అర్జీలు ఇవ్వడానికి పోటీ పడుతున్న ప్రజలు
చిలమత్తూరు : మండలంలో సాగిన ఎమ్మెల్యే బాలకృష్ణ రెండో రోజు పర్యటనలో కూడా ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. మొరంపల్లి, కో డూరు, శెట్టిపల్లి, మరవకొత్తపల్లి, వీరాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. పింఛన్ రాలేద ని, కొందరు, రేషన్ సక్రమంగా అందలేదని కొందరు, ఇంటి స్థలాలు మంజూరు కాలేదని కొందరు ఇలాసమస్యలను పరిష్కారించాలంటూ వందలాది మంది ప్రజలు వినతులు అందజేశారు.
ఆశా కార్యకర్తలకు న్యాయం చేయాలి : ప్రభుత్వాసుపత్రిలో, ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలో పనిచే సే ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కార్యకర్తలు బాలకృష్ణ వద్ద శెట్టిపల్లిలో మొరపెట్టుకున్నారు. సరైన గౌరవ వేతనం లేక నానా ఇబ్బందులు పడుతున్నామని వేతనం పెంచాలని డిమాండ్ చేశారు.
యువకులకు ఉద్యోగాలు కల్పించాలి
యువకులకు ఉద్యోగాలు కల్పించాలంటూ నిరుద్యోగ యువత కోరారు. కియో పరిశ్రమం ఏర్పాటు జ రుగుతోందని అధికారులు, ప్రజాప్రతినిధులు తె లియజేస్తున్నారని స్థానికులకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. శెట్టిపల్లి ఎస్సీ కాలనీ వా సులకు గత కొన్ని నెలలుగా నీటి సమస్యతో పాటు ఇంటి పట్టాలు, నిర్మాణాల సమస్య ఉందని వాటిని పరిష్కరించాలన్నారు. కోడూరు పంచాయతీ లోని కనిశెట్టిపల్లిలో చౌకధాన్యపు డిపో సమస్యలను డీలర్ స్వయంగా బాలకృష్ణకు వివరించారు. అనంతరం వీరాపురంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు.
స్పెషల్ పార్టీ పోలీసుల అత్యుత్సాహం
ఎమ్మెల్యే బాలకృష్ణకు సెక్యురిటీగా వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శించారు. అర్జీలు ఇచ్చుకోవడం కోసం వెళ్లిన ప్రజలను అడ్డుకున్నారు. సెక్యూరిటీ సమస్యలు వస్తాయనే సాకుతో చాలామంది ప్రజలు నేరుగా సమస్యలను తెలియజేసే అవకాశం ఇవ్వలేదు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అధికారులతో పాటు, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment