
వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన నాయకులు
తాండూరు రూరల్: బీసీ రుణాల దరఖాస్తుల గడువు పెంచాలని ఆ సంఘం నాయకులు సోమవారం డిమాండ్ చేశారు. ఈనెల 4వ తేదీతో బీసీ రుణాల దరఖాస్తు ముగుస్తోందని తెలిపారు. సమయం తక్కువగా ఉండటంతో కులం, ఆదాయం సర్టిఫికెట్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని అవేదన వ్యక్తం చేశారు. ఈవిషయంలో ఉన్నతాధికారులు దృష్టిసారించి దరఖాస్తుల గడువు పెంచాలని కోరారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీఓలకు వినతిపత్రాలు ఇచ్చేందుకు యత్నించగా అధికారులు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్డె కృష్ణ, అమ్రేష్, రమేష్, వెంకటేష్, నర్సింలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment