nims doctors
-
ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం : నిమ్స్ వైద్యులు
-
ప్రీతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం
లక్డీకాపూల్ (హైదరాబాద్)/సాక్షి, వరంగల్: పీజీ వైద్యవిద్యార్థిని ️ప్రీతిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని నిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమెకు ప్రొటోకాల్ ప్రకారం వైద్య చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై శనివారం యాజమాన్యం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిమ్స్ వైద్య బృందం సభ్యులు మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు. ప్రస్తుతం ఆమెకు ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ పరిస్థితిలో ఉన్న ప్రీతిని నిమ్స్‌కు తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌లు నిమ్స్‌కు వచ్చి ప్రీతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రీతి ర్యాగింగ్ ఘటనకు మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రగతిభవన్‌లో కూడా పేదవర్గాలపై కనబడకుండా ర్యాగింగ్ జరుగుతోందని తెలిపారు.ప్రీతి విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిష్పాక్షికంగా విచారణ: మంత్రి హరీశ్‌రావు ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా కల్పించారు. నిష్పాక్షికంగా పూర్తి విచారణ జరుగుతుందని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై మంత్రి సమీక్షించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, చికిత్స చేస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని ఆరా తీశారు. డాక్టర్ ప్రీతికి అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సైఫ్ విషయంలో ఏం చేద్దాం?: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అరెస్టయిన సీనియర్ విద్యార్థి సైఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ర్యాగింగ్, వేధింపుల కేసులో అరెస్టయి జైలుకెళ్లిన సైఫ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాళోజీ హెల్త్‌వర్సిటీకి.. కేఎంసీ ప్రిన్సిపల్ మోహనదాస్ శనివారం లేఖ రాశారు. సోమవారంలోగా నిర్ణయం రావొచ్చని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సైఫ్‌పై చర్యలు ఉంటాయని ప్రిన్సిపల్ శనివారం ‘సాక్షి’కి తెలిపారు. అలాగే, కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా కేఎంసీలో సోమవారం ర్యాగింగ్ నియంత్రణ కమిటీ సమావేశమై నివేదికను రూపొందించి పంపుతుందన్నారు. ప్రీతి కేసులో సైఫ్‌పై ఆరోపణలు రుజువైతే అతడి పీజీ అడ్మిషన్‌ను రద్దు చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. ఒకవేళ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించేలా సైఫ్ వ్యవహార శైలి ఉందని రుజువైతే ఎంబీబీఎస్ పట్టా కూడా రద్దు కావచ్చంటున్నారు. ఏమైనా.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి చర్యలుంటాయని మోహన్‌దాస్ తెలిపారు. ‘సర్’పై సర్వత్రా చర్చ: కేఎంసీ కాలేజీలో సీనియర్లను.. జూనియర్లు ‘సర్’అని పిలుస్తున్నారని, దీనిపై దృష్టి సారించాల్సి ఉందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇలా పిలిపించుకోవడం ర్యాగింగ్ కిందికే వస్తుందని వరంగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అభిప్రాయపడింది. సీనియర్లు, జూనియర్ల మధ్య ‘సర్’అనే పదం చాలా గ్యాప్ తీసుకొస్తుందని నిపుణులు అంటున్నారు. -
విషమంగానే ప్రీతి ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్/హైదరాబాద్: వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అంతర్గత అవయవాలు ఫెయిలైన స్థితిలో ఆమెను నిమ్స్‌కు తెచ్చారని, గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరిచేందుకు ఎక్మో, సీఆర్ఆర్టీలతో ప్రయత్నం చేస్తున్నామని నిమ్స్ వైద్యులు వివరించారు. అన్ని విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఈమేరకు గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. సీనియర్ విద్యార్థి చేతిలో వేధింపులకు గురైన ప్రీతి బుధవారం ఎంజీఎం ఆస్పత్రిలో ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. పోలీసుల అదుపులో సైఫ్? ప్రీతి తండ్రి నరేందర్ నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు, సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సైఫ్‌పై ర్యాగింగ్, వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఏసీపీ బోనాల కిషన్ గురువారం కేఎంసీ, ఎంజీఎంలో విచారణ జరిపారు. ప్రీతి, సైఫ్‌ల సెల్ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు.. కాల్‌డేటా ఆధారంగా కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సైఫ్ వేధింపులే కారణమా..? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా ఆరా తీశారు. మరోవైపు, ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ప్రీతి సహచర విద్యార్థులు, అనస్థీషియా విభాగ వైద్యులతో మాట్లాడి ప్రాథమిక నివేదిక తయారుచేసింది. ఈ నివేదికను శుక్రవారం డీఎంఈకి పంపనున్నట్లు ఎంజీఎం పరిపాలనాధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రీతి, సైఫ్ ఇద్దరి కుటుంబాలదీ రైల్వే బ్యాక్ గ్రౌండే కావడం గమనార్హం. ప్రీతి తండ్రి ధరావత్ నరేందర్ నాయక్ వరంగల్ రైల్వే ప్రొటెక్షన్స్ ఫోర్స్‌లో ఏఎస్ఐగా పని చేస్తుండగా, సైఫ్ తండ్రి సలీం కాజీపేటలో రైల్వే డీజిల్ లోకోషెడ్‌లో పని చేస్తున్నారు. సరస్వతీ పుత్రిక ఎంజీఎం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి సర్వసతీ పుత్రిక అని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెబుతున్నారు. ఎస్ఎస్సీలో 600కు గాను 526 మార్కులు సాధించింది. ఇంటర్లో వెయ్యి మార్కులకు 970 సాధించింది. ఎంసెట్ ఎంట్రన్స్‌లో 5 వేల ర్యాంకు సాధించి కామినేని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. 2013లో వైద్యవిద్యను ప్రారంభించి 2019లో పూర్తిచేసింది. పీజీ ఎంట్రన్స్‌లో ఆలిండియా 1161 ర్యాంకు సాధించి కేఎంసీలో అనస్థీషియా విభాగంలో అడ్మిషన్ పొందింది. అన్ని స్థాయిల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తూ వస్తున్న ప్రీతి ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు తలొగ్గేది కాదని, వైద్యవిద్య అంటే ఆమెకు ఇష్టమని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. -
అరగంటలో కరోనా టెస్ట్ రిజల్ట్
-
మా పదవీ విరమణను 65 ఏళ్లకు పెంచాలి
సాక్షి, హైదరాబాద్: తమ రిటైర్మెంట్ వయసు కూడా 65 ఏళ్లకు పెంచాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు నిమ్స్ డాక్టర్లు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రొఫెసర్ల వయసును 65 ఏళ్లకు పెంచుతూ జూన్‌లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని కాలేజీల్లో ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినప్పటికీ, నిమ్స్‌లో మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు. నిమ్స్ అటానమస్ సంస్థ కావడంతో ఆ సంస్థ డైరెక్టర్ ఈ ఉత్తర్వులను అమలు చేయా ల్సి ఉంది. ఈ రెండు నెలల్లో ముగ్గురు ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఉందని, ఇకనైనా ఏజ్ హైక్ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని శనివారం మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు. -
‘నిమ్స్’ ప్రతిష్టపై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్ : ‘రౌతు మెత్తనైతే గర్రం మూడుళ్ల మీద పరిగెడుతుందని సామెత’.. ఇది నిమ్స్ ఆస్పత్రిలో జరుగుతున్న సంఘటనలకు సరిగ్గా సరిపోతుంది. ఆస్పత్రిలో ఉండాల్సిన వైద్యులు ప్రైవేటు ఆస్పత్రుల్లో బిజీబిజీగా చికిత్సలు చేస్తున్నా.. కీలకమైన అత్యవసర చికిత్సా విభాగంలోకి ప్రయివేటు వైద్యులు చొచ్చుకొచ్చినా.. మెడికో లీగల్ కేసుల సర్జరీలను సైతం వారే చేస్తున్నా నిమ్స్ డైరెక్టర్ పట్టించుకోరు. ప్రఖ్యాతి గాంచిన నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరువును నిలువునా తీసేస్తున్నా పర్యవేక్షించాల్సిన బాధ్యుడు పట్టించకోరు. నిత్యం సచివాలయం చుట్టూ చక్కర్లు.. మంత్రులతో మంతనాలతోనే గడిపేస్తారు. ఎమర్జెన్సీ విభాగంలో ఉండాల్సిన ఇద్దరు వైద్యులు ఎక్కడికి వెళతారో తెలియదు. వారి స్థానంలో మరో ఇద్దరు ప్రయివేటు వైద్యులు కనిపిస్తారు. వారిని ఎవరు తీసుకు వచ్చారో నిమ్స్ డైరెక్టర్ సమాధానం చెప్పరు. న్యూరో సర్జరీ విభాగంలో డాక్టర్ వంశీ కృష్ణ అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. నిమ్స్‌లో మాత్రమే విధులు నిర్వహించాల్సిన ఈయన పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేశారు. గతేడాది జరిగిన ఈ సంఘటనపై ఆ విభాగాధిపతి డాక్టర్ విజయ్ సారథి సీరియస్‌గా తీసుకుని డైరెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లగా మెమో ఇచ్చి సరిపెట్టారు తప్ప ఆయనపై చర్యలు మాత్రం తీసుకోలేదు. అత్యవసర చికిత్సా విభాగంలో విధులు నిర్వహించాల్సిన వైద్యులు దూర్దానా, శరోన్ అప్పట్లో గైర్హాజరయ్యారు. వారు ఎక్కడికి వెళ్లినట్టో తెలియని పరిస్థితి. కానీ వారిస్థానంలో వైద్యులుగా ప్రజ్ఞ, అలీ నిమ్స్‌కు వచ్చారు. ఆస్పత్రి డైరెక్టర్‌కు అంతా తెలిసే జరిగిందా..? తెలియకుంటే ఎందుకు ఆయా విభాగం అధినేతపై చర్యలు తీసుకోలేదో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే.. అదే సమయంలో ఓ ఖైదీ మృతి చెందిన ఘటనలో పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో సదరు వైద్యుల బండారం బయట పడుతుందని.. కేసు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని అక్కడి నుంచి వెళ్లి పోయారు. వారితోపాటు వైద్యులు దూర్దానా, శరోన్ కూడా వెళ్లి పోయారు. ఇదిలా ఉండగా.. నిమ్స్‌లో వైద్యుడిగా విధులు నిర్వహిస్తూ ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ చికిత్సను నిర్వహిస్తూ కొందరు వైద్యులు నిమ్స్‌కు ఆలస్యంగా వస్తుంటారు. ‘ప్రయివేటు’ సేవలపై ఉన్న మమకారంతో ఇక్కడి రోగులపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం సర్వసాధారణంగా మారింది. దీంతో పలు అనర్థాలు జరుగుతున్నాయి. చికిత్స సమయంలో రోగి పొట్టలో కత్తెరలు మరిచి పోవడం లాంటి ఘటనలు అలాగే చోటుచేసుకున్నాయి. గతంలో హెర్నియాకు చికిత్స చేయాలంటూ వచ్చిన హర్షవర్ధన్ భార్య మహేశ్వరి పొట్టలో కత్తెర పెట్టి కుట్లేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో విచారణ కమిటీ పేరుతో ఆ వైద్యుడిని తప్పించారు. రోగుల శ్రేయస్సు, ఆస్పత్రి ప్రతిష్ఠ దృష్ట్యా నిమ్స్ యాజమాన్యం ఇటువంటి ఘటనలకు తావులేకుండా చూడాల్సి ఉంది. నిమ్స్‌లో ఇలాంటి బాధ్యతా రహితంగా పలు సంఘటనలు జరుగుతున్నా డైరెక్టర్ మాత్రం దేన్నీ సీరియస్‌గా తీసుకోవడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రయివేటు వైద్యులు చికిత్స నిర్వహించడం చట్టరీత్యా నేరం. అయినా సరే దానిని విస్మరించి కొన్నాళ్లపాటు వైద్యం నిర్వహించారంటే దాని వెనుక పెద్ద తలకాయే ఉందని ఇక్కడ పనిచేస్తున్న పలువురు వైద్యులు అనుమానిస్తున్నారు. -
ఏసీబీ చార్జ్‌షీట్‌లో నిమ్స్ వైద్యుల పేర్లు
హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో పరికరాల కొనుగోలు అవకతవకలపై ఏసీబీ గురువారం దాఖలు చేసింది. మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. పరికరాల కోసం రూ. 10 కోట్ల టెండర్లలో రూ. 3.14 కోట్ల మేర అవినీతి జరిగిందని ఏసీబీ తెలిపింది. అలాగే మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్తోపాటు ఆసుపత్రి వైద్యులు ముకుందరెడ్డి, సూర్యప్రకాశ్‌రెడ్డి, వికాస్ కన్నా పేర్లను కూడా చార్జ్‌షీటులో ఏసీబీ చేర్చింది. -
14 ఏళ్ల బాలునికి అరుదైన చికిత్స
♦ ‘మేజర్ హెపటెక్టమీ’తో బాధపడుతున్న బాలుడు ♦ క్యాన్సర్ సోకిన 80 శాతం కాలేయం తొలగింపు ♦ కోలుకున్న బాధితుడు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ సాక్షి, సిటీబ్యూరో: నిమ్స్ వైద్యులు మరో అరుదైన చికిత్స చేశారు. కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న ఓ బాలునికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. బాధితుడు కోలుకోవడంతో శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన చౌదరి(14) కొంత కాలంగా మేజర్ హెపటెక్టమీ (కాలేయ క్యాన్సర్)తో బాధపడుతున్నాడు. చికిత కోసం అనేక మంది వైద్యులను ఆశ్రయించాడు. దీంతో వారు నిమ్స్‌లోని సర్జికల్ క్యాన్సర్ విభాగం అధిపతి డాక్టర్ సూర్యనారాయణరాజును సంప్రదించగా, ఆయన ఈ నెల 5న బాధితుడికి ఆపరేషన్ నిర్వహించి క్యాన్సర్ సోకిన 80 శాతం కాలేయాన్ని తొలగించారు. అతడిని ఐసీసీయూలో ఉంచి చికిత్స అందించారు. మెడికల్ సపోర్టుతో ఊపిరితిత్తులు, మూత్ర పిండాల పని తీరును మెరుగుపరి చారు. చిన్న పిల్లల్లో చాలా అరుదుగా కాలేయ క్యాన్సర్లు వెలుగు చూస్తాయని, అరుదైన ఈ మేజర్ హెపటెక్టమీతో బాధపడే వారికి చిన్న వయసులోనే ఇలాంటి చికిత్స చేయడం చాలా రిస్కుతో కూడినదని డాక్టర్సూర్యనారాయణరాజు తెలిపారు. రూ. 10 లక్షలకు పైగా ఖర్చయ్యే ఈ ఆపరేషన్‌ను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అతను కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు. -
డబ్బు ఇవ్వకపోతే అంతు చూస్తా...
- నిమ్స్ వైద్యుడికి నకిలీ విలేకరి బెదిరింపులు - నిందితుడి అరెస్టు పంజగుట్ట : ‘నేను విలేకరిని, నాకు డబ్బు ఇవ్వకపోతే .. మా పత్రికలో నీకు వ్యతిరేకంగా వార్త రాసి నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించి అడ్డంగా దొరికిపోయాడో నకిలీ విలేకరి. పంజగుట్ట పోలీసుల కథనం ప్రకారం ... దోమలగూడకు చెందిన మనోహర్ (40) రిపోర్టర్నని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఇతను శనివారం నిమ్స్ ఆసుపత్రి బ్లడ్‌బ్యాంక్ విభాగాధిపతి పాండురంగారావు వద్దకు వెళ్లి ‘నేరు యాంటీ కరప్షన్ పత్రిక విలేకరిని, నాకు వెయ్యి రూపాయలు కావాలి.. డబ్బు ఇవ్వకపోతే, నీకు వ్యతిరేకంగా మా పత్రికలో వార్త రాస్తానని బెదిరించాడు. తాను ఏ తప్పు చేయకపోయినా తను బెదిరిస్తుండటంతో సదరు డాక్టర్ అవాక్కయ్యాడు. వెంటనే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నకిలీ విలేకరని తేలింది. అతడి వద్ద విజ్ఞాన్, నందు టైమ్స్, జననేత, వాయిస్ ఆఫ్ తెలంగాణ, ఎవరెస్ట్ న్యూస్ అనే పేర్లతో ఉన్న ఏడు గుర్తింపు కార్డులు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మనోహర్‌ను రిమాండ్‌కు తరలించారు. -
వడపోయని కిడ్నీలు..
పాతికేళ్లకే పాడవుతున్న వైనం నిమ్స్ వైద్యుల సర్వేలో వెల్లడి.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం నేడు వరల్డ్ కిడ్నీ డే.. సిటీబ్యూరో/గాంధీ ఆస్పత్రి: ఇనుప కండలు.. ఉక్కు నరాలతో రాళ్లను సైతం పిండి చేయగల యువత నేడు పాతికేళ్లకే కిడ్నీ జబ్బుల బారిన పడుతోంది. దేశవ్యా ప్తంగా ఏటా 2.5 లక్షల కేసులు నిర్థారణ అవుతుంటే.. రాష్ట్రంలో ప్రతి పదిమందిలో ఒకరు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఏటా 15 వేలకు పైగా కేసులు వెలుగు చూస్తుండటం గమనార్హం. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో 10-15 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. నగరంలోని ప్రస్తుతం 15 వేల మంది డయాలసిస్ చేయించుకుంటుండగా, ఏటా 150-200కు పైగా మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఒక్క నిమ్స్‌లోనే ఏటా 70-80 శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఆందోళన కలిగించే అంశం.. తమకు కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్టు వీరిలో చాలా మందికి తెలియదు. బాధితుల్లో ఎక్కువ శాతం 40 ఏళ్లలోపు వారే కావడం విశేషం. ఐసీఎంఆర్ సర్వే.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎంత మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు..? ఏ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువ ఉంది..? ఏ వయసు వారు దీని బారిన పడుతున్నారు..? వంటి ప్రశ్నలకు నిపుణుల వద్ద ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లే దు. అయితే, ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాన్ని కనుగొనాలనే ఉద్దేశంతో ‘ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)’ నాలుగేళ్ల క్రితం ఢిల్లీ, ముంబయి, గౌహతి, భువనేశ్వర్, కోల్‌కత, చైన్నై, జైపూర్, హైదరాబాద్ పట్టణాల్లో సర్వే చేపట్టింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు నిమ్స్‌లోని సీనియర్ వైద్య నిపుణులు, పరిశోధక విద్యార్థులకు ఇందులో భాగస్వామ్యం కల్పించింది. సర్వే దాదాపు ముగింపు దశకు వచ్చింది. పేదల జీవితాల్లో వైఎస్సార్ వెలుగులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ సేవలను ఉచితంగా అందించి వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. రూ. వేలు ఖర్చుపెట్టి డయాలసిస్ చేయించుకోలేని వారికి ‘ఆరోగ్యశ్రీ’ ద్వారా డయాలసిస్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో గాంధీ ఆస్పత్రిలో 2009 నవంబర్ 6న ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో 20 యూనిట్లతో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ 92,210 మందికి ఉచిత డయాలసిస్ సేవలు అందించారు. రోగాలకు కారణాలివే.. మారిన ఆహారపు అలవాట్లు, మధుమేహం, అధిక రక్తపోటు, పెయిన్ కిల్లర్స్ అతిగా వినియోగించడం, యాంటిబయాటిక్స్ ఎక్కువ వాడటం, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు సోకడం, యాంజియోగ్రామ్ పరీక్షల్లో కాంట్రాస్ట్ మందు వాడటం, మరికొన్ని జన్యుపరమైన కారణాలతో పాటు శరీరానికి సరిపడినంత మంచి నీరు తాగకపోవడం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. - చాడ రమేష్, గాంధీ నెఫ్రాలజీ హెచ్‌వోడీ ఏటా స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి ఏడాది కోసారైనా ప్రతి ఒక్కరూ విధిగా కిడ్నీ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఫిట్నెస్ కోసం రోజుకు కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయాలి. శరీరానికి సరిపడు (4 లీటర్లకు తగ్గకుండా) మంచినీరు తాగాలి. లేదంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడి, మూత్ర విసర్జన సమయంలో భరించలేని నొప్పి వచ్చి అది క్రమంగా గుండె పోటుకు దారి తీస్తుంది. - ప్రొ. శ్రీభూషణ్ రాజు, నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి గాంధీలో డయాలసిస్ రోగులు.. 2010 13,600 2011 16,300 2012 16,800 2013 20,400 2014 21,270 2015 ఫిబ్రవరి వరకు 3,840 -
మా వయస్సు.. మీ ఓటు!
పదవీ కాలాన్ని పొడిగించుకొనేందుకు కొందరు నిమ్స్ వైద్యుల ఎత్తుగడ శుక్రవారమే ప్రారంభమైన రహస్య బ్యాలెట్ డైరెక్టర్ అనుమతితోనే జరుగుతున్న బాగోతం.. నిబంధనలకు నీళ్లు మీ సేవలు చాలు.. వెళ్లిపోమ్మంటున్న జూనియర్ ఫ్యాకల్టీలు సాక్షి, హైదరాబాద్: సాధారణంగా రిటైర్మెంట్ వయస్సు సమీపించిన ఉద్యోగుల పదవీ కాలాన్ని పొడిగించుకోవాలంటే.. వయసు నిబంధనను సవరించాలి. అందులోనూ ఆ పని చేయాల్సింది ప్రభుత్వమే. కానీ నిమ్స్‌లో మాత్రం దీనంతటికీ నీళ్లోదిలేశారు. నిమ్స్‌లో 62 ఏళ్ల వయసు దాటితే పదవీ విరమణ చేయాలి. కానీ, కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయాల్సిన పలువురు వైద్యులు మళ్లీ పదవిలో కొనసాగడానికి రహస్య బ్యాలెట్ విధానానికి పూనుకున్నారు. అందుకు డెరైక్టర్‌నూ ఒప్పించారు. ఈ మేరకు వైద్యులందరూ రహస్య బ్యాలెట్ పద్ధతిలో పాల్గొనాలంటూ శుక్రవారం నిమ్స్ వైద్యులందరికీ డీన్ నుంచి ఓ ఈ-మెయిల్ సందేశం వచ్చింది. ఒక్కసారిగా వచ్చిన ఈ సందేశంతో వైద్యులు కంగుతిన్నారు. అసలు ఆ బ్యాలెట్లో మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటో ఆప్షన్లో.. ‘మీ పదోన్నతులకు అడ్డుకాము. శస్త్రచికిత్సలు మీ ఇష్టమొచ్చినట్టే చేసుకోవచ్చు. విభాగాధిపతి పోస్టులను రొటేషన్ పద్ధతిలో ఇస్తాం. 65 ఏళ్ల వయసుకు ఓటేస్తున్నాం’ అని... రెండో ఆప్షన్లో ‘ఒప్పుకొనేది లేదు’ అని... మూడో ఆప్షన్లో ‘మేము నిర్ణయించుకోలేం. తటస్థంగా ఉంటాం’ అని పెట్టారు. ఈ రహస్య బ్యాలెట్లో శుక్రవారం కొంతమంది వైద్యులు ఓటేశారు కూడా. శనివారం సాయంత్రం వరకూ ఈ ఓటింగ్ కొనసాగనుంది. అయితే, నిమ్స్‌లో 140 మందికి పైగా ఫ్యాకల్టీ సభ్యులుండగా.. 70 శాతం మంది వయస్సు పెంపును వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ‘మిమ్మల్ని భరించలేం, మీరు చేసిన సేవలు చాలు. ఇక వెళ్లిపోండి’ అంటూ కొంతమంది బ్యాలెట్లో రాసినట్టు నిమ్స్ వర్గాల సమాచారం. నిమ్స్ చరిత్రలో ఇలాంటి తిరకాసు నిర్ణయాలు లేవని, వయసు దాటాక కూడా ఇదేం పరిస్థితి అని పలువురు వైద్యులు విమర్శిస్తున్నారు. కొత్తగా వచ్చిన డెరైక్టర్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలపై మండిపడుతున్నారు. కాగా.. వైద్యుల్లో వీబీఎన్ ప్రసాద్, జగన్మోహన్రావు, పీవీఎల్ఎన్ మూర్తి, ముకుందరెడ్డి, పీవీ రావు తదితరులు కొద్ది రోజుల్లో పదవీవిరమణ చేయనున్నారు. -
జగన్‌కు మరో 2రోజులు చికిత్స అవసరమన్న వైద్యులు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి మరో రెండు రోజులు చికిత్స అవసరమని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఆయన బాగా నీరసంగా ఉన్నట్లు వారు చెప్పారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయానికి నిరసన తెలుపుతూ, ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో జగన్ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏడు రోజులు దీక్ష చేసిన తరువాత కోర్టు ఆదేశాలతో వైద్యులు శనివారం ఆయన దీక్షను భగ్నం చేశారు. ఆ రోజు నుంచి నిమ్స్‌లోనే ఆయనకు చికిత్స చేస్తున్నారు. ఏడు రోజులపాటు ఎటువంటి ఆహారం తీసుకోనందున ఆయన ఇంకా నీరసంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన సాధారణ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని వారు చెప్పారు. జగన్ శరీరంలో సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నట్లు ఉదయం నిమ్స్ వైద్యులు తెలిపారు. షుగర్, బీపీ, కీటోన్స్ సాధారణ స్థాయికి చేరుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఏడు రోజులుగా దీక్ష చేయడంవల్ల శరీరంలో ఉన్న కొవ్వులు పూర్తిగా కరిగిపోయాయని, ఈ కారణంగానే కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. జగన్ ఇప్పటికీ నీరసంగానే ఉన్నారని, సాధారణ స్థితికి చేరుకోవాలంటే బలమైన ఆహారం తీసుకోవాల్సి ఉందని సూచించారు. ఆరోగ్యం మందకొడిగా ఉన్నందున జగన్ పూర్తిగా కోలుకోవటానికి కొన్నిరోజుల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. నిమ్స్ వైద్య బృందంలో ప్రముఖులైన డాక్టర్ శేషగిరిరావు (కార్డియాలజీ), డాక్టర్ శ్రీభూషణ్‌రాజు (నెఫ్రాలజీ), డాక్టర్ వైఎస్ఎన్ రాజు (జనరల్ మెడిసిన్)లు ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. -
వైయస్ జగన్‌కు ఇంకా ప్లూయిడ్స్ ఎక్కిస్తున్నాం
-
జగన్ మెల్లగా కొలుకుంటున్నారు: నిమ్స్ వైద్యులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులు ఆదివారం మధ్యాహ్నం 12.00 గంటలకు హెల్త్ బులెటన్ విడుదల చేశారు. వైఎస్ జగన్ ఆరోగ్యం మెల్లగా కుదుటపడుతోందని వైద్యులు తెలిపారు. ఆయనకు ఇంకా ప్లూయిడ్స్ అందిస్తున్నట్లు వివరించారు. ఆయన కొలుకోవడానికి కొంత సమయం పడుతోందని చెప్పారు. మరో రెండు రోజుల వరకు ఆయనకు విశ్రాంతి అవసరమని వారు విడుదల చేసిన హెల్త్ బులెటన్లో వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా గత ఏడు రోజుల పాటు ఎస్ జగన్ ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో నిమ్స్ ఆసుపత్రి వైద్యులు శనివారం ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్(గ్లూకోజ్) ఎక్కించారు. దీంతో వారం రోజులుగా ఆయన చేస్తున్న నిరాహార దీక్షను భగ్నం చేసినట్లయింది. కాగా, ఆస్పత్రిలో ఉన్న జగన్ ఇంకా నీరసంగానే ఉన్నారని ఆయన సతీమణి వైఎస్ భారతి ఈ ఉదయం తెలిపారు. మరోవైపు నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) డైరెక్టర్‌గా నియమితులయిన డాక్టర్ లావు నరేంద్రనాథ్... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. తనను నిమ్స్ డైరెక్టర్ గా నియమించినందుకు సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రికి ఆయన వివరించారని సమాచారం.