షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణలో డీఎస్సీ పరీక్ష | No Mega DSC in Telangana | Sakshi
Sakshi News home page

షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణలో డీఎస్సీ పరీక్ష

Published Mon, Jul 8 2024 6:50 PM | Last Updated on Mon, Jul 8 2024 7:33 PM

No Mega DSC in Telangana

హైదరాబాద్‌, సాక్షి: షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణలో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుత నోటిఫికేషన్‌ను రద్దు చేసి మరిన్ని పోస్టులను జత చేసి మెగా డీఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్‌తోపాటు ఎగ్జామ్‌ను కొంతకాలంపాటు వాయిదా వేయాలన్న డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో.. 

షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 11వ తేదీ నుంచి డీఎస్సీ హాల్‌ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాబులో ఉంచనుంది విద్యాశాఖ. జులై 18వ తేదీ నుంచి ఆగష్టు 5వ తేదీ దాకా పరీక్షలు జరగనున్నాయి. 

టెట్‌కు, డీఎస్సీకి భిన్నమైన సిలబస్ ఉండటంతో చదవడానికి సమయం సరిపోవడం లేదని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. ఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలని, అక్టోబర్‌లో 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని రాజకీయ పార్టీల యువజన, విద్యార్థి అనుబంధ సంఘాలు ఆందోళన సైతం చేపట్టాయి.

2.79 లక్షల దరఖాస్తులు..
రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తుల గడువు జూన్‌ 20వ తేదీతో ముగిసింది. మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు అందాయి. అభ్యర్థులపరంగా చూస్తే.. సుమారు 2 లక్షల వరకు ఉంటారని అంచనా.

రెండు షిఫ్టుల్లో..
సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. జులై 18న మొదటి షిఫ్ట్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ పరీక్ష, సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్ష నిర్వహిస్తారు. జులై 19 నుంచి 22 వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు జరుగుతాయి. జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ , జులై 22న స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌, జులై 24న స్కూల్‌ అసిస్టెంట్‌ బయలాజికల్‌ సైన్స్‌,  జులై 26న తెలుగు భాషా పండిట్‌, సెకండరీ గ్రేడ్‌టీచర్‌ పరీక్ష, జులై 30న స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ పరీక్ష నిర్వహిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement