
సాక్షి, హైదరాబాద్: తమ రిటైర్‌మెంట్ వయసు కూడా 65 ఏళ్లకు పెంచాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు నిమ్స్ డాక్టర్లు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రొఫెసర్ల వయసును 65 ఏళ్లకు పెంచుతూ జూన్‌లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని కాలేజీల్లో ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినప్పటికీ, నిమ్స్‌లో మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు. నిమ్స్ అటానమస్ సంస్థ కావడంతో ఆ సంస్థ డైరెక్టర్ ఈ ఉత్తర్వులను అమలు చేయా ల్సి ఉంది. ఈ రెండు నెలల్లో ముగ్గురు ప్రొఫెసర్ల రిటైర్‌మెంట్ ఉందని, ఇకనైనా ఏజ్ హైక్ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని శనివారం మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment