తాండూరు కందిపప్పు టేస్టే వేరు..
ఇతర రాష్ట్రాల్లో పండించిన కందులతో తయారు చేసిన కందిపప్పు కన్నా తాండూరు పప్పు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి నేల స్వభావంతో పప్పు రుచికరంగా ఉండడంతో దీనికి అధిక డిమాండ్ ఉంది. ఇక్కడి పప్పు త్వరగా ఉడుకుతుంది. వండిన పప్పు రెండు రోజులైనా పాడవకుండా ఉండడం మరో ప్రత్యేకత. ప్రతి ఏడాది తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సుమారు వంద కోట్ల కందుల వ్యాపారం జరుగుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కందులు రవాణా అవుతాయి. తాండూరు కందిపప్పు పేరుతో విక్రయిస్తారు. ఈ ప్రాంతంలో చాలామంది ముద్దపప్పు చేసిన తరువాత తెల్లని వస్త్రంలో ఆరబెడతారు. ఇలా వారం రోజులపాటు ఆరబెట్టిన ముద్దపప్పు పాచిపోదు. ఈ పప్పును జొన్న రొట్టెతోకలిపి ఆరగిస్తారు.
- తాండూరు