నా ఆత్మహత్య వార్త చూడాలనుకుంటున్నారా : హీరోయిన్ | malayali Actress Amala Rose Kurian requests not to misunderstand her | Sakshi
Sakshi News home page

నా ఆత్మహత్య వార్త చూడాలనుకుంటున్నారా : హీరోయిన్

Published Tue, Nov 8 2016 12:59 PM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

నా ఆత్మహత్య వార్త చూడాలనుకుంటున్నారా : హీరోయిన్

నా ఆత్మహత్య వార్త చూడాలనుకుంటున్నారా : హీరోయిన్

ఓ మలయాళీ హీరోయిన్కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కొద్ది రోజుల క్రితం కేరళలో అమలా అనే సీరియల్ నటి వ్యభిచారం చేస్తూ పట్టుపడింది. ఆ విషయం మీడియాలో ప్రముఖంగా రావటంతో అంతా హీరోయిన్ అమలా రోజ్ కురియన్ పోలీసులకు పట్టుబడినట్టుగా భావించారు. సోషల్ మీడియాలో అదే ప్రచారం జరగటంతో అమలా రోజ్ కురియన్ త్రీవంగా స్పందించింది.

పోలీసులకు పట్టుబడింది తాను కాదంటూ తన ఫేస్బుక్ పేజ్లో క్లారిటీ ఇచ్చిన అమలా రోజ్ కురియన్, ఈ వార్త ప్రచారం చేస్తున్న వారు తన ఆత్మహత్య వార్త చూడాలనుకుంటున్నారా అని ప్రశ్నించింది. 'మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయిని నేను.. కేవలం నటన మీద ఆసక్తితోనే ఈ రంగంలో కొనసాగుతున్నా.. కానీ ఇలాంటి వార్తల వల్ల, ఆ ఆసక్తి తగ్గిపోతుంది. దయచేసి నన్ను అపార్థం చేసుకునే వార్తలను ప్రచారం చేయకండి. ఈ వార్తల మూలంగా గత వారం రోజులుగా నాకు నిద్ర కూడా పట్టడం లేదు' అంటూ పోస్ట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement