
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న ఉల్లి ధరలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణకు 500 టన్నుల ఉల్లి పంపాలని కేంద్ర పౌర సరఫరాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్టు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. కేంద్రం నుంచి ఉల్లిగడ్డ వచ్చే లోగా మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతు బజార్లలో బుధవారం నుంచి కిలో రూ.40కి అమ్మేందుకు మలక్‌పేట ఉల్లి హోల్‌సేల్ వ్యాపారస్తులు అంగీకరించారన్నారు. ఉల్లితోపాటు రాష్ట్రంలో జరుగుతు న్న పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్ సంచాలకుల కా ర్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కొ నుగోలు కేంద్రాలకు వచ్చిన పత్తిని ఏ రోజుకారో జు కొనేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం మా ర్కెట్‌కు 93 శాతానికిపైగా నాణ్యమైన తే మ శాతం ఉన్న పత్తి వస్తోందన్నారు.
కేంద్రాల్లో తేమ కొలిచే యంత్రాలు..
అన్ని సీసీఐ కేంద్రాల్లో తేమ కొలిచే యం త్రాలు అవసరాల మేరకు సమకూర్చుకోవాలని పార్థసారథి సూచించారు. రోజు వారి కొనుగోళ్లు పూర్తయిన వెంటనే తక్కపట్టీలను బ్రాంచ్ మేనేజర్లకు పంపించి రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారంలో 6 రోజులు కొనుగోలు కేంద్రాలు పనిచేయాలని, కాటన్ సీడ్ విషయమై నెలకొన్న స్తబ్దత ను వెంటనే పరిష్కరించాలని సీసీఐ సీఎండీని కోరినట్లు తెలిపారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు ఆర్.లక్ష్మణుడు, పి.రవికుమార్, పత్తి మార్కెట్ కమిటీ కార్యదర్శులు, జిల్లా మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment