ఏడాది క్రితమే అనంతపురం నుంచి హైదరాబాద్ వచ్చి ఎస్సార్ నగర్ హాస్టల్లో ఉంటూ ఓ వైపు ప్రత్యేక కోర్సులు, మరోవైపు ఇంటర్వూ్యలకు హాజరవుతూ అదృష్టా న్ని పరీక్షించుకుంటోంది. శనివారం ఓ కంపెనీ ఇంటర్వూ్యకు హాజరై సెలక్ట్ కూడా అయింది. ఈ వార్తను సెల్ఫోన్లో అనంతపురంలో ఉన్న తండ్రి తో పంచుకుంటున్న సమయంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఒంటినిండా గాయాలతో చావుబతుకులతో పోరాడుతోంది. ఇది శనివారం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుబ్రా బేగం (23) దుస్థితి. ప్రసుత్తం ఆమె గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రి వద్ద కుబ్రా తల్లిదండ్రులు చేతిలో రూపాయి లేక విలవిల.. అనంతపురంనకు చెందిన కుబ్రా బేగం తండ్రి అబ్దుల్ అజీం. పెయింటర్‌గా సాదాసీదా జీవనం సాగిస్తూ కూతురు కుబ్రాతో పాటు కుమారుడు కాలిఖ్ను ఉన్నత చదువులు చదివించాడు. ఆయన సంపాదనంతా పిల్లల చదువులు, జీవనోపాధికే సరిపోయింది. ప్రమాదం గురించి తెలియగానే కుబ్రా తండ్రి, తల్లి, సోదరుడు హైదరాబాద్‌కు బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున నగ రానికి చేరుకున్న కుబ్రా తల్లిదండ్రులకు ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షల నిమిత్తం రూ.లక్షా పది వేలు అయ్యాయని చెప్పారు. కుబ్రాకు ఒళ్లంతా గాయాలున్నాయని, ఆపరేషన్ కోసం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని, చెల్లిస్తే మిగతా వైద్యం చేస్తామని తెలిపారు. అప్పటికే హైదరాబాద్‌లోని సమీప బంధువుల నుంచి రూ.30 వేలు తీసుకుని ఫీజు చెల్లించిన అబ్దుల్ రూ.5 లక్షల కోసం తనకు తెలిసిన వారందరికీ ఫోన్లు చేశాడు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆస్పత్రి ఎదుటే భార్య, కుమారుడితో విషాదంగా గడిపేశాడు. చేతిలో రూపాయి లేక కుబ్రాకు వైద్యం ఎలా చేయిం చాలో తెలియక సతమతమవుతున్నాడు. కుబ్రాను ఆస్పత్రిలో చేర్చించిన పోలీసులు ఆపై అటు కన్నెత్తి చూడలేదని వారు వాపోతున్నారు. ఆదివారం రాత్రి కుబ్రా సోదరుడు ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. తాము నిరుపేదలమని, రూ.5 లక్షలు చెల్లించే స్థోమత తమకు లేదని తన అక్క ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను వేడుకున్నాడు. -
రిట్ దాఖలు చేసిన వేణుగోపాల్
సాక్షి, హైదరాబాద్: పోలీసులు తనపై అక్రమంగా కేసులు బనాయించారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాల ని కోరుతూ సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం మాసపత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం, తెలంగాణ ప్రజా భద్రతా చట్టం కింద తనపై అక్రమ కేసు బనాయించారని, ఇది భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని హైకోర్టుకు తెలిపారు. ఈ రిట్‌ను గురువారం న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి విచారించారు. ఈ కేసు పూర్తి వివరాలు, బెయిల్ మంజూరు అంశాలపై వైఖరిని తెలపాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. హైదరాబాద్‌లో ఈ నెల 12న ఎన్.రవిశర్మ, బి.అనూరాధను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో హఠాత్తుగా వేణుగోపాల్ పేరును నిందితుడిగా చేర్చి పోలీసులు ఆయనను వేధింపులకు గురిచేస్తున్నారని వేణుగోపాల్ తరఫు న్యాయవాది రఘునాథ్ రిట్ దాఖలు చేశారు. ఆ ఇద్దరి రిమాండ్ కేసు డైరీలో ఉద్దేశపూర్వకంగా ఆయనను ఏడో ముద్దాయిగా పేర్కొన్నారన్నారు. -
ఫేస్‌బుక్‌కు పెరిగిన ప్రభుత్వ అభ్యర్థనలు
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్.. ఈ ఏడాది ప్రథమార్థంలో భారత్ నుంచి 22,684 అభ్యర్థనలను అందుకుంది. యూజర్ అకౌంట్లకు సంబంధించిన సమాచారం కోరుతూ ఈ అభ్యర్థనలను పొందినట్లు కంపెనీ వెల్లడించింది. అమెరికా 50,714 అభ్యర్థనలను కోరగా.. ఆ తరువాత స్థానంలో అత్యధిక రిక్వెస్ట్‌లు భారత్ నుంచే వచ్చాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.28 లక్షల అభ్యర్థనలను అందుకున్నట్లు తెలియజేసింది. గతేడాది జూలై–డిసెంబర్ కాలంలోని 1,10,634 రిక్వెస్ట్‌లతో పోల్చితే ఈ సారి 16 శాతం వృద్ధి ఉన్నట్లు తెలిపింది. -
ఆలకించయ్యా.. బాలయ్య
చిలమత్తూరు : మండలంలో సాగిన ఎమ్మెల్యే బాలకృష్ణ రెండో రోజు పర్యటనలో కూడా ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. మొరంపల్లి, కో డూరు, శెట్టిపల్లి, మరవకొత్తపల్లి, వీరాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. పింఛన్ రాలేద ని, కొందరు, రేషన్ సక్రమంగా అందలేదని కొందరు, ఇంటి స్థలాలు మంజూరు కాలేదని కొందరు ఇలాసమస్యలను పరిష్కారించాలంటూ వందలాది మంది ప్రజలు వినతులు అందజేశారు. ఆశా కార్యకర్తలకు న్యాయం చేయాలి : ప్రభుత్వాసుపత్రిలో, ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలో పనిచే సే ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కార్యకర్తలు బాలకృష్ణ వద్ద శెట్టిపల్లిలో మొరపెట్టుకున్నారు. సరైన గౌరవ వేతనం లేక నానా ఇబ్బందులు పడుతున్నామని వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. యువకులకు ఉద్యోగాలు కల్పించాలి యువకులకు ఉద్యోగాలు కల్పించాలంటూ నిరుద్యోగ యువత కోరారు. కియో పరిశ్రమం ఏర్పాటు జ రుగుతోందని అధికారులు, ప్రజాప్రతినిధులు తె లియజేస్తున్నారని స్థానికులకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. శెట్టిపల్లి ఎస్సీ కాలనీ వా సులకు గత కొన్ని నెలలుగా నీటి సమస్యతో పాటు ఇంటి పట్టాలు, నిర్మాణాల సమస్య ఉందని వాటిని పరిష్కరించాలన్నారు. కోడూరు పంచాయతీ లోని కనిశెట్టిపల్లిలో చౌకధాన్యపు డిపో సమస్యలను డీలర్ స్వయంగా బాలకృష్ణకు వివరించారు. అనంతరం వీరాపురంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. స్పెషల్ పార్టీ పోలీసుల అత్యుత్సాహం ఎమ్మెల్యే బాలకృష్ణకు సెక్యురిటీగా వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శించారు. అర్జీలు ఇచ్చుకోవడం కోసం వెళ్లిన ప్రజలను అడ్డుకున్నారు. సెక్యూరిటీ సమస్యలు వస్తాయనే సాకుతో చాలామంది ప్రజలు నేరుగా సమస్యలను తెలియజేసే అవకాశం ఇవ్వలేదు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అధికారులతో పాటు, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
మీ సేవలు బుట్ట దాఖలు
ఒంగోలు టౌన్ : జిల్లాలోని మీ సేవ కేంద్రాలకు వచ్చే అర్జీల్లో అధిక శాతం బుట్టదాఖలవుతున్నాయి. ప్రజలు తమకు కావలసిన సర్టిఫికెట్లను మీ సేవ కేంద్రాల ద్వారా పొందాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న తరువాత రోజుల తరబడి వాటి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. మీ సేవ కేంద్రాల నుంచి సంబంధిత శాఖలకు ఆ అర్జీలు వెళ్లినప్పటికీ అక్కడి అధికారులు వాటిని పక్కన పెట్టడంతో మీ సేవ కేంద్రాల ఉద్దేశం నీరుగారిపోతోంది. ఈ–సేవ కేంద్రాలుగా కొనసాగుతున్న వాటిని మీ–సేవ కేంద్రాలుగా మారుస్తూ 2011లో ఉన్న అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పేరు మార్చినప్పటికీ తీరు మారలేదు. సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో సంబంధిత శాఖల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పైపెచ్చు ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్న సర్టిఫికెట్ల పరిష్కారం కంటే వాటిని రిజక్ట్(తిరస్కరణ) చేసేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా గణాంకాలు ఉండటం గమనార్హం. రాష్ట్రంలోని ఈ–సేవ కేంద్రాలు 2011 నవంబర్ 4వ తేదీ మీ సేవ కేంద్రాలుగా మారాయి. అయితే వాటి ద్వారా అందించే సేవల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించకపోగా, మరింత జాప్యం, తిరస్కరణ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 429 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. ఏపీ ఆన్లైన్ కింద 60 కేంద్రాలు, కార్వే సంస్థకు సంబంధించి 76 కేంద్రాలు, సీఎంఎస్‌కు సంబంధించి 293 కేంద్రాలు ఉన్నాయి. కార్వే సంస్థ మీ సేవ కేంద్రాలు అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలకు, సీఎంఎస్ సంస్థకు సంబం«ధించిన మీ సేవ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఏపీ ఆన్లైన్ ద్వారా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మీ సేవ కేంద్రాలు కొనసాగుతున్నాయి. మీ సేవ కేంద్రాలకు వచ్చే అర్జీలను ఏ, బీ కేటగిరీలుగా విభజించి వాటిని సంబంధిత అధికారులకు వాటి నిర్వాహకులు పంపిస్తుంటారు. ఏ–కేటగిరీ అర్జీలను ఎలాంటి విచారణ లేకుండా అప్పటికప్పుడే అందించాల్సి ఉంటుంది. బీ–కేటగిరీ అర్జీలను సంబంధిత శాఖలు విచారణ జరిపిన అనంతరం నిర్ణీత గడువులోగా అర్జీదారులకు మీ సేవ కేంద్రాల ద్వారా అందించాలి. 2011 నవంబర్ 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఏ, బీ కేటగిరీలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన అర్జీల్లో 4,42, 096 అర్జీలు తిరస్కరించారు. 2017 మార్చి 1 నుంచి 2018 మార్చి 1వ తేదీ వరకు ఒక్క సంవత్సర కాలంలోనే 89,542 అర్జీలను తిరస్కరణకు గురికావడం చూస్తుంటే మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంపట్ల సంబంధిత అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మీ సేవ మా పనికాదు: అనేక శాఖలకు సంబంధించిన సర్టిఫికెట్లను మీ సేవ కేంద్రాల ద్వారా పొందేలా ప్రభుత్వం నిబంధనలు విధించింది. రెవెన్యూ శాఖకు సంబంధించి 71 రకాల సేవలు, వ్యవసాయ శాఖకు సంబంధించి 36 రకాల సేవలు, ట్రాన్స్‌కోకు చెందిన 34 రకాల సేవలు పొందేలా మీ సేవ కేంద్రాలకు రూపకల్పన చేశారు. వీటితోపాటు అనేక శాఖలకు సంబంధించిన సేవలను కూడా మీ సేవ కేంద్రాల ద్వారా రుసుం చెల్లించి నిర్ణీత గడువులోగా పొందేలా సిటిజన్ ఛార్టర్ను ఏర్పాటు చేశారు. అయితే సిటిజన్ ఛార్టర్ ప్రకారం సర్టిíఫికెట్లు పొందినవారి సంఖ్య చాలా స్వల్పంగానే ఉంటుంది. అందుకు కారణం మీ సేవ కేంద్రాల నుంచి సంబంధిత శాఖలకు అర్జీలు వెళ్లిన వెంటనే అక్కడి అధికారులు వాటిని పక్కన పడేస్తున్నారు. అర్జీదారుల అత్యవసరాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన క్యాస్ట్, ఇన్‌కం తదితర అత్యవసర సర్టిఫికెట్లు పొందాలంటే మీకోసంలో దరఖాస్తు చేసుకున్న తరువాత, సంబంధిత వ్యక్తులు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి అక్కడ రాయ్ఙబేరాలు’ సాగిస్తుండటం బహిరంగ రహస్యమే. ఇక రైతులకు సంబంధించి భూ హక్కుల పత్రాలు పొందాలంటే రైతులు నేరుగా రెవెన్యూ అధికారులను కలిసి వారికి తృణమో ఫలమో సమర్పించుకుంటేగాని ఆ పత్రాలు రావన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. “మీ సేవ మా పని కాదు’ అన్నట్లుగా మీ సేవ కేంద్రాల పనితీరు ఉంది. నిర్లక్ష్యానికి నిదర్శనం: మీ సేవ కేంద్రాల ద్వారా వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నా వాటిని సకాలంలో ఇవ్వకుండా తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు వాటిని పొందలేకపోతున్నారు. జిల్లాలో 4792 అర్జీలు గడువు దాటినవి ఉన్నాయంటే అధికారుల నిర్లక్ష్యం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రతి సోమవారం మీ కోసం, మీ సేవ కేంద్రాలకు వచ్చిన అర్జీల గురించి సమీక్షించడం తప్పితే జాప్యానికి కారణం అవుతున్న శాఖల అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో నిర్లక్ష్యం పెరిగిపోతోంది. ఇప్పటికైనా కలెక్టర్ మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకుంటే ప్రజలకు సకాలంలో సేవలు అందుతాయి. లేకుంటే ప్రజలకు వ్యయ ప్రయాసలు తప్పవు. మీ సేవ అర్జీలు త్వరితగతిన పరిష్కారానికి చర్యలు మీ సేవ కేంద్రాలకు వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ సేవ కేంద్రాల్లో శాఖల వారీగా ఎన్ని అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయో వివరాలను సేకరించి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశాం. – ప్రభాకరరెడ్డి, ఇన్చార్జి జేసీ మూడు నెలల కిందట దరఖాస్తు చేసినా పరిష్కారం కాలేదు ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డుతో రేషన్‌షాపునకు వెళ్లి నిత్యావసర వస్తువులు ఇవ్వాలని అడిగితే కార్డు ల్యాప్స్ అయిందని చెప్పారు. దీంతో తర్లుపాడులోని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లగా మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మూడు నెలల కిందట రేషన్‌కార్డు లోని లోపాలను సరిచేసి మళ్లీ నాకు ఉపయోగపడేలా ఇవ్వాలని మీ సేవలో దరఖాస్తు చేసుకున్నా. ఇదే విషయాన్ని తహశీల్దార్ కార్యాలయంలో తెలిపాను. ఇంత వరకు నా అర్జీ పరిష్కారం కాలేదు. – జి.రంగారెడ్డి, నాయుడుపల్లె , తర్లుపాడు మండలం -
విన్నపాలు వినవలె..
వివిధ సమస్యలపై ‘మీ కోసం’లో కలెక్టర్‌కు అర్జీలు అనంతపురం అర్బన్ : వంద శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువ పత్రం ఇచ్చినా పింఛను మంజూరు చేయలేదని కలెక్టర్ కోన శశిధర్‌కు దివ్యాంగుడు గౌతమ్ తల్లిదండ్రులతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీ కోసంలో గౌతమ్ పరిస్థితిని వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం 48వ డివిజన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో దివ్యాంగుడు గౌతమ్ పరిస్థితిని వారి తల్లిదండ్రులు గురునాథ్‌రెడ్డికి వివరించారు. పింఛన్ కోసం పలుమార్లు అధికారులకు అర్జీ ఇచ్చినా పింఛన్ మంజూరు చేయలేదని చెప్పారు. వారి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే సూచించారు. దీంతో గౌతమ్ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు నిమ్మల నాగరాజు, గోపాల్ మోహన్, కసునూరు శ్రీనివాసులు, చంద్రమోహన్ రెడ్డి, తిరుమలరెడ్డి, రాజునాయక్, గుజ్జల శివయ్యలు కలెక్టర్‌కు పరిస్థితిని వివరించారు. దీంతో పింఛను మంజూరుకు తక్షణం చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారు. న్యాయం చేయండి తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కోన శశిధర్‌కి మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్లు విన్నవించుకున్నారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామక వ్యవహారంలో నిలిపివేసిన జాబితాను పునరుద్ధరించాలని వారు కోరారు. దీంతో డీఎంహెచ్ఓ వెంకటరమణను కలెక్టర్ పిలిపించి మాట్లాడి వివరాలు తీసుకున్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈఎస్ఐ ఆస్పతి నిర్మించాలని వినతి జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించడానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ఈఎస్ఐ కార్పొరేషన్ అంగీకరించిందని కలెక్టర్‌కు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఇందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రి కోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించాలన్నారు. అర్జీ ఇచ్చిన వారిలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర ఉన్నారు. -
విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
► రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ► అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రారంభం బేల : గత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళశాలలో నాబార్డు ఆర్ఐడీఎఫ్–21 నిధులు రూ.కోటి వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనుల ప్రారంభానికి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర ఏళ్ల పాలనలో ప్రభుత్వం 250 గురుకులాలను ఏర్పాటు చేయడం విద్యా వ్యవస్థ పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. జనాభాలో 52శాతం ఉన్న బీసీలకు ప్రత్యేకంగా 109 గురుకులాలు త్వరలోనే మంజూరు కానున్నాయని తెలిపారు. బేలలో డిగ్రీ కళశాల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. స్థానిక జూనియర్ కళశాలలో ప్రహరీ నిర్మాణానికి రూ.30 లక్షలు త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదువుకోవాలని, లక్ష్యంతో భవిష్యత్‌లో గమ్యం చేరాలని తెలిపారు. ప్రతి సంవత్సరం మండలంలో మొత్తంగా ఏవైనా రెండు సంఘాల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల సబ్సిడీ నిధుల విడుదలలో వాస్తవంగా జాప్యం జరిగిందని, ఈ నెలాఖరులోపు నిధులన్నీ తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి విడుదలవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి నాగేందర్, జెడ్పీటీసీ సభ్యుడు నాక్లే రాందాస్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రావుత్ మనోహార్, ఎంపీపీ అధ్యక్షుడు కుంట రఘుకుల్‌రెడ్డి, కళశాల ప్రిన్సిపాల్ కన్నం మోహన్ బాబు, కస్తూరిబా ప్రత్యేక అధికారి గేడాం నవీన, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నిపుంగే సంజయ్, సర్పంచ్ మస్కే తేజ్‌రావు, ఉప సర్పంచ్ వట్టిపెల్లి ఇంద్రశేఖర్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టాక్రే గంభీర్, మండల అధ్యక్షుడు ఓల్లఫ్వార్ దేవన్న, ప్రధాన కార్యదర్శి టాక్రే మంగేష్ పాల్గొన్నారు. వినతుల వెల్లువ బేల : అదనపు తరగతుల నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి జోగు రామన్నకు వినతులు వెల్లువెత్తాయి. రజక, కుమ్మర, కమ్మరి, మేదరి, ప్రధాన్ పురోహిత్, గున్ల, తదితర సంఘాల వారు మంత్రిని ఘనంగా సన్మానించి.. కమ్యూనిటీ హాల్లు మంజూరు చేయాలని వినతిపత్రాలు అందజేశారు. కస్తూరిబా బృందం, కాంట్రాక్ట్ లెక్చరర్లు, గిరిజన సంక్షేమ, ఆశ్రమోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలు క్రమబద్ధీకరణ, 10వ పీఆర్ఎసీ అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. ఆ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. -
నా ఆత్మహత్య వార్త చూడాలనుకుంటున్నారా : హీరోయిన్
ఓ మలయాళీ హీరోయిన్‌కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కొద్ది రోజుల క్రితం కేరళలో అమలా అనే సీరియల్ నటి వ్యభిచారం చేస్తూ పట్టుపడింది. ఆ విషయం మీడియాలో ప్రముఖంగా రావటంతో అంతా హీరోయిన్ అమలా రోజ్ కురియన్ పోలీసులకు పట్టుబడినట్టుగా భావించారు. సోషల్ మీడియాలో అదే ప్రచారం జరగటంతో అమలా రోజ్ కురియన్ త్రీవంగా స్పందించింది. పోలీసులకు పట్టుబడింది తాను కాదంటూ తన ఫేస్బుక్ పేజ్‌లో క్లారిటీ ఇచ్చిన అమలా రోజ్ కురియన్, ఈ వార్త ప్రచారం చేస్తున్న వారు తన ఆత్మహత్య వార్త చూడాలనుకుంటున్నారా అని ప్రశ్నించింది. 'మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయిని నేను.. కేవలం నటన మీద ఆసక్తితోనే ఈ రంగంలో కొనసాగుతున్నా.. కానీ ఇలాంటి వార్తల వల్ల, ఆ ఆసక్తి తగ్గిపోతుంది. దయచేసి నన్ను అపార్థం చేసుకునే వార్తలను ప్రచారం చేయకండి. ఈ వార్తల మూలంగా గత వారం రోజులుగా నాకు నిద్ర కూడా పట్టడం లేదు' అంటూ పోస్ట్ చేసింది. -
మంత్రికి వినతుల వెల్లువ
అనంతపురం న్యూటౌన్ : జిల్లా పర్యటనలో ఉన్న బీసీ సంక్షేమ శాఖా మంత్రి కొల్లు రవీంద్రకు బీసీ సంఘాల నేతలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. అన్ని జిల్లాలలో బీసీ భవన్లు ఏర్పాటు చేయాలని, జనాభా దామాషా ప్రకారం బీసీ కార్పోరేషన్‌కు రూ.20 కోట్లు కేటాయించాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కేటాయించాలని, ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో బీసీలకు మినహాయింపు ఇవ్వాలని డిమాండు చేశారు. -
విన్నపాలు వినవలె..!
కొత్త జిల్లాలపై అభ్యంతరాలు స్వీకరణకు నేటితో గడువు సరి తుది ప్రకటనపై అందరి ఆసక్తి అందిన వినతులు 1,670 ఆన్లైన్లో వచ్చినవి 760 ‘మెదక్ జిల్లా’పైనే అత్యధికం సాక్షి, సంగారెడ్డి: జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రజాభిప్రాయం, అభ్యంతరాలు, సలహాల స్వీకరణ గడువు మంగళవారంతో ముగియనుంది. మెదక్ జిల్లాను విభజించి కొత్తగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం గత నెల 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన 30 రోజులలోపు ప్రజలు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలు, సలహాలను అందజేయాలని ప్రభుత్వం పేర్కొంది. జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్‌ను అనుసరించి మంగళవారంతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియనుంది. దీంతో ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రకటించే తుది ముసాయిదా (డ్రాప్టు ప్రకటన) ఎలా ఉంటుందోనని, ఎప్పుడు ప్రకటిస్తారో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల ఏర్పాటు, కొత్త రెవెన్యూ, కొత్త మండలాల ఏర్పాటపై సోమవారం వరకు అధికారులకు మొత్తం 1,670 వినతులు, అభ్యంతరాలు అందాయి. వీటిలో 910 వినతులు, అభ్యంతరాలు నేరుగా అధికారులకు అందగా 760 ఆన్లైన్లో వచ్చాయి. ఏ జిల్లాలో ఎన్ని అభ్యంతరాలు? మెదక్ జిల్లా ఏర్పాటుకు సంబంధించి 98, సంగారెడ్డి జిల్లా ఏర్పాటుకు సంబంధించి 143, సిద్దిపేట జిల్లాకు సంబంధించి 19 అభ్యంతరాలు, వినతులు అందాయి. అలాగే ప్రతిపాదిత మెదక్ జిల్లాలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై 201, మండలాల ఏర్పాటుపై 549 వినతులు, అభ్యంతరాలు వివిధ వర్గాల వారు అధికారులకు అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై 259, మండలాల ఏర్పాటుపై 139 అభ్యంతరాలు, వినతులు వచ్చాయి. సిద్దిపేట జిల్లాలో రెవెన్యూ డివిజన్లపై 93, మండలాల ఏర్పాటుపై 169 వినతులు, అభ్యంతరాలు అధికారులకు అందజేశారు. ఇదిలా ఉంటే కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, వినతులు అందజేసేందుకు మంగళవారం తుది రోజు కావటంతో అధికారులకు మరిన్ని వినతులు అందే అవకాశం ఉంది. ఇదీ లెక్క జిల్లా వినతులు మెదక్ 848 సంగారెడ్డి 541 సిద్దిపేట 281 =============== మొత్తం 1,670 =============== -
‘విభజన’ వినతులు
మిగిలింది మూడు రోజులే.. వెబ్‌సైట్‌కు 1,408 దరఖాస్తులు రెవెన్యూ డివిజన్లు చేయాలని ఆందోళనలు కొత్త మండలాలపై పెరుగుతున్న డిమాండ్ సాక్షిప్రతినిధి, ఖమ్మం : వినతుల స్వీకరణకు ఈనెల 20వ తేదీ వరకు గడువుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి వెబ్‌సైట్‌కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల ఏర్పాటుపై స్థానికంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ వెబ్‌సైట్‌కు 1,408 దరఖాస్తులు వచ్చాయి. గత నెల 23వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. దీంట్లో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలతోపాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై వివరాలు ఉంచింది. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వ వెబ్సైట్లో విన్నవించుకోవచ్చని పేర్కొంది. అయితే జిల్లాల ఏర్పాటు అంశం అలా ఉంచితే.. కొత్త మండలాల ఏర్పాటుపై అధికారులు పేర్కొన్న నివేదికలో మండలాలు లేకపోవడంతో స్థానికంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కూడా వివాదాస్పదంగా మారింది. దీంతో మొదటి రోజు నుంచే వెబ్‌సైట్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రభుత్వం విడుదల చేసింది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కావడంతో.. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం విడుదల చేసే తుది నోటిఫికేషన్లో ఈ అంశాలన్నింటిపై చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. మండలాల ప్రకటనపై ఎదురుచూపు కొత్తగూడెం జిల్లాలో కొత్తగా నాలుగు మండలాలు, ఖమ్మం జిల్లాలో ఒక మండలం కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మాత్రం ఖమ్మం జిల్లాలో గతంలో ప్రకటించిన రఘునాధపాలెంను మాత్రమే పేర్కొనడంతో రాజకీయ నాయకుల నుంచి స్థానికుల వరకు నిరాశ చెందారు. కొత్తగూడెం జిల్లాలో లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, గుండాల మండలంలో ఆళ్లపల్లి, పినపాక మండలంలో కరకగూడెం మండలాలు ఏర్పాటు చేస్తారని ప్రజలు ఎదురు చూశారు. దీనిపై ప్రభుత్వానికి వినతులు ఎక్కువగా వెళ్లాయి. నోటిఫికేషన్ తర్వాత వివిధ సందర్భాల్లో సమీక్షలు నిర్వహించిన సీఎం కేసీఆర్ మండలాల ఏర్పాటుపై కూడా చర్చించారు. పినపాక మండలంలో కరకగూడెం, గుండాల మండలంలో ఆళ్లపల్లి మండలాలను ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారని స్థానికులు భావిస్తున్నారు. జూలూరుపాడు, ఏన్కూరు మండలాలను కొత్తగూడెం జిల్లాలో కలపాలని స్థానికులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రదర్శనలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. జూలూరుపాడుకు కొత్తగూడెం 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, అదే ఖమ్మం 60 కిలోమీటర్ల వరకు ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని తమను కొత్తగూడెం జిల్లాలో కలపాలని జూలూరుపాడులో ఆందోళనలు చేపట్టారు. రెవెన్యూ డివిజన్లపై ఉధృతంగా ఆందోళనలు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఖమ్మం జిల్లాలో కొత్తగా వైరా రెవెన్యూ డివిజన్‌ను పేర్కొనడంతోపాటు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం రెవెన్యూ డివిజన్లుగా పేర్కొన్నారు. అయితే ఖమ్మం జిల్లాలో గతంలోనే కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ క్రమంలో కల్లూరు కేంద్రంగానే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అక్కడ ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. మరికొందరు సత్తుపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కూడా ఆందోళనలు చేపట్టారు. రెవెన్యూ డివిజన్ అంశంపై కూడా సీఎం కేసీఆర్ సమీక్షలో కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. దీంతో నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగానే వైరా కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని.. వైరాలో ఆందోళనలు, నిరసన దీక్షలు మొదలయ్యాయి. అలాగే మధిరను కూడా రెవెన్యూ డివిజన్ చేయాలనే ఆందోళనలు మిన్నంటాయి. బంద్‌లు, దీక్షలతో ఆందోళనలు హోరెత్తుతున్నాయి. దీనిపై అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. వెబ్‌సైట్‌కు వచ్చిన వినతుల వివరాలు ఇలా.. –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– జిల్లాల ఏర్పాటుపై రెవెన్యూ డివిజన్లపై మండలాలపై ఖమ్మం 363 336 88 కొత్తగూడెం 459 55 107 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మెుత్తం 822 391 195 (రెండు జిల్లాలకు కలిపి వచ్చిన అన్ని వినతులు 1,408) –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
కడుపు ఉబ్బుతోంది..
= బాధతో విలవిలలాడుతున్న బాలుడు = తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు = వైద్య సాయం కోసం వేడుకోలు కడుపు నిండా తిండి తినలేక.. కంటినిండా నిద్రపోలేక.. క్షణక్షణం భరించలేని బాధతో విలవిలలాడుతున్న తనయుడిని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చూపించినా జబ్బు నయం కాకపోవడంతో కుమిలిపోతున్నారు. తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. బుక్కపట్నం మండలం గూనిపల్లికి చెందిన దళిత ఆదెప్ప, శ్రీలతలు దంపతులు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు లోకేశ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. ఎంతో చలాకీగా ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లివచ్చేవాడు. అలాంటి ఈ చిన్నారికి ఆరు నెలల క్రితం కడుపునొప్పి వచ్చింది. క్రమేణా కడుపు ఉబ్బుతుండటంతో పలు ఆస్పత్రుల్లో చూపించారు. ఆర్డీటీ ఆస్పత్రిలోను, కర్నూలు ప్రభుత్వాస్పత్రిలోనూ చికిత్స చేయించారు. కడుపు ఉబ్బరం వచ్చి కాలేయం దెబ్బతిందంటూ కొందరు వైద్యులు, టీబీ లక్షణాలు ఉన్నాయని మరికొందరు వైద్యులు తెలిపి మందులిచ్చారు. అయినా జబ్బు నయం కాలేదు. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తోంది. విపరీతమైన బాధ ఉంటుండటంతో రాత్రిపూట నిద్రకూడా పట్టడం లేదు. అసలు ఇంతకూ ఇది ఏ జబ్బో తెలుసుకుని, బాగు చేయించుకోవడానికి పెద్ద ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ కుమారుడికి వైద్యం అందించాలని ప్రాధేయపడుతున్నారు. . దాతలు సంప్రదించవలసిన చిరునామా సాకే ఆదెప్ప బ్యాంకు ఖాతా నంబరు : 32697931879 స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, బుక్కపట్నం ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్ 4412 సెల్ నంబరు : 99632 10389 -
వినతులు స్వీకరించిన కలెక్టర్
కడప సెవెన్‌రోడ్స్: సోమవారం కొత్త కలెక్టరేట్లో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ కేవీ సత్యనారాయణ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు మీ కోసం కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. ఆయన వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అదికారులకు పరిష్కార నిమిత్తం పంపారు. మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారమైతే ప్రజలు ఖర్చులు భరించి మళ్లీ మళ్లీ కలెక్టర్‌కు తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. క్షేత్ర స్థాయిలోనే సమస్యలను పరిష్కరించడంపైదృష్టి కేంద్రీకరించాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలు మాత్రమే తన దృష్టికి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు. ఇంటి స్థలాలు, రేషన్‌కార్డులు, పెన్షన్లు, భూ వివాదాలు వంటి సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సులోచన, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విభజన, విలీనంపై వినతుల వెల్లువ
♦ గ్రీవెన్స్‌లో మెజార్టీ అర్జీలు ♦ వీటిపైనే వినతులు స్వీకరించిన ♦ జేసీ, అదనపు జేసీ సంగారెడ్డి జోన్ : మండలాల విలీనం, విభజనలపైనే జిల్లా నలుమూలల నుంచి వినతులు వెల్లువెత్తాయి. గ్రీవెన్స్-డేను పురస్కరించుకుని ప్రజలు సోమవారం పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమ అభిప్రాయాలను వినతిపత్రాల రూపంలో అధికారులకు అందజేశారు. గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలను జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అదనపు జేసీ వి.వెంకటేశ్వర్లు, డీఆర్ఓ దయానంద్, ఇతర శాఖల అధికారులు స్వీకరించారు. నూతనంగా ప్రకటించనున్న మండల కేంద్రాలకు దగ్గరలోని రెవెన్యూ గ్రామాలను సమీపంలోని ప్రాతిపాదిత మండలాల్లో విలీనం చేయాలని ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఇతర సమస్యలపైనా వినతులు అందాయి. ⇒ రేగోడ్ మండలాన్ని పూర్తి స్థాయిలో సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ⇒ మెద క్ మండలం బూర్గుపల్లిని మండల కేంద్రం చేయడంతోపాటు కళాశాలను మంజూరు చేయాలని బూర్గుపల్లి, వాడి, రాజిపేట, కొత్తపల్లి తండాల వాసులు జేసీకి వినతి పత్రం సమర్పించారు. ⇒ శివ్వంపేట మండలం నవాబుపేట గ్రామం గుమ్మడిదలకు కేవలం 6 కి.మీ. దూరంలోనే ఉందని, దీన్ని ప్రతిపాదిత గుమ్మడిదలలో విలీనం చేయాలని సర్పంచ్ భిక్షపతి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామసభ నిర్వహించి తీర్మానం చేసిన కాపీని అధికారులకు అందజేశారు. ⇒ హత్నూర మండలం నాగారం పంచాయతీలో గల రొయ్యపల్లి, అవంచగూడ గ్రామాలను 3 కి.మీ. దూరంలో గల జిన్నారం మండలంలో విలీనం చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. ⇒ మునిపల్లి మండలంలో కంకోల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు రమేశ్ యాదవ్ జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ⇒ అంగవైకల్యంతో బాధ పడుతున్న దళిత వర్గానికి చెందిన తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోహీర్ మండలం బిలాల్‌పూర్‌కు చెందిన డప్పు మల్లమ్మ కోరారు. ⇒ సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట పరిధిలో నిర్మిస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పక్కన గల తమ పట్టా భూముల్లో అధికారిక సమాచారం ఇవ్వకుండా విద్యుత్ స్తంభాలు, రోడ్డు నిర్మించారని, లోతైన గుంతలతో సాగుకు పనికి రాకుండా చేశారని గ్రామస్తులు అంజిరెడ్డి, యాదమ్మ, మల్లారెడ్డి, కిష్టారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. ⇒ అమ్మానాన్నలు మృతి చెందడంతో అనాథలమయ్యాం. తన తమ్ముడు నవీన్‌కు జోగిపేట, సంగారెడ్డిలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రవేశం కల్పించాలని పుల్కల్ మండలం ముదిమాణిక్యంకు చెందిన శ్రావణ్ కోరారు. ⇒ సంగారెడ్డిలోని బొబ్బిలికుంట నుంచి కల్వకుంట పంట పొలాలకు వెళ్లే కాలువ విస్తీర్ణం 33 ఫీట్లు కాగా, ప్రస్తుతం శాంతినగర్, శ్రీ విద్యానికేతన్ పాఠశాల వద్ద పంట కాల్వలను ఆక్రమించుకుని ఇళ్లు, ప్రహరీలు నిర్మించుకున్నారని, వాటిని తొలగించాలని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ⇒ 20 గుంటల భూమిని పక్క పొలానికి చెందిన వారుఆక్రమించుకున్నారని, సాగులోకి వెళ్లనీయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని దౌల్తాబాద్ మండలం చిన్నమసాన్పల్లికి చెందిన నర్సారెడ్డి ఫిర్యాదు చేశారు. ⇒ బోరుబావి, పైప్లైన్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, నష్ట పరిహారం ఇప్పించాలని బాధితుడు దుబ్బాక మండలానికి చెందిన అనంపల్లి రాజు అధికారులను కోరారు. ⇒ ఎకరా 34 గుంటల భూమిని దాయాదులు కబ్జా చేయడమే కాకుండా రికార్డుల్లోనూ మార్పులు జరిగాయని, తనకు న్యాయం చేయాలని మెదక్ మండలం పాతూర్కు చెందిన దొరబోయిన సిద్దప్ప కోరారు. -
రియో ఒలింపిక్స్‌కు మరో తలనొప్పి
బ్రెజిల్ రియో ఒలంపిక్స్ క్రీడల్ని మొన్నటి వరకు జికా వైరస్ భయపెడితే.. తాజాగా మరో కీలక పరిణామం వేధిస్తోంది. బ్రెజిల్ లో నెలకొన్న సంక్షోభం రియో ఒలింపిక్స్ పై ప్రభావాన్ని పడేయనుందా... అంటే అవునే అనిపిస్తోంది. బ్రెజిల్ రాజధాని నగరం రియో డి జనీరో లో తీవ్ర ఆర్థిక మాంద్య పరిస్థితులతో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో 2016 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ వ్యవహారంలో కొత్త తలనొప్పి మొదలైంది. నగరంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మధ్యంతర గవర్నర్ ఫ్రాన్సిస్కో డోర్నెల్లస్ శుక్రవారం ప్రకటిచారు. బ్రెజిల్లో రెండవ అత్యధిక జనాభా కలిగిన పెద్ద నగరం, రాజధాని రియో లో ప్రతిష్టాత్మక ఒలంపిక్స్‌కు ఈ ఏడాది అతిధ్యమిస్తున్న నగరంలో...ఒలింపిక్స్ కు సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ఆందోళన రేపింది. ప్రజా విపత్తుమూలంగా ప్రజల భద్రత, ఆరోగ్యం, విద్య ప్రజా, రవాణా, పర్యావరణ మేనేజ్మెంట్ తదితర సేవల్లో మొత్తం పతనానికి దారి తీయవచ్చనే ఆందోళనతో ఈ అత్యవసర చర్య అవసరమైందని రాష్ట్ర అధికారిక గెజిట్ స్పష్టం చేసింది. గేమ్స్ నిర్వహణలో సహాయం చేయాల్సిందిగా బ్రెజిల్ మధ్యంతర అధ్యక్షుడు మైకేల్ టెమర్ ఫెడరల్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రపంచ చమురు ధరలు పడిపోవడంతో ముఖ్యంగా పెట్రోలియం రంగంతోముడిపడివున్నరాష్ట్ర రెవెన్యూ క్షీణించింది. గత రెండేళ్లుగా నెలకొన్న సంక్షోభం రియో ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీసింది. అయితే రాష్ట్ర ఆర్థిక అత్యవసర పరిస్థితి ఒలింపిక్స్ నిర్వహణ పై ప్రభావం చూపదని, అనుకున్నట్టుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని రియో మేయర్ ఎడ్యరాడో పేస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే నగరంలోని మెట్రో విస్తరణ పనులు కూడా ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే పూర్తి అవుతాయని చెప్పారు. ఒలింపిక్స్ కు సంబంధించి అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు గేమ్స్ స్థానిక నిర్వాహక కమిటీ దీనిపై స్పందించ లేదు . కాగా సుమారు 5లక్షలమంది మందివిదేశీ సందర్శకులు ఒలింపిక్స్ క హాజరయ్యే అవకాశం ఉందని అంచాన. ఒలింపిక్ మౌలిక వ్యయాల్లో ఎక్కువభాగం ప్రైవేట్ కంపెనీల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. దీంతోపాటు నగరం , రాష్ట్ర , సమాఖ్య బడ్జెట్లు కేటాయించాల్సి ఉండగా...భద్రత , ఆరోగ్య సేవలు లాంటివాటి ప్రధాన బాధ్యత మాత్రం రియోదే. -
కొత్త జిల్లాల కోసం విన్నపాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటనతో జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఊపందుకుంది. తమ ప్రాంతానికి కొత్త జిల్లా కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రభుత్వానికి విన్నపాలు వచ్చాయి. ప్రజా సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలతో పాటు ప్రతిపక్ష పార్టీల నుంచి, అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు 33 వినతులు సర్కారుకు అందాయి. ఒక్క నిజామాబాద్ జిల్లా నుంచి మాత్రం ఎటువంటి వినతులు రాకపోవడం విశేషం. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అత్యథికంగా వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి 11 చొప్పున, అత్యల్పంగా అదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఒక్కొక్కటి చొప్పున రిప్రజెంటేషన్లు ప్రభుత్వానికి అందాయి. అదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్‌తో పాటు కొత్తగా నిర్మల్‌ను జిల్లా చేయాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. అలాగే కరీంనగర్ జిల్లాలో మెట్పల్లి లేదా కోరుట్లను జిల్లాగా చేయాలని కోరుతుండగా, ఖమ్మం జిల్లాలో భద్రాచలాన్ని జిల్లాగా చేయాలని మూడు వినతులు సర్కారుకు అందాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా గద్వాల్‌ను జిల్లా చేయాలని 8వినతులు అందగా, వనపర్తి కోసం మూడు వినతులు వచ్చాయి. మెదక్ జిల్లా నుంచి వచ్చిన మూడు వినతుల్లోనూ మెదక్‌ను జిల్లా కేంద్రంగా మార్చాలని సర్కారుకు విజ్ఞప్తి చేయడం గమనార్హం.నల్గొండ జిల్లా నుంచి వచ్చిన రెండు వినతుల్లో ఒకటి యాదగిరి గుట్టను కొత్త జిల్లాగా మార్చాలని కోరగా, రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా ప్రకటించాలని మరొక వినతిపత్రం అందింది. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి అందిన వినతిపత్రంలో వికారాబాద్ లేదా మేడ్చల్‌ను కొత్త జిల్లా చేయాలని స్థానికులు ప్రభుత్వానికి విన్నవించారు. వరంగల్ జిల్లాలో సమ్మక్క-సారలమ్మ పేరిట ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని, మహబూబాబాద్, జనగాంలను కొత్త జిల్లాలుగా మార్చాలని ఆయా ప్రాంతాల నుంచి సర్కారుకు ఏకంగా 11 వినతులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రిప్రెంజెంటేషన్లను తదుపరి చర్యల నిమిత్తం భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)కు పంపింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను సీసీఎల్ఏ ఆదేశించారు. జిల్లాల నుంచి నివేదికలు అందిన తర్వాత కొత్త జిల్లాల పేరిట ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీచేసి నిర్ణీత గడువులోగా అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆపై ప్రభుత్వ ఆదేశాల మేరకు తుది నోటిఫికేషన్ జారీచేస్తామని రెవెన్యూ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
'శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలి'
హైదరాబాద్: రాష్ట్రంలో శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రీషీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ లేఖ రాశారు. శాసనసభ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం స్థానాలు పెంచాలని కోరారు. జనాభా లెక్కలు పూర్తైన తర్వాత నియోజక వర్గ పునర్విభజన జరపాలని రాజ్యాంగం సూచిస్తోందని లేఖలో ప్రస్తావించారు. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ఎన్నికల కమిషన్ ప్రక్రియ ప్రారంభించేలా దిశానిర్ధేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
సార్..! సమస్యలు ఆలకించండి !!
- ప్రజావాణిలో వినతుల వెల్లువ - స్వయంగా అర్జీలు స్వీకరించిన జేసీ వెంకట్రాంరెడ్డి సంగారెడ్డి జోన్ : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చారు. జేసీ వెంకట్రాంరెడ్డి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. విచారణ చేసి సత్వరం న్యాయం చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. తన ప్రమేయం లేకుండానే తన భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన డిప్యూటీ తహసీల్దార్, గ్రామ పట్వారీలపై చర్యలు తీసుకోవాలని పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన ప్రభాకర్ కోరారు. తన 2 ఎకరాల 20 గుంటల భూమిని ఎలాంటి అనుమతి లేకుండా ఇతరులపై రిజిస్ట్రేషన్ చేశారని, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తమకు ఎకరా భూమి పట్టా ఇచ్చారని, కానీ ఇంతవరకు పొజిషన్ చూపించలేదని పాపన్నపేట మండలం మిన్పూర్కు చెందిన ఏసమ్మ, బాలమ్మలు తెలిపారు. తమకు వెంటనే పొజిషన్ చూపించాలని, లేకుంటే మూడెకరాల భూమి ఇప్పించాలని జేసీకి విన్నవించారు. మావోయిస్టుగా జనజీవన శ్రవంతిలోకి వచ్చిన తనకు ప్రభుత్వ భూమి మంజూరు చేయాలని మెదక్ మండలం తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన పోచయ్య కోరారు. విధి నిర్వహణలో తన భర్త మతిస్థిమితం కోల్పోయినందునా తనకు ఉపాధి కల్పించాలని కొండాపూర్మండలం మారేపల్లికి చెందిన ఇందిరమ్మ విజ్ఞప్తి చేశారు. బీడీ కార్మికులైన తమకు ఇళ్లు మంజూరు చేయాలని అందోల్ మండలానికి చెందిన సువర్ణ, దుబ్బాక మండలం ఆరేపల్లికి చెందిన సునీత, యాదమ్మ వినతిపత్రం అందజేశారు. తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్‌కు చెందిన కోనమ్మ విజ్ఞప్తి చేశారు. తన భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించానని, ఈ కారణంగా తమ కూ తురుకు బాలిక సంరక్షణ పథకం వర్తింపజేయాలని జహీరాబాద్ పట్టణం శాంతినగర్ కుచెందిన మంగళి విజయకుమార్ కోరారు. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని ఆస్తినంతా వారికే ఇచ్చారని, న్యాయంగా తనకు రావాల్సిన ఆస్తిలో వాటా ఇప్పించాలని న్యాల్కల్కు చెందిన అంజమ్మ జేసీకి విజ్ఞప్తి చేసింది. తన భూమిలో అక్రమంగా ఇతరులు రోడ్డు వేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోహీర్ మండలం వెంకటాపూర్‌కు చెందిన మల్లయ్య కోరారు. మెదక్ మండలం హవేళీఘన్పూర్కు చెందిన మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి ప్రభుత్వ భూమిని ప్లాట్లు చేసి విక్రయిస్తున్నాడని, తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. తనకు అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని అందోల్ మండలం పోసానిపేటకు చెందిన వడ్డే యాదమ్మ కోరారు. తాను గత 30 సంవత్సరాలుగా పిండి గిర్ని నడిపిస్తూ జీవనం సాగిస్తున్నానని, దాన్ని తొలగించాలని అధికారులు యత్నిస్తున్నట్టు చేగుంటకు చెందిన రాజలింగం తెలిపారు. పిండి గిర్ని యథావిధిగా నడిపించుకొనేందుకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు. సత్వరమే సమస్యల పరిష్కారం : ఎస్పీ సంగారెడ్డి క్రైం : ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ బి.సుమతి సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ అర్జీదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులకు సూచిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. -
ప్రజావాణి వినతులకు తొలి ప్రాధాన్యత
అధికారులకు కలెక్టర్ కేవీ రమణ ఆదేశం కడప సెవెన్‌రోడ్స్ : ప్రజావాణికి వచ్చే వినతుల పరిష్కారానికి అధికారులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కేవీ రమణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు సమర్పిస్తుంటారని చెప్పారు. వాటిని అధికారులు పరిశీలించి సకాలంలో పరిష్కరించాలన్నారు. కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో 268 ప్రభుత్వ చౌక దుకాణాలకు ఇన్‌ఛార్జి ఆర్డీఓగా ఉన్న లవన్న ఇచ్చిన నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దుచేయాలని టీడీపీ నాయకుడు ఇందిరెడ్డి శివారెడ్డి తదితరులు కోరారు. రోస్టర్‌ను సక్రమంగా రూపొందించలేదని చెప్పారు. అలాగే కోర్టు విచారణలో ఉన్న ఎఫ్పీ షాపులను కూడా నోటిఫికేషన్లో పొందుపరిచారన్నారు. భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈనెల 25న బదిలీపై వెళుతున్న ఇన్చార్జి ఆర్డీఓ హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేయడంపై పలు అనుమానాలు ఉన్నాయని వివరించారు. జర్నలిస్టుల హెల్త్ కార్డుల దరఖాస్తులకు మరికొంత సమయాన్ని పొడిగించాలని జాప్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి.విజయకుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు జ్యోతి జార్జి కోరారు. వరుసగా పండుగలు రావడం వల్ల చాలామంది దరఖాస్తు చేసుకోలేక పోయారన్నారు. సమాచారం సైతం చాలామందికి తెలియదన్నారు. జిల్లాలోని వికలాంగులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు చిన్న సుబ్బయ్యయాదవ్, బీఎన్ బాబు తదితరులు కోరారు. పలుమార్లు తహశీల్దార్ల దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లినప్పటికీ వారు స్పందించడం లేదన్నారు. కడప నగరంలోని పలు వీధులలో చెత్తాచెదారాలు పేరుకుపోతున్నప్పటికీ మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించడం లేదని అర్బన్ డెవలప్మెంట్ కమిటీ నాయకులు ఎం.చెండ్రాయులు, వై.తిరుమలయ్య, సుజాతరెడ్డి, ఎస్.గౌస్‌పీర్ తదితరులు ఫిర్యాదు చేశారు. ఈగలు, దోమలు ప్రబలి పలు వ్యాధులకు కారణమవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామారావు, ఇన్‌ఛార్జి ఏజేసీ సుబ్బారెడ్డి, డీఆర్వో సులోచన, ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.