Man Making Tandoori Maggie Video Viral, See Netizens Shocking Reaction - Sakshi
Sakshi News home page

Tandoori Maggie: RIP మ్యాగీ అంటున్న నెటిజన్లు.. కారణం ఇదే..

Published Thu, Dec 30 2021 2:44 PM | Last Updated on Thu, Dec 30 2021 3:51 PM

Watch: Tandoori Maggie Viral Video, See Netizens Shocking Reaction - Sakshi

ఫుడ్‌.. ఈ పేరు వింటనే చాలా నోరూరుతోంది.  స్నాక్స్‌, స్వీట్స్‌, హాట్‌, డిషెస్‌ ఇలా వంటకం ఏదైనా.. ఫుడ్‌ను ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కో వంటకం నచ్చుతుంది. మరికొందరికి కొత్త వంటకాలు టేస్ట్‌ చేయడం అంటే పిచ్చి. ఏ హోటల్‌, రెస్టారెంట్‌కు వెళ్లినా, అక్కడ ఉన్న కొత్త వంటకాన్ని రుచి చూడాలనుకుంటారు. ఇలాంటి వారి కోసం రెండు మూడు పదార్థాలను కలిపి ఢిఫరెంట్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ను తయారు చేస్తుంటారు. వీటిని యూట్యూబ్‌ ద్వారా ఆహార ప్రియులకు షేర్‌ చేస్తుంటారు.
చదవండి: Anand Mahindra: నీ పాటతో ఆ గ్యారేజికి ప్రాణం పోశావ్‌!

ఇలా రకరకాల స్ట్రీట్ ఫుడ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చక్కగా ఉంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు. అయితే అన్నీసార్లు ఇవి సక్సెస్‌ కాలేవు. కొన్నిసార్లు బెడిసికొడుతుంటాయి. తాజాగా అలా తయారైన తందూరీ మ్యాగీపై నెటిజన్ల నుంచి నెగెటివ్ రియాక్షన్ వస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను అనికైత్ లూత్రా అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో డిసెంబర్ 20న పోస్ట్ చేశారు. ఇందులో  ముందుగా మట్టి పాత్రలను కొలిమిలో కాల్చి అందులో నుంచి ఓ పాత్రను పైకి తీసి గిన్నెలో పెట్టారు. అది మండుతూ ఎర్రగా ఉంది. అప్పుడు దానికి వెన్నను అంటించారు. వెంటనే అది కొవ్వొత్తిలా కాలి మంట వచ్చింది.
చదవండి: వలస రాజహంసలు ఒకేచోట సందడి చేశాయి: క్యూట్‌ వైరల్‌ వీడియో!!

అప్పుడు కాస్తా ఉడికించిన మ్యాగీని అందులో పోశారు. వెంటనే అది కుతకుతా ఉడుకుతూ.. డాన్స్ చేసినట్లు కనిపిస్తుంది. అంతే తందూరీ మ్యాగీ రెడీ. దీనిని ఇప్పటివరకు 32 లక్షల మందికి పైగా చూశారు. దీనిని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘రెస్ట్‌ ఇన్‌ పీస్‌ . మ్యాగీ ఆత్మ శాంతించాలి. డిసెంబర్‌ 31 లాగా మ్యాగీ డ్యాన్స్‌ చేస్తోంది. చెడగొట్టారు. ఎంత అందంగా కనిపిస్తోంది అనే దానిపై ఫోకస్ పెడుతున్నారే తప్ప రుచిపై పెట్టట్లేదు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరీ మీరూ ఈ వంటకాన్ని చూసేయండి..
చదవండి: కూతురుతో కలిసి అదిరిపోయే స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement