కులసంఘాల విజ్ఞప్తిపై బీసీ కమిషన్ నోటిఫికేషన్
ఈ నెల 18 వరకు అభ్యంతరాల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని ఎనిమిది కులాల పేర్లను మా ర్పు చేసేందుకు తెలంగాణ బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా కులాల పేర్లను తిట్ల రూపంలో వాడుతున్నారని, దీంతో కులం పేరు చెప్పేందుకు ఇబ్బందికరంగా ఉందని దొమ్మర, పిచ్చకుంట్ల, తమ్మలి, బుడబుక్కల, కుమ్మరి, చాకలి, చిప్పోలు, వీరముష్టి కులాలకు చెందిన ప్రతినిధులు పలు సందర్భాల్లో బీసీ కమిషన్‌కు పెద్ద సంఖ్యలో వినతులు సమర్పించారు.
ఈ అంశంపై స్పందించిన బీసీ కమిషన్ తాజాగా పేర్ల మార్పునకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 18వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అభ్యంతరాలను ఖైరతాబాద్‌లోని తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయంలో ప్రభుత్వ పనివేళల్లో స్వీకరించనున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment