ప్రసిద్ధి ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ అల్పాహారం, స్వీట్స్, నాన్‌వెజ్, వెజిటేరియన్ పరంగా ఏది ఉత్తమమమేనదో దేశాల వారిగా ర్యాంకులు ఇచ్చింది. ఇప్పుడు మంచి టేస్ట్‌తో కూడిన వంటకాలను అందించే దేశాల జాబితాను విడుదల చేసింది. ఆయా దేశాల్లో ఉండే విభిన్న వంటకాలు, ఫేమస్ రెస్టారెంట్లు, పానీయాలు, ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చింది. ప్రపంచంలోనే ఉత్తమ వంటకాలను అందించే.. వంద దేశాలో జాబితాలో గ్రీక్, ఇటాలియన్, మెక్సికన్, స్పానిష్, పోర్చుగీస్ తదితర దేశాలు అగ్రస్థానంలో నిలిచాయి.
ఆ జాబితాలో భారతీయ వంటకాలు 12వ స్థానం దక్కించుకున్నాయి. ఈ ర్యాంకులను అట్లాస్ ఆయా దేశాల్లోని వివిధ వంటకాలు దక్కించుకున్న అత్యధిక స్కౌరు ఆధారంగా ఇచ్చింది. కాగా, టేస్టీ అట్లాస్ మన దేశంలోని బెస్ట్ టేస్టీ వంటకాలుగా..అమృతసరి కుల్చా, బట్టర్ గార్లిక్ నాన్, ముర్గ్ మఖానీ, హైదరాబాదీ బిర్యానీ తదితరాలను తప్పకుండా తిని చూడాల్సిన వంటకాలుగా పేర్కొంది.
దీంతోపాటు మంచి ఆహార వైవిధ్యాన్ని అందించే రెస్టారెంట్లుగా దమ్ పుఖ్త్ (న్యూఢిల్లీ), గ్లెనరీస్ (డార్జిలింగ్), రామ్ ఆశ్రయ (ముంబై), శ్రీ థాకర్ భోజనాలయ్ (ముంబై)లుగా తెలిపింది. ఇక టేస్టీ అట్లాస్ ప్రకారం..భారత్‌లో కొన్ని రకాల వంటకాలు, పానీయాలు అత్యధిక స్కౌరుని దక్కించుకోవడంతో అగ్రస్థానంలో నిలిచింది.
(చదవండి: ఎగతాళి నుంచి సంతాలి రుచుల దాకా...)
Comments
Please login to add a commentAdd a comment