
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డితో భేటీ అయ్యారు. జానారెడ్డి నివాసంలో ఆపరేషన్ కగార్ అంశంపై సీఎం రేవంత్.. జానారెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి భేటీకి హాజరయ్యారు.
అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కగార్‌పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక.. ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని అన్నారు.

ఇదిలా ఉండగా..తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో కొన్ని రోజులుగా మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. కర్రెగుట్టలో బాంబు వర్షం కురిపిస్తోంది. ఈ ఆపరేషన్ వల్ల వందలాది మంది మావోలు మృతిచెందుతున్నారు. మావోలు చనిపోతుండటంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర చర్యలను ఖండించారు. పౌర హక్కుల సంఘాలు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాంతి చర్చల కమిటీ భేటీలో నక్సలిజాన్ని శాంతి భద్రతల అంశంగా పరిగణించమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి మంత్రులతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. సామాజిక కోణంలో మావోయిస్టుల అంశాన్ని చూడాలి. మావోయిస్టుల భావాజాలాన్ని చంపాలనుకోవడం సరైంది కాదని అన్నారు.