PM Modi AP Visit: CM YS Jagan Request PM Modi Over Special Status, Details Inside - Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి: ప్రధానితో సీఎం జగన్‌

Published Mon, Jul 4 2022 6:17 PM | Last Updated on Mon, Jul 4 2022 6:57 PM

CM YS Jagan Request PM Modi Over Special Status After AP Visit - Sakshi

సాక్షి, అమరావతి:  విభజన వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి వీడ్కోలు పలికిన సీఎం జగన్‌.. పలు విజ్ఞప్తులతో కూడిన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. 


విజ్ఞాపన పత్రంలోని ముఖ్యమైన అంశాలు

రీసోర్సు గ్యాప్‌ గ్రాంటు అంశాన్ని ప్రస్తావిస్తూ..  రూ.34,125.5 కోట్ల రూపాయలను రీసోర్స్‌ గ్యాప్‌ కింద గ్రాంటుగా ఇవ్వాలని కోరారు.
తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాలి. 
► పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపండి.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్‌ విషయంలో హేతు బద్ధత లేదు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోంది. దానిని సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలి. 
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలి. 
భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్‌లు మంజూరుచేయాలి. 
ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని ప్రధానికి సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement