tandoor
-
నాగర్ కర్నూల్: ఈదురుగాలుల బీభత్సం.. గోడ కూలి నలుగురు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: తాడూరు మండలం ఇంద్రకల్లో విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షం కూలీ కుటుంబాల బతుకులను చేసింది. ఈ విషాద సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఆదివారం సాయంత్రం అకాలంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తాకిడికి గ్రామంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల షెడ్డు కూలి నలుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరి కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.ఇంద్రకల్ గ్రామంలో కోళ్ల ఫారం నిర్మాణానికి 6 మంది కూలీలు వెళ్లారు. గోడలు కడుతుండగా ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది పని ముగించుకొని నిర్మాణంలో ఉన్న గోడ పక్కనే కూర్చున్నారు. తీవ్రమైన ఈదురుగాలులతో ఒక్కసారిగా గోడకూలి కూలీలపై పడింది. దీంతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
సాక్షి, వికారాబాద్: జిల్లోలోని తాండూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెంపుడు కుక్క స్వైర విహారం చేసింది. తాండూరు పట్టణం బసవేశ్వర నగర్‌కు చెందిన దత్తు, లావణ్య దంపతుల కుమారుడు ఐదు నెలల పసి కందును పెంపుడు కుక్క పీక్కుతింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పెంపుడు కుక్కను చంపేశారు. తాండూరు పట్టణం బసవేశ్వర నగర్లో ఘటన చోటుచేసుకుంది. -
జీఐ జర్నల్‌లో తాండూరు కంది ప్రత్యేకతలు
సాక్షి, హైదరాబాద్: గతేడాది డిసెంబర్లో తెలంగాణ నుంచి భౌగోళిక గుర్తింపు (జీఐ) సాధించిన వికారాబాద్ జిల్లా తాండూరు కందికి సంబంధించిన ప్రత్యేకతలను తాజాగా కేంద్రం ‘జీఐ జర్నల్’లో పొందుపరిచింది. వండిన పప్పు ఎక్కువకాలం నిల్వ ఉండటం, తొందరగా ఉడకడం, మంచి రుచి, వాసన తాండూరు కంది ప్రత్యేకతలని పేర్కొంది. అలాగే సానుకూల వాతావరణ పరిస్థితులు, రైతులు ఆచరించే సంప్రదాయ, ఆధునిక యాజమాన్య సాగు పద్ధతుల మూలంగా దీనికి ప్రత్యేక గుర్తింపు లభించిందని వివరించింది. తాండూరు ప్రాంతంలో ఉన్న సున్నపురాయి నిక్షేపాల వల్ల వచ్చే పోషక నాణ్యతలే దీనికి కారణమని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలలో 1.48 లక్షల ఎకరాల్లో కంది సాగు జరుగుతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు కోసం వివిధ రంగాల నుంచి వెయ్యి దరఖాస్తులు రాగా వాటిలో 432 ఉత్పత్తులకు మాత్రమే భౌగోళిక గుర్తింపు లభించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ఏర్పడ్డాక ఆరింటికి.. తెలంగాణ ప్రాంతానికి చెందిన మొత్తం 16 ఉత్పత్తులకు ఇప్పటివరకు జీఐ హోదా లభించగా వాటిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆరు ఉత్పత్తులు ఈ ఘనత సాధించాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ హోదా పొందిన వాటిలో పుట్టపాక తేలియ రుమాలు (2015), బంగినపల్లి మామిడి (2017), ఆదిలాబాద్ ఢోక్రా, వరంగల్ డురీస్ (2018), నిర్మల్ పెయింటింగ్ (2019), తాండూరు కంది (2022) ఉన్నాయి. తాజాగా తాండూరు కంది భౌగోళిక గుర్తింపు సాధించిన నేపథ్యంలో ఆ ప్రాంత రైతులు, వ్యవసాయ విద్యాలయం సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్, కంది పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్‌లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందించారు. ఈ నెల 31న కంది పరిశోధనా కేంద్రంలో తాండూరు రైతులు, శాస్త్రవేత్తలను అభినందిస్తామని ఆయన పేర్కొన్నారు. -
విహారంలో విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి వైద్య విద్యార్థి మృతి
తాండూరు: అమెరికాలోని మిస్సౌరిలో వైద్యవిద్య అ భ్యసిస్తున్న తాండూరు విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన అపెక్స్ ఆస్పత్రి యజమాని వెంకటేశం, జ్యోతి దంపతుల రెండో కుమారుడు శివదత్తు (25) వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు. శివదత్తు సెయింట్ లూయిస్ వర్సిటీలో డెంటల్ ఎంఎస్ విద్య అభ్యసిస్తున్నాడు. శనివారం దత్తు స్నేహితుడితో కలిసి ఓజార్క్ సరస్సుకు వెళ్లాడు. సరస్సులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు. విషయం తెలిసి మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. (చదవండి: దంత ఆరోగ్యంపై తలసరి ఖర్చు 4 రూపాయలే!) -
రౌడీషీటర్లకు కార్పెట్ వేస్తావా.. అంతుచూస్తా
సాక్షి, తాండూరు: ‘రౌడీషీటర్లకు కార్పెట్ వేస్తావా..? ఎంత ధైర్యం? నీ అంతు చూస్తా!’ అంటూ తాండూరు సీఐపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివా దాస్పద మయ్యాయి. 3 రోజుల క్రితం జరిగిన భావిగి భద్రేశ్వర జాతరకు ముందుగా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. అరగంట తర్వాత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వచ్చారు. దాంతో మరో కార్పెట్ వేసి ఎమ్మెల్యేను కూర్చోబెట్టారు. ఇదే మహేందర్‌రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. ప్రొటోకాల్ ఎందుకు పాటించలేదని సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి మహేందర్‌రెడ్డి బూతులు తిట్టారు. ‘నా ముందే రౌడీషీటర్లకు కార్పెట్ ఎలా వేస్తావు’ అని సీఐని నిలదీశారు. ‘రౌడీషీటర్లు ఎవరు ?’ అని సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్యే పక్కన ఉన్నవారంతా వారేనంటూ దుర్భాషలాడారు. ఎమ్మెల్యే రౌడీషీటరా అంటూ సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్సీ మళ్లీ తీవ్ర పదజాలం ఉపయోగించారు. మంచిగా మాట్లాడాలని సీఐ ఎమ్మెల్సీని కోరగా.. ‘నువ్వు ఇసు క అమ్ముకొంటలేవా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ అమ్ముకొంటున్నాన ని సీఐ ప్రశ్నించగా.. త్వరలో పట్టిస్తానని ఫోన్ కట్ చేశారు. సీఐని దూషించిన కేసులో మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు వికారాబాద్ ఎస్పీ తెలిపారు. అధికారులకు ఆడియో తలనొప్పి... జాతర సందర్భంగా జరిగిన తప్పిదాలు పోలీసు ఉన్నతాధికారులకు సమస్యలను తెచ్చిపెట్టాయి. ప్రొటోకాల్ ప్రకారం బందోబస్తు నిర్వహించడంలో విఫలం అయ్యారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఎమ్మెల్సీ, సీఐల మధ్య ఫోన్ సంభాషణ ఆడియో బయటకు రావడం కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టింది. ఈ విషయమై తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ రాజేందర్‌రెడ్డిలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. మహేందర్ రెడ్డిని అడగ్గా.. ‘పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి ప్రొటోకాల్‌ను పాటించట్లేదు. ఫోన్లో నేను తిట్టింది వాస్తవమే’ అని తెలిపా రు. తాండూరు సీఐని మహేందర్‌రెడ్డి దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ క్షమా పణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి కరోనా పాజిటివ్
తాండూరు: ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో శనివారం పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణయింది. దీంతో హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇటీవల తనను కలసిన వారంతా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
RIP మ్యాగీ అంటున్న నెటిజన్లు.. కారణం ఇదే..
ఫుడ్.. ఈ పేరు వింటనే చాలా నోరూరుతోంది. స్నాక్స్, స్వీట్స్, హాట్, డిషెస్ ఇలా వంటకం ఏదైనా.. ఫుడ్‌ను ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కో వంటకం నచ్చుతుంది. మరికొందరికి కొత్త వంటకాలు టేస్ట్ చేయడం అంటే పిచ్చి. ఏ హోటల్, రెస్టారెంట్‌కు వెళ్లినా, అక్కడ ఉన్న కొత్త వంటకాన్ని రుచి చూడాలనుకుంటారు. ఇలాంటి వారి కోసం రెండు మూడు పదార్థాలను కలిపి ఢిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్‌ను తయారు చేస్తుంటారు. వీటిని యూట్యూబ్ ద్వారా ఆహార ప్రియులకు షేర్ చేస్తుంటారు. చదవండి: Anand Mahindra: నీ పాటతో ఆ గ్యారేజికి ప్రాణం పోశావ్! ఇలా రకరకాల స్ట్రీట్ ఫుడ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చక్కగా ఉంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు. అయితే అన్నీసార్లు ఇవి సక్సెస్ కాలేవు. కొన్నిసార్లు బెడిసికొడుతుంటాయి. తాజాగా అలా తయారైన తందూరీ మ్యాగీపై నెటిజన్ల నుంచి నెగెటివ్ రియాక్షన్ వస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను అనికైత్ లూత్రా అనే యూట్యూబ్ ఛానెల్లో డిసెంబర్ 20న పోస్ట్ చేశారు. ఇందులో ముందుగా మట్టి పాత్రలను కొలిమిలో కాల్చి అందులో నుంచి ఓ పాత్రను పైకి తీసి గిన్నెలో పెట్టారు. అది మండుతూ ఎర్రగా ఉంది. అప్పుడు దానికి వెన్నను అంటించారు. వెంటనే అది కొవ్వొత్తిలా కాలి మంట వచ్చింది. చదవండి: వలస రాజహంసలు ఒకేచోట సందడి చేశాయి: క్యూట్ వైరల్ వీడియో!! అప్పుడు కాస్తా ఉడికించిన మ్యాగీని అందులో పోశారు. వెంటనే అది కుతకుతా ఉడుకుతూ.. డాన్స్ చేసినట్లు కనిపిస్తుంది. అంతే తందూరీ మ్యాగీ రెడీ. దీనిని ఇప్పటివరకు 32 లక్షల మందికి పైగా చూశారు. దీనిని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘రెస్ట్ ఇన్ పీస్ . మ్యాగీ ఆత్మ శాంతించాలి. డిసెంబర్ 31 లాగా మ్యాగీ డ్యాన్స్ చేస్తోంది. చెడగొట్టారు. ఎంత అందంగా కనిపిస్తోంది అనే దానిపై ఫోకస్ పెడుతున్నారే తప్ప రుచిపై పెట్టట్లేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ మీరూ ఈ వంటకాన్ని చూసేయండి.. చదవండి: కూతురుతో కలిసి అదిరిపోయే స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా -
బిగ్‌బాస్ నుంచి ఢీ 13 వరకు: తాండూరు మెరికలు.. బుల్లి తెరపై మెరుపులు
తాండూరుకు చెందిన యువ కళాకారులు బుల్లితెరపై తళుక్కున మెరుస్తున్నారు. ప్రఖ్యాత టెలివిజన్ షోలల్లో సత్తాచాటుతూ జిల్లాకు మంచి పేరు తెచ్చిపెడుతున్నారు. వీరిలో ఒకరు ఢీ– 13లో టైటిల్ సాధించగా, మరొకరు గతేడాది నిర్వహించిన బిగ్‌బాస్– 4లో టాప్– 5 ఫైనలిస్ట్ల్లో నిలిచారు. టాలెంట్ ఎవరి సొత్తూ కాదని ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు. తాండూరు టౌన్: పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన దువచర్ల మహేశ్– పద్మావతి దంపతుల కూతురు కావ్యశ్రీ ఇటీవల ముగిసిన ఢీ– 13 విన్నర్‌గా నిలిచింది. కావ్యశ్రీ తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి నలుగురు ఆడపిల్లలు. అమ్మాయిలు ఇంటికే పరిమితం కావాలనే ధోరణి నుంచి వారికి నచ్చిన రంగాల్లో రాణించేలా పిల్లలను ప్రోత్సహించారు. దీంతో కావ్యశ్రీ తనకిష్టమైన డ్యాన్స్‌ను ఎంచుకుంది. ప్రస్తుతం తాండూరులోని భాష్యం జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కావ్యశ్రీ ఓ శుభకార్యంలో చేసిన డ్యాన్స్‌ను చూసిన మాస్టర్ ఆమెకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఢీ షో కోసం సైడ్ డ్యాన్సర్‌గా చేరింది. మాస్టర్ పల్టీ రవి ఆధ్వర్యంలో అక్కడే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. 2015లో ఢీ– జూనియర్స్ సీజన్– 2లో గ్రూప్ డ్యాన్సర్‌గా చేసింది. తల్లిదండ్రులతో కావ్యశ్రీ అనంతరం ఢీ– 13లో కంటెస్టెంట్‌గా వైల్డ్‌కార్డు ఎంట్రీతో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి వెనుకడుగు వేయకుండా తన డ్యాన్స్‌లతో అదరగొట్టి, ఫినాలేలోకి అడుగు పెట్టింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమె ఈనెల 8వ తేదీన నిర్వహించిన ఢీ–13 ఫైనల్లో విన్నర్‌గా నిలిచింది. సినీ హీరో అల్లు అర్జున్ చేతుల మీదుగా టైటిల్‌తో పాటు ప్రైజ్ మనీ అందుకుంది. } ఢీ–13లో స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తున్న కావ్యశ్రీ మంచి కొరియోగ్రాఫర్ కావడమే లక్ష్యం చిన్ననాటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. అదృష్టవశాత్తు ఢీ– 13లో అవకాశం దక్కింది. నన్ను ప్రోత్సహించిన డైరెక్టర్ శ్రీకాంత్, మాస్టర్లు శ్రీను, రాముకు రుణపడి ఉంటా. ఫైనల్లోకి ప్రవేశించి.. టైటిల్ సాధించడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మంచి కొరియోగ్రాఫర్‌గా రాణించాలనేదే నా లక్ష్యం. – కావ్యశ్రీ, ఢీ– 13 టైటిల్ విన్నర్ బిగ్‌బాస్ షోలో అదరగొట్టిన అరియానా గతేడాది జరిగిన బిగ్‌బాస్– 4 రియాల్టీ షోలో తాండూరు అమ్మాయి అరియానా గ్లోరీ మెరిసింది. 105 రోజుల పాటు కొనసాగిన ఈ పోటీలో టాప్– 5 పోటీదారుల్లో నిలిచింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్ వరకు గట్టి పోటీ ఇచి్చంది. తాండూరు మండలం అంతారానికి చెందిన సత్యనారాయణ, శశికళ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. సత్యనారాయణ ఫొటోగ్రాఫర్ కాగా శశికళ నర్స్‌గా పనిచేసి రిటైరయ్యారు. వీరి చిన్న కూతురు అరియానా ఇంటర్ వరకు తాండూరులో అభ్యసించింది. కూకట్‌పల్లిలోని ప్రగతి కళాశాలలో డిగ్రీ చదివింది. తాండూరులో అభిమానులకు అభివాదం చేస్తున్న అరియానా (ఫైల్) అల్లు అర్జున్ చేతుల మీదుగా క్యాష్ ప్రైజ్ తీసుకుంటున్న కావ్యశ్రీ చిన్ననాటి నుంచి చురుకైన అమ్మాయిగా పేరున్న అరియానా తనలోని ప్రతిభను చాటిచెప్పాలనే లక్ష్యంతో హైదరాబాద్ చేరుకుంది. స్టూడియో వన్, జెమినీ కామెడీ, కెవ్వు కేక, జింగ్ జింగ్ అమేజింగ్ తదితర టీవీ షోలకు వ్యాఖ్యాతగా పనిచేసింది. తన కళాత్మక దృష్టిని యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయం చేసింది. ఈ క్రమంలో బిగ్‌బాస్– 4 నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. తొలిరోజు నుంచి తన చురుకైన∙ప్రదర్శనలతో టాప్ ఫైవ్ అభ్యర్థుల్లో నిలిచింది. బిగ్‌బాస్‌లో వచ్చిన ప్రైజ్‌మనీతో ఇల్లు కట్టుకోవడంతో పాటు గ్రామంలోని రైతులకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పడం విశేషం. ప్రస్తుతం టీవీ కార్యక్రమాలకు యాంకర్‌గా చేస్తున్న అరియానా మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిద్దాం. -
దొంగ ఓటు వేసిన తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న
-
కొండా బర్త్‌డే: కాంగ్రెస్‌లో ‘కేకు’ రగడ..
తాండూరు టౌన్: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ నేతల మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కొండా జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేయాలని నాయకులు ముందుగా భావించారు. అయితే కార్యకర్తలు, నేతలు అందరూ రాకముందే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్‌మహరాజ్ కేక్ కట్ చేశారు. దీంతో ఆగ్రహించిన పార్టీ నేత ఖయ్యూం రమేష్‌మహరాజ్‌తో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలందరి సమక్షంలో వేడుకలు నిర్వహిస్తే బాగుండేదని, కొందరి సమక్షంలో తూతూ మంత్రంగా జరపడం సరికాదన్నారు. తాను అత్యవసర పనిమీద వెళ్లాల్సి ఉందని, ఉందని, మరో పెద్ద కేకు తీసుకొస్తారని, దానిని కట్ చేసి వేడుకలు నిర్వహించుకోవాలని రమేష్ మహరాజ్ చెప్పడంతో వాగ్వాదం మరింత ముదిరింది. ఎవరికి వారే నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని పలువురు నేతలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో రమేష్ మహరాజ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మరో కేక్ తీసుకొచ్చి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు అలీం, బస్వరాజ్, మల్లికార్జున్, ప్రభాకర్‌గౌడ్, వరాల శ్రీనివాస్‌రెడ్డి, లింగదల్లి రవి, షుకూర్ పాల్గొన్నారు. చదవండి: ముగ్గురు మంత్రులు.. 3 జిల్లాలు అందమైన యువతుల ఫొటోలతో ఎర, గొంతులు మార్చి.. -
రోడ్డు ప్రమాదం: దుఖఃసాగరంలో తాండూర్
సాక్షి, తాండూర్(అదిలాబాద్): నిశీధి వేళ జరిగిన రోడ్డు ప్రమాదం మంచిర్యాల జిల్లా తాండూర్‌లో తీరని విషాదాన్ని నింపింది. ఒకే ప్రమాదంలో ముగ్గురు బలికావడంతో వారి కుటుంబాలను దుఖఃసాగరంలో ముంచింది. అవసరం నిమిత్తం హైదరాబాద్‌కు కారులో బయలుదేరిన ఆ ముగ్గురు వ్యక్తులకు ఆ ప్రయాణమే చివరి మజిలీ అయింది. గురువారం వేకువజామున సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, మంచిర్యాల జిల్లా సర్పంచ్ల ఫోరం అ«ధ్యక్షుడు కొండు అంజిబాబు (33), టీఆర్ఎస్ యువజన నాయకుడు ఇడిదినేని గణేష్ (27), మరో యువకుడు అంగల సాయిప్రసాద్ (27) సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మరో యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. రోడ్డును ఆనుకుని ఆగి ఉన్న ట్యాంకర్‌ను కారు ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. హైదరాబాద్‌కు బయలుదేరి.. తాండూర్ సర్పంచ్ అంజిబాబు ఓ పని నిమిత్తం తన మిత్రుడు గణేష్‌తో కలిసి అతడి కారులో బుధవారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ బయలుదేరారు. అదే సమయంలో వారి మిత్రుడు అంగల సాయిప్రసాద్ తన తల్లి వైద్యానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎన్వోసీ తీసుకురావడం కోసం ఆ ఇద్దరితోపాటు అదే కారులో ఎక్కాడు. డ్రైవింగ్ నిమిత్తం బానేష్ అనే వ్యక్తిని వెంట తీసుకెళ్లినప్పటికీ గణేష్ కారు నడిపాడు. కారు ప్రజ్ఞాపూర్ వద్దకు చేరుకోగానే రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ట్యాంకర్ లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు స్నేహితులు మృత్యు ఒడికి చేరడం కలిచివేసింది. బానేష్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఘటనాస్థలికి వెళ్లిన నాయకులు, స్నేహితులు ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన ప్రజ్ఞాపూర్‌కు బయలుదేరి వెళ్లారు. పోస్టుమార్టం, ఇతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని సాయంత్రం వరకు మృతదేహాలను తాండూర్‌కు తీసుకొచ్చారు. అందరితో కలుపుగోలుగా ఉండే అంజిబాబు, గణేష్, సాయిప్రసాద్ మరణవార్త విని తాండూర్ మండలం శోకసంద్రంలో మునిగిపోయింది. వీరి మృతదేహాలను చూసేందుకు బంధువులు, మిత్రులు, స్థానిక నాయకులు వేలాదిగా తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పలువురు ప్రముఖులు వీరి మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారును పరిశీలిస్తున్న సర్పంచ్‌లు చేతికి అందివచ్చాడనుకుంటే.. తాండూర్‌కే చెందిన ఇడిదినేని కమల, చంద్రయ్యకు ఇద్దరు కుమారులు. గణేష్ పెద్దవాడు. మొదటి నుంచి అన్నింటా ముందుండే గణేష్ రాజకీయం వైపు మళ్లాడు. తండ్రి చంద్రయ్య సింగరేణి ఉద్యోగాన్ని గణేష్‌కు పెట్టిద్దామనుకునే సమయంలో విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదం రూపంలో గణేష్‌ను కబలించి ఆ కుటుంబంలో ఎనలేని విషాదాన్ని నింపింది. రాజకీయాల్లో రాణిస్తూ.. తాండూర్‌కు చెందిన కొండు సత్తమ్మ, భీమయ్యకు ఇద్దరు కుమారులు. నలుగురు కుమార్తెలు. అంజిబాబు నాలుగో సంతానం. విద్యాభాస్యం పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌లో మెడికల్ ఏజెన్సీతోపాటు పలు వ్యాపారాలు నిర్వహించారు. యూనివర్సిటీ రాజకీయాల నుంచి ప్రేరణ పొంది, అదే స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో స్వగ్రామమైన తాండూర్‌కు చేరారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. 20 నెలల్లోనే ప్రజలతో మమేకమై గ్రామ పంచాయతీ అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రజల మదిలో తనదైన ముద్ర వేసుకున్నారు. కొద్దిరోజుల్లోనే రాజకీయాల్లో ఎదిగి అంతే అనతికాలంలో అంజిబాబు కానరాని లోకానికి వెళ్లడాన్ని ప్రజలు జీర్ణించుకోలేపోతున్నారు. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న అంజిబాబుకు ఒక కుమార్తె ఉంది. అంజిబాబు మరణంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. పాడెమోసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం తాండూర్ చేరుకుని అంజిబాబు, గణేష్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా అంజిబాబు, గణేష్ పాడె మోశారు. అంజిబాబు, గణేశ్ టీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవలు, వారితో తనకున్న సాన్నిహిత్యాన్ని ఎమ్మెల్యే గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ అంజిబాబు, గణేష్ మృతదేహాలకు నివాళులర్పించారు. వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అంతిమయాత్రలో జెడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంజిబాబు పాడె మోస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య మాకు దిక్కెవరు బిడ్డా..! తాండూర్‌కే చెందిన అంగల విజయ, చంద్రయ్యకు సాయిప్రసాద్, ఇద్దరు కూతుళ్లు సంతానం. సాయిప్రసాద్ చిన్నతనంలోనే తండ్రి మృతి చెందడంతో ఆ కుటుంబబాధ్యత తల్లిపై పడింది. పిల్లలను పెంచి పెద్ద చేసి విశ్రాంతి తీసుకుందామనుకున్న సమయంలో అనుకోని దుర్ఘటన జరిగింది. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తూ.. కుటుంబబాగోగులు చూసుకుంటున్న సాయిప్రసాద్ అనుహ్యంగా మరణించడంతో ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. ‘ఇక మాకు దిక్కెవరు బిడ్డా..’ అని ఆ తల్లి రోదించిన తీరు అందరిని కలిచివేసింది. -
బాలికపై యువకుడి అత్యాచారం
తాండూరు: తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ ఫొటోలు చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల విద్యార్థిని తాండూరు శివాజీచౌక్‌లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. తాండూరు మండలం దస్తగిరిపేట్‌కు చెందిన యువకుడు పవన్ స్థానికంగా కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం బాలికను ప్రేమపేరుతో నమ్మించి కారులో హైదరాబాద్ తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం తన వద్ద ఉన్న బాలిక ఫొటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేసే యత్నం చేశాడు. దీంతో బాధితురాలు కుటుంబీకులతో కలసి నవంబర్ 8న తాండూరు పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేసింది. అయితే కొందరు రాజీకి యత్నించడంతో పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారు. దీంతో వారం తర్వాత బాధితురాలు తాండూరు డీఎస్పీని ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అనంతరం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు మరో ఇద్దరు బాలికలను కూడా వేధించాడని సమాచారం. బాలికపై అత్యాచారం జరిగినా కేసు నమోదులో జాప్యం చేయడం, నిర్లక్ష్యం వహించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. -
మా పొట్ట కొట్టకండి
తాండూరు టౌన్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులమంతా సమ్మె చేస్తుండగా, తాత్కాలిక ఉద్యోగులుగా చేరి మా పొట్ట కొట్టకండని ఆర్టీసీ కార్మికులు వేడుకున్నారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న కార్మికులను పట్టించుకోకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తున్న విషయం విదితమే. 18వ రోజుకు చేరిన సమ్మెలో భాగంగా మంగళవారం ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్ష నేతలు, ప్రజా, కుల సంఘాల నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారి వద్దకు వెళ్లి వారికి గులాబీ పువ్వులను అందించారు. ఆర్టీసి బలోపేతానికి, ఉద్యోగ భద్రతకు, ఖాళీ ఉద్యోగాల భర్తీ కోసం సమ్మె చేస్తున్నామని, దీనికి విరుద్ధంగా మీ స్వలాభం కోసం విధులకు హాజరవుతూ మా పొట్టలు కొట్టొద్దని వేడుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయితే కొత్త నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. మీరంతా శాశ్వత ఉద్యోగులుగా మారొచ్చని హితవు పలికారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం కావాలనే తాత్కాలిక ఉద్యోగులను తీసుకుందన్నారు.కార్మికులపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం మానేయాలని, ఇకనైనా హైకోర్టు ఆదేశాలను శిరసావహించి కార్మిక సంఘాల జేఏసీ నేతలను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరి వీడకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నిరసన కార్యక్రమంలో టీజేఎస్ నేత సోమశేఖర్, టీజేఎంయూ డిపో గౌరవాధ్యక్షుడు పటేల్ విజయ్, బీజేపీ నేతలు కృష్ణముదిరాజ్, భద్రేశ్వర్, సీపీఎం నేత శ్రీనివాస్, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అంజిలయ్య, గోపాల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్లకు పిలిచి.. పట్టించుకోలేదు
తాండూరు: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (కుని) శిబిరం నిర్వహణ లోపంతో గందరగోళంగా నెలకొంది. ఆపరేషన్లు చేస్తామని గ్రామాల నుంచి మహిళలను రప్పించారు. తీరా టార్గెట్ పూర్తయిందని వైద్యులు ఆపరేషన్లను నిలిపి వేశారు. దీంతో మహిళలు, మహిళల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రి పీపీ యూనిట్ విభాగంలో సోమవారం పెద్దేములో మండలానికి చెందిన మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు శిబిరం ఏర్పాటు చేశారు. దీంతో పలు గ్రామాల నుంచి మహిళలు కుటుంబసభ్యులతో వచ్చారు. పీపీ యూనిట్ ఇన్చార్జి శ్రీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో గైనకాలజిస్ట్ జయమాలిని, అనస్థిషియా సాకేత్‌తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యులు మరియాఆఫ్రిన్, శ్రావణ్‌కుమార్ ఆపరేషన్లు చేశారు. మొత్తం 78 మంది మహిళలకు ఆపరేషన్లు చేయించుకునేందుకు వైద్య సిబ్బంది రిజిస్టర్లో పేర్లు నమోదు చేసుకున్నారు. అంతకు మించి మహిళలు ఆపరేషన్లు చేయించుకోవడానికి ముందుకొచ్చారు. అయితే వైద్యులు 70 మంది మహిళలకు మాత్రమే ఆపరేషన్లు చేసి వెళ్లి పోయారు. ఆపరేషన్ చేయాలని ఆందోళన ఆస్పత్రికి వచ్చిన మహిళలందరికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని వారు ఆందోళనకు దిగారు. ఆపరేషన్లు చేయించుకోవాలని గ్రామాల్లో ఆశవర్కర్లు తమ ఆధార్ కార్డు వివరాలను, పేర్లను నమోదు చేసుకోవడంతోనే ఆస్పత్రికి వచ్చామని వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో ఆస్పత్రిలోని ధియేటర్ను ముట్టడించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వైద్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ గఫార్ పోలీసులతో కలిసి మహిళలకు, వారి కుటుంబ సభ్యులను నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కనీస వసతులు కరువు జిలా ప్రభుత్వ ఆస్పత్రిలోని పీపీ యూనిట్లో జరిగిన కుటుంబ నియంత్రణ శిబిరంలో ఆపరేషన్లు చేయించుకునే మహిళలకు, కుటుంబ సభ్యులకు కావాల్సిన కనీస వసతులను కల్పించడంలో పీపీ యూనిట్ నిర్వాహకులు విఫలమయ్యారు. దీంతో ఆపరేషన్ చేయించుకున్నాక మహిళలను అరగంట పాటు విశ్రాంతి తీసుకోకుండానే వారిని వార్డులో నుంచి పంపించారు. దీంతో పరేషన్ చేయించుకున్న మహిళలు ఆస్పత్రి ఆవరణలో నేలపై పడుకుని అవస్థలు పడ్డారు. 50 మందికి మాత్రమే ఆపరేషన్లు చేయాలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ను 50 మందికి మాత్ర మే చేస్తాం. అయితే పెద్దేముల్ మండలం నుంచి మహిళలు అధికసంఖ్యలో వచ్చారు. అయితే 70మంది మహిళలకు ఆపరేషన్లు చేశారు. మరోసారి శిబిరం ఏర్పాటు చేస్తే మిగిలిన వారికి ఆపరేషన్లు చేస్తాం. – శ్రీకాంత్‌రెడ్డి, పీపీ యూనిట్ ఇంచార్జ్ -
రైతు బంధు సాయం చోరీ..
బషీరాబాద్(తాండూరు) : ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం ఇచ్చిన రైతుబంధు సాయం ఓ మహిళా రైతు ఇంట్లో చోరీకి గురైంది. ఈ సంఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దామర్‌చెడ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాలెల లక్ష్మీ భర్త చనిపోవడంతో చాలా ఏళ్లుగా వ్యవసాయం చేస్తుంది. అయితే ఈ మధ్యే రైతు బంధు పథకం ద్వారా రూ.11,900 వచ్చాయి. కొన్ని నెలల కిందట గ్రామంలోని కొంతమంది రైతులకు అప్పుగా రూ.78,100 ఇచ్చింది. వారికి కూడా రైతుబంధు సాయం అందడంతో సదరు రైతులు అప్పు చెల్లించారు. ఈ మొత్తం డబ్బును ఇంట్లో దాచిపెట్టింది. హైదరాబాద్‌లో ఉన్న తన కొడుకును చూడడానికని ఈ నెల 24న లక్ష్మీ ఇంటికి తాళం వేసి వెళ్లింది. తిరిగి ఈ నెల 26న ఇంటికి చేరుకొని చూడగా ఇంట్లో దాచిన రూ.90 వేల నగదు కనిపించలేదు. దీంతో డబ్బులు అప్పుగా అడిగిన పొరుగింటి యువకుడు తలారి శ్రీనివాస్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఎస్సై లక్ష్మయ్య 48 గంటల్లోన్నే కేసును చేదించారు. అనుమానిత యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా నేరాన్ని అంగీకరించాడు. తనకు అప్పు అడిగితే ఇవ్వనందుకే చోరీకి పాల్పడినట్లు చెప్పాడు. అతడి నుంచి రూ.68,500 రికవరీ చేసిన పోలీసులు, మరో 21,500 ఖర్చు చేశాడని వెల్లడించారు. మంగళవారం యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
జాడలేని ‘ట్రామా’
తాండూరు : రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్జిల్లాలోనే రొడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నాయని ఇటీవల ఉన్నతాధికారుల కమిటీ ప్రకటించింది. ఒక్కసారిగా పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదం జరిగితే జిల్లాలోనే క్షతగాత్రులకు వైద్యం అందించి ట్రామాకేర్ సెంటర్ ద్వారా చికిత్సలను అందించాలి. కానీ జిల్లాలో ప్రమాదాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నా అధికారులు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శంలు వస్తున్నాయి. గత శనివారం రాజీవ్ జాతీయ రహదారిపై 11 మందికి పైగా ప్రయాణికులు రొడ్డు ప్రమాదంలో మృతి చెందడం. పదుల సంఖ్యలో క్షతగాత్రులు కావడం జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ట్రామాకేర్ సెంటర్ అందుబాటులోకి తీసుకురాక పోవడంతో అధికారులు, ప్రజాప్రతినిదుల నిర్లక్ష్యంపై సర్వాత్ర చర్చనీయాంశమైంది. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలను చేపట్టేందుకు గతంలో వికారాబాద్ జిల్లాలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం, రాష్ట్ర ఆర్అండ్బీ అధికారుల బృందం జిల్లాలో పర్యటించింది. ప్రమాదాలు జరిగితే మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేసి క్షతగాత్రులకు వైద్యం అందించాలని నిర్ణయించారు. అందుకోసం మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రావాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకోసం మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు రూ.30 కోట్ల వరకు కేటాయించారు. అందుకు సంభందించి తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలోని ఇందుకు దాదాపు రెండేళ్ల క్రితమే సుమారు రూ.5.92కోట్ల నిధులు మంజూరు చేసి ట్రామా కేర్ సెంటర్ నిర్వహణ కోసం అభివృద్ధి పర్చారు..వికారాబాద్ జిల్లాలో ప్రతి ఏటా సూమారు 350 నుంచి 400 వరకు రోడ్డు, రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని తాండూరులోని జిల్లా ఆస్పత్రిలోని ట్రామాకేర్ సెంటర్లోని వైద్యం అందించి అవసరమైన శస్త్ర చికిత్సలను వెంటనే చేయాలి. జాతీయ రహదారిపై పర్యవేక్షణేది.. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు జాతీయ రహదారిగా మార్చారు. వికారాబాద్ జిల్లా మీదుగా రహదారిని ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లాలోని మన్యగుడ నుంచి కొడంగల్ నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దు వరకు ఈ హైవే ఉంది. సూమారు 90 కిలో మీటర్ల వరకు ఈ రహదారి జిల్లా నుంచి వెలుతుంది. జాతీయ రహదారి భద్రత కోసం రవాణ, ఆర్అండ్బీ, పోలీసు శాఖ, వైద్య శాఖలు హైవేపై పనిచేసేలా ఏర్పాటు చేస్తారు. అందులోకి పోలీసు శాఖ హైవే పోలీస్ స్టేషన్లను, అవుట్ పొస్ట్లను అందుబాటులో ఉంచింది. జాతీయ రహదారి సమీపంలో ప్రభుత్వం క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించేందుకు రూ.కోట్ల నిధులు ఖర్చు పెట్టి ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో కూడా వాటిని ఏర్పాటు చేసేందుకు పనులు మొదలు పెట్టి అసంపూర్తిగా వదిలేసారు. కేవలం ప్రాథమిక చికిత్సలకే పరిమితం... రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సలు మినహా పూర్తి స్థాయి వైద్య సేవలు అందని పరిస్థితి. క్షతగాత్రులను 120 కి.మీ దూరంలో ఉన్న హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు.. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వెళ్లేలోపు ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు సకాలంలో వైద్య సేవలు అందక మరణిస్తున్నారని వైద్యులు అంటున్నారు. ప్రత్యేక వైద్య సదుపాయాలు ఇలా... జాతీయ రహదారుల పరిధిలోకి వచ్చే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రుల్లోనే కేంద్రం నిధులతో ఈ సెంటర్ నెలకొల్పనున్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే వైద్యం అందించేందుకు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలపమెంట్ కార్ఫొరేషన్(టీఎస్ఎంఐడీసీ) ట్రామ సెంటర్‌ను ఏర్పాటుకు పనులను ప్రారంభించారు. ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్లతోపాటు స్టాఫ్ నర్సులు, ప్రత్యేక అత్యవసర వైద్య సదుపాయాలు కలిగిన అంబులెన్స్, ఆధునాతన సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్లు తదితర ప్రత్యేక వైద్య సిబ్బందిని నియామకం చేయనున్నారు. ప్రత్యేకంగా ఐసీయూ ఏర్పాటు, ఈ ట్రామా సెంటర్ కోసం మొత్తం రూ.5.92 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో రూ.5కోట్లతో పరికరాలు, వసతులు, రూ.80లక్షలతో బిల్డింగ్ తదితర సివిల్ పనులు, మరో రూ.12లక్షలతో అంబులెన్స్‌ను ఏర్పాటుకు నిధులను కేటాయించారు. ట్రామా కేర్ కోసం చేసిన పనులు ఎక్కడికక్కడే తుప్పుపట్టి పోయాయి. వైద్యం కోసం వచ్చిన పరికరాలను గదిలో వేసి తాళం వేయడంతో తుప్పు పట్టాయి. -
కొండెక్కుతున్న కోడికూర ధరలు
తాండూరు : కోడి కొండెక్కి కూర్చుంది. ఎంతకీ దిగిరానంటోంది. మండుతున్న ఎండలకు పోటీగా చికెన్ ధరలు పెరుగుతున్నాయి. ఎండ దెబ్బకు చికెన్ ధరలు దిగిరావాల్సింది పోయి భారీగా పెరుగుతున్నాయి. వేసవి కాలంలో కావడంతో కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి భారీగా తగ్గిపోతోంది. ఎండల తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఫారాల్లో ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతోంది. దీంతో మరో నెలరోజుల వరకు కోడి కూర ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. చికెన్ కిలో రూ.170 తాండూరులో నెలరోజుల కిందట లైవ్ కోడి రూ.63, డ్రెస్సుడ్ చికెన్ రూ.130, స్కిన్ లేకుండా రూ.140 వరకు విక్రయించారు. వారం రోజులుగా చికెన్ ధర కిలోకు రూ.170 అమ్ముతున్నారు. తాండూరులో కిలో చికెన్ ధర (స్నేహ ఫ్రెష్ చికెన్ సెంటర్లో) లైవ్ రూ.101, డ్రెస్సుడ్ రూ.150, స్కిన్లెస్ రూ.170 అమ్ముతున్నారు. ఈ నెలలో ధరలు రోజురోజుకి పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని చికెన్ దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు. గతేడాది గరిష్టంగా కిలోకు రూ.260 గతేడాది ఏప్రిల్, మే నెలల్లో కిలో కోడి కూరకు రూ.250 నుంచి రూ.260 వరకు ధర పలికింది. ఈ ఏడాది కూడా చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్ది చికెన్ ధరలపై ప్రభావం ఉంటుందని కోళ్లఫారాల నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లీళ్లు, శుభకార్యాలు ఉండడంతో ఒక్కసారిగా చికెన్ ధరలు తాండూరులో ఆకాశాన్నంటాయి. వేసవి కావడంతో పౌల్ట్రీఫారాల నుంచి కోళ్ల పంపిణీ సంఖ్య బాగా తగ్గింది. పౌల్ట్రీఫారాల్లో బాయిలర్ కోళ్ల కొరత ఉండడంతో కోడికూర ధరలు పెరుగుతున్నాయని చికెన్ దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు. శుభకార్యాలతో ధరలపై ప్రభావం వేసవి కాలంలో ఏప్రిల్, మే రెండు నెలల పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు వందల సంఖ్యలో జరుగుతుండడంతో చికెన్ వాడకం అధికంగా ఉంటోంది. దీంతో చికెన్ ధరలపై ప్రభావం చూపుతోంది. కోళ్ల ఫారాల్లో ఉత్పత్తులు తగ్గిపోవడంతో కోడి కూర ప్రియులపై ధర ప్రభావం చూపుతుంది. -
బీసీ రుణాల దరఖాస్తు గడువు పెంచాలి
తాండూరు రూరల్: బీసీ రుణాల దరఖాస్తుల గడువు పెంచాలని ఆ సంఘం నాయకులు సోమవారం డిమాండ్ చేశారు. ఈనెల 4వ తేదీతో బీసీ రుణాల దరఖాస్తు ముగుస్తోందని తెలిపారు. సమయం తక్కువగా ఉండటంతో కులం, ఆదాయం సర్టిఫికెట్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని అవేదన వ్యక్తం చేశారు. ఈవిషయంలో ఉన్నతాధికారులు దృష్టిసారించి దరఖాస్తుల గడువు పెంచాలని కోరారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీఓలకు వినతిపత్రాలు ఇచ్చేందుకు యత్నించగా అధికారులు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్డె కృష్ణ, అమ్రేష్, రమేష్, వెంకటేష్, నర్సింలు ఉన్నారు. -
నిరుద్యోగ యువతకు శిక్షణ
తాండూరు రూరల్ : నిరుద్యోగ యువతకు విభిన్నరంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని జినుగుర్తి గేటు సమీపంలో రూర్బన్ నిధులు రూ.2 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి ఆయన శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాండూరు ప్రాంతంలో యువతకు స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతీయువకులకు ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు ఈ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని ఆయన వివరించారు. పెళ్లికోసం అప్పు చేయొద్దు కూతురు పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేయొద్దని మంత్రి మహేందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన 79 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, ఎంపీపీ లక్ష్మమ్మ, జెడ్పీటీసీ రవిగౌడ్, తహసీల్దార్ రాములు, జినుగుర్తి సర్పంచ్ పాపమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు బాలమణి, నాయకులు రాంలింగారెడ్డి, శ్యామప్ప, శ్రీనివాస్‌గౌడ్, అమృత్‌రెడ్డి ఉన్నారు. -
తాండూరు కందిపప్పు టేస్టే వేరు..
ఇతర రాష్ట్రాల్లో పండించిన కందులతో తయారు చేసిన కందిపప్పు కన్నా తాండూరు పప్పు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి నేల స్వభావంతో పప్పు రుచికరంగా ఉండడంతో దీనికి అధిక డిమాండ్ ఉంది. ఇక్కడి పప్పు త్వరగా ఉడుకుతుంది. వండిన పప్పు రెండు రోజులైనా పాడవకుండా ఉండడం మరో ప్రత్యేకత. ప్రతి ఏడాది తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సుమారు వంద కోట్ల కందుల వ్యాపారం జరుగుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కందులు రవాణా అవుతాయి. తాండూరు కందిపప్పు పేరుతో విక్రయిస్తారు. ఈ ప్రాంతంలో చాలామంది ముద్దపప్పు చేసిన తరువాత తెల్లని వస్త్రంలో ఆరబెడతారు. ఇలా వారం రోజులపాటు ఆరబెట్టిన ముద్దపప్పు పాచిపోదు. ఈ పప్పును జొన్న రొట్టెతోకలిపి ఆరగిస్తారు. - తాండూరు -
కోనేరులో స్నానాలు: ముగ్గురు యువకుల మృతి
కోయిల్‌కొండ: మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం తాండూరు సమీపంలోని శ్రీవీరభద్రస్వామి ఆలయ కోనేరులో పడి ముగ్గురు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన వివరాలు... తాండూరుకు చెందిన శివకుమార్ కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి శ్రీవీరభద్రస్వామిని దర్శించుకున్నారు. శివకుమార్ హోటల్లో పనిచేస్తున్న సాయి(17), మల్లు (28), ఆటో డ్రైవర్ రాజు(30) బుధవారం సాయంత్రం స్వామివారి దర్శనానికి వెళ్లారు. అయితే వారు మార్గమధ్యంలో మద్యం సేవించారు. స్నానమాచరించేందుకు ముగ్గురూ కోనేరులో దిగారు. వారిలో సాయికి ఈత రాకపోవడంతో అతను మునిగిపోతుండగా, అతణ్ణి కాపాడేందుకు ప్రయత్నించిన మల్లు, రాజు కూడా మునిగిపోయారు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనస్థలానికి వెళ్లి మృతదేహాలను వెలికితీశారు. సాయి, రాజు తాండూరుకు చెందినవాళ్లు కాగా మల్లు కర్ణాటకలోని విర్యామణ గ్రామానికి చెందినవాడు. -
బైక్‌పై 40 వేల కిలోమీటర్ల దేశయాత్ర
తాండూర్ (రంగారెడ్డి జిల్లా): స్వచ్ఛభారత్, మహిళా హక్కులకు గౌరవం, భ్రూణ హత్యల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా తాండూర్‌కు చెందిన వ్యక్తి మోటారు సైకిల్‌పై దేశయాత్రకు శ్రీకారం చుట్టాడు. తాండూరుకు చెందిన జొల్లు ప్రవీణ్‌కుమార్(33) ఆదివారం ఉదయం 9 గంటలకు పట్టణంలోని శ్రీకోటేశ్వరాలయం నుంచి స్థానిక పెద్దల సమక్షంలో ఈ బృహత్ కార్యాన్ని ప్రారంభించాడు. మొత్తం 29 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, ముఖ్య పట్టణాల మీదుగా 40వేల కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. ఆయా ప్రాంతాలకు చెందిన ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను యాత్రలో భాగంగా కలుసుకుని తన ఉద్దేశం వివరించనున్నాడు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున తిరిగి తాండూర్‌కు చేరుకోనున్నాడు. స్థానిక వ్యాపారి అయిన ప్రవీణ్‌కుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.