తెలంగాణ బడ్జెట్‌పై కేసీఆర్‌ రియాక్షన్‌ | KCR Reacts On Congress Govt Telangana Budget 2024-25, Says This Govt Would Be Taken To Task | Sakshi
Sakshi News home page

అర్బక ప్రభుత్వం.. ఈ బడ్జెట్‌ ఒక ట్రాష్‌, గ్యాస్‌: కేసీఆర్‌

Published Thu, Jul 25 2024 2:05 PM | Last Updated on Thu, Jul 25 2024 3:59 PM

KCR Reacts On Congress Budget 2024 25 Budget

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ బడ్జెట్‌..  ప్రజల ఆశలపై నీళ్లు జల్లేలా ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. గురువారం మధ్యాహ్నాం బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.

మా పాలనలో ఎన్నో పథకాలు పెడితే.. వాటన్నింటిని కాంగ్రెస్‌ ప్రభుత్వం అటకెక్కించిందని కేసీఆర్‌ మండిపడ్డారు. రైతులకు, మత్య్సకారులకు.. ఇలా వర్గానికి మేలు చేసేలా లేదు. ఐటీ, పారిశ్రామిక విధానాలు లేవు. తెలంగాణ బడ్జెట్‌ ఒట్టి గ్యాస్‌.. ట్రాష్‌. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఒత్తి ఒత్తి ఆర్థిక మంత్రి మాట్లాడారే తప్ప.. కొత్తగా ఏమీ చెప్పలేదు. ఏదో కథ చెప్పినట్లు.. రాజకీయ ప్రసంగంలా ఉందే తప్పా.. ఏ ఒక్క వర్గానికి మేలు చేసేలా లేదన్నారు. 

ప్రభుత్వం ఏర్పాడ్డాక వీళ్లకు ఆరు మాసాల సమయం ఇద్దామని అనుకున్నామని, కానీ బడ్జెట్‌ చూశాక ఒక పాలసీ లేకుండా ఉందని అన్నారు. రైతు భరోసా ప్రస్తావనే లేదు.. ఇది పూర్తిగా రైతు శత్రుత్వ ప్రభుత్వమని విమర్శించారు. భవిష్యత్తులో ఈ బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని చీల్చిచెండతామని అన్నారాయన.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement