కోనేరులో స్నానాలు: ముగ్గురు యువకుల మృతి | 3 youth died, veerabadraswamy temple | Sakshi
Sakshi News home page

కోనేరులో స్నానాలు: ముగ్గురు యువకుల మృతి

Published Wed, Aug 26 2015 8:45 PM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

కోనేరులో స్నానాలు: ముగ్గురు యువకుల మృతి

కోనేరులో స్నానాలు: ముగ్గురు యువకుల మృతి

కోయిల్‌కొండ: మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం తాండూరు సమీపంలోని శ్రీవీరభద్రస్వామి ఆలయ కోనేరులో పడి ముగ్గురు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన వివరాలు... తాండూరుకు చెందిన శివకుమార్ కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి శ్రీవీరభద్రస్వామిని దర్శించుకున్నారు. శివకుమార్ హోటల్‌లో పనిచేస్తున్న సాయి(17), మల్లు (28), ఆటో డ్రైవర్ రాజు(30) బుధవారం సాయంత్రం స్వామివారి దర్శనానికి వెళ్లారు. అయితే వారు మార్గమధ్యంలో మద్యం సేవించారు.

స్నానమాచరించేందుకు ముగ్గురూ కోనేరులో దిగారు. వారిలో సాయికి ఈత రాకపోవడంతో అతను మునిగిపోతుండగా, అతణ్ణి కాపాడేందుకు ప్రయత్నించిన మల్లు, రాజు కూడా మునిగిపోయారు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనస్థలానికి వెళ్లి మృతదేహాలను వెలికితీశారు. సాయి, రాజు తాండూరుకు చెందినవాళ్లు కాగా మల్లు కర్ణాటకలోని విర్యామణ గ్రామానికి చెందినవాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement