తాండూరు రూరల్ : నిరుద్యోగ యువతకు విభిన్నరంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని జినుగుర్తి గేటు సమీపంలో రూర్బన్ నిధులు రూ.2 కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణానికి ఆయన శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాండూరు ప్రాంతంలో యువతకు స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతీయువకులకు ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు ఈ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని ఆయన వివరించారు.
పెళ్లికోసం అప్పు చేయొద్దు
కూతురు పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేయొద్దని మంత్రి మహేందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన 79 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, ఎంపీపీ లక్ష్మమ్మ, జెడ్పీటీసీ రవిగౌడ్, తహసీల్దార్ రాములు, జినుగుర్తి సర్పంచ్ పాపమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు బాలమణి, నాయకులు రాంలింగారెడ్డి, శ్యామప్ప, శ్రీనివాస్‌గౌడ్, అమృత్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment