హైదరాబాద్, సాక్షి: సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
సెప్టెంబర్ 17రోజున తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొంది. జిల్లాల్లో జెండా ఆవిష్కరణ చేసే ప్రజాప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించింది.
చదవండి: అణచివేతపై సాయుధ పోరాటం!
చదవండి: నలువైపులా ముట్టడి.. ‘ఆపరేషన్ పోలో’ పేరిట భారత ఆర్మీ సైనిక చర్య
Comments
Please login to add a commentAdd a comment