![Woman Arrested In Fake Job Scam In Vizianagaram - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/2/kiledi.jpg.webp?itok=eRDSYNBm)
సాక్షి, బొబ్బిలి(విజయనగరం): ఉద్యోగాలిప్పిస్తానని పలువురిని మోసం చేసి సుమారు రూ.కోటి వసూలు చేసిన మండలంలోని రాముడువలసకు చెందిన కిలేడీ బుట్ట సరస్వతి ఎట్టకేలకు అరెస్టు అయ్యింది. అసలు పేరును కాదని విజయరాణిగా చలామణి అవుతూ పలువురిని మోసగించింది. తనకు పెద్దలతో పరిచయాలున్నాయని ఒకొక్కరి నుంచి రూ.50వేల నుంచి ఆరు లక్షల వరకు వసూలు చేసింది. అంగన్‌వాడీ కార్యకర్త, మండల కో ఆర్డినేటర్, 104 అంబులెన్సు డ్రైవర్, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్, ఫార్మాసిస్టు, కార్యదర్శి తదితర ఉద్యోగాల పేరు చెప్పి సుమారు 13 మంది నుంచి డబ్బులు వసూలు చేసింది.
ఈమెను పట్టణంలోని గుర్తించిన బాధితులు డబ్బులు ఎప్పుడిస్తావని నిలదీయడంతో శనివా రం రాత్రి గొడవ జరిగిన విషయం పాఠకులకు తెలిసిందే. ఎస్‌ఐలు వెలమల ప్రసాదరావు, చదలవాడ ప్రసాదరావు దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేశారు. ఆదివారం రిమాండ్ నిమిత్తం తరలించినట్టు చెప్పారు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment