Unemployed Youth
-
కూటమి సర్కార్ నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలికావాలా?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: నిరుద్యోగ యువతపై కూటమి ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ నిలదీశారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో నిరుద్యోగులేమైనా బిక్షగాళ్ళా? అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చేతిలో నిరుద్యోగులు మోసానికి గురయ్యారన్నారు. ఏపీలో ప్రభుత్వం ఉందా? ఉంటే ఎవరి కోసం పనిచేస్తోందంటూ దుయ్యబట్టారు.‘‘ప్రభుత్వ తీరుతో నిరుద్యోగులు చాలా జీవితం కోల్పోతున్నారు. గందరగోళం సృష్టించడం కోసం ప్రభుత్వం ఉండకూడదు. కూటమి ప్రభుత్వమంటే పెద్ద అబద్ధం. ఉద్యోగాలు ఇవ్వడం చేతగాని కూటమి ప్రభుత్వం అవసరమా?. గ్రూప్-2 అభ్యర్థులను తీవ్ర కన్ఫ్యూజన్లోకి నెట్టేశారు. నిరుద్యోగుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లింది. అబద్ధపు హామీలతో నిరుద్యోగులను మోసం చేశారు. చిన్న అంశాన్ని తేల్చుకోలేక నిరుద్యోగులను బలిచేస్తారా?. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలికావాలా?. 40 ఏళ్ల సీనియర్.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ నా వినడం లేదంటాడు. సీఎం మాట ఏపీపీఎస్సీ ఛైర్మన్ వినకపోవడమేంటి?’’ అంటూ జూపూడి ప్రశ్నించారు.‘‘సీఎంగా చంద్రబాబు అన్ ఫిట్. రోస్టర్ విధానంలో లోపాలున్నాయంటున్నారు. లోపాలుంటే ఎందుకు సరిచేయలేకపోతున్నారు. వైఎస్ జగన్‌పై అపవాదు వేయాలని చూస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయ్యింది గాడిదలు కాస్తున్నారా? ఇన్ని రోజులూ. గందరగోళం సృష్టించడానికి కాదు.. మీకు అధికారం ఇచ్చింది. పది రోజుల నుంచి అభ్యర్ధుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎగ్జామ్‌కి ఒక రోజు ముందు నారా లోకేష్ ట్వీట్ చేశారు. మరుసటిరోజు చంద్రబాబు ఆడియో లీక్ చేశారు. సీఎం మాట విననప్పుడు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను తక్షణమే ఆమెను తొలగించండి’’ అంటూ జూపూడి ప్రభాకర్ అన్నారు.ఇంత గందరగోళం నడుస్తుంటే.. ఏపీపీఎస్ ఛైర్మన్ ఎందుకు నోరువిప్పడం లేదు. వైఎస్ జగన్ బయటికెళితే కేసు. ఆయనకి సెక్యూరిటీ తీసేస్తారు. నిరుద్యోగుల తరపున మాట్లాడితే అరెస్టులు. చిన్న సమస్యకు పరిష్కారం చూపలేనోళ్లు పోలవరం కడతారంట. చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీ స్వతంత్రంగా పనిచేసిన చరిత్ర లేదు. నిరుద్యోగులకు వచ్చిన చిన్న సమస్యను పరిష్కరించలేకపోయారు. నిరుద్యోగులు టెర్రరిస్టులు కాదు. ప్రభుత్వమే నిరుద్యోగుల గొంతు కోసేస్తే ఎలా?. నిరుద్యోగుల తరపున వైఎస్సార్సీపీ పోరాడుతుంది.. ఉద్యమాన్ని చేపడతాం. చంద్రబాబు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి’’ అని జూపూడి ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం
-
నిరుద్యోగులకు సీఎం రేవంత్ కీలక సందేశం
-
నిరుద్యోగులకు సర్కారీ ‘పరీక్ష’!
వారం రోజుల్లో మొదలుకానున్న డీఎస్సీ పరీక్షలు.. అవి ముగిశాక రెండు రోజుల్లోనే గ్రూప్–2 పరీక్షలు.. ప్రిపరేషన్‌కు సమయం సరిపోని పరిస్థితి.. దీంతో డీఎస్సీ పరీక్షల తేదీలను మార్చాలంటూ అభ్యర్థుల ఆందోళనలు.. ఏమాత్రం వెనక్కితగ్గకుండా పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపుతున్న సర్కారు.. ఆందోళనలు చేస్తున్న అభ్యర్థులు, విద్యార్థి సంఘాలపై పోలీసుల లాఠీచార్జీలు.. కాస్త సమయం ఇస్తే బాగుంటుందంటున్న విద్యావేత్తలు.. సమస్యకు పరిష్కారం చూపడం మానేసి లాఠీచార్జీలు ఏమిటంటూ హక్కుల కార్యకర్తల నిలదీతలు.. .. రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో ఆందోళన, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో నెలకొన్న పరిస్థితి ఇది. సర్కారు ఉద్యోగాల భర్తీ హర్షణీయమే అయినా.. నిరుద్యోగుల డిమాండ్లు, విజ్ఞప్తుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్న సూచనలు వస్తున్నాయి.సిలబస్ ఎక్కువ.. సమయం తక్కువ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ బాగా పెరిగింది. మొత్తం 14 సబ్జెక్టులు చదవాలి. కానీ సమయం మాత్రం తక్కువగా ఉంది. రోజుకో సబ్జెక్ట్ పూర్తి చేయడం ఎలా? ఇది ఆందోళన రేపుతోంది. పరీక్ష గడువును కనీసం మూడు నెలలు పొడిగించాలి. – ఐ.సుజిత, డీఎస్సీ అభ్యర్థి, సూర్యాపేట జిల్లాసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్షల (డీఎస్సీ)కు సమయం ముంచుకొస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి సబ్జెక్టుల వారీగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కంప్యూటర్ ఆధారి తంగా పరీక్షలు నిర్వహించనున్న ప్రభుత్వం.. ఆ దిశగా ఆన్లైన్ కేంద్రాలను సైతం ఎంగేజ్ చేసుకుంది. డీఎస్సీ పరీక్షలు ఆగస్టు 5వ తేదీతో పూర్తికానుండగా.. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు జరగనున్నాయి. వరుసగా పరీక్షలు ఉండటంతో అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి ఉంటుందనే వాదన వస్తోంది. సమయం తక్కువగా ఉండటంతో.. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది మార్చిలో నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుల స్వీకరణ మార్చి 4 నుంచి జూన్ 20వ తేదీ వరకు కొనసాగింది. సాధారణంగా పోటీ పరీక్షలకు సిద్ధంకావడానికి కనీసం 45 రోజులు ఉండాలి. కానీ ఉపాధ్యాయ నియామక పరీక్షకు కనీసం నెల రోజుల వ్యవధి కూడా ఇవ్వకుండా పరీక్షల తేదీలు నిర్ణయించడంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గ్రూప్–2 ఉద్యోగాల భర్తీ కోసం 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలైంది. ఆ పరీక్షలు పలుమార్లు వాయిదా పడ్డాయి. తాజా తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ.. ఈసారి పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదంటూ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలు దాదాపు ఒకే సమయంలో జరుగుతుండటంతో.. రెండింటికీ సిద్ధమవుతున్న వారికి ఇబ్బందిగా మారింది. ఆందోళనలకు దిగుతున్న అభ్యర్థులు ప్రిపరేషన్‌కు సమయం తక్కువగా ఉందని.. ఉపాధ్యాయ నియామక పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టెట్ పరీక్ష ఫలితాలను కూడా వారం క్రితమే విడుదల చేశారని.. డీఎస్సీకి ఎలా సిద్ధం కావాలని ప్రశ్నిస్తున్నారు. అయితే మరో వారం రోజుల్లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... వాయిదా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విముఖంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లను వెబ్సైట్లో పెట్టిందని పేర్కొంటున్నాయి. రెండు నెలలు వాయిదా వేయాలి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన నెలలోపే రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామనడం సరికాదు. కనీసం 45 రోజులు సమయం ఇవ్వాలి. తక్కువ సమయంలో పరీక్షలకు ఎలా సిద్ధమవాలో అర్థంకాని పరిస్థితి. ఇది అభ్యర్థులను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టడమే. టీచర్ నియామక పరీక్షలను కనీసం రెండు నెలలు వాయిదా వేస్తే మేలు జరుగుతుంది. – కేశమోని మనోజ్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా (డీఎస్సీ, గ్రూప్–2 పరీక్షల అభ్యర్ధి) పరీక్షలు వాయిదా వేయాలంటే.. పోలీసులతో కొట్టిస్తున్నారు డీఎస్సీ పరీక్షలకు కాస్త సమయం ఇవ్వాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతుంటే స్పందించని సీఎం.. నిరుద్యోగులపై మాత్రం లాఠీచార్జి చేయిస్తున్నారు. ప్రజాపాలన అంటే.. నిరుద్యోగులపై లాఠీచార్జి చేయడం, ఇచి్చన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడమేనా? 25వేల టీచర్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తానన్న సీఎం రేవంత్.. కేవలం 11 వేలకే టీచర్ పోస్టులను పరిమితం చేశారు. పైగా విద్యార్థులకు ప్రిపరేషన్‌కు తగిన సమయం కూడా ఇవ్వకపోవడం సరికాదు – గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు కొంత సమయం ఇస్తే బాగుండేది టెట్ ఫలితాలు వెల్లడించిన తర్వాత కొంత సమయం ఇచ్చి ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహిస్తే బాగుండేది. అలాగాకుండా ముందే షెడ్యూల్ ప్రకటించి, తర్వాత టెట్ ఫలితాలు ఇవ్వడంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకుని సమస్యను పరిష్కరిస్తే అభ్యర్థులకు ఊరట కలుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే జాబ్ కేలండర్ ప్రకటించడానికి సన్నాహాలు చేస్తోంది. గ్రూప్–1 పరీక్షలు సవ్యంగా నిర్వహించిందన్న పేరు వచి్చంది. ఇలాంటి సమయంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. – ప్రొఫెసర్ కోదండరామ్, టీజేఎస్ అధ్యక్షుడు లాఠీచార్జీలు కాదు.. సమస్యను పరిష్కరించాలి రాష్ట్రంలో వివిధ పోటీ పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించి రాజకీయ పారీ్టల అభిప్రాయాలు తీసుకుంటే మంచిది. పదేళ్లపాటు ఉద్యోగాల కోసం వేచి ఉండటంతో నిరుద్యోగ యువతలో ఆతృత, ఆందోళన పెరిగాయి. వరుస పరీక్షల నిర్వహణ షెడ్యూల్, ఇప్పటికే ప్రకటించిన పోటీపరీక్షల రీషెడ్యూల్‌పై టీజీపీఎస్సీ నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంది. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఎవరైనా కోర్టుకు వెళితే.. కోర్టు స్టే ఇస్తే మొత్తం సమస్య మొదటికి వచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వపరంగా స్పందించడమో లేక ఉద్యమిస్తున్న సంఘాల ప్రతినిధులతో చర్చించి సమస్య పరిష్కారానికి నచ్చజెప్పడమో చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా లాఠీచార్జీలు, దాడులకు దిగడం మంచిది కాదు. దీనితో అసలు సమస్య పోయి పోలీసులు దాడులకు దిగారంటూ మరో సమస్య తెరపైకి వస్తోంది. – ప్రొఫెసర్ హరగోపాల్, హక్కుల కార్యకర్త, విద్యావేత్త వెబ్సైట్లో డీఎస్సీ హాల్‌టికెట్లు డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లను గురువారం రాత్రి వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు www. schooledu. telangana. gov. in వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం సుమారు 2.8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. -
త్వరలో జాబ్ కేలండర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, నిరుద్యోగులందరికీ మేలు జరిగేలా త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ కేలండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో దాదాపు మూడు గంటలకు పైగా ఆయన సమావేశమయ్యారు.భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.శివసేనారెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, పవన్ మల్లాది, ప్రొఫెసర్ రియాజ్, టీచర్ల జేఏసీ నేత హర్షవర్ధన్‌రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు చనగాని దయాకర్, మానవతారాయ్, బాల లక్షి్మ, చారకొండ వెంకటేశ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీలో భాగంగా నిరుద్యోగుల డిమాండ్ల గురించి సీఎం ఆరా తీశారు. సీఎస్ శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులతో నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించేందుకున్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాబ్ కేలండర్ ప్రకారం భర్తీకి ప్రయత్నాలు: సీఎం ‘నిరుద్యోగులకు ఇచి్చన హామీ ప్రకారం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. గ్రూప్–1,2,3 ఉద్యోగాలకు సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించాం. జాబ్ కేలండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ కోసం ప్రయతి్నస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, ఇతర బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు కలగకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కేలండర్ రూపొందిస్తున్నాం.ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం కూలంకషంగా కసరత్తు చేస్తోంది. కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వారు చేస్తున్న కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో పాటు నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్ని రాజకీయ పారీ్టలు, స్వార్ధపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావొద్దు. గత ప్రభుత్వం లాగా మేం తప్పుడు నిర్ణయాలు తీసుకోలేం. పరీక్షలు జరుగుతున్న సమయంలో నిబంధనలు మారిస్తే చట్టపరంగా తలెత్తే అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 1:100కు పెంచితే కోర్టులు జోక్యం చేసుకునే చాన్స్: టీజీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలన్న డిమాండ్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ అధికారులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2022లో నిర్వహించిన గ్రూప్–1 పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా రెండుసార్లు వాయిదా పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంలో ఉన్న పిటిషన్‌ను వెనక్కు తీసుకుని, పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతో పోస్టుల సంఖ్యను పెంచి కొత్తనోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు.12 ఏళ్ల తర్వాత నిర్వహించిన గ్రూప్–1 పరీక్షకు 4 లక్షల మంది హాజరయ్యారని, ప్రిలిమ్స్‌ను పూర్తి చేశామని, నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం 1:50 పద్ధతిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఇప్పుడు ఆ నిష్పత్తిని 1:100కు పెంచితే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశముందని, అదే జరిగితే మళ్లీ నోటిఫికేషన్ నిలిచిపోతుందని చెప్పారు. నోటిఫికేషన్‌లోని నిబంధనల మార్పు న్యాయపరంగా చెల్లుబాటు కాదని, బయోమెట్రిక్ పద్ధతి పాటించలేదన్న ఏకైక కారణంతో హైకోర్టు గ్రూప్–1 పరీక్షను రెండోసారి రద్దు చేసిందని గుర్తు చేశారు. 1999లో యూపీపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వారు ఉదహరించారు. గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల పెంపు సాధ్యం కాదు గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల పెంపు అంశం కూడా సమావేశంలో చర్చకు వచి్చంది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నందున పోస్టులు పెంచడం ఇప్పుడు సాధ్యం కాదని, అలా జరిగితే అది నోటిఫికేషన్ ఉల్లంఘన అవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని తెలిపారు. కాగా గ్రూప్–2, డీఎస్సీ పరీక్షలు వెంటవెంటనే ఉండడంతో అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తోందని విద్యార్థి సంఘాల నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూలై 17 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలున్నాయని, వెంటనే 7, 8 తేదీల్లో గ్రూప్–2 పరీక్ష ఉండడంతో విద్యార్థులు ప్రిపరేషన్‌కు ఇబ్బంది అవుతుందని వివరించారు. కాగా టీజీపీఎస్సీ, విద్యాశాఖలు చర్చించి ఈ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటాయని సీఎం వారికి హామీ ఇచ్చారు. -
TGPSC వద్ద హైటెన్షన్
-
నిరుద్యోగ భారత్
సాక్షి, హైదరాబాద్: ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గడంతో దేశంలో నిరుద్యోగిత శాతం క్రమక్రమంగా పెరుగుతోంది. గత మే నెలలో 6.3 శాతం ఉండగా, జూన్ నాటికి 9.2 శాతానికి చేరింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే..గ్రామీణ ప్రాంతాల్లోనే నిరుద్యోగిత శాతంగా అధికంగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర రంగాల్లో డిమాండ్ తగ్గడంతో అక్కడ పనులు చేసుకునేవారిలో నిరుద్యోగం పెరిగింది.అదే సమయంలో ఆర్థిక రంగం దిగజారడం, ఇతర అంశాల కారణంగా పట్టణాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గడంతో దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూ వచ్చినట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో నిరుద్యోగశాతం 6.3 ఉండగా, జూన్‌లో 9.3కు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో చూస్తే...మే నెలలో 8.6 ఉండగా, జూన్ నాటికి 8.9 శాతానికి పెరిగింది. ⇒ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా రెండుచోట్లా మహిళల్లోనే నిరుద్యోగమనేది ఎక్కువగా ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ⇒ దేశవ్యాప్తంగా మహిళల విషయానికొస్తే... పట్టణ ప్రాంతాల్లో 21.36, గ్రామీణ ప్రాంతాల్లో 17.1 శాతం నిరుద్యోగులు ఉన్నారు. ⇒ పురుషుల విషయంలో నిరుద్యోగిత శాతం పట్టణ ప్రాంతాల్లో 8.9, గ్రామీణ ప్రాంతాల్లో 8.2 శాతంగా ఉంది. ⇒ 2023 జూన్‌లో నిరుగ్యోగ శాతం 8.5 ఉండగా, ఈ ఏడాది ఇదే సమయానికి 9.2 శాతానికి పెరిగింది. ⇒ కన్జూమర్ పిరమిడ్స్ హోస్‌హోల్డ్ సర్వేలోని గణాంకాల ప్రాతిపదికగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఆయా వివరాలు వెల్లడించింది.జనవరి–మార్చి మధ్యలో 6.7 శాతం... పీఎల్ఎఫ్ఎస్ సర్వేదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది జనవరి–మార్చి మధ్యలో 6.7గా నిరుద్యోగశాతం ఉన్నట్టుగా పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) పేర్కొంది. 2013లో 5.42 శాతమున్న నిరుద్యోగ శాతం, కరోనా పరిస్థితుల కారణంగా 2020లో 8 శాతానికి, ఆ తర్వాత 2021లో 5.98 శాతానికి తగ్గి, 2022లో 7.33 శాతానికి, 2023లో 8.4 శాతానికి, 2024లో తొలి ఆరునెలల్లో 6.7 శాతానికి (జూన్‌లో 9.2 శాతానికి) చేరుకున్నట్టుగా వివిధ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.15–29 ఏజ్ గ్రూప్ నిరుద్యోగంలో మూడోప్లేస్ దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 15–29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో అత్యధిక నిరుద్యోగ శాతమున్న రాష్ట్రంగా కేరళ నిలవగా, తెలంగాణ మూడో స్థానంలో నిలిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్యకాలంలో ఈ ఏజ్ గ్రూప్ నిరుద్యోగుల్లో టాప్‌ఫైవ్ రాష్ట్రాలు కేరళ 31.8 శాతం, జమ్మూ,కశ్మీర్ 28.2, తెలంగాణ 26.1, రాజస్థాన్న్ 24, ఒడిశాలో 23.3 శాతం ఉన్నట్టు వెల్లడైంది.దేశవ్యాప్తంగా ఈ ఏజ్‌గ్రూప్‌లో మొత్తంగా నిరుద్యోగిత శాతం జనవరి–మార్చి మధ్యలో 17 శాతంగా (అంతకు ముందు అక్టోబర్–డిసెంబర్ల మధ్యలో పోల్చితే 16.5 శాతం నుంచి) ఉంది. ఇక ఏజ్ గ్రూపుల వారీగా చూస్తే (అన్ని వయసుల వారిలో నిరుద్యోగ శాతం) నిరుద్యోగిత శాతం 6.7 శాతంగా ఉంది.నిరుద్యోగానికి ప్రధాన కారణాలు...⇒ అధిక జనాభా⇒ తక్కువ స్థాయిలో చదువు, నైపుణ్యాల కొరత (ఒకేషనల్ స్కిల్స్)⇒ప్రైవేట్‌రంగ పెట్టుబడులు తగ్గిపోవడం⇒వ్యవసాయరంగంలో తక్కువ ఉత్పాదకత ⇒చిన్న పరిశ్రమలకు ఇబ్బందులు, ప్రభుత్వ సహాయం కొరవడటం⇒మౌలిక సదుపాయాలు, ఉత్పత్తిరంగాల్లో పురోగతి సరిగ్గా లేకపోవడం⇒అనియత రంగం (ఇన్ఫార్మల్ సెక్టార్) ఆధిపత్యం⇒ కాలేజీల్లో చదివే చదువు, పరిశ్రమ అవసరాల మధ్య అంతరం పెరగడంమహిళల్లో అత్యధిక నిరుద్యోగ శాతంలో తెలంగాణ ఫోర్త్ ప్లేస్ఈ ఏడాది జనవరి–మార్చి నెలల మధ్యలో వివిధ వయసుల వారీగా నిరుద్యోగిత శాతంపై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేçషన్ (ఎంఎస్‌పీఐ) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)లో ఇవి వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా మహిళల్లో అత్యధిక నిరుద్యోగుల శాతంలో తెలంగాణ 38.4 శాతంతో నాలుగో స్థానంలో నిలిచినట్టు ఈ సర్వే వెల్లడించింది. మహిళల్లో అత్యధికంగా నిరుద్యోగులు అంటే 48.6 శాతంతో జమ్మూ కశ్మీర్ మొదటిస్థానంలో నిలవగా...కేరళ 46.6 శాతంతో రెండోస్థానంలో, ఉత్తరాఖండ్ 39.4 శాతంతో మూడోస్థానంలో, హిమాచల్‌ప్రదేశ్ 35.9 శాతంతో ఐదో స్థానంలో నిలిచాయి. ⇒ పురుషుల్లో అత్యధిక నిరుద్యోగిత శాతమున్న రాష్ట్రంగా 24.3 శాతంతో కేరళ మొదటి స్థానంలో, బిహార్ 21.2 శాతంతో రెండోస్థానం, ఒడిశా, రాజస్తాన్‌లు 20.6 శాతంతో మూడో స్థానంలో, ఛత్తీస్‌గఢ్ 19.6 శాతంతో నాలుగోస్థానంలో నిలిచాయి.ఏ అంశాల ప్రాతిపదికన...⇒16 ఏళ్లు పైబడినవారు పరిగణనలోకి⇒ నెలలో నాలుగువారాలపాటు పనిచేసేందుకు అందుబాటులో ఉండేవారు⇒ఈ కాలంలో ఉపాధి కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నవారు⇒ ఉపాధి కోల్పోయి మళ్లీ పనికోసం చురుగ్గా వెతుకుతున్నవారు.నిరుద్యోగుల శాతం లెక్కింపు ఇలా...నిరుద్యోగిత శాతం = నిరుద్యోగుల సంఖ్య/ఉద్యోగులు, ఉపాధి పొందిన సంఖ్య + నిరుద్యోగుల సంఖ్య -
నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త
-
నిరుద్యోగులకు ఏపీపీ ఎస్సీ మరో గుడ్ న్యూస్
-
ప్రపంచంలో అక్కడే నిరుద్యోగులు ఎక్కువ..!
పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న సమర్థులకు ఉపాధి లభించకపోవడమే నిరుద్యోగమని ప్రపంచ కార్మిక సంస్థ నిర్వచించింది. ప్రపంచం ఏళ్లుగా నిరుద్యోగ సంక్షోభం ఎదుర్కొంటోంది. కొవిడ్ దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ వేగంగా పుంజుకోలేకపోతున్నాయి. చాలా దేశాల్లో సరిపడా ఉపాధిలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం లభించక, స్వయం ఉపాధి పొందేంత స్థోమతలేక దొరికిన పనులు చేస్తూ జీవితాలు నెట్టుకొస్తున్నారు. పారిశ్రామికీకరణకు ముందు సంప్రదాయ పనుల వల్ల ఉపాధి సమస్య ఉండేది కాదు. యంత్రాల రాకతో వస్తూత్పత్తి పెరిగినా చాలామందికి పని దొరకడం కష్టం అవుతోంది. పారిశ్రామిక దేశాలు దశాబ్దాల తరబడి దీన్నొక సమస్యగానే గుర్తించలేదు. క్రమంగా నిరుద్యోగం తీవ్రరూపం దాలుస్తోందని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తుంది. ఇదీ చదవండి: విమానాశ్రయానికి బెదిరింపు... రూ.8.3 కోట్లకు డిమాండ్! నూటికి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారన్నది లెక్కతేల్చే ‘నిరుద్యోగిత రేటు’ నిత్యం మారుతోంది. భారత్‌లో ఈ ఏడాది నిరుద్యోగిత రేటు 7.1 శాతంగా ఉన్నట్లు కొన్ని సర్వేల ద్వారా తెలిసింది. ప్రపంచంలోనే స్విట్జర్ల్యాండ్లో తక్కువగా 2 శాతం నిరుద్యోగితరేటు ఉంటే గరిష్ఠంగా దక్షిణాఫ్రికాలో 31.9 శాతం ఉంది. Unemployment rate: 🇿🇦 South Africa: 31.9% 🇪🇸 Spain: 11.84% 🇹🇷 Turkey: 9.1% 🇧🇷 Brazil: 7.7% 🇮🇹 Italy: 7.4% 🇫🇷 France: 7.4% 🇮🇳 India: 7.1% 🇦🇷 Argentina: 6.2% 🇩🇪 Germany: 5.8% 🇨🇦 Canada: 5.7% 🇮🇩 Indonesia: 5.32% 🇨🇳 China: 5% 🇸🇦 Saudi: 4.9% 🇬🇧 UK: 4.2% 🇺🇸 US: 3.9% 🇦🇺 Australia:… — World of Statistics (@stats_feed) November 23, 2023 -
నిరుద్యోగులకు శుభవార్త
-
కొన్నే ఉద్యోగాలు.. వందల్లో ఉద్యోగార్థులు.. వీడియో వైరల్
ఒక దేశ ప్రగతికి అవరోధంగా నిలిచే ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. చేయడానికి పని లేక.. ఉపాధి లేక.. అర్హతలుండి కొందరు, అర్హతల్లేక మరికొందరు నిరుద్యోగితను ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ కంపెనీ వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుందనే సమాచారంతో పెద్దఎత్తున యువత ఒక్కసారి రావడంతో గేట్లు మూసివేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కొవిడ్ కారణంగా సాఫ్ట్వేర్ కంపెనీల వృద్ధిరేటు తగ్గిపోయింది. దానికితోడు అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల బ్యాంకింగ్, ఆటోమొబైల్ వంటి కీలక రంగాలో సాఫ్ట్వేర్ అప్డేట్లు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. దాంతో ఉద్యోగుల అవసరం తగ్గిపోయింది. గ్లోబల్‌గా నెలకొన్ని యుద్ధభయాల వల్ల కొన్ని దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. సిబ్బందికి లేఆఫ్స్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉన్నాయంటే చాలు వందల్లో ఉద్యోగార్థులు వస్తున్నారు. ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం Situation of walk-in interviews in India. This is in Hyderabad. pic.twitter.com/DRyz4R4YgM — Indian Tech & Infra (@IndianTechGuide) November 1, 2023 -
APPSC: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: వయసు మీరిన నిరుద్యోగులకు మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే నాన్ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నాన్ యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయోపరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచింది. యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా రెండు సంవత్సరాలను పెంచింది. ఈ వయోపరిమితి పెంపుదల వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: తత్తరపాటు.. బిత్తర చూపులు! -
‘అమ్మా.. నాకు నౌకరొస్తుంది. మన కష్టాలు తొలగిపోతాయమ్మా’....
‘అమ్మా.. నాకు నౌకరొస్తుంది. మన కష్టాలు తొలగిపోతాయమ్మా’.... భువనగిరికి చెందిన శ్రీశైలం కొద్దికాలం క్రితం తన తల్లికి చెప్పిన మాటలివి. శ్రీశైలం ఎల్ఎల్బీ చదివాడు. టెట్ అర్హతా పొందాడు. అతని తండ్రి సన్నకారు రైతు. అయినా కొడుకు గ్రూప్–1 కోచింగ్ కోసం అప్పు చేసి మరీ డబ్బులు పంపాడు. తమ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందనే నమ్మకం వారిలో ఉండేది. టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన శ్రీశైలంలోనూ ఆ ధైర్యం నెలకొంది. కానీ ఇప్పుడు అతనిలో భయం, ఆందోళన కన్పిస్తున్నాయి. ‘పర్లేదులేయ్యా.. ఇంకేదైనా ఉద్యోగం చూసుకోవచ్చు..’ అని తండ్రి బుజ్జగిస్తుంటే తట్టుకోలేకపోతున్నానంటూ బావురుమన్నాడు. వరంగల్ జిల్లాలో మారుమూల ప్రాంతానికి చెందిన సంజయ్‌కుమార్‌ది దయనీయ స్థితి. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. తల్లి కూలీ పని చేస్తోంది. ఆమె కూడా దీర్ఘకాల వ్యాధికి గురైంది. ఆ విషయాన్ని కొడుకు దగ్గర దాచి పెట్టింది. పీజీ చేసిన కొడుకుకు మంచి ఉద్యోగం వస్తుందనేది ఆమె ఆశ. మందులకు వాడాల్సిన సొమ్మును కొడుకు కోచింగ్ కోసం పంపేది. సంజయ్ కూడా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ మరీ గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యాడు. మెయిన్స్ దాకా వచ్చాడు. ప్రిలిమ్స్ పరీక్ష రద్దవ్వడంతో దిగాలుపడ్డాడు. ‘నాకు ఉద్యోగం కాదు.. అమ్మ కష్టం గుర్తుకొస్తోంది’ అంటూ గుండె పగిలేలా ఏడ్చాడు. సాక్షి, హైదరాబాద్: ఎన్నాళ్లగానో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు..షడ్రుచుల ఉగాది ఒట్టి చేదునే పంచుతోంది. వేలాది మంది తీవ్రమైన నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు రద్దు కావడం, వాయిదా పడటం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీక్‌తో తమ ఏళ్ల తరబడి కష్టం వృథా అయిందంటూ కుమిలిపోతున్నారు. ముఖ్యంగా గ్రూప్–1 కోచింగ్ కోసం చేసిన అప్పులు, కుదవబెట్టిన ఆస్తులు గుర్తుకొచ్చి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అమ్మానాన్నల కలలు చెదిరిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయంటూ తల్లడిల్లిపోతున్నారు. చిన్నా చితక ఉద్యోగాలొదిలిపెట్టి, ఉన్న ఉపాధిని కోల్పోయి.. సర్కారీ కొలువే లక్ష్యంగా కఠోర దీక్ష బూనిన నిరుపేద నిరుద్యోగుల బరువెక్కిన గుండెల్లోంచి ఆవేదన ఉప్పొంగుతోంది. దిగాలు పడ్డ పిల్లలను ఓదార్చేందుకు తమ వద్ద మాటల్లేవంటున్న తల్లిదండ్రుల వ్యథ వర్ణనాతీతంగా ఉంది. అమ్మ పుస్తెను అమ్మేసి ఇస్తున్నా.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నీలేశ్ మాటలు గుండెను పిండేసేలా ఉన్నాయి. ‘30 ఏళ్ల క్రితం మీ అమ్మకు కట్టిన పుస్తె కొడుకా.. అమ్మేసి ఇస్తున్నా. ఉద్యోగం తెచ్చుకో బిడ్డా..’ అంటూ కోచింగ్‌కు డబ్బులిచ్చేప్పుడు తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ గుక్క తిప్పుకోకుండా ఏడ్చాడు. ఇప్పుడేం చేయాలి? అంటూ నిస్సహాయంగా ప్రశ్నించాడు. ఉపాధి పోయే.. భరోసా కరువాయే ఎమ్మెస్సీ చేసిన ప్రశాంతి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కాలేజీలో మేథ్స్ లెక్చరర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 50 వేలకు పైనే సంపాదించేది. ప్రభుత్వ నోటిఫికేషన్ల తర్వాత ఉన్న ఉద్యోగం వదిలేసింది. ఏడాదిగా గ్రూప్స్‌పైనే దృష్టి పెట్టింది. మెయిన్స్‌కు అర్హత సాధించింది. పరీక్ష రద్దవ్వడంతో ఏమీ పాలుపోని స్థితిలో ఉంది. ఇప్పుడామె గర్భిణి కూడా. ‘పుట్టబోయే బిడ్డ కోసం దుఃఖాన్ని దిగమింగుతున్నా. మళ్లీ సన్నద్ధమవ్వడం కష్టమే..’ అంటూ కన్నీటి పర్యంతమైంది. చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బులు.. పీజీ తర్వాత భద్రాచలానికి దగ్గర్లోని ఓ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు ఉద్యోగం తెచ్చుకున్నాడు వీరబోయిన నరేంద్ర. తండ్రి చనిపోవడంతో ఇంటికి పెద్ద దిక్కడయ్యాడు. కానీ గ్రూప్స్ కోసం ఉద్యోగం మానేసి హైదరాబాద్‌లో కోచింగ్ కోసం వచ్చాడు. చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బు ఖర్చు చేశాడు. ‘ఇప్పుడు ప్రభుత్వ కొలువు ఎండమావిగా మారింది. ఉన్న ఇంటిని అమ్మేయడమే దిక్కు’ అంటూ వాపోయాడు. ఎవరిని కదిపినా..ఉప్పొంగే ఆవేదనే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లతో లక్షలాది మంది నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇళ్ళను వదిలేసి, వ్యక్తిగత బాధలన్నీ పక్కన బెట్టి కొలువు కొట్టే లక్ష్యంతో లక్షల మంది కోచింగ్ కేంద్రాల బాట పట్టారు. ఇంకొందరు ఇళ్లల్లోనే ఉండి చదువుతూ బయటి ప్రపంచాన్ని మరిచిపోయారు. నిద్రాహారాలు మానుకుని పరీక్షల కోసం సన్నద్ధమయ్యారు. ఈ దశలో బాంబులా పేలింది..రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అదే టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్. తీగలాగితే డొంక కదిలినట్టు ఒక పరీక్షతో ఆగిపోలేదు. గ్రూప్–1 ప్రిలిమ్స్ సహా ఏకంగా నాలుగు పరీక్షలు రద్దు అయ్యాయి. మరో రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి. నిరుద్యోగ యువతలో అయోమయాన్ని నింపాయి. మెడలోని పుస్తెనో, ఇంట్లోని గొర్రెనో.. బర్రెనో.. ఉన్న కుంట భూమినో.. తాతల నుంచి వచ్చిన ఇంటినో అమ్మేసి కన్న బిడ్డల్ని ఉన్నత స్థితిలో చూడాలనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరై పోయాయి. మళ్లీ గ్రూప్–1కు సన్నద్ధమవడమనే ఊహే వారిని తీవ్రంగా బాధిస్తోంది. ఊహించని ఈ పరిణామంపై ‘సాక్షి’ వారి ప్రతిస్పందన కోరినప్పుడు.. ఎంతో ఆందోళన..ఆవేదన, మరెంతో నిరాశా నిస్పృహలు వారిలో స్పష్టంగా కన్పించాయి. ఎంఏ చేసినా అమ్మకు భారంగానే.. నాన్న చనిపోతే అమ్మే కూలి పనిచేసి పెంచింది. ఎంఏ చేసినా ఇంకా అమ్మకు భారంగానే ఉన్నా. టీఎస్పీఎస్సీ పరీక్షల ద్వారా ఉద్యోగం వస్తుందని, అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తాననే నమ్మకం తగ్గిపోతోంది. పరీక్షల పట్ల ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా? – కాదిరాబంద్ పాండు (ఆందోల్, సంగారెడ్డి జిల్లా) మళ్లీ సన్నద్ధమవ్వడం ఎలా? వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా కష్టపడి బీఎస్సీ, బీఈడీ చేశా. గ్రూప్స్ కోసం మూడేళ్లు కష్టపడ్డా. నేను, నా స్నేహితు లు నిద్రహారాలు మానేసి చదివాం. పరీక్ష రద్దు మనసు కకావికలం అయిపోయింది. మళ్లీ ఎలా సన్నద్ధమవ్వాలో అర్ధం కావడం లేదు. – దుర్గం శ్రావణి బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి.. కొంతకాలంగా ఇంటివద్ద పిల్లల్ని సైతం వదిలేసి.. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ పరీక్షకు సిద్ధమవుతున్నా. ఈ సమయంలో పరీక్ష రద్దు చేయడం బాధించింది. లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి. మాలాంటి వారిని ఆదుకోవాలి. ఈసారైనా పకడ్బందీగా ప్రక్రియను పూర్తి చేయాలి. – సంధ్య గ్రూప్–1 అభ్యర్థి, మహబూబ్‌నగర్ నష్టపోయిన వారికి చేయూతనివ్వాలి కోచింగ్ కోసం ఉన్నవన్నీ అమ్ముకుని వచ్చిన వాళ్ళున్నారు. తప్పు ప్రభుత్వానిదైతే శిక్ష పరీక్ష రాసిన వాళ్లెందుకు అనుభవించాలి? దరఖాస్తు చేసిన వారికి ప్రభుత్వం ఆర్థిక పరమైన చేయూతనివ్వాలి. – చెన్నగాని దయాకర్ గౌడ్ (పీహెచ్డీ విద్యార్థి, నకిరేకల్, నల్లగొండ జిల్లా) -
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
-
పోలీసునంటూ నిరుద్యోగులకు టోకరా! భారీగా వసూళ్లు
గుంతకల్లు: ఖాకీ యూనిఫాం ధరిస్తాడు. బుల్లెట్ బండిపై సవారీ చేస్తాడు. శ్రీసత్యసాయి జిల్లాలో ఓ ఉన్నతాధికారి వద్ద ఏఆర్ కానిస్టేబుల్‌నంటూ అందరినీ నమ్మించాడు. ఉన్నతాధికారులతో తనకు పరిచయాలు ఉన్నాయంటూ మభ్యపెట్టాడు. పోలీస్, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా వసూలు చేశాడు. చివరకు మోసం బట్టబయలై పోలీసులకు దొరికిపోయాడు. ఇదీ అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని కథలవీధిలో నివాసముంటున్న పృథ్వి బాగోతం. ఇతను పృథ్వి, చింటూ, హర్షారెడ్డి తదితర పేర్లతో నిరుద్యోగ యువతతో పరిచయం పెంచుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ ఉన్నతాధికారి వద్ద కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానంటూ బిల్డప్ ఇచ్చాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఇతని మాటలు నమ్మి గుంతకల్లు పట్టణంలో హెర్బల్ ప్రొడక్ట్స్ అమ్ముకునే ఓ మహిళ ఏకంగా రూ.17 లక్షల దాకా ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ఎస్ఎల్వీ థియేటర్ సమీపంలోని ఓ కూల్ డ్రింక్ షాపు యజమాని రూ.8 లక్షలు, తిమ్మాపురం గ్రామానికి చెందిన సంగమేష్ రూ.4.5 లక్షలు, ఓ మహిళా పోలీస్ కూడా తన చెల్లెలి ఉద్యోగం కోసం రూ.లక్ష సమరి్పంచుకున్నారు. ఇంకా ఇతని గాలానికి చిక్కి ఎందరో నిరుద్యోగులు రూ.లక్షల్లో మోసపోయినట్లు సమాచారం. ఆఫీసులకు తీసుకెళ్లి..అందరినీ నమ్మించి.. నిరుద్యోగులను పృథ్వి నమ్మించి మోసగించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావాలని అడిగారో ఏకంగా ఆ శాఖ కార్యాలయానికి నిరుద్యోగులను తీసుకెళ్లేవాడు. వారిని కార్యాలయం వద్ద కూర్చోబెట్టి ఒక్కడే లోపలికి వెళ్లేవాడు. కాసేపటికి బయటకు వచ్చి పై అధికారితో అంతా మాట్లాడానంటూ నమ్మబలికేవాడు. ఇలా ఒక నిరుద్యోగిని గుంతకల్లు సెబ్ కార్యాలయంలో ఉద్యోగం ఉందని పిలుచుకెళ్లి అక్కడే అడ్వాన్స్‌గా రూ.లక్ష తీసుకున్నాడు. వాస్తవంగా ఇతనికి ఎక్సైజ్ శాఖలో ఎవరూ తెలీదు. ప్రస్తుతం ఇతను గుంతకల్లు టూటౌన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. (చదవండి: కాల్వకు 'జేసీబీ'తో బ్రేక్.. ఈసారి టికెట్ ఆయనకేనా?) -
Good News: నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు
-
అసెంబ్లీ వేదికగా అద్భుత ప్రకటన: సీఎం కేసీఆర్
నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నాం.. నేడు అసెంబ్లీ వేదికగా అద్భుత ప్రకటన చేయనున్నాం. ఉదయం 10 గంటలకు అందరూ టీవీలు పెట్టుకొని చూడండి – వనపర్తి సభలో సీఎం కేసీఆర్ ‘‘తెలంగాణలో ఎన్నో పనులు ప్రజలు అడగక ముందే చేసుకున్నాం. ఇప్పుడు నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నాం. బుధవారం అసెంబ్లీ వేదికగా నిరుద్యోగుల కోసం అద్భుత ప్రకటన చేయనున్నాం. ఉదయం పది గంటలకు అందరూ టీవీలు పెట్టుకుని చూడండి. తెలంగాణ ప్రగతి కోసం చివరి ఊపిరి, రక్తం బొట్టు దాకా టీఆర్ఎస్ పని చేస్తుంది..’’ మంగళవారం వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన ఈ ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించింది. ముఖ్యమంత్రి ఏం చెబుతారు? ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామంటారా? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు? ఎప్పుడో మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతిని ప్రకటిస్తారా? ఎంత ఇస్తారు? అనే చర్చకు తెరతీసింది. రాజకీయ వర్గాల్లో సైతం ఉత్కంఠ నెలకొంది. అయితే 60 వేల వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని, ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రకటన ఉండవచ్చని తెలుస్తోంది. సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వనపర్తి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ల జారీపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయవచ్చనే చర్చ జరుగుతోంది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా కొలువుల భర్తీకి వార్షిక క్యాలెండర్ ప్రకటిస్తామంటూ ఇచ్చిన హామీని సైతం ప్రస్తావించే అవకాశముందని చెబుతున్నారు. ఉపాధ్యాయ, పోలీసు కొలువులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2020 డిసెంబర్ 13న కేసీఆర్ ప్రకటన చేశారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించిన తర్వాత ఏర్పడనున్న ఖాళీల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్లు జారీ చేయాలని కూడా అప్పట్లో ఆదేశించారు. అయితే పదోన్నతుల ప్రక్రియ ముగిసిన తర్వాత నియామకాల అంశం మరుగున పడిపోయింది. గతేడాది కరోనా రెండోవేవ్ రావడం, ఆ తర్వాత కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగాల పునర్విభజన చేపట్టాల్సి రావడంతో ఆ ప్రక్రియకు ఫుల్స్టాప్ పడింది. అయితే కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం బదిలీల ప్రక్రియ సైతం ఇటీవల పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీకి అన్ని అడ్డంకులు తొలగినట్టయింది. కమిటీతో మళ్లీ మొదటికి.. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల సర్దుబాటు పూర్తయిన తర్వాత ప్రభుత్వం చేసే ప్రకటన కోసం నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, కేడర్ స్ట్రెంగ్త్ అవసరాలు, ఖాళీల భర్తీపై అధ్యయనానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్ శేషాద్రి అధ్యక్షతన పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు గత జనవరి 16న కేసీఆర్ ప్రకటించడంతో నియామకాల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినట్టు అయింది. జిల్లాల్లో ఖాళీలను గుర్తించడంతో పాటు ఆర్డీఓలు, వీఆర్వోలు, వీఆర్ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి? కొత్త జిల్లాలు, కొత్త మండలాల్లో పని ఒత్తిడికి తగ్గట్టు కొత్తగా పోస్టుల అవసరాన్ని గుర్తించడం వంటి అంశాలపై అధ్యయనం జరపాలని అప్పట్లో కమిటీకి సూచించారు. ఈ నేపథ్యంలో కొలువుల భర్తీపై ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించే పనిని ఈ కమిటీ ప్రారంభించింది. కానీ నిర్దిష్టమైన కాలవ్యవధి నిర్ణయించకపోవడం, విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో కమిటీ నివేదిక ఎప్పుడు ఇస్తుందో అన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో కాలయాపనకే ఈ కమిటీని వేశారనే విమర్శలు సైతం వచ్చాయి. అయితే ఉన్నట్టుండి ముఖ్యమంత్రి నిరుద్యోగులు గురించి చేసిన ప్రకటన నేపథ్యంలో.. ఈ కమిటీ ఆగమేఘాల మీద నివేదిక సమర్పించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలావుండగా..నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్ర బడ్జెట్ 2022–23లో ఎలాంటి నిధులను ప్రతిపాదించకపోవడంతో దీనిపై సీఎం ప్రకటన ఉండే అవకాశాలు లేనట్టేనని సమాచారం పునర్విభజన తర్వాత 85 వేల ఖాళీల గుర్తింపు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొత్తం 1.32 లక్షల పోస్టులను భర్తీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తెలంగాణ వచ్చాక తొలి నాలుగేళ్లలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయగా, దాదాపుగా గడిచిన మూడేళ్ల కాలంలో ఎలాంటి నోటిఫికేషన్లు జారీ కాలేదు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం పోస్టుల పునర్విభజన పూర్తైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 85 వేల వరకు ఖాళీలను గుర్తించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. 1.91 లక్షల పోస్టులు ఖాళీ అన్న తొలి పీఆర్సీ రాష్ట్రంలో 39 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గతేడాది ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4,91,304 పోస్టులు ఉండగా.. 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, ఏకంగా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ప్రధానంగా విద్యా శాఖలో 23,798, హోంశాఖలో 37,182, వైద్య శాఖలో 30,570, రెవెన్యూ శాఖలో 7,961, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 12,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది. -
యువతకు ఉపాధి కల్పనకు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అనేక చర్యలు
-
ఉద్యోగంలోకి తీసుకోలేదని ఆత్మహత్యాయత్నం
సాక్షి, శంకరపట్నం(కరీంనగర్): ఓ యువకుడు తనను ఉద్యోగంలోకి తీసుకోలేదని మనస్తాపానికి గురై, ఆత్మహత్యాయత్నం చేశాడు. కేశవపట్నం ఎస్సై ప్రశాంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలంలోని అర్కండ్ల గ్రామానికి చెందిన యేమునూరి నవీన్ బీటెక్ వరకు చదువుకొని, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బీటెక్‌లో ఒక సబ్జెక్ట్ ఫెయిలవడంతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటికి వచ్చాడు. తిరిగి బుధవారం కంపెనీకి వెళ్లగా యాజమాన్యం అతన్ని ఉద్యోగంలోకి తీసుకోలేదు. దీంతో నవీన్ కేశవపట్నం వచ్చాడు. తండ్రికి ఫోన్ చేసి, తాను విషపు గుళికలు మింగినట్లు చెప్పాడు. కంగారు పడిన ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ఎస్సై ప్రశాంత్‌రావు సూచన మేరకు బ్లూకోల్డ్స్ సిబ్బంది భాస్కర్‌రెడ్డి, రవిలు నవీన్‌ను పోలీస్ వాహనంలో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. చదవండి: గాంధీ ఆస్పత్రికి కోవిడ్ బాధితుల క్యూ -
ఇది ‘ఆత్మగౌరవ’ జంగ్ సైరన్
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనే విశ్వాసంతో లక్షలాది విద్యా ర్థులు లాఠీలకు, తూటాలకు, భాష్ప వాయువులకు ఎదురొడ్డి, ఆఖరికి తమ జీవితాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు కున్నారు. కానీ జీవితాలు బాగు పడతాయని కలలుగన్న విద్యార్థి నిరుద్యోగులకు, వారిని కన్న తల్లి దండ్రులకు ఈనాడు నిరాశే మిగిలింది. ఉద్యమకాలంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానని నమ్మబలికిన కేసీఆర్, తెలం గాణ వచ్చినంక ఉద్యమ లక్ష్యాలను మరచి, విద్య, ఉద్యోగ, ఉపాధిరంగాలపై నిర్దిష్టమైన పాలసీలు లేకుండా పాలిస్తు న్నారు. ‘అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏడున్నాయి? జనా భాలో రెండు శాతం కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమం’టూ నాలుగు కోట్ల సబ్బండవర్గాల సమున్నత పోరాటాన్ని, ఆశలను, ఆకాంక్షల్ని అపహాస్యం చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ లక్ష్యం దారితప్పింది. లక్షలమంది విద్యార్థ్ధి, నిరుద్యోగుల బతు కులు నాశనం అయినాయి. అటు తల్లిదండ్రులకు మొఖం చూపించుకోలేక, ఉద్యోగ వయోపరిమితి పెరుగుతూ పెళ్లిళ్లు చేసు కోలేక, నిరాశానిస్పృహలకు లోనై తెలంగాణ నిరుద్యోగ యువత ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. ఉద్యోగం రాకపోవడంతో ఆత్మబలిదానం చేసుకొన్న కాక తీయ యూని వర్సిటీకి చెందిన సునీల్ నాయక్ మరణ వాంగ్మూలం వింటే కన్నీళ్లు ఆగవు... ‘నా చావుతోనైనా మన ఉద్యోగాలు మనకు రావాలి’ అంటూ నినదించిన ఆ గొంతు ఇంకా సజీవంగా మన గుండెల్లో మోగుతూనే ఉంది.. ఉద్యోగుల పీఆర్సీ కోసం వేసిన కమిటీ రాష్ట్ర ప్రభు త్వంలో ఉద్యోగ ఖాళీలు లక్షా 91 వేలు అని తేల్చింది. కానీ ప్రభుత్వం మాత్రం 56 వేల ఖాళీలే అని చెప్పి నిరుద్యోగు లను దగాచేస్తోంది. ఏడేళ్ళలో మొత్తం 85 వేల ఉద్యోగాలే భర్తీ చేసి లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీచేసినామని పచ్చి అబద్ధాలాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తా యని నమ్మి 2009 నుండి 2014 వరకు ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ వయోపరిమితి దాటిపోయి అన్నిరకాలుగా నష్టపోయారు. గత ఏడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 12 విశ్వ విద్యాలయాల్లో 2,500 పైచిలుకు బోధనా సిబ్బందిని, 12 వేల పైచిలుకు బోధనేతర సిబ్బందిని భర్తీ చేయకుండా విద్యార్థి ఉద్యమాలపై అనేక ఆంక్షలు పెట్టి పోలీసు అడ్డాలుగా మార్చారు. అంతేగాక రాష్ట్రంలో 5 ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేసి ప్రభుత్వ విశ్వవిద్యా లయాలను నీరుగార్చేందుకు అనేక కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకునే 4,500 పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేసి, వేలకొద్దీ టీచర్ల ఖాళీలను భర్తీచేయకుండా ప్రభుత్వ విద్యని సర్వనాశనం చేశారు. పదిజిల్లాలు ఉన్న పాత తెలంగాణ రాష్ట్రంలో 2014 నాటికే విభజన చట్టం ప్రకారం బడ్జెట్ శాంక్షన్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షల 70 వేల ఉద్యోగాలు ఉంటే, 33 జిల్లాల ప్రస్తుత కొత్త తెలంగాణలో ఎన్ని కొత్త ఉద్యో గాలు కల్పించాలి? 23 కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివి జన్లు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త కార్పొరేషన్లు ఏర్పర్చిన ప్రభుత్వం, కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా, ప్రభుత్వ ఉద్యోగులపై మరింత పనిభారం మోపుతోంది. స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీ టీచర్ ఉద్యోగాలు సుమారు 25 వేలపైన ఖాళీలు భర్తీ చేయకుండా, ఈ ఏడేళ్ళలో కేవలం 2 సార్లు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ నిర్వహించి 5 లక్షలమంది పైచిలుకు నిరుద్యోగుల జీవితాలను సర్వనాశనం చేసింది. వైద్య ఆరోగ్యశాఖలో వివిధ అత్యవసర సర్వీసుకు చెందిన డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు సుమారు 35 వేల ఖాళీలున్నాయి. కోవిడ్–19 తీవ్రంగా ఉన్న సందర్భంలో ఏకంగా 50 వేల ఉద్యోగాలు వైద్యశాఖలో వెంటనే భర్తీ చేస్తానని కేసీఆర్ చేసిన వాగ్దానం ఇంకా అమలుకాలేదు. న్యాయశాఖలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూనియర్ సివిల్ ఇతర న్యాయసిబ్బంది ఖాళీలు వేలల్లో ఉన్నాయి. పోలీసుశాఖలోనూ వేలాది పోస్టులు ఖాళీలు న్నాయి. ప్రభుత్వంలో దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కొత్తజిల్లాల నేపథ్యంలో మరో 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించి, మొత్తం 5 లక్షలమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగులను ఆదుకోవచ్చు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీచేయకుండా, మరోవైపు చాలా ఏళ్లుగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిని 21,200 మంది సర్వశిక్షా అభియాన్; 16,400 విద్యా వలంటీర్లు; 7,651 మహాత్మాగాంధీ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్స్, 2,000 పంచాయతీ కార్యదర్శులు; 709 మిషన్ భగీరథ; 315 హార్టికల్చర్ డిపార్ట్మెంట్, 2,640 సోషల్ వెల్ఫేర్, ఆర్టీసీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 1,640 నర్సులు మొత్తంమీద దాదాపు 55 వేల మందిని ఉద్యోగా ల్లోంచి తీసివేసి, వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసి, భవిష్యత్తును నాశనం చేశారు. ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని జబ్బలు చరుచుకుంటున్నారు కేటీఆర్. కానీ పొరుగు రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్ మాదిరిగా స్థానికులకు రిజర్వేషన్లు కల్పించకపోవడం వలన, ప్రైవేట్ ఉద్యోగాలలో, ముఖ్యంగా ఐటీ రంగంలో తెలంగాణ స్థానిక విద్యార్థి నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. 2018 వరకు టీఎస్పీఎస్సీలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులు దాదాపు 26 లక్షలమంది ఉన్నారు. ఈ రెండేళ్ల కాలంలో దాదాపు మరో 4 లక్షలమంది ఈ జాబితాలో చేరి ఉంటారని అంచనా. అయినా సరే కేసీఆర్‌కు నిరుద్యోగ సమస్యను పరిష్కరిం చాలనే సోయి లేకపోవడం బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళుతెరిచి నిరుద్యోగు లను నిండా ముంచకుండా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. తెలం గాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల క్యాలెండర్‌ను రూపొందించి క్యాలెండర్లో పేర్కొన్న విధంగా ప్రతి సంవ త్సరం ఖాళీలు భర్తీచేయాలి. విద్యార్థి నిరుద్యోగుల హక్కుల సాధన కోసం, రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగులను కూడగట్టుకొని మన విద్య కోసం, మన ఉద్యోగాల కోసం, మన స్వయం ఉపాధి కోసం, అన్నింటికీ మించి మన ఆత్మగౌరవం కోసం జంగ్ సైరన్ మోగిద్దాం. డా.శ్రవణ్ దాసోజు వ్యాసకర్త జాతీయ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ మొబైల్: 98850 39384 -
ఉద్యోగాల పేరుతో కిలేడీ చీటింగ్.. కోట్లు కొట్టేసి మాస్టర్ ప్లాన్..
సాక్షి, బొబ్బిలి(విజయనగరం): ఉద్యోగాలిప్పిస్తానని పలువురిని మోసం చేసి సుమారు రూ.కోటి వసూలు చేసిన మండలంలోని రాముడువలసకు చెందిన కిలేడీ బుట్ట సరస్వతి ఎట్టకేలకు అరెస్టు అయ్యింది. అసలు పేరును కాదని విజయరాణిగా చలామణి అవుతూ పలువురిని మోసగించింది. తనకు పెద్దలతో పరిచయాలున్నాయని ఒకొక్కరి నుంచి రూ.50వేల నుంచి ఆరు లక్షల వరకు వసూలు చేసింది. అంగన్వాడీ కార్యకర్త, మండల కో ఆర్డినేటర్, 104 అంబులెన్సు డ్రైవర్, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్, ఫార్మాసిస్టు, కార్యదర్శి తదితర ఉద్యోగాల పేరు చెప్పి సుమారు 13 మంది నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈమెను పట్టణంలోని గుర్తించిన బాధితులు డబ్బులు ఎప్పుడిస్తావని నిలదీయడంతో శనివా రం రాత్రి గొడవ జరిగిన విషయం పాఠకులకు తెలిసిందే. ఎస్ఐలు వెలమల ప్రసాదరావు, చదలవాడ ప్రసాదరావు దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేశారు. ఆదివారం రిమాండ్ నిమిత్తం తరలించినట్టు చెప్పారు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకుంటే తప్పేంటి?: నిరంజన్‌రెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్: చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన నాగర్ కర్నూలు జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని, హమాలీ పని రూపంలో ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకుంటే తప్పేంటని బాధత్యరాహిత్యంగా వ్యాఖ్యానించారు. వరల్డ్ స్కిల్ యూత్ డే రోజు మంత్రి నిరంజన్‌రెడ్డి నోటి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావటం దారుణమని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. -
కేసీఆర్ రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టించారు
హైదరాబాద్: రాష్ర్టంలో నిరుద్యోగులు, కౌలు రైతులు, ప్రయివేటు ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే పట్టించుకోకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న అతిపెద్ద నియంత కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకులు భట్టి విక్రమార్క మల్లు. తెలంగాణా రాష్ర్ట సమితి శానససభా పక్షం లో తెలంగాణా తెలుగుదేశం శాసనసభా పక్షం విలీనం అత్యంత దుర్మార్గం, ప్రజస్వామ్యాన్ని పతానికి తీసుకువెళ్లే అడుగుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టించారని , ప్రతిపక్షమే లేకుండా చేస్తూ దేశంలో 29 రాష్ర్టంగా ఆవిర్భవించిన తెలంగాణా రాష్ర్టాన్ని ఫిరాయింపుల పర్వంలో అగ్రస్థానంలో నిలబెట్టి సంపూర్ణ నియంత పాలన కింద కు తీసుకువచ్చాడని ,ఒకవైపు ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తూ, మరోవైపు ప్రతిపక్షాలను లేకుండా చేస్తూ దేశంలోనే అతిపెద్ద నియంతగా కేసీఆర్ అవతరించారని భట్టి విమర్శించారు. నిరుద్యోగుల పరిస్థితేంటి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటి గురించి మాట్లాడకుండా, పట్టించుకోకుండా ఇతర పార్టీల బి ఫామ్ లపై గెలిచిన వారిని తమ పార్టీలోకి ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచించడం అత్యంత దుర్మార్గమన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో యువకులను రెచ్చగొట్టి వారు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించి వందలమంది తల్లుల కడుపుకోత కు కారణమైన కేసిఆర్ ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగ యువత ఆత్మహత్య లు చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నారని, వారి తల్లుల కడుపుకోత కేసిఆర్ కు తగలక మానదని, ఎలక్షన్ కలెక్షన్ ఉంటే చాలు అనుకునే కెసిఆర్ కు కౌలు రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు, ప్రైవేట్ టీచర్స్ ఆత్మహత్యలు కనపడటం లేదా అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. ఫిరాయింపుల ప్రమాదాలను గుర్తించే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆనాడే ప్రతిపక్షం వుంటేనే అభివృద్ధి, రాజ్యాంగం సంరక్షించబడుతుందని చెప్పారన్నారు. తన స్వార్థ రాజకీయాల కోసం డబ్బు ఎరవేసి శాసనసభ్యులను కేసీఆర్ కొట్టున్నాడని, గతంలోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలచిన ఎంఎల్ ఎ లను ఇదే విధంగా డబ్బు ఎరవేసి, ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారన్నారు. ప్రజాస్వామ్య పతనానికి దారి తీసే అన్ని అడుగులను కేసీఆర్ వేస్తున్నాడన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని నిసిగ్గుగా పార్టీలో విలీనం చేసుకుంటున్నాడని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడడం అత్యంత దుర్మార్గంమని, పార్టీల విలీనం అనేది ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశమని, రెండు పార్టీల అధ్యక్షల అంగీకారంతో వారు ఇచ్చే లేఖ ఆధారంగా ఆ ప్రక్రియ జరగాలని , ఒక పార్టీ అధ్యక్షుడు ఇచ్చే బి ఫామ్ మీద గెలిచిన ఎం ఎల్ ఏ లు తమ పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ కు లెటర్ ఇస్తే సరిపోదన్నారు. ఏ విధంగా కూడా దీనికి చట్టబద్ధత లేదని, చెల్లదని, విలీనం అసెంబ్లీ స్పీకర్ పరిధిలో లేదని, ఎన్నికల కమిషన్ ధృవీకరించిన తరువాతే అసెంబ్లీలో కూడా అది వర్తిస్తుందని, వీటన్నింటిపై ప్రజాస్వ్యామ వాదులంతా ఆలోచన చేయాలన్నారు భట్టి విక్రమార్క. కేసిఆర్ నిరంకుశ నిజాం నవాబును తలపిస్తున్నాడు అధికార దాహంతో ఉన్న కేసిఆర్ నిరంకుశ నిజాం నవాబును తలపిస్తున్నాడని, తన మీద ప్రజలలో రోజు రోజు కు పెరుగుతున్న వ్యతిరేకతతో ప్రతిపక్షాలకు రాజకీయంగా లాభ జరుగుతుందనే కుట్ర తో వారిని బలహీన పరచాలనే ఆలోచనతోనే ఇతర పార్టీల ఎం ఎల్ ఏ లను ప్రలోభాలకు, భయభ్రంతాలకు గురిచేస్తూ తమ పార్టీలోకి చేర్చుకుంటున్నాడని భట్టి అన్నారు. ఎంతమంది ఎంఎల్ ఎలను , నాయకులను కలుపుకున్నా, చేర్చుకున్నా ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని, ప్రజల్లో మీ పై వ్యస్తున్న వ్యతిరేకతను ఆపలేరని, దీనిని గమనించాలని రాష్ర్ట ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నానన్నారు భట్టి విక్రమార్క. ( చదవండి: తెలంగాణ కోర్టుల్లో కరోనా కలకలం ) -
ఘరాన మోసం... సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటు యువతకు టోకరా!
ఖమ్మం: సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు, వాటాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న అంకిరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డిని బుధవారం సత్తుపల్లి కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు సత్తుపల్లి రూరల్ సీఐ టి.కరుణాకర్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన అంకిరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి గత ఏడాది ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విసన్నపేటలో టిమాటిక్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించి, అందులో నిరుద్యోగ యువతీ యువకులకు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చేర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు పలువురు వద్ద కంపెనీలో వాటాలు ఇస్తానంటూ నమ్మబలికి పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేశాడు. విసన్నపేటకు చెందిన తిరుమల జయరాం అనే బాధితుడు రూ.15 లక్షలు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టి, మోసపోవడంతో వీఎం బంజర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు కల్లూరుకు చెందిన బీటెక్ విద్యార్థి వద్ద రూ.3.5లక్షలు మోసం చేయడంతో అక్కడ కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి నరేష్‌కుమార్‌రెడ్డి వీరితోపాటు పలువురిని మోసగించి మలేషియాకు పారిపోయాడు. ఇటీవల ఇండియాకు తిరిగొచ్చి, తిరిగి మలేషియా వెళ్తుండగా పోలీసులు లుక్ అవుట్ జారీ చేసి ఉండటంతో తమిళనాడులోని తిరుచురాపల్లి ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు గుర్తించి వీఎం బంజర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై తోట నాగరాజు, కానిస్టేబుళ్లు కనకారావు, శ్రీనివాస్, వెంకటేశ్వరరావులతో కలిసి తిరుచురాపల్లి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం ప్రాంషీట్ వారెంట్‌తో ఇక్కడికి తరలించి సత్తుపల్లి కోర్టులో బుధవారం హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, కొన్ని బ్యాంక్ అకౌంట్‌్లను సీజ్ చేసి, పోలీస్ కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు రాబడతామని సీఐ తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని కోరారు. -
వామ్మో.. ‘ఖతర్’నాక్ మోసం!
సాక్షి, సిటీబ్యూరో: ఏపీ ప్లస్ సంస్థ తరఫున ఖతర్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎర వేసిన సైబర్ నేరగాళ్లు నిరుద్యోగుల్ని నిండా ముంచారు. దీనిపై ఆ సంస్థ మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బేగంపేట కేంద్రంగా పని చేసే ఏపీ ప్లస్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్యలో బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన ఖతర్ బ్రాంచ్‌లో ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో ప్రకటనలు చేశారు. అనేక మందిని ఫోన్లో ఇంటర్వ్యూలు కూడా చేసి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. కొందరు బాధితులు ఖతర్‌లోని సంస్థ కార్యాలయాన్ని ఫోన్ ద్వారా సంప్రదించారు. ఇలా విషయం తెలుసుకున్న ఆ బ్రాంచ్ అధికారులు హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఆరా తీసిన ఇక్కడి అధికారులు నగరానికి చెందిన నలుగురికి అలాంటి లెటర్లు అందినట్లు గుర్తించారు. వీరి నుంచి రూ.13,500 చొప్పున వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు మరో రూ.35 వేలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై ఆ సంస్థ ప్రతినిధులు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
ఏ ఏటికాయేడు అయితేనే..!
సాక్షి, హైదరాబాద్: ఖాకీ యూనిఫాం వేసుకోవాలి.. పోలీస్ అని పిలిపించుకోవాలి.. అని లక్షలాదిమంది యువతీ యువకుల కల. ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందా..? ఎప్పుడు పోలీస్ అవుదామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి స్వప్నం నెరవేర్చేందుకు మూడేళ్ల తర్వాత మరోసారి పోలీస్ ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మరో 20 వేల పోస్టులు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఇటీవల హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటన చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ కూడా మరో ప్రకటన చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, ప్రస్తుత పోలీసులు, విశ్రాంత ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ)కు విన్నపాలు చేస్తున్నారు. భవిష్యత్తులో గంపగుత్తగా భారీ స్థాయిలో రిక్రూట్మెంట్లు వద్దని, ఎప్పటివి అప్పుడే భర్తీ చేయాలని కోరుతున్నారు. 3 వేల పోస్టులు సరెండర్.. రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) 2018లో 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 16,925 కానిస్టేబుల్ పోస్టులు, 1,503 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. వాటిలో 9,213 మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు, 1,162 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, దాదాపు 4 వేల టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లను కలుపుకొంటే 15 వేల పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలినవి డీజీపీకి సరెండర్ చేశారు. కాగా, 2018 మేలో నోటిఫికేషన్ రాగానే.. లక్షలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలుకాగానే.. ఏకంగా 7 లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుల్ దరఖాస్తుకు రూ.800 ఫీజు కాగా, ఎస్సైకి రూ.వెయ్యిగా ఉంది. పోలీస్ బోర్డుకు ఏకంగా రూ.80 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. అర్హత కోల్పోయిన మూడు బ్యాచ్‌లు! గతంలో మాదిరిగా ఈసారి గంపగుత్త నోటిఫికేషన్లు వద్దని, ఏటా కొలువుల భర్తీ చేపట్టాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. వయోపరిమితి కారణంగా ఏటా లక్షలాది మంది అర్హత కోల్పోతున్నట్లు వాపోతున్నారు. 2018 నోటిఫికేషన్‌కు త్వరలో రాబోయే నోటిఫికేషన్‌కు మధ్య దాదాపు మూడు బ్యాచ్‌లకు చెందిన వేలాది మంది వయోపరిమితి కారణంగా అనర్హులయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పోలీస్ బోర్డు చేపట్టిన నియామకాల్లో 2015లో వయోపరిమితిపై మూడేళ్ల మినహాయింపు ఇచ్చింది. 2018 రిక్రూట్మెంట్ సమయంలో రెండేళ్ల మినహాయింపు ఇచ్చింది. దీంతో వేలాదిమంది అభ్యర్థులకు ఊరట లభించింది. ఈసారి ఎంతమందికి ఊరట దక్కుతుందోనని అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, భారీ రిక్రూట్మెంట్ల కారణంగా ప్రతీసారి పదోన్నతుల్లో న్యాయపరమైన చిక్కులు తలెత్తడం, అందరికీ పదోన్నతులు కల్పించలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తున్నాయి. పైగా వేలాదిమంది ఒకేరోజు జాయిన్ అయితే.. ఒకేసారి రిటైర్ కావడం వంటి ఇబ్బందులు డిపార్ట్మెంట్ను భవిష్యత్తులో ఇబ్బంది పెడతాయి. అందుకే ప్రత్యేక కేలండర్ రూపొందించుకుని ఏటా రిక్రూట్మెంట్లు చేపడితే అభ్యర్థులందరికీ అవకాశం దక్కుతుందని రిటైర్డ్ ఉద్యోగులు చెబుతున్నారు. -
ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిర్వచనం క్రమంగా మారుతోందని.. ఐటీ అంటే ఇంటెలిజెంట్ టెక్నాలజీ అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అభివర్ణించారు. మంగళవారం కరీంనగర్లో అర్బన్ మిషన్ భగీరథ కింద రూ.110 కోట్లతో చేపట్టిన ‘ప్రతిరోజూ తాగునీటి సరఫరా’పథకాన్ని, ఎల్ఎండీ సమీపంలో నిర్మించిన ఐటీ టవర్‌ను మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నైపుణ్యం ఒకరి సొత్తు కాదని ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎంతో నైపుణ్యం ఉన్న మేధావులు వస్తున్నారని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాస్తా ఇంటెలిజెంట్ టెక్నాలజీగా మారడంతో నైపుణ్యం గల వారందరికీ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వరంగల్‌లో ఐటీ సెంటర్‌ను ప్రారంభించామని, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద ఐటీ టవర్‌కు కరీంనగర్ కేంద్ర స్థానం అయిందని పేర్కొన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. ఒకప్పుడు రూ.56 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉండేవని, ప్రసుత్తం రూ.1.28 లక్షల కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాల్లో విద్యను అభ్యసిస్తున్న వారు ఉద్యోగాల కోసం ఇతర పట్టణాలకు వలస పోకుండా, స్థానికంగా ఐటీ ఉద్యోగాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ చుట్టు పక్కన ఉన్నత విద్యను అభ్యసించిన వారికి ఇక్కడి ఐటీ టవర్‌లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన నైపుణ్యాన్ని మార్చుకుంటూ వెళ్లాలని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తే వారికి ప్రభుత్వం తరఫున రాయితీలు కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్లో మరో ఐటీ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ తెలిపారు. కాగా, కరీంనగర్ ఐటీ సెంటర్లో ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ప్రస్తుతం కరీంనగర్ ఐటీ కంపెనీలో 432 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించగా.. వారికి మంగళవారం నియామక పత్రా లు కేటీఆర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేటీఆర్ కేబుల్ బ్రిడ్జిని పరిశీలించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. -
‘నిరుద్యోగ భృతి’ని ప్రారంభించండి
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ‘నిరుద్యోగ భృతి’పథకాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రైవేటు రంగ ఉద్యోగులను తొలగించకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని బుధవారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. ‘అనేక ఐటీ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. అనేక ప్రైవేట్ సంస్థలు ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోతలు విధించాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. లాక్డౌన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కనీసం ఒక సంవత్సరం వరకు పరిస్థితి మెరుగుపడకపోవచ్చు. ఈ సమయంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగులకు నెలకు రూ.3,016 భృతి కింద ఇవ్వాలి’అని ఆ ప్రకటనలో ఉత్తమ్ కోరారు. చదవండి: ‘టిమ్స్’కు రూ.50 లక్షల ఎంపీ ల్యాడ్స్: రేవంత్ రెడ్డి లాక్డౌన్ తర్వాత తెలంగాణలో నిరుద్యోగ యువకుల సంఖ్య రెట్టింపు అవుతుందని, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో నమోదైన దాదాపు 24 లక్షలతో సహా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువతతో.. తెలంగాణ రాష్ట్రం రాబోయే కొద్ది నెలల్లో నిరుద్యోగ గణాంకాలలో భారీ పెరుగుదలను చూడబోతోందని, ఈ పరిస్థితిని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండవ దశ లాక్డౌన్ ముగియడానికి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఉత్తమ్ ఆ ప్రకటనలో కోరారు. అదే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం శ్వేతపత్రం తీసుకురావాలని, తెలంగాణలో కరోనా వైరస్ పరిస్థితిపై నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
పోలీసు పిల్లలకూ ‘జాబ్ కనెక్ట్’
సాక్షి, సిటీబ్యూరో: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నగర పోలీసు విభాగం నిరుద్యోగ యువతకు ఆసరాగా నిలుస్తోంది. వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వీరికి దగ్గర చేయడానికి జాబ్ కనెక్ట్ పేరుతో కార్యక్రమం చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ వాహనాన్ని డిజైన్ చేసిన నగర పోలీసులు కాలనీలు, బస్తీలకు వెళ్లి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్నారు. తొలిసారిగా పోలీసు పిల్లల కోసం బుధవారం జాబ్ కనెక్ట్ నిర్వహించారు. పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్–క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ మేళాలో మూడు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల కల్పనకు ముందుకు వచ్చాయి. మరోపక్క సీఏఆర్ హెడ్–క్వార్టర్స్ ప్రాంగణంలో సిబ్బంది కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన క్యాంటీన్‌ను పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు సీపీ టి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించేశాడు..!
సాక్షి, విశాఖపట్నం : నిరుద్యోగులే టార్గెట్... ఉద్యోగం కోసం ఆశగా నిరీక్షిస్తున్న వారు కనిపించగానే అక్కడ వాలిపోయాడు... డీఆర్ఎం ఆఫీసులో తను పనిచేస్తున్నానని, ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి రూ.కోటికిపైగా వసూలు చేసేశాడు... అనంతరం అదుగో ఉద్యోగాలు.. ఇదిగో ఉద్యోగాలు.. అంటూ కాలం గడిపేశాడు.. చివరకు బండారం బయటపడుతుందని అనుమానం రాగానే నగరం నుంచి ఉడాయించేశాడు. దీంతో మోసపోయిన 30 మందికిపైగా బాధితులు నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నమ్మించి టోకరా నగరంలోని అక్కయ్యపాలెంలో ‘వైజాగ్ హోమ్స్’ పేరిట ఎయిర్ కూలర్ సర్వీస్ సెంటర్‌ను శ్రీకాకుళం జిల్లాకు చెందిన మురహరి సాయి సంతోష్ నిర్వహించేవాడు. అందులో నష్టాలు రావడంతో తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. వాటి నుంచి గట్టెక్కేందుకు సులువుగా డబ్బులు సంపాదించాలని భావించాడు. అనుకున్నదే తడువుగా నిరుద్యోగులను తన టార్గెట్‌గా పెట్టుకున్నాడు. గత ఏప్రిల్ నెలలో రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు నమ్మించాడు. వారు తెలియనప్పటికీ సంతోష్ నేరుగా వెళ్లి పరిచయం చేసుకునేవాడు. డీఆర్ఎం కార్యాలయంలో హెచ్ఆర్ విభాగంలో రిక్రూట్మెంట్ అధికారిగా పనిచేస్తున్నాను... రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేవాడు. అనంతరం అతని భార్య మురహరి సుజాతని రంగంలోకి దింపేవాడు. ఆమె చాకచక్యంగా మాట్లాడుతూ నిరుద్యోగులను అక్కయ్యపాలెం పరిధి లలితానగర్‌లోని ఎంకే కైలాస్ టవర్స్‌లో అద్దెకు ఉంటున్న తమ నివాసానికి తీసుకొచ్చి నమ్మకం కలిగించేది. మరికొందరిని డీఆర్ఎం కార్యాలయానికి రమ్మని అక్కడి పరిచయాలతో నమ్మకం కలిగించేవాడు. పూర్తిగా నిరుద్యోగులను నమ్మించిన తర్వాత డబ్బులు అకౌంట్లో వేయాలని చెప్పేవాడు. ఇలా మొత్తం ఐదు అకౌంట్లలో బాధితుల నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకున్నాడు. అలా సుమారు 30 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షలు చొప్పున రూ.కోటికి పైగా వసూలు చేశాడు. సెంటర్లోని ఫర్నిచర్ తరలింపు బాధితుల నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత వారిని నమ్మించేందుకు భువనేశ్వర్‌కు వెళ్లేందుకు రైలు రిజర్వేషన్ చేయించుకోమనేవా డు. ఈ క్రమంలో వారు సిద్ధమైతే వాయిదా వేసేవాడు. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు అప్పట్లోనే నగరంలోని నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతని ఇల్లు, వైజాగ్ హోమ్స్ సర్వీసు సెంటర్‌పై పోలీసులు నిఘా పెట్టారు. అయినప్పటికీ వారి కళ్లుగప్పి గురువారం రాత్రి అందులోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర విలువైన సామగ్రిని మురహరి సాయి సంతోష్ తరలించుకుపోయాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితులు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. సంతోష్‌ను అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇదేవిషయాన్ని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సూర్యనారాయణ వద్ద ప్రస్తావించగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామన్నారు. 30 మందికిపైగా బాధితులు మురహరి సంతోష్ బాధితులు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో 30 మందికిపైగా ఉన్నా రు. వారిలో శ్రీనివాస్, నక్కరాజు వెంకట సింహాద్రి, నక్కరాజు శివ, కర్రి సత్యారావు, గరికిన స్వర్ణ, గుర్రం అనిల్‌కుమార్, నక్కా రమణ, గెడ్ల మోహన్‌రెడ్డి, జి.వెంకట సతీష్, వళ్లు సూర్యనారాయణ, ఎల్లా త్రీనాథమ్మ, రేగిడి పద్మలతో కలిసి 30 మందికి పైగా బాధితులున్నారు. -
మంచిర్యాలలో మాయలేడి
సాక్షి, మంచిర్యాలక్రైం/బెల్లంపల్లి: ఉద్యోగాల కల్పన పేరుతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమాయకులైన నిరుద్యోగులను తన మాయమాటలతో నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేసింది. ఊరు, పేరు తెలియకపోయినా.. కేవలం పరిచయమైతే చాలు.. బుట్టలో వేసుకోవడంలో ఆమెకామె సాటి. ఏం ఉద్యోగం చేస్తున్నావని, ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆత్మీయురాలిగా కుశలప్రశ్నలు వేసి ఆకట్టుకోవడంలో దిట్ట. ఇలా ఆ మహిళ ఒక్కరుకాదు.. ఇద్దరు కాదు ఏకంగా 100 మందిని బోల్తాకొట్టించింది. రూ.కోట్లు వసూలు చేసి చివరికి ఐపీ పెట్టింది. నోటీసులు అందుకున్న బాధితులు మంచిర్యాల డీసీపీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. డిగ్రీ చదివిన ఓ ఇల్లాలు బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి కన్నాల బస్తీ (ఇందిరమ్మ కాలనీ)కి చెందిన సుమలత డిగ్రీ చదువుకుంది. ఓ కొడుకు జన్మించాక భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయినట్లు సమాచారం. అప్పటినుంచి సదరు మహిళ మోసాలు చేయడం అలవా టు చేసుకున్నట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి బజారుఏరియా, గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న ఓ ఇద్దరు యువకులను అసిస్టెంట్లుగా పెట్టుకుని దందాకు తెరతీసినట్లు ప్రచారంలో ఉంది. నిరుద్యోగులే టార్గెట్ సుమలత దూర ప్రాంతాల నిరుద్యోగులను ఎంచుకుంది. ప్రభుత్వం ఏదైనా నోటిఫికేషన్ జారీ చేస్తే చాలు.. ఆమె పంట పండినట్లే. అసిస్టెంట్లతో కలిసి అద్దెకారులో బయల్దేరి నిరుద్యోగులను వెదికేవారు. ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్నట్లు అసిస్టెంట్లు నిరుద్యోగులకు పరిచయం చేసి.. సింగరేణి, ఏసీసీ, జైపూర్ విద్యుత్ ఫ్లాంట్, దేవాపూర్ ఓసీసీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏ రకమైనా ఉద్యోగమైనా సరే ఉన్నతాధికారులతో మాట్లాడి పెట్టిస్తుందని, ఆమె తలుచుకుంటే ఏదైనా సాధ్యమని నమ్మించి వలలో వేసుకునేవారు. అలా ఒక్కొక్కరి నుంచి కని ష్టంగా రూ.లక్ష.. గరిష్టంగా రూ.5లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులను వంచించడంలో ఆమె ఎంతగానో ఆరితేరింది. అవసరాలకు అనుగుణంగా నేతల పేర్లు సుమలత ఏమాత్రం అనుమానం రాకుండా నిరుద్యోగుల వద్ద రాజకీయ నాయకుల పేర్లు ఎన్నోసార్లు వాడుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. అధికార పార్టీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పి ఉద్యోగాలు పెట్టిస్తానని నమ్మబలికేది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల పేర్లనూ వదలలేదని సమాచారం. బాధితుల సంఖ్య పెరగడం, ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడం.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు తీవ్ర ఒత్తిడి తేవడం ప్రారంభించారు. దీంతో సదరు కిలేడీ ఐపీ పెట్టినట్లు తెలుస్తోంది. డీసీపీని కలిసిన బాధితులు గురుకులంలో ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పి సదరు సుమలత 132 మంది నిరుద్యోగులను మోసం చేసి చివరికి ఐపీ నోటీసులు పంపడంతో న్యాయం చేయలంటూ బాధితులు మంచిర్యాల డీసీపీని కలిశారు. డబ్బులు తీసుకుని కొంతకాలం ఉద్యోగాల విషయం కోర్టుకేసులో ఉందని, ఎన్ని కల కోడ్ ఉందని కాలయాపన చేసి ఇప్పుడు నిం డా ముంచిందని, తీసుకున్న డబ్బులకు ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, బాండ్‌పేపర్‌పై అగ్రిమెంట్ కూడా రాసిచ్చిందని విన్నవించారు. ఈనెల14న ఐపీ నోటీసులు పంపిన సుమలత తన సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిందని పేర్కొన్నారు. పుస్తెలతాడు అమ్మిచ్చి డబ్బులు తీసుకుంది.. గురుకులంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటే వెళ్లి కలిశాం. నేను ఏఎన్ఎం పోస్టుకు దరఖాస్తు చేసుకున్న. ఉద్యోగానికి రూ.లక్ష అవుతుందని నమ్మిచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్తామంటే ఇప్పుడే ఇవ్వాలంది. లేదంటే పనికాదంది. డబ్బుల్లేవంటే నీ మెడలో పుస్తెలతాడు, రింగులున్నయి కదా.. అవి అమ్మియ్యుమని దగ్గరుండి మరీ మార్కెట్లో అమ్మిచ్చి డబ్బులు తీసుకొని వెళ్లిపోయింది. నా బంగారం పోయింది. ఉద్యోగం రాలే. – రత్నం భారతి, బెల్లంపల్లి అప్పులపాలయినం... ఉద్యోగం వస్తుందంటే నాలుగు పైసల వడ్డీకి తెచ్చి రూ.4లక్షలు అప్పు చేసి ఇచ్చినం. రెండున్నరేళ్లుగా వడ్డీలు కట్టలేక అప్పులపాలైనం. ఉద్యోగం ఇప్పించకపోగా.. మాపేనే కేసులు పెట్టింది. ఉన్నతాధికారులు స్పందించి సుమలతపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి. – రామటెంకి తిరుపతి, కాసిపేట -
డైట్ కాలేజీలో నిరుద్యోగి ఆత్మహత్య..!
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగం లేక నిరాశ చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జరగడం కలకలం రేపింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైట్ కాలేజీలో రవి కుమార్ (32) ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ.. సరైన ఉద్యోగం లేకపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. అందరూ చూస్తుండగానే రోడ్డు పక్కన ఉన్న కాలేజీలో రవికుమార్ ప్రాణాలు తీసుకున్నాడని స్థానికులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అదే కాలేజీలో జెండా కూడా ఎగురవేశామని అన్నారు. -
ఒక్కమార్కుతో ఫెయిల్ జీవితంలో పాస్..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పెద్దచదువులు అబ్బలేదు.. అయితేనేం జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగాడు.. పదో తరగతిలో ఫెయిలైనా కలత చెందలేదు.. పట్టుదలతో ఏదైనా సాధించాలని కంకణం కట్టుకున్నాడు.. అంతే.. పొట్టచేత పట్టుకుని పరాయి దేశం వెళ్లాడు.. అక్కడే కూలీ పనులు చేస్తూ ఉన్నతంగా ఎదిగాడు. ఇప్పుడు పెద్దకంపెనీలు స్థాపించి వందలాది మందికి ఉపాధికల్పిస్తున్నాడు.. ఆయనే ఎల్లారెడ్డిపేటకు చెందిన రాధారపు సత్యం. ఆయన విజయం వెనుక రహస్యాలు.. ఆయన మాటల్లోనే.. వెయ్యి మందికి ఉపాధి.. వీర్నపల్లిలో 1995–96 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన. గణితంలో ఒకేఒక్క మార్కు తక్కువ రావడంతో ఫెయిలైన. రెండేళ్లు ఖాళీగా ఉన్న. మా సోదరుడు శంకర్ సాయంతో 1998లో కంపెనీ వీసాపై దుబాయి పోయిన. అక్కడే కూలీ పనులు చేసిన. ఎల్‌ఎస్‌పీఎంకే పేరిట దుబాయిలో భవన నిర్మాణాల కంపెనీ ప్రారంభించిన. సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు వెయ్యి మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్న. పుట్టెడు కష్టాలు.. నా చిన్నతనంలోనే అమ్మానాన్న అనారోగ్యంతో చనిపోయిండ్రు. సోదరుడు, ఒక అక్క, చెల్లెలు. అన్నీ తామై నన్ను పెంచిండ్రు. ఆర్థిక పరిస్థితులకు తోడు పదో తరగతిలో ఫెయిలైన. సోదరుని సాయంతో దుబాయికి వెళ్లి కూలీ పనులకు కుదిరిన. కొన్నాళ్లపాటు అవేపనులు చేసిన. కొందరు మిత్రుల సాయంతో దుబాయిలోనే భవన నిర్మాణ వ్యాపారం ప్రారంభించిన. ప్రస్తుతం దుబాయి ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న. వెయ్యి కుటుంబాల్లో వెలుగులు నింపాలి.. భవన నిర్మాణ రంగ వ్యాపారం అనుకూలించింది. కూలీల అవసరం ఎక్కువైంది. అందుకే.. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు వెయ్యి మందిని నా కంపెనీలో కూలీలుగా పెట్టుకున్న. నేను బతకడం కష్టమనుకునే పరిస్థితిని ఇలా అధిగమించిన. అంచలంచెలుగా ఎదగడమే కాదు.. నేను ఉపాధి కల్పిస్తున్న వెయ్యి కుటుంబాల్లో వెలుగులు నింపాననే సంతృప్తి నా జీవితకాలం ఉంటుందని నా అభిప్రాయం. నిరుపేదలకు అండగా.. అనాథలకు అండగా ఉంటూ.. నిరుపేదలకు ఆకలి తీర్చడమే లక్ష్యంగా ముందుకు పోతున్న. అభాగ్యులకు ఆపద సమయంలో నేనున్నాననే భరోసా కల్పిస్తున్న. వృద్ధాశ్రమంలో మలిసంధ్యలో ఉన్న అవ్వలకు బువ్వకోసం సాయం చేస్తున్న. తంగళపల్లిలోని లగిశెట్టి శ్రీనివాస్ చారిట్రబుల్ ట్రస్ట్‌లోని అనాథలకు రూ.50వేలు, గంభీరావుపేట వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుస్తులు, పండ్లు, రూ.25వేల నగదు అందించిన. ఎల్లారెడ్డిపేటలోని 20 మంది అనాథ మహిళలకు దుప్పట్లు, దుస్తులు అందించిన. వివిధ సందర్భాల్లో వివాహం చేయలేని స్థితిలో ఉన్న నిరుపేద తల్లిదండ్రుల కూతుళ్ల పెళ్లిళ్లకు పుస్తెమెట్టెలు, దుస్తులు, పెళ్లి సామగ్రి అందిస్తూ వస్తున్న. ఇలా ఇప్పటివరకు 25 మంది యువతుల వివాహాలకు రూ.2.25 లక్షల సాయం చేసిన. పాఠశాలల్లో విద్యార్థుల చదువులకోసం రూ.5 లక్షలతో పది పాఠశాలలకు ప్రొజెక్టర్లు, దుస్తులు, విద్యాసామగ్రి అందించిన. జీవితకాలం కొనసాగిస్తా నేను ఒకప్పుడు బుక్కెడు బువ్వకోసం తండ్లాడిన. ఆకలి బాధ అంటే నాకు తెలుసు. అందుకే పేదల ఆకలి తీర్చడంలో ముందుంటున్న. పెద్ద చదువులు చదువలేకపోయినా.. తెలివితో రాణించి పదిమందికి సాయం చేసే విధంగా నేటి యువత ఎదగాలి. -
పంచాయతీకో కార్యదర్శి
నేరడిగొండ(బోథ్): గ్రామపంచాయతీల్లో నూతన కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గ్రామ పంచాయతీకో కార్యదర్శిని నియమించింది. దీంతో గ్రా మపంచాయతీలు అభివృద్ధి పథంలో పయనించనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 467 గ్రామపంచాయతీలు ఉండగా కార్యదర్శులు 132 మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన 335 మంది పంచాయతీ కార్యదర్శుల కొరత ఉండేది. ఒక్కో కార్యదర్శికి మూడు నుంచి నాలుగు గ్రామాల చొప్పున అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో 2018 అక్టోబర్‌లో ప్రభుత్వం గ్రామపంచాయతీ సెక్రెటరీల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఎంపిక ప్రక్రియ చేపట్టింది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. డిసెంబర్లో సర్టిఫికెట్ల పరిశీలన సైతం జరిపారు. అనంతరం కొంద రు అభ్యర్థులు ప్రభుత్వం రోల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం లేదని, పరీక్షల్లో ప్రశ్నలను తప్పుగా ఇచ్చారని కోర్టుకు వెళ్లిన విషయం విధితమే. దీంతో నియామకాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో ఇప్పటికే కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుక్రవారం నియామక పత్రాలను అందించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన చర్యలు వెంటనే చేపట్టాలనే ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. 290 మంది జూనియర్ పంచాయతీల నియామకం ఆదిలాబాద్ జిల్లాలో 335 పంచాయతీ కార్యదర్శులు ఖాళీగా ఉండగా ఇటీవల రాసిన పంచాయతీ పరీక్షలో ఫలితాలు సా«ధించిన 318 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 290 మందికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియామక పత్రాలు అందించారు. మరో 28 మందిని పూర్తి వివరాలు సేకరించి నియామక పత్రాలు అందజేస్తామని జిల్లా అధికారులు తెలిపారు. త్వరలోనే అన్ని స్థానాల్లో నియామకం చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. తీరనున్న సమస్యలు.. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర. జనన, మరణ ద్రువీకరణ పత్రాలతోపాటు 18 రకాల సర్టిఫికెట్లు ఇచ్చేది వారే. గ్రామాభివృద్ధి కోసం విడుదలయ్యే నిధులు ఎన్ని, ఖర్చు చేసింది ఎంత, తాగునీరు, పన్నుల వసూళ్లు, అత్యవసరంగా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు, తదితర అంశాలన్ని కార్యదర్శులే చేపట్టాల్సి ఉంటుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండడంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. నూతనంగా జూనియర్ కార్యదర్శులు గ్రామానికొకరు రానుండడంతో సమస్యలు పరిష్కారం కానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. నూతనంగా ఎంపికైన కార్యదర్శులకు నియామక పత్రాలను అందజేశాం. వీరికి సంబంధించిన సర్టిఫికెట్లను గతంలోనే పరిశీలించాం. గ్రామానికో కార్యదర్శి నియామకంతో పల్లెల్లో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారానికి నోచుకుంటాయి. దీంతో పాలన సౌలభ్యంగా ఉంటుంది. మరిన్ని ఖాళీలను భర్తీ చేస్తాం. – టి.సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి సంతోషంగా ఉంది కాస్త ఆలస్యమైనా నియామకాలు చేపట్టడం సంతోషంగా ఉంది. 2018 అక్టోబర్ 10న రాత పరీక్ష నిర్వహించారు. ఫలితాలను అదే ఏడాది డిసెంబర్ 18న వెల్లడించారు. సర్టిఫికెట్ల పరిశీలన సైతం చేశాక న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కావడంతోపాటు శాసన మండలి ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు రావడంతో నియామకంలో ఆలస్యం జరిగింది. శుక్రవారం నియామక పత్రం అందజేయడంతో సంతోషంగా ఉంది. – కొప్పుల రవీందర్, వడూర్ -
నిరుద్యోగుల కలలు...కల్లలు!
చదువుకుంటే.. మంచి భవిష్యత్తు ఉంటుంది. చదువుకుంటే.. కుటుంబానికి అండగా నిలబడొచ్చు. చదువుకుంటే.. సమాజంలో ఒక గౌరవస్థానం ఉంటుంది. చదువుకుంటే.. నలుగురికి చేతనైన∙సాయం చేయొచ్చు. చదువుకుంటే.. నచ్చిన ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడొచ్చు ....ఇదీ నేటి యువత కల. అయితే ఈ ఐదేళ్లలో ఆ కలలు కల్లలయ్యాయి. ఎంత ఉన్నత చదువులు చదివినా కనీస ఉపాధి లేక కుటుంబానికి బరువై దయనీయ స్థితిలో రోజులు నెట్టకొస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో లక్షల సంఖ్యలో పోస్టులున్నా భర్తీ చేయడం లేదు. ఏటా వేలల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్న యువతకు ఉద్యోగాలు దొరకడం గగనమైపోతోంది. అందుకే ఏ చిన్న నోటిఫికేషన్ వెలువడినా లక్షల దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఏడో తరగతి అర్హత ఉన్న ప్రభుత్వ కొలువుకు బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ చేసిన వారు పోటీ పడుతున్నారు. మరోపైపు ప్రైవేటు రంగంలోనైనా ఉపాధి దొరకుతుందా అంటే అక్కడా పోటీ తీవ్రంగా ఉంది. ఒకవేళ దొరికినా అతి తక్కువ వేతనంతో నగరాల్లో పని చేయాలంటే చాలా కష్టం. నచ్చిన ఉద్యోగ అవకాశం లేక, తల్లిదండ్రులకు భారం కాలేక యువత నరకయాతన అనుభవిస్తోంది. చివరకు ఉద్యోగార్హతకు వయసు మీరి జీవితంలో స్థిరపడలేక ఒత్తిడికి లోనవుతూ ఉరికొయ్యకు వేలాడుతోంది. సాక్షి, అనంతపురం: ‘ఇంటికో ఉద్యోగం కల్పిస్తాం. నిరుద్యోగాన్ని రూపుమాపుతాం. కొత్త ఉద్యోగాల్ని సృష్టిస్తాం. ఉద్యోగ సృష్టికర్తలుగా తయారుచేసి.. తద్వారా ఉద్యోగ కల్పనకు కృషి చేస్తాం. ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం. ఒకవేళ ఉద్యోగం కల్పించకపోతే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తాం.’ గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వాగ్దానాలు, హామీలు ఇవి. వీటిని విన్న నిరుద్యోగులతోపాటు వారి తల్లిదండ్రులూ చాలా సంతోషించారు. అయితే గద్దెనెక్కి న తర్వాత ఆ హామీలను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల మాట దేవుడెరుగు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కింద పని చేస్తున్న వేలాది ఉద్యోగాలను ఊడబెరికారు. ఉన్నత చదువులు చదివి.. ఉన్నత చదువులతో ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని ఆశించిన యువతకు ప్రభుత్వ నిర్వాకంతో భవిష్యత్తు అంధకారంగా మారింది. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులను ఎవరిని కదిలించినా వారి ఆవేదన వర్ణనాతీతం. బతుకులు బాగుపడుతాయని ఆశించి భంగపడ్డామని నిరుద్యోగులు వాపోతున్నారు. ఐదేళ్లు వేచి చూసినా.. ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చకపోవడం తో ఉద్యోగార్హత వయసు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో స్థిరపడాల్సిన వయసులో ప్రభుత్వం చేయూతనివ్వకపోవడంతో నిరుద్యోగులుగానే మిగిలిపోవాల్సి వస్తోందని మండిపడుతున్నారు. తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన వయసులో ఇంకా వారి మీదే ఆధారపడి బతకాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. చదివిన కోర్సుకు చేస్తున్న ఉద్యోగానికి పొంతన లేక రాజీపడి బతుకు బండిని లాగిస్తున్న పలువురి వేదన వారి మాటల్లోనే.. పోస్టుల భర్తీ ఏదీ? గతంలో కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం డీఎస్సీ పోస్టులు 950 భర్తీ చేసింది. అనంతరం గతేడాది 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇంతవరకూ భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. గతంలో 450 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశారు. తాజాగా 300 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలు గతంలో జిల్లాలో 90 పోస్టులు భర్తీ చేశారు. తాజాగా 40 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. చంద్రబాబు గత సార్వత్రిక ఎన్నికల్లో ఖాళీగా ఉన్న 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఆశపడ్డ అభ్యర్థులు ప్రైవేటు ఉద్యోగాలను సైతం వదిలి కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకున్నారు. అయితే హామీలన్నీ విస్మరించడంతో అటు ప్రైవేటు ఉద్యోగాలు చేయలేక, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు రాక రెండింటికీ చెడ్డ రేవడిలా తయారయ్యామన్న వేదన నిరుద్యోగుల్లో ఉంది. ఈ చిత్రంలోని యువకుడి పేరు డాక్టర్ గణేష్‌కుమార్. కదిరికి చెందిన ఈయన కామర్స్‌లో పీహెచ్డీ పూర్తి చేశాడు. నెట్ (జాతీయ అర్హత పరీక్ష), సెట్ (రాష్ట్ర అర్హత పరీక్ష) ఉత్తీర్ణత సాధించారు. పీడీఎఫ్ (పోస్ట్‌డాక్టరల్ ఫెలోఫిప్) పూర్తీ చేశాడు. ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కలలుకన్నాడు. అయితే అతడి చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం అతడి ఆశలు అడియాసలు చేస్తున్నాయి. అతడి తండ్రి కిడ్నీ పేషేంట్. ఏ పనీ చేయలేడు. ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లి కదిరిలో మల్లెపూలు కట్టి కుటుంబానికి నెట్టుకొస్తోంది. గత ఐదేళ్లలో ఉద్యోగాలు భర్తీ చేయలేదు. గత్యంతరం లేక కుటుంబ పోషణకు ఓ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేరాడు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు జగదీష్. నార్పల గ్రామం. ఎంబీఏ పూర్తి చేశాడు. చదువు అయిపోగానే మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకున్నాడు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ 2014 ఎన్నికల సమయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించడంతో తన భవిష్యత్తు బాగుపడుతుందని సంబరపడ్డాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. చివరకు నిరుద్యోగ భృతి కూడా అందకపోవడంతో కుటుంబపోషణ కోసం ఉపాధి కూలీ(జాబ్‌కార్డ్ నెం. 121712707004011932)గా మారాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలందరినీ మోసగించాడని జగదీష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
యువనేస్తం...రిక్తహస్తం
సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకమునుపు ఒక మాట.. వచ్చిన తర్వాత మరొక మాట చెబుతూ ముందుకు వెళుతోంది. ఒక్కటేమిటి రుణమాఫీ మొదలుకొని నిరుద్యోగ భృతి వరకు చెప్పిందొకటి...చేసేది మరొకటిగా మారింది. నిరుద్యోగ భృతి విషయంలోనూ దాదాపు నాలుగున్నరేళ్ల పుణ్యకాలం గడిచినంత వరకు మొద్దునిద్రలో ఉన్న టీడీపీ సర్కార్ ఎన్నికల నేపథ్యంలో మేలుకుంది. అదీ కూడా ఇంటింటికి ఉద్యోగం.. లేకుంటే ప్రతి నిరుద్యోగికి రూ. 2 వేలు భృతి అంటూ దండోరా వేసిన తెలుగుదేశం ప్రభుత్వం రూ. 1000లకే పరిమితమై మార్చి నెలలో మాత్రం రూ. 2000 ఎన్నికల స్టంట్తో పెంచేశారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో జిల్లాలో వేల మంది దరఖాస్తు చేస్తే రకరకాల నిబంధనల పేరుతో అధికశాతం మందికి మొండి చేయి చూపి కొంతమందికే భృతి ఇస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. అంతంత మాత్రమే.. ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్సైట్లో దాదాపు 7.15 లక్షల పైచిలుకు నమోదైనా ఓటీపీ జనరేట్ చేసిన వారు 5.73 లక్షల మంది ఉన్నారు. పెద్ద ఎత్తున దరఖాస్తుకు ప్రయత్నించారు. అయితే నిబంధనల సాకుతో అందరినీ కోత కోసేశారు. కొందరికి ఓటీపీ రిజెక్ట్ అయితే, మరికొందరికి సక్సెస్ అయినా సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదనో, చదువు ఇది కాదనో లేదా వయస్సు దాటిపోయిందనో సాకులు చూపుతూ యువతకు భృతిని దూరం చేస్తున్నారు. జిల్లాలో 31,164 మందికి భృతి ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం 31 వేల 124 మందిని మాత్రమే అర్హులుగా తేల్చి మొత్తాన్ని అందిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇంటింటికి ఉద్యోగం...లేకపోతే రూ. 2 వేలు నిరుద్యోగ భృతి అన్నా తీరా చివరలో రూ. 1000 పేరుతో మొదలు పెట్టారు. జిల్లాలో భారీగా నిరుద్యోగులు జిల్లాలో అధికారికంగా తక్కువ సంఖ్య చూపిస్తున్నా జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారు. రోజురోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. భృతి రాక, ఉద్యోగం లేక తల్లడిల్లిపోతున్న నిరుద్యోగులు ప్రభుత్వ తీరును తూర్పార బడుతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం దరఖాస్తు వివరాలు వెబ్సైట్లో దరఖాస్తుకు యత్నించినవారు : 7,15,343 ఓటీపీ జనరేట్ చేసిన వారు : 5,73,462 ఓటీపీ ఫెయిల్ అయిన వారు : 1,41,881 మార్చి నెల వరకు భృతి పొందుతున్న నిరుద్యోగులు : 31,124 జిల్లాకు ప్రస్తుతం మంజూరైన నిరుద్యోగుల సంఖ్య : 36,304 అధికారికంగా అర్హులుగా ప్రభుత్వం గుర్తించిన నిరుద్యోగులు : 64,265 -
బతుకుదెరువు చూపించని కులవృత్తి
గుంటూరు, తాడేపల్లి రూరల్: తండ్రితో పాటు కులవృత్తి చేస్తూ ఆ వృత్తిలో బతుకుదెరువు కనిపించక పోవడంతో తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మరో వృత్తిని ఎంచుకున్నా, ఆ వృత్తి భరోసా ఇవ్వకపోవడంతో తనువు చాలించిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి పట్టణ పరిధిలోని చిన్న శ్రీనివాసరావు ఒక్కగానొక్క కొడుకు చిన్నం వెంకటేష్ (22) తన తండ్రితో కలిసి చేనేత వృత్తి చేస్తూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో కులవృత్తైన చేనేతతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టతరంగా మారడంతో వడ్రంగి పని చేస్తూ తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. బయటకు వెళ్లొస్తానని చెప్పి శ్రీనివాసరావు, శివపార్వతిలకు వెంకటేష్‌తో పాటు కుమార్తె ఉంది. వెంకటేష్ అక్కకు వివాహమైంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం తండ్రికి గుండెజబ్బు రావడంతో ఆపరేషన్ కూడా చేయించాడు. ప్రస్తుతం కుటుంబాన్ని మొత్తం అతనే పోషిస్తున్నాడు. అప్పు చేయకపోయినా, ఉన్న దాంట్లోనే సర్దుకుని జీవిస్తున్న వెంకటేష్ కుటుంబాన్ని ఆర్థిక పరిస్థితులు వెంటాడాయి. మరో 15 రోజుల్లో వెంకటేష్ అక్కను ఇంటికి తీసుకువచ్చి పురుడు పోయాల్సి ఉంది. తల్లిదండ్రులతోనూ, స్నేహితులతోనూ సంతోషంగా ఉన్న వెంకటేష్ మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ, తమతో మాత్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానంటూ రెండుమూడు సార్లు చర్చించాడని స్నేహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఇంట్లో టిఫిన్ చేసి, తల్లిదండ్రులతో కొంచెం సేపు మాట్లాడి, బయటకు వెళ్లొస్తానని, తన ద్విచక్రవాహనంపై వచ్చి కృష్ణానది వద్ద బండి పార్క్ చేసి, మూడో కానా దగ్గర కృష్ణానదిలోకి దూకినట్లు గుర్తించారు. తల్లడిల్లిన కుటుంబం రాత్రి సమయం కావడంతో పోలీసులుకానీ, మరెవరూ ఈ విషయాన్ని గమనించలేదని, మృతదేహం మూడో రోజు తేలడంతో మత్స్యకారులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా, జేబులో సెల్‌ఫోన్, బండి తాళం ఉన్నాయని, సెల్‌ఫోన్ ఆధారంగా బంధువులకు, స్నేహితులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్నేహితులు మృతదేహాన్ని పరిశీలించి చనిపోయింది వెంకటేష్ అని గుర్తించారు. వెంకటేష్‌కు ప్రమాదం జరిగిందని తండ్రైన శ్రీనివాసరావుకు తెలిపారు. తండ్రిని కృష్ణానది దగ్గరకు తీసుకువచ్చారు. శ్రీనివాసరావు కుమారుడి వాహనం గుర్తించాడు. అనంతరం కృష్ణానదిలో వెంకటేష్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయాడు. కుమారుడి మృతదేహాన్ని చూసిన భోరున విలపించాడు. శ్రీనివాసరావును ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. -
కొత్తపేట చౌరస్తాలో కలకలం
సాక్షి, హైదరాబాద్ : కొత్తపేట చౌరస్తాలోని వీఎం హోం వద్ద శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎత్తున నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉన్న వీఎం హోం గ్రౌండ్‌ను అధికారులు మూసివేయడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వీఎం హోంను తెరవాలని దాదాపు రెండు వేల మంది నిరుద్యోగులు కొత్తపేట చౌరస్తాలో బైఠాయించి, ప్రధాన రహదారిపైనే వ్యాయామాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డితోపాటూ స్థానిక ప్రజా సంఘాల నేతలు సంఘటనా స్థలానికి చేరుకొని నిరుద్యోగులకు బాసటగా నిలిచారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు నిరుద్యోగ యువతకు సర్దిచెప్పి, ఆందోళన కార్యక్రమాన్ని విరమింపజేశారు. -
నిరుద్యోగ భృతి వద్దు.. ఉద్యోగాలు ఇవ్వండి!
సాక్షి, వరంగల్: నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్‌తోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ ఉద్యోగ నియామకాల హామీపై దృష్టి సారించాయి. నిరుగ్యోగుల ఓట్లకు గాలం వేసేందుకు ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇస్తున్నాయి. ఉద్యోగావకాశాలు కల్పించిన పార్టీలనే ఆదరిస్తామని నిరుద్యోగులు అంటున్నారు. దీనిపై నిరుద్యోగుల అభిప్రాయాలు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ములుగు: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో అండగా ఉంటాం. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తాత్సారం చేయకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలి. అలాంటి వారికే ఓటేస్తాం. నిరుద్యోగ భృతి కాకుండా తగిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది. డిగ్రీ, ఆ పైన విద్యనభ్యసించి వేలాదిమంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. –ఒజ్జల కుమారస్వామి యాదవ్ ఉద్యోగాలు లేనట్టే.. టేకుమట్ల: ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ భృతితోనే సరిపెట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పనికి తగ్గ వేతనాన్ని కల్పిస్తే ప్రభుత్వ పథకాలపై ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. నిరుద్యోగులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తే సరిపోతుంది. –రాం సుమన్, బీటెక్, పంగిడిపల్లి, మొగుళ్లపల్లి మేనిఫెస్టోలో ప్రకటించాలి నిరుద్యోగ భృతికి సంబంధించిన అంశాలను రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాలి. తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలి. ఇది నిరుద్యోగులకు వెసులుబాటు కల్పించేదిగా ఉండాలి. –కల్లూరి పవన్ (కేయూ విద్యార్థి నాయకుడు) బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి నిరుద్యోగ యువతకు ఇచ్చే భృతిని ప్రతినెలా బ్యాంకు ఖాతాల్లో జమచేయాలి. నేరుగా ఇవ్వడం వల్ల అవినీతి జరిగే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుల్లో వేయడం వల్ల యువత తన అవసరాలకు డబ్బులను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. –పి.సురేష్ బాబు , కాజిపేట నిరుద్యోగ భృతి అవసరమే కాజీపేట: ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు దొరకక నిరుద్యోగులు బాధపడుతున్నారు. వారిని ఆదుకోవడానికి రాజకీయ పార్టీలు ముందుకు రావడం మంచి పరిణామం. నిరుద్యోగ యువతకు భృతి అవసరం. –దామెరుప్పుల సతీష్ (కేయూ విద్యార్ధి సంఘం) ఎన్నికలకు ముందే అర్హతలు ప్రకటించాలి ప్రభుత్వం నుంచి ఆశించిన నోటిఫికేషన్ రాకపోవడం నిరాశ కలిగించింది. స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న రుణాలు కూడా ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయాయి. ఏ పార్టీ అయినా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం కాదు. ముందే పథకానికి సంబంధించిన అన్ని అర్హతలను స్పష్టంగా ప్రకటించాలి. నిరుద్యోగ భృతి ఇవ్వడం కంటే నోటిఫికేషన్ ఇవ్వడం మేలు. –ఏల్పుకొండ ప్రవీణ్‌కుమార్, పత్తిపాక, మానుకోట ఉద్యోగాల కోసం ఉద్యమించాం.. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉద్యమించాం. కానీ పాలకులు విస్మరించారు. లబ్దికోసమే నిరుద్యోగ భృతిపేరుతో మరోమారు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.నిరుద్యోగ భృతి ప్రకటిస్తే ఇక ఉద్యోగాలు లేనట్టే. ఎన్నో కష్టాలను అనుభవించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివి ఉద్యోగావకాశాలు కల్పించమంటే నిరుద్యోగ భృతి అనడం దారుణం. సీహెచ్ నరేష్, డిగ్రీ విద్యార్థి మొగుళ్లపల్లి భృతి అక్కర్లేదు టేకుమట్ల: రాష్ట్రంలో నిరుద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసేందుకే నిరుద్యోగ భృతిని తెరపైకి తెస్తున్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని అప్పులు చేసి ఉన్నత చదువులు చదివింది నిరుద్యోగ భృతి కోసం కాదు. నిరుద్యోగ భృతి కావాలని ఎవరూ అడగలేదు. ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగులను ఆదుకోవాలి. –గడ్డం సుమ, ఎంఏ బీఈడీ టేకుమట్ల ఓట్ల కోసమే.. స్టేషన్‌ఘన్‌పూర్: కేవలం ఎన్నికల్లో ఓట్లు పొందడానికే నిరుద్యోగ భృతి ఆశ చూపుతున్నాయి. నిరుద్యోగ భృతి కన్నా ఉపాధి కల్పించే దిశగా కృషి చేయాలి. గత ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం, నీళ్లు, నిధులు, నియామకాలతో టీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేసింది. కనీసం ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. –వేళ్ల సురేందర్, నిరుద్యోగి నిరుద్యోగ భృతి వద్దు.. ఏటూరునాగారం: నిరుద్యోగ భృతి వద్దు..ఉద్యోగమే ముద్దు. ఈ రోజుల్లో చదువుకొని ఉద్యోగం చేసేవాళ్లు ఉన్నారు గానీ నిరుద్యోగ భృతి తీసుకొని మరింత సోమరితనంగా మారే పరిస్థితిలో యువత లేదనే విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. అర్హులకు ఉద్యోగం కల్పిస్తే బాగుంటుంది. –వెల్దండి రచన, ఏటూరునాగారం, నిరుద్యోగిని నోటిఫికేషన్లు వేయాలి పాలకుర్తిటౌన్: పలు పార్టీలు మ్యానిఫెస్టోలో నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని ప్రకటిస్తున్నాయి. నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగభృతి ఇచ్చి ఏం లాభం. ఉపాధి కోసమే నిరుద్యోగులు, విద్యార్థులు పోరాటాలు చేశారు. నిరుద్యోగ భృతితో యువతకు లాభం లేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు వారి మ్యానిఫెస్టోలో ఉద్యోగాలపై స్పష్టమైన ప్రకటన చేయాలి. –కోతి సుధాకర్, నిరుద్యోగి, మల్లంపల్లి, పాలకుర్తి మండలం -
నో జాబ్స్
-
నేడే ఆఖరు రోజు..
ఖమ్మం మయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ)కు చెందిన నిరుద్యోగులు సబ్సిడీ రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకునే గడువు బుధవారంతో ముగియనుంది. నిరుద్యోగులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు.. యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు అందించి.. ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రభుత్వం అందించే రుణాలు పొందిన లబ్ధిదారులు యూనిట్లను ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందుతుండగా.. కొత్త రుణాల కోసం దరఖాస్తుదారుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు ప్రభుత్వం రుణ ప్రణాళికను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. గత నెల 19 నుంచి దరఖాస్తు చేసుకునేలా ఆన్లైన్ సైట్‌ను ప్రభుత్వం ఓపెన్ చేసింది. అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పలు కారణాల వల్ల జిల్లా అధికారులు ఆలస్యంగా ప్రకటించారు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు కొంత వెనుకబడ్డారు. ఈనెల 7వ తేదీతోనే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అని ప్రకటించిన ప్రభుత్వం గడువు తేదీని ఈనెల 10వరకు పొడిగించింది. దీంతో అభ్యర్థులు కొంత ఊరట చెందారు. నేటితో గడువు ముగుస్తుండడంతో ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు గడువు తేదీ పెంచాలని కోరుతున్నారు. గడువు తేదీ ముగిస్తే సవరణలకు కూడా అవకాశం కోల్పోతామని, తాము పొందాలనుకున్న యూనిట్‌ను పొందలేమని ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు 4,065 యూనిట్లు.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం పలు కేటగిరీల్లో సబ్సిడీ రుణాలను అందిస్తుంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు సంబంధించిన రుణ ప్రణాళికను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన ఎస్సీ అభ్యర్థులకు స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీ రుణాలను అందించడంతోపాటు పలు రుణాలకు సంబంధించిన ప్రణాళికలను విడుదల చేసింది. జిల్లాకు మొత్తం 4,065 యూనిట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో బ్యాంక్ లింకేజీ ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు 670 యూనిట్లు, సీఎం ఎంటర్ ప్రిన్యూర్‌షిప్ డెవలప్ ప్రోగ్రాం(సీఎంఈడీపీ) పథకానికి 93, ఆదాయ అభివృద్ధి పథకానికి 232, సంఘాలకు 7, బ్యాంక్‌తో సంబంధం లేకుండా భూ పంపిణీ పథకానికి 110, మైనర్ ఇరిగేషన్ కింద 664, ఎనెర్జిషన్ పథకం కింద 353, ఈఎస్ఎస్ పథకం కింద 775, ట్రైనింగ్ ప్రోగ్రాం కింద 925, ఇతర పథకాల కింద 236 యూనిట్లను జిల్లాకు కేటాయించారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ ద్వారా ఎస్సీల ఆర్థిక బలోపేతం కోసం అందించే రుణాల యూనిట్ల సంఖ్యను మాత్రం తగ్గించింది. 2018–19 సంవత్సరానికి మొత్తం 670 యూనిట్లను జిల్లా లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో పురుషులకు 447 యూనిట్లు, మహిళలకు 223, వికలాంగులకు 34 యూనిట్లను కేటాయించింది. ఎస్సీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంక్ లింకేజీ ద్వారా అందించే రూ.లక్ష యూనిట్లు 318, రూ.2లక్షల యూనిట్లు 255, రూ.7లక్షల యూనిట్లు 97 ఉన్నాయి. గత ఏడాది జిల్లాకు 1,382 యూనిట్లను జిల్లా లక్ష్యంగా నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ ఏడాది 670 యూనిట్లను మాత్రమే కేటాయించడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు 20,449 దరఖాస్తులు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు 20,449 మంది దరఖాస్తుదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. స్వయం ఉపాధి పొందేందుకు బ్యాంక్ లింకేజీ ద్వారా అందుకునే రుణాలకు వీరంతా దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది రుణాలకు దరఖాస్తు చేసుకొని రుణం పొందని దరఖాస్తులు సైతం ఈ ఏడాది అందించే రుణాలకు రెన్యూవల్ అయ్యాయి. దీంతో కొత్తగా, రెన్యూవల్ అయిన దరఖాస్తులు ఇప్పటివరకు 20,449 ఉన్నాయి. ఇంకా ఒక రోజు గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఆన్లైన్లో పలు కారణాలతో దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. దరఖాస్తు చేసుకునే గడువు పొడిగించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ఎన్నికల తర్వాత జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల తర్వాతే ఎంపికలు.. అసెంబ్లీ రద్దుతో త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించే సబ్సిడీ రుణాలు ఎన్నికల తర్వాతే ఉంటాయి. అభ్యర్థులు గడువు తేదీని గమనించి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం గడువు తేదీ పెంచితే జిల్లాలో ఇంకా దరఖాస్తుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రేషన్ కార్డులో ఉన్న వారిలో ఒక్కరికి మాత్రమే రుణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనిని గమనించి దరఖాస్తు చేసుకోవాలి. – వై.ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
యువనేస్తం అస్తవ్యస్తం
అనంతపురం, ఎస్కేయూ: ప్రభుత్వ యువనేస్తం..నిరుద్యోగులకు రిక్తహస్తం చూపుతోంది. ప్రభుత్వం అట్టహాసంగా నిరుద్యోగులందరికీ భృతి ఇస్తున్నామంటూ గొప్పలు చెబుతున్నా...సవాలక్ష నిబంధనలతో జిల్లాలో 4 శాతం మందికి కూడా అందని పరిస్థితి నెలకొంది. 2014 ఎన్నికల వేళ అలవిగానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత అన్ని వర్గాలను మోసం చేశాడు. ఇపుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరకొర విదిల్చి మళ్లీ ఓట్ల రాజకీయానికి తెరలేపాడు. సార్వత్రిక ఎన్నికల వేళ చెప్పిన హామీ ఏటా డీఎస్సీ ప్రకటిస్తాము. క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు ప్రకటిస్తాము. ఖాళీగా ఉన్న 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాము. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ. నిరుద్యోగులపై ఉక్కుపాదం అరకొరగా నిరుద్యోగభృతి కల్పించి.. నిరుద్యోగులను అన్యాయానికి గురిచేయడమే కాకుండా ప్రభుత్వ నోటిఫికేషన్లలో పేర్కొన్న ఉద్యోగాలు సంఖ్యనామమాత్రంగా ఉంది. ప్రస్తుతం డీఎస్సీ ద్వారా 10 వేల ఉద్యోగాలు , గ్రూప్–2 కేవలం 330 పోస్టులు, పంచాయతీ సెక్రటరీ 1,600 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో (ఇపుడు ఇవ్వబోయే నోటిఫికేషన్లతో కలిపి) అరకొరగానే పోస్టులను మంజూరు చేశారు. అటు ప్రభుత్వ ప్రకటనలు సజావుగా జారీ చేయకపోగా, నిరుద్యోగ భృతిని చివరి ఆరు నెలల కాలంలో, కేవలం 4 శాతం మందికి మాత్రమే భృతి కల్పించి నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపారు. వయోపరిమితి ప్రధాన అవరోధం రాష్ట్ర విభజన నేపథ్యంలో నిరుద్యోగులకు ఊరట కలిగించి, ఉపాధి కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోలేదు. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకుండా జాప్యం చేసింది. దీంతో ఉద్యోగాలు రాకుండా వయోపరిమితి భారమైన నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అటు నిరుద్యోగ భృతికి అనర్హులుగా మిగిలిపోయి. ఈ నాలుగున్నర సంవత్సరం కాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో వేదన మిగిలింది. నిరుద్యోగభృతి దక్కాలంటే వయోపరిమితి సడలించాలనే ప్రధానమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి. దరఖాస్తు తిరస్కరణకు కారణాలు ⇔ 35 సంవత్సరాల వయోపరిమితి దాటకూడదు. ⇔ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ రూ.50 వేలకు మించకూడదు. ⇔ కుటుంబానికి 5 ఎకరాల భూమి (నిరుద్యోగికి కాదు) మించకూడదు. ⇔ నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. ⇔ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం కూడా చేయకూడదు. ⇔ వయోపరిమితిని పరిగణలోకి తీసుకోవడంతో సింహభాగం నిరుద్యోగులు అనర్హులుగా మిగిలారు. అనంతపురం జిల్లాలో కరువు కాటకాల నేపథ్యంలో వ్యవసాయం కుదేలైంది. కుటుంబానికి 5 ఎకరాల భూమి ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. అయినా ప్రభుత్వం మాత్రం భూమిని పరిగణలోకి తీసుకుని సింహభాగం నిరుద్యోగులకు రిక్తహస్తం చూపింది. ఒక్కొక్కరికిరూ.1.08 లక్షలు బాకీ సీఎం చంద్రబాబు హామీ మేరకు నిరుద్యోగులందరికీ 54 నెలల భృతి అందాలి. నెలకు రూ. 2 వేలు చొప్పున రూ.1.08 లక్షల బాకీ ఉన్నారు. ఆరు నెలల భృతి ఇచ్చి నిరుద్యోగులను మోసం చేద్దామంటే కుదరదు. – ఓబులేసు యాదవ్, ఎస్కేయూ. వయోపరిమితి పెంచాలి ఉద్యోగ వయోపరిమితిని పెంచాలి. లేదంటే రానున్న నోటిఫికేషన్లలో చాలా మంది అభ్యర్థులు అనర్హులు అవుతారు. పోలీసు శాఖలోనూ ఉద్యోగ వయోపరిమితి 5 సంవత్సరాలు పెంచాలి. నిరుద్యోగుల శ్రేయస్సుకు విఘాతం కలిగించే చర్యలను విరమించకపోతే రానున్న రోజుల్లో పతనం తప్పదు. – సాకే నరేష్, బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి.క్యాలెండర్ ఇయర్ ఏమైంది? ఏపీపీఎస్సీ ద్వారా ఏటా క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. గ్రూప్–2లో అరకొరగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగులు ఉద్యోగాలపై ఆశలు వదులుకున్నారు. 1.60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. భర్తీకి నోచుకోలేదు. ఫలితంగా వయస్సు దాటిపోయి .. నోటిఫికేషన్లు వచ్చినా అనర్హులుగా మిగిలిపోతున్నారు. – క్రాంతికిరణ్,జాగ్రఫీ పరిశోధన విద్యార్థి, ఎస్కేయూ. -
ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్ధి విభాగం దీక్ష
-
ఉద్యోగాల పేరుతో టోకరా
దేవరకద్ర(మహబూబ్‌నగర్): చదువుకున్న నిరుద్యోగులకు ఎర వేసి మంచి ఉద్యోగం ఇప్పిస్తాం, రూ.వేలల్లో జీతం, మంచి భవిష్యత్‌ను కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి పలువురిని ఒడిశాకు తీసుకువెళ్లి శిక్షణ పేరుతో నిర్బంధానికి గురి చేసిన ఘటన ఇది. అక్కడి నుంచి కొందరు యువకులు తప్పించుకుని రావడంతో విషయం వెలుగు చూసింది. మహబూబ్‌నగర్ దేవరకద్రకు చెందిన కొందరు యువకులు, ఒక యువతి ఇప్పటికి అక్కడే వారి నిర్బంధంలో ఉన్నట్లు తప్పించుకుని వచ్చిన వారి ద్వారా తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ముందుగా కొందరు నిరుద్యోగలకు ఎర వేసి వారి ద్వారా స్నేహితులు, బంధువులు, తెలిసిన వారి వివరాలు, ఫోన్ నంబర్లు తీసుకుని తిరిగి వారి ద్వారామరి కొందరిని చైన్ సిస్టం మాదిరిగా లాగుతున్నట్లు సమాచారం. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ చదివిన వారినే ఎక్కువగా తమ చైన్ సిస్టంలోకి లాగుతున్నారు. సభ్యత్వానికి డబ్బు వసూలు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తమ కంపెనీలో చేరడానికి రూ.10,500 చెల్లించాలని, ఆ తర్వాత భోజనం ఖర్చు కింద రూ. 6 వేలు చెల్లిస్తే ఇక రూ.16 వేల నుంచి రూ. 18 వేల వరకు నెలకు వేతనం వస్తుందని మాయమాటలు చెబుతున్నట్లు సమాచారం. ఇలా అంగీకరించిన వారిని ఒడిశాలోని బద్రక్ జిల్లాకు వచ్చేలా చేస్తున్నారు. అక్కడి వెళ్లాక వారి నుంచి రూ. 16,500 తీసుకుని.. ఒక గాల్వే బ్యాగ్ అందులో కొన్నిరకాల క్రీములు, పౌడర్లు, ప్రొటీన్ డబ్బాలు ఇస్తున్నారు. గ్రేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద గాల్వే బ్రాండ్ వస్తువులను అంటగడుతున్నారు. అలాగే, ఒడిశాకు వచ్చిన వారికి సూటు వేయించి ఫొటో తీసి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నట్లు ఐడెంటిటీ కార్డు జారీ చేస్తున్నారు. ఇదంతా చూసిన నిరుద్యోగులు ఆశతో ఉంటున్నారు. బద్రక్ జిల్లాలో అద్దెకు తీసుకున్న గదుల్లో పది నుంచి ఇరవై మంది వరకు ఉంచి రెండు పూటల భోజనం మాత్రం పెట్టి తరగతులు నిర్వహిస్తూ చివరకు గాల్వే ఉత్పత్తులు ఎలా విక్రయించాలో చెబుతున్నారు. ప్రతీ సభ్యుడు ముగ్గురిని సభ్యత్వం చేయించాలని, ముందుగా తీసుకున్న వారి స్నేహితులు, బంధువులు, ఇతరులకు ఫోన్ చేసేలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఒడిశా వెళ్లిన వారెవరూ బయటకు వెళ్లకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెల నుంచి రెండు నెలలు పూర్తయ్యాక ఉద్యోగం లేదనే విషయం తెలుసుకుని గ్రామాలకు వెళ్తామని చెప్పినా కంపెనీ ప్రతినిధులు నిరాకరిస్తున్నారు. ఇరుకు గదుల్లో నెలల తరబడి ఉండడం దుర్భరంగా మారిందని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక స్టేజీ వన్ నుంచి ఫోర్ వరకు సభ్యత్వాలను చేయిస్తే రూ.74 వేలు అకౌంట్లో వేస్తాం, ఆ తర్వాత రూ.లక్ష, చివరగా రూ.5 లక్షలు వస్తాయని ఆశపెడుతూ ఇతరులకు ఫోన్లు చేయించి మోసం చేయిస్తున్నారని బాధితులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు దేవరకద్రకు చెందిన ఎరుకలి వెంకట్రాములు, ఎ రుకలి శివ, కురుమూర్తి, బల్సుపల్లి నర్సింహా ఒ డిశాలో నిర్బంధం తప్పించుకుని వచ్చారు. అదే విధంగా మద్దూర్ మండలం నిడ్జింతకు చెందిన ఆంజనేయులు కూడా వీరి వెంట వచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం విషయం పోలీసులకు వివరించారు. తమకు జరిగిన అన్యాయమే చాలా జరుగుతోందని తెలిపారు. తన తమ్ముడు రాము, చెల్లెలు రామలక్ష్మీ ఇప్పటికి ఒరిస్సాలోనే వారి నిర్బంధంలో ఉన్నారని ఎరుకలి వెంకట్రాములు తెలిపారు. ఈ మేరకు వారిని విడిపించి తీసుకు రావాలని కోరారు. -
అధ్యయనం చేశాకే హామీలు
సాక్షి, హైదరాబాద్: తాము అసాధ్యపు హామీలను ఇవ్వడం లేదని, అన్ని వివరాలను అధ్యయనం చేసిన తర్వాతే ఎన్నికల హామీలు ఇస్తున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ చెపుతున్నట్టు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అసాధ్యమేమీ కాదని, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.300 కోట్లు కేటాయించడం కష్టమేమీ కాదని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మహ్మద్‌సలీం, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో కలసి ఆయన మాట్లాడారు. నిరుద్యోగ భృతి విషయంలో సీఎం కేసీఆర్ వ్యక్తం చేసిన అనుమానాలు సరైనవి కావన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున భృతి ఇవ్వడానికి కేవలం రూ.300 కోట్లు అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు నికరంగా రూ.10,500 కోట్ల ఆదాయం వస్తోందని సీఎం స్వయంగా చెప్పారని, అలాంటప్పుడు నిరుద్యోగులకు రూ.300 కోట్లు కేటాయించలేమా అని ప్రశ్నించారు. ఉపాధి కల్పన కార్యాలయాల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగులకు భృతి ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు మేం రెడీ.. ఎన్నికలు ముందస్తు జరిగినా, షెడ్యూల్ ప్రకారం జరిగినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఉత్తమ్ చెప్పారు. సెప్టెంబర్‌లో తాము కూడా అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. భావసారూప్య పార్టీలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకునే విషయాన్ని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాహుల్‌నుద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చిల్లర మాటలని పీసీసీ చీఫ్ అన్నారు. కేటీఆర్ రాజకీయ అవగాహన లేని చిన్న పిల్లాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లు దిగజారి మాట్లాడుతున్నారని, సూర్యుని మీద ఉమ్మి వేస్తే వారి మీదే పడుతుందన్న విషయాన్ని వారు గ్రహించాలని హితవు పలికారు. టీఆర్ఎస్ కంటే భారీ సభ... అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. తాము అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాకే ప్రజలకు హామీలిస్తున్నామని ఉత్తమ్ చెప్పారు. సెప్టెంబర్‌లో టీఆర్ఎస్ నిర్వహించే సభ కన్నా భారీ సభను తామూ నిర్వహిస్తామన్నారు. త్వరలో బస్సుయాత్ర ప్రారంభిస్తామని, సెప్టెంబర్‌లో కూడా రాహుల్ రాష్ట్రానికి వస్తారని చెప్పారు. అభ్యర్థుల ప్రకటన కోసం త్వరలోనే ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు వేస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాల పట్ల రాహుల్ చాలా సంతృప్తిగా ఉన్నారని, ఈ విషయా న్ని ఆయనే స్వయంగా చెప్పారని వెల్లడించారు. రాహుల్ టూర్ సక్సెస్ రాహుల్‌గాంధీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన అద్భుతంగా సాగిందని, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు ఊహించిన దాని కన్నా ఎక్కు వ మంది వచ్చారని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ముఖ్యంగా విద్యార్థులు, యువతలో ఉన్న ఆగ్రహానికి ప్రతీకగా ఈ సభ నిలుస్తుందని చెప్పారు. రాహుల్ టూర్‌తో కేసీఆర్‌కు దడ పుట్టిందని, అందుకే మహిళా సంఘాలకు ఉన్న బకాయిల్లో రూ.960 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారని తెలిపారు. మహిళా సంఘాలకు ఇచ్చిన ప్రతి హామీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్ బూత్ స్థాయిలోని కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ పట్ల రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. సెటిలర్లకు ఇచ్చిన హామీలను కూడా చిత్తశుద్ధితో నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. -
అనంతలో వైఎస్ఆర్సీపీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగుల ర్యాలీ
-
గల్ఫ్ ఏజెంట్ల దందా !
జగిత్యాలక్రైం: నిరుద్యోగ యువత ఆసరాన్ని అవ కాశంగా మలుచుకుంటున్నారు గల్ఫ్ నకిలీ ఏజెంట్లు. విదేశాలకు పంపిస్తామని.. మంచి పని..అంతకంటే మంచి వేతనం ఉంటుందని నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. గల్ఫ్ ఏజెంట్ల మోసాలపై జగిత్యాల జిల్లా పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. దీంతో ఏజెంట్లు రహస్య ప్రాంతాల్లో యువతకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ తమ ఆగడాలను కొనసాగిస్తున్నారు. జిల్లా వారం క్రితం గల్ఫ్‌లో ఉపాధి చూపిస్తామంటూ కొండగట్టు పరిసర ప్రాంతం లోని ఓ మామిడితోటలో రహస్యంగా ఇంటర్వ్యూ లు నిర్వహించారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని పురాణిపేట ఓ నివాస గృహంలో అనుమతి లేని గల్ఫ్ ఇంటర్వ్యూలు చేసిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో సుమారు 340 మంది ఎలాంటి అనుమతులు లేకుండా గల్ఫ్ ఏజెంట్లుగా చెలామణి అవుతున్నారు. ట్రావెల్స్ పెట్టుకొని గల్ఫ్ దేశాలకు పంపిస్తామంటూ విస్తృత ప్రచారం చేయించుకుంటున్నారు. వీరిని నమ్మిన కొందరు ఇంటర్వ్యూలకు హాజరై పాస్‌పోర్టుతోపాటు కొంత మేరకు డబ్బు ముట్టజెప్పారు. పోలీసుల నిఘా జగిత్యాల జిల్లా నుంచి గల్ఫ్‌లో ఉపాధి కోసం వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఏజెంట్ల మోసాలు సైతం చాలానే వెలుగుచూస్తున్నాయి. దీంతో వారి ఆగడాలను అరికట్టేందుకు జిల్లా పోలీసులు పలుమార్లు గల్ఫ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న ప్రాంతాలపై దాడులు చేశారు. ఇది గ్రహించిన గల్ఫ్ ఏజెంట్లు గత నెల రోజులుగా రహస్య ప్రాంతాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. దీంతో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు గల్ఫ్ ఏజెంట్ల ఉచ్చులో పడి మోసాలకు గురవుతున్నారు. రెండు ట్రావెల్స్లకే లైసెన్స్‌లు జగిత్యాల జిల్లాలో గల్ఫ్ దేశాలకు పంపించేందుకు రెండు ట్రావెల్స్‌లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మిగతా వారికి ఎలాంటి అనుమతులు లేవు. దీంతో వారంతా ముంబై, చెన్నై, ఢిల్లీ ప్రాంతాల నుంచి గల్ఫ్ ఏజెంట్లను తెప్పించి ఇక్కడ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారి నుంచి ఒరిజినల్ పాస్‌పోర్టుతోపాటు కొంత మేరకు అడ్వాన్స్‌గా తీసుకుంటున్నారు. పోలీసుల కొరడా జగిత్యాల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు పోలీసులు కొరడా ఝులిపిస్తు న్నారు. జిల్లాలో ఆరు నెలల కాలంలో సుమారు 60కి పైగా కేసులు నమోదు చేశారు. అయినా ఏజెంట్లలో మార్పు రావడం లేదు. మంచి కంపె నీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతూ నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నారు. -
ఉద్యోగాలు భర్తీ చేయకపోతే అసెంబ్లీ ముట్టడి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల పన్నెండు వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని విజయవాడలో నిరుద్యోగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని, అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన జాబు లేదని ఐక్యవేదిక నేతలు విమర్శించారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని ఇంతవరకు భృతి కూడా చెల్లిందలేదన్నారు. గ్రూప్ 1, 2 ఉద్యోగాలకు పాత పద్దతిలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని, డీఎస్సీ పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ చేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని ఐక్యవేదిక నేతలు ప్రకటించారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు యువత ఓట్లను దండుకున్నారని పేర్కొన్నారు. ఖాళీలను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
ఆలకించయ్యా.. బాలయ్య
చిలమత్తూరు : మండలంలో సాగిన ఎమ్మెల్యే బాలకృష్ణ రెండో రోజు పర్యటనలో కూడా ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. మొరంపల్లి, కో డూరు, శెట్టిపల్లి, మరవకొత్తపల్లి, వీరాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. పింఛన్ రాలేద ని, కొందరు, రేషన్ సక్రమంగా అందలేదని కొందరు, ఇంటి స్థలాలు మంజూరు కాలేదని కొందరు ఇలాసమస్యలను పరిష్కారించాలంటూ వందలాది మంది ప్రజలు వినతులు అందజేశారు. ఆశా కార్యకర్తలకు న్యాయం చేయాలి : ప్రభుత్వాసుపత్రిలో, ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలో పనిచే సే ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కార్యకర్తలు బాలకృష్ణ వద్ద శెట్టిపల్లిలో మొరపెట్టుకున్నారు. సరైన గౌరవ వేతనం లేక నానా ఇబ్బందులు పడుతున్నామని వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. యువకులకు ఉద్యోగాలు కల్పించాలి యువకులకు ఉద్యోగాలు కల్పించాలంటూ నిరుద్యోగ యువత కోరారు. కియో పరిశ్రమం ఏర్పాటు జ రుగుతోందని అధికారులు, ప్రజాప్రతినిధులు తె లియజేస్తున్నారని స్థానికులకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. శెట్టిపల్లి ఎస్సీ కాలనీ వా సులకు గత కొన్ని నెలలుగా నీటి సమస్యతో పాటు ఇంటి పట్టాలు, నిర్మాణాల సమస్య ఉందని వాటిని పరిష్కరించాలన్నారు. కోడూరు పంచాయతీ లోని కనిశెట్టిపల్లిలో చౌకధాన్యపు డిపో సమస్యలను డీలర్ స్వయంగా బాలకృష్ణకు వివరించారు. అనంతరం వీరాపురంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. స్పెషల్ పార్టీ పోలీసుల అత్యుత్సాహం ఎమ్మెల్యే బాలకృష్ణకు సెక్యురిటీగా వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శించారు. అర్జీలు ఇచ్చుకోవడం కోసం వెళ్లిన ప్రజలను అడ్డుకున్నారు. సెక్యూరిటీ సమస్యలు వస్తాయనే సాకుతో చాలామంది ప్రజలు నేరుగా సమస్యలను తెలియజేసే అవకాశం ఇవ్వలేదు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అధికారులతో పాటు, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
త్రిపురారం : టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అయితగాని విజయ్‌కుమార్ విమర్శించారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యం లో చేపట్టిన చెగువేరా మోటార్ సైకిల్ యాత్ర శుక్రవారం హలియాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను విస్మరించిందన్నారు. ఈ బైక్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో పర్యటించి నిరుద్యోగుల సమస్యలపై సర్వే చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవినాయక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అవుతా సైదయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకారపు నరేష్, డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు పున్నా రాధకృష్ణ, బాబు, అజయ్ కుమార్, రాంబాబు, రాజు, వెంకట్, శ్రీను తదితరులు ఉన్నారు. -
నిరుద్యోగ యువతకు శుభవార్త
సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు ప్లేస్మెంట్ గ్యారంటీతో వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మొత్తం 18 వృత్తి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 1,627 మంది నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించించి. మొత్తం అభ్యర్థుల్లో 702 మంది మైనారిటీ, 625 మంది ఎస్సీ, 300 మంది ఎస్టీ యువతకు శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గురుకుల విధానంలో రెండు నుంచి ఆరు నెలల కాల పరిమితి శిక్షణ ఉచితంగా అందించనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత, ఆపైన చదివిన అభ్యర్థులు శిక్షణకు అర్హులు. ప్రస్తుతం 512 మంది ఆయా కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ అందించేం దుకు ఈ సీఐఎల్ అలీఫ్, సెట్విన్, ఏస్, డైలాగ్ ఇన్డార్క్, క్యాబ్ ఫౌండేషన్, సీపెట్, డాన్వాస్కో టెక్నాలజీ, టీఎస్ ఆర్టీసీ సంస్థలతో అధికార యంత్రాంగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాంతాల వారీగా కోర్సులు ఇలా.. రియాసత్‌నగర్: ట్యాలీ,జీఎస్టీ, డీటీపీ, డిజైనింగ్ కోర్సులు అమీర్‌పేట: డీటీపీ, నెట్వర్కింగ్, హార్డ్‌వేర్ మలక్‌పేట, అంబర్‌పేట, నషేమాన్‌నగర్, హేజ్ బాబానగర్: టైలరింగ్ కోర్సులు విద్యానగర్, మీరాలం ట్యాంక్, బహదుర్ పురా, జూపార్క్: ఏసీ రిపేరింగ్, మొబైల్ సర్వీసింగ్, బ్యూటిషియన్. పెద్ద అంబర్‌పేట: లైఫ్ స్కిల్స్ (అంధులకు మాత్రమే) కోటి, దూద్‌బౌలి, బండ్లగూడ, గాగిల్లాపురం, రామాంతపూర్: హాస్పిటాలిటీ, బెడ్‌సైడ్ నర్సింగ్, రిటైల్ మార్కెటింగ్, ఎలక్ట్రానిక్, వెల్డింగ్, ఏసీ సర్వీసింగ్ తదితర 70 రకాల ట్రేడ్స్. హకీంపేట: లైట్ మోటార్ వెహికిల్, హెవీ వెహికిల్ డ్రైవింగ్ శిక్షణ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి: 86397 87489 ఎస్సీ కార్పొరేషన్ ఈడీ: 94899 05999 ఈసీఐఎల్ ప్రోగామింగ్ ఆఫీసర్: 99857 98828 అలీప్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 98498 02970 సెట్విన్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 98666 53908 ఏసీఈ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 94408 04858 పాలిటెక్నిక్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 99123 42001 క్యాప్ ఫౌండేషన్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 87989 69698 సీఐసీఈటీ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 99593 33415 డాన్బాస్కోటెక్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 99005 46572 టీఎస్ఆర్టీసీ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 73828 10023 టీఎస్ ఆర్టీసీ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 73828 00936 -
డొంక కదిలింది!
బ్యాక్లాగ్ పోస్టుల బురిడీ వెనుక ఉపాధి రాష్ట్ర శాఖ కార్యాలయానికి చెందిన అధికారి ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. ఈ కేసులో మొత్తం ముగ్గురు సూత్రధారులు కాగా ఒకరు పాత్రధారిగా తేలారు. ఉపాధి కల్పన శాఖలో ఓ చిరుద్యోగి పేరు తెరమీద కనిపిస్తున్నా... ఆ కార్యాలయంలో మరో ఉద్యోగి... రాష్ట్ర స్థాయి అధికారే కీలక వ్యక్తులనే విషయం తేటతెల్లమవుతోంది. బురిడీ రాకెట్ తీగ లాగితే మొత్తం డొంకంతా కదులుతోంది. ఈ అవినీతి దందా అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ విస్తరించడం విస్మయపరుస్తోంది. సాక్షి, అమరావతిబ్యూరో : బ్యాక్లాగ్ పోస్టుల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి రూ. 2 కోట్లు స్వాహా చేసిన కేసులో విజయవాడ ఉపాధి కల్పనా శాఖ కార్యాలయంలోని చిరుద్యోగి అయిన మహిళ కేవలం పాత్రధారి మాత్రమే. ఈ బురిడీ వ్యవహారం వెనుక చిత్రం స్పష్టంగా తెలిసిపోయింది. అదే కార్యాలయంలో ఉద్యోగ సంఘ నేతగా ఉన్న మరో ఉద్యోగి, మరో మధ్యస్థాయి అధికారి, కార్మిక శాఖ కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి దీనివెనుక సూత్రధారులుగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో భారీగా ముట్టజెప్పుకుని నిండా మునిగిన కొందరు బాధితులు ఆ మహిళా ఉద్యోగితో సంభాషణలను రికార్డు చేశారు. ఆ ఆడియో రికార్డుల్లో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. అదే కార్యాలయంలో పనిచేస్తున్న జిల్లా ఉద్యోగ సంఘ నేత చెబితేనే తాను ఆ డబ్బులు వసూలు చేశాను అని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. మరో వివాదాస్పద అధికారితోపాటు కార్మిక శాఖ కమిషరేట్ కార్యాలయంలో అధికారికి ఈ వ్యవహారం అంతా తెలుసుకదా అని ఆమె ధీమాగా చెప్పడం గమనార్హం. డబ్బంతా వారు తీసుకుని తనను మాత్రమే ఎందుకు నిలదీస్తారని ఆమె ప్రశ్నించడం విశేషం. డబ్బులు తీసుకున్నవారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు రంగం సిద్ధమవుతోందని కూడా ఆమె చెప్పారు. ఇక అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించిన తాము వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. వారికి ఆమె ధైర్యం చెబుతూ ఉద్యోగాలు వస్తాయి... గాబరా పడొద్దని అసలు సూత్రధారుల తరపున హామీ సైతం ఇచ్చారు. ఒక్క బందరులోనే పదిమంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి కూడా నిరుద్యోగులను నమ్మించి భారీగా వసూలు చేశారని స్పష్టమైంది. శాఖోపశాఖలుగా ... బ్యాక్లాగ్ పోస్టుల బురిడీ ఒక్క ఉపాధి కల్పనా శాఖకే పరిమితం కాలేదు. నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కట్టబెట్టేందుకు పక్కాగా రంగం సిద్ధం చేశారని స్పష్టమవుతోంది. దేవాదాయ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు ఫైళ్లు సిద్ధమయ్యాయి. పంచాయతీరాజ్, ఇతర శాఖల్లో కూడా అందరికీ ఉద్యోగాలు సర్దుబాటు చేయడానికి పన్నాగం పన్నారు. ఈ నెలాఖరునాటికి అన్ని సంతకాలు పూర్తయి ఆర్డర్లు వస్తాయని కూడా పాత్రధారి అయిన ఆ చిరుద్యోగి బాధితులకు చెప్పడం గమనార్హం. కేవలం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్యాక్లాగ్ పోస్టులను అడ్డగోలుగా కట్టబెట్టనున్నారన్న సమాచారం విస్మయం కలిగిస్తోంది. అంటే విజయవాడ కేంద్రంగా ఏర్పడ్డ ఈ రాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందనే విషయం స్పష్టమైంది. అందుకు కార్మిక శాఖ ప్రధాన కార్యాలయంలోని కొందరు అధికారుల సహకారంతోనే ఈ దందా దర్జాగా సాగిపోతోంది. విచారణ ఎలా సాగుతుందో...! బ్యాక్లాగ్ పోస్టుల దందా విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో జిల్లా అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. ఈ వ్యవహారంపై విచారణకు జాయింట్ కలెక్టర్, జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి, విజిలెన్స్, పోలీసు అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే బాధితులు ఫిర్యాదు చేయడంతోపాటు ఆడియో ఆధారాలు లభించాయి. మరి విచారణలో అసలు దోషులు బండారం బయటపడుతుందా ? రాజకీయ ఒత్తిడికి తలొగ్గి కేసును నీరుగారుస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. -
పరపతి ముద్ర ఉంటేనే రుణం
ధర్మవరం: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్రయోజన (పీఎంఎంవై) లక్ష్యం దిశగా అడుగులు పడటం లేదు. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారులు, తయారీ, సేవా, వాణిజ్య రంగాలకు, నిరుద్యోగులకు పూచికత్తు లేకుండా రుణాలు ఇవ్వాలి. జిల్లాలో 34 బ్యాంకులకు చెందిన 455 శాఖలు ఉన్నాయి. ఒక్కో శాఖనుంచి కనీసం 25 మందికి రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. దాని ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 15,470 మందికి రూ.50 వేలలోపు రుణాలు ఇవ్వాలి. ఇప్పటి వరకు లక్ష్యంలో 30 శాతం కూడా చేరుకోలేకపోయారు. కొన్ని బ్యాంకుల్లో బోణీ కరువు:మండల ప్రాంతాల్లో ఉన్న కొన్ని బ్యాంకుల్లో ఒక్క రుణం కూడా ఇచ్చి న దాఖలాలు లేవు. నూతనంగా ఏర్పాటు తమ శాఖలను ఏర్పాటు చేసిన కొన్ని బ్యాంకులైతే తాము ముద్ర రుణాలు ఇవ్వబోమని ఖరాకండిగా చెబుతున్నారు. మరి కొన్ని శాఖల్లో ఇవ్వలేమని చెప్పకుండా పదే పదే తిప్పుతున్నారు. పూచికత్తో, పలుకబడో ఉంటేనే.. పూచికత్తు లేకుండా 50 వేలరూపాయల రుణాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా బ్యాంకర్లు మాత్రం కచ్చితంగా హామీ కోరుతున్నారు. చిన్న వ్యాపారులు ఎవరైనా దీని గురించి తెలుసుకుని వెళ్లి అడిగితే మా లక్ష్యం అయిపోయింది వేరే బ్యాంకులో ప్రయత్నించండని సలహా ఇస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. రుణం కోసం ఇవి కావాలి.. = గుర్తింపు ధ్రువపత్రం (ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పాన్‌కార్డు, ఓటర్ గుర్తింపుకార్డు, పాస్‌పోర్టుల్లో ఏదో ఒకటి) = నివాస ధ్రువపత్రం(విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఇంటిపన్ను రసీదు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు వంటి చిరునామా ఉన్నవి ఏదైనా) = ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు–2 = కొనదలచిన యంత్ర సామగ్రి/ వ్యాపార సామాను/మూలధన పెట్టుబడికి ఉపయోగపడే కొటేషన్ = సప్లయర్ పేరుతో కూడిన సరుకుల వివరాలు = వ్యాపార సంస్థ గుర్తింపు/చిరునామా ధ్రువపత్రం, ఇటీవల లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం ఇతర పత్రాలు అందని ద్రాక్షే.. ముద్ర రుణాలు అందని ద్రాక్షలా మారాయి. అధికార పార్టీ వారికి, పలుకుబడి ఉన్న వారికి మాత్రమే బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తున్నారు. సాధారణ కార్మికులు మాత్రం ప్రైవేట్ ఫైనాన్సర్ల చేతిలో కాల్‌మనీ వేధింపులతో అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి అరులకు ముద్ర రుణాలు ఇప్పించాలి.– హైదర్‌వలి, ఆటోయూనియన్ జిల్లా అధ్యక్షుడు, ధర్మవరం -
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
కరీంనగర్ సిటీ: ఇండియన్ ఆర్మీలో ఉపాధి కోసం మేలో వరంగల్‌లో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువమంది ఎంపికయ్యేందుకు నిరుద్యోగ యువతకు వారధి, ఎన్సీసీ బెటాలియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. రన్నింగ్ అంబేద్కర్ స్టేడియంలో, క్యూటీ ఎస్సారార్ కళాశాలలో శిక్షణ ఇస్తారని తెలిపారు. ప్రతి కళాశాలలో ర్యాలీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంపికైనవారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. 8వతరగతి నుంచి ఇంటర్, బీఎస్సీ నర్సింగ్, ఎల్ఎల్బీ ఇంజినీరింగ్ విద్యాభ్యాసం చేసినవారు వివిధ విభాగాల్లో ఆర్మీలో చేరొచ్చని అన్నారు. వారధి సొసైటీ సెక్రటరీ ఆంజనేయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెఫ్ట్‌నెంట్ కల్నల్ ఉమాశంకర్ పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువతకు శిక్షణ
తాండూరు రూరల్ : నిరుద్యోగ యువతకు విభిన్నరంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని జినుగుర్తి గేటు సమీపంలో రూర్బన్ నిధులు రూ.2 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి ఆయన శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాండూరు ప్రాంతంలో యువతకు స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతీయువకులకు ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు ఈ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని ఆయన వివరించారు. పెళ్లికోసం అప్పు చేయొద్దు కూతురు పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేయొద్దని మంత్రి మహేందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన 79 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, ఎంపీపీ లక్ష్మమ్మ, జెడ్పీటీసీ రవిగౌడ్, తహసీల్దార్ రాములు, జినుగుర్తి సర్పంచ్ పాపమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు బాలమణి, నాయకులు రాంలింగారెడ్డి, శ్యామప్ప, శ్రీనివాస్‌గౌడ్, అమృత్‌రెడ్డి ఉన్నారు. -
నిరుద్యోగులను మోసం చేసిన ఘనత సీఎందే
నందికొట్కూరు: బాబు వస్తే జాబ్ వస్తుందని ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు హామీ ఇచ్చి నట్టేట ముంచేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే ఐజయ్య ధ్వజమెత్తారు. మంగళవారం పట్టణంలోని బసిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సత్యనారాయణ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని చెప్పిన సీఎం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయని తూతూ మంత్రంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విద్యావంతులు బాబు జిమ్మిక్కులను ఇక నమ్మరన్నారు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సైతం తొలగించిన చరిత్ర చంద్రబాబుదేనని తెలుసుకున్నారన్నారు. ఈమేళాకు హాజరైన నిరుద్యోగులందరికీ వారి విద్యా అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నరసింహులు, బసిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల డైరెక్టర్లు రమే‹ష్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జాన్ ఎలీషాబాబు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. లక్షల్లో టోకరా
సాక్షి, నాగోలు: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. లక్షల్లో నగదు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..గౌరీశంకర్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టు, పలు ప్రభుత్వ కార్యాలయాలలో అటెండర్, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానని హస్తినాపురం సెంట్రల్ ఇంద్రప్రస్త కాలనీకి చెందిన జి.చంద్రమోహన్‌తో పాటు మరికొంత మందిని నమ్మించి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పించక పోగా తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు చంద్రమోహన్, సందీప్, హరినాథ్, ఉమామహేందర్, రవికిరణ్, వినోద్‌గౌడ్, సరిత, భవాని, శ్రీనివాస్, శివ, సత్యనారాయణతో పాటు మరికొంత మంది కలిసి ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో గౌరీశంకర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గౌరీశంకర్ సుమారు రూ. 25 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
జెడ్పీలో ఉద్యోగాల పేరిట మోసం
ఒంగోలు: ప్రకాశం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగాల పేరిట మోసం చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కొందరు వ్యక్తుల ముఠా నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి ఉద్యోగ ఉత్తర్వులు అంటూ పలువురు నిరుద్యోగులను మోసం చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు షేక్ ఖాసిమ్ అనే వ్యక్తి సహా 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.31 లక్షల నగదు, డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
తెలంగాణ సర్కార్‌కు గుణపాఠం చెప్పాలి..
సాక్షి, హైదరాబాద్ : ఎంతోకాలంగా వాయిదా పడుతూ వస్తున్నకొలువుల కొట్లాట సభ సోమవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభం అయ్యింది. నిరుద్యోగులు సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సభకు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, విద్యావేత్త చుక్కా రామయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాంచంద్రరావు, టీడీపీ నేత ఎల్ రమణ తదితరులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని, ఈ సభను విజయవంతం చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు గుణపాఠం చెప్పాలన్నారు. సభకు రాకుండా ప్రభుత్వం ఇబ్బందులు , ఆటంకాలు కల్పిస్తుందని, విభేదాలు పక్కన పెట్టి అన్ని పక్షాలు ఐక్యమత్యంతో సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కోదండరాం మాట్లాడుతూ..‘మన చేపట్టబోయే కొలువులకై కొట్లాటను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్లు ప్రకటిస్తున్నదని , ఇది మన విజయం అని మన సభ ద్వారా తెలంగాణ ప్రభుత్వంకు ఒక సందేశం పంపాలని, వారికి మన సత్తా చాటి కనువిప్పు అయ్యేవిధంగా సభను విజయవంతం చేయాలి.’ అని కోరారు. అంతకు ముందు కోదండరాం... తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. మరోవైపు కొలువుల కొట్లాట సభ పోలీసుల నిఘా నీడలో జరుగుతోంది. పోలీసులు తనిఖీల తర్వతే సభా ప్రాంగణంలోకి అనుమతి ఇస్తున్నారు. ఇక కొలువుల కొట్లా సభకు వస్తున్న విద్యార్థులు, నిరుద్యోగుల అక్రమ అరెస్ట్‌లను టీజేఏసీ నేతలు తీవ్రంగా ఖండించారు. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు సభా కార్యక్రమాలను ప్రారంభించి, సాయంత్రం 6 వరకు నిర్వహిస్తామని జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే. సభ కోసం సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా జరిగిన సంఘటనలు, ఉద్యమ ఘట్టాలు, జేఏసీ నిర్వహించిన పాత్ర వంటివాటిని గుర్తు చేసేలా పాటలను రూపొందించారు. -
‘ఆ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే’
సాక్షి, విజయవాడ : ఏపీని ఆత్మహత్యల ప్రదేశ్‌గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పైలా సోమినాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నిరుద్యోగ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. యువత భయపడొద్దు. వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుంది. నిరుద్యోగుల ఆత్మహత్యలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు. ఇప్పటివరకూ రైతులు, చేనేత, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకన్నారు. ఇప్పుడు విద్యార్థులు బలవంతపు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు నివారించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. ఏపీలో విద్యా వ్యవస్థ కార్పొరేట్‌మయమైపోయింది. మంత్రులు వైఎస్ జగన్‌ను విమర్శించడానికే తప్ప...రాష్ట్ర సమస్యలపై స్పందించడం లేదు.’ అని మండిపడ్డారు. -
లెక్క తేలని నిరుద్యోగులు
కర్నూలు(రాజ్‌విహార్) : ‘ఎమ్మిగనూరుకు చెందిన అశోక్ రెండేళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. సామాన్య కుటుంబానికి చెందిన ఇతడు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీం కింద చదువుకొని పట్టా తీసుకున్నాడు. తన వివరాలను జిల్లా ఉపాధి కల్పన శాఖలో నమోదుకు వెళ్తే.. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరోలో నమోదు చేసుకోవాలని సూచించారు ఇక్కడి అధికారులు. దీంతో అక్కడికి వెళ్లే స్థోమత లేక వెనుదిరిగాడు’. ఈ సమస్య అశోక్ కుమార్ ఒక్కడి దే కాదు.. జిల్లాలో వేలాది మంది పట్టభద్రులు ఎదుర్కొంటున్నా సమస్య. ఇటు ఉపాధి కల్పన శాఖపైన నమ్మకం సన్నగిల్లడంతో ‘రిజిస్ట్రేషన్ చేయిస్తే ఏం ఉద్యోగాలొస్తాయిలే’ అనే అసంతృప్తిలో నిరుద్యోగులున్నారు. నిరుద్యోగుల వివరాల నమోదుకు జిల్లాలో ఎలాంటి విభాగం లేకపోవడంతో ఎంత మంది ఉన్నారనే పూర్తి సమాచారం లేకుండా పోయింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు ఏర్పాటు చేసిన ఎంప్లాయ్మెంట్ ఎక్ఛేంజ్లోనే పట్టభద్రుల వివరాలు లేవంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోంది. సాధారణ డిగ్రీలందుకున్న విద్యార్థులకు మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకునే వీలుంది. కానీ కొన్నేళ్లుగా ఎలాంటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన దాఖలాలు లేకపోవడంతో ఈ శాఖపై నిరుద్యోగులకు నమ్మకం లేకుండాపోయింది. ‘ఉన్నత’ పట్టా ఉంటే తిరుపతి ప్రయాణం జిల్లా ఉపాధి కల్పన కేంద్రంలో కేవలం టెన్త్, ఇంటర్, యూజీ(అండర్ గ్రాడ్యుయేట్) పూర్తి చేసుకున్న వారికి మాత్రమే రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంది. ఇక పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేట్)తో పాటు ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న వారి వివరాలు ఇక్కడి ఎంప్లాయ్మెంట్ ఎక్ఛేంజ్‌లో నమోదు చేసుకునే వీలు లేదు. వీరు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయ్మెంట్ బ్యూరోలో వివరాలను నమోదు చేసుకోవాలి. అయితే ఇక్కడ, అక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకొని ఏళ్ల తరబడి ఎదురుచూసే నిరుద్యోగులకు ఎలాంటి కాల్ లెటర్లు అందకపోవడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాకపోవడంతో నిరుద్యోగులు ఆ శాఖపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఫలితంగా కొందరు రెన్యూవల్స్ చేయించుకోవడం మానేయగా, మరికొందరు అసలు నమోదు చేయించుకోవడానికే ఇష్టపడటంలేదు. వేలల్లో పట్టాలు.. కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీతో పాటు కృష్ణదేవరాయ, ఉర్దూ, ఎస్వీ, అంబేడ్కర్, యోగి వేమన, డ్రావిడియన్, పొట్టి శ్రీరాములు, ఉస్మానియా, తదితర యూనివర్సిటీల నుంచి ఏటా వేళల్లో డిగ్రీ, పీజీల పట్టాలు పొందుతున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీలు, బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్, పీహెచ్డీ ఇలా అనేక విభాగాల్లో పట్టాలు పొందినవారున్నారు. వీరిందరు కలిసి దాదాపు లక్షల్లో ఉన్నారు. అయితే వీరి వివరాలే ప్రభుత్వం వద్ద లేనప్పుడు నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన లాంటి సంక్షేమ పథకాల అమలు ఎలా సాధ్యమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నంద్యాల ఎన్నికల ముందు భృతిపై హడావిడి.. నంద్యాల ఉప ఎన్నికల ముందు నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం హడావిడి చేసింది. ఓట్ల లబ్ధి కోసం మంత్రి వర్గం సమావేశమై చర్చించింది. ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. 7601 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. ఉపాధి కల్పన కార్యాలయంలో ఇప్పటి వరకు 7601 మంది మాత్రమే వారి వివరాలు నమోదు చేసుకున్నారు. పీజీలు, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ ఆపై డిగ్రీల పట్టాలు పొందిన వారి వివరాలు నమోదు చేసుకునే సౌకర్యం ఇక్కడ లేదు. అలాంటి వారు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో నమోదు చేసుకోవాలి. -ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి -
నిరుద్యోగ యువతకు నష్టం ఉండదు
వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టుకు ‘సింగరేణి’ నివేదన సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న వారి వారసులకు ఉద్యోగాలు కల్పించడం వల్ల నిరుద్యోగ యువతకు ఎటువంటి నష్టం ఉండదని సింగరేణి కాలరీస్ ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. బొగ్గు గని కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే వారి వారసులకు ఉద్యోగాలిస్తున్నామంది. ఈ పథకమేమీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదని, 1981 నుంచి అమల్లో ఉందని వివరించింది. సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కె.సతీశ్‌కుమార్ హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, సింగరేణి కాలరీస్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ (పర్సనల్) ఎ.ఆనందరావు కౌంటర్ దాఖలు చేశారు. కార్మికులు భూమిలో 400 మీటర్ల లోతులో పనిచేస్తుంటారని, అందువల్ల వారు తరచూ అనారోగ్యానికి గురవుతుంటారన్నారు. 2017 ఫిబ్రవరి నాటికి 5,875 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పదవీ విరమణ పథకం ద్వారా భర్తీ చేసే పోస్టులకు, ప్రత్యక్ష విధానం ద్వారా భర్తీ చేసే పోస్టులకు సంబంధం లేదన్నారు. కనుక ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని అభ్యర్థించారు.