బైక్‌పై 40 వేల కిలోమీటర్ల దేశయాత్ర | tandoor starts country trip from his owntown | Sakshi
Sakshi News home page

బైక్‌పై 40 వేల కిలోమీటర్ల దేశయాత్ర

Published Sun, May 31 2015 4:54 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

బైక్‌పై 40 వేల కిలోమీటర్ల దేశయాత్ర - Sakshi

బైక్‌పై 40 వేల కిలోమీటర్ల దేశయాత్ర

తాండూర్ (రంగారెడ్డి జిల్లా): స్వచ్ఛభారత్, మహిళా హక్కులకు గౌరవం, భ్రూణ హత్యల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా తాండూర్‌కు చెందిన వ్యక్తి మోటారు సైకిల్‌పై దేశయాత్రకు శ్రీకారం చుట్టాడు. తాండూరుకు చెందిన జొల్లు ప్రవీణ్‌కుమార్(33) ఆదివారం ఉదయం 9 గంటలకు పట్టణంలోని శ్రీకోటేశ్వరాలయం నుంచి స్థానిక పెద్దల సమక్షంలో ఈ బృహత్ కార్యాన్ని ప్రారంభించాడు. మొత్తం 29 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, ముఖ్య పట్టణాల మీదుగా 40వేల కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.

ఆయా ప్రాంతాలకు చెందిన ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను యాత్రలో భాగంగా కలుసుకుని తన ఉద్దేశం వివరించనున్నాడు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున తిరిగి తాండూర్‌కు చేరుకోనున్నాడు. స్థానిక వ్యాపారి అయిన ప్రవీణ్‌కుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement