job fraud
-
ఉద్యోగం ఎర వేస్తారు...క్లిక్ చేస్తే ఊడ్చేస్తారు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను బలహీనతగా చేసుకుని కొంతమంది సైబర్‌నేరాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో ఆకర్షణీ యమైన వేతనం, తక్కువ శ్రమ అంటూ ఇంటర్నె ట్లో ఆన్లైన్ జాబ్స్ పేరిట ఇచ్చే ఉద్యోగ నోటిఫికే షన్లు ఒకటి. ఆన్లైన్ జాబ్స్ పేరిట ఇచ్చే ఉద్యోగ ప్రకటనలతో ఎంతోమందిని ఆకర్షించి వారి నుంచి తెలివిగా డబ్బులు గుంజడం, ఆపై కనిపించకుండా తప్పుకోవడం ఇటీవల సాధారణమైపోయింది. అటువంటి ఊదరగొట్టే ఉద్యోగ ప్రకటనల వెనుక మోసం దాగి ఉన్నట్లు గ్రహించాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు. భారీగా ఆదాయం అంటూ ప్రకటనలు ఇస్తున్నారంటే దాని వెనుక సైబర్ నేరగాళ్లు మన వ్యక్తి గత, బ్యాంకు సమాచారం కోసం మాటు వేసి ఉన్నారని పసిగట్టాలని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నా రు. ఎక్కువగా ఉద్యోగావకాశాల కోసం, ఆన్లైన్ జాబ్స్ కోసం ఇంటర్నెట్లో వెదికేవారిని సైతం సైబ ర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసు కుంటున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఉద్యోగం పేరిట మెయిల్స్ లేదా మొబైల్స్‌కు లింక్స్ పంపిస్తా రని, వాటిని ఏమాత్రం క్లిక్ చేసినా మన సమాచార మంతా వారు తెలుసుకుని అకౌంట్లలోని డబ్బుల్ని ఊడ్చేస్తారని చెబుతున్నారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటం పెద్ద కష్టమేమీ కాదని వారు సూచిస్తున్నారు. ఇవీ సూచనలు.. ► ఆన్లైన్ జాబ్ ఆఫర్లో మనం చేసే పనికి సాధారణం కంటే ఎక్కువ లబ్ధి వచ్చేలా, అత్యధిక సంపాదన ఉండేలా సమాచారం ఉంటే అది మోసమని గ్రహించాలి. ► ఆన్లైన్ ఉద్యోగాల పేరిట వచ్చే ఈమెయిల్స్‌లో అక్షర దోషాలు ఉన్నా, ఎలాంటి ఫోన్ నంబర్లు లేకుండా ఉన్నా కచ్చితంగా అది మోసపూరితమైన లింక్ అని పసిగట్టాలి. ► ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేస్తామంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దు. ► ఆన్లైన్ జాబ్ ఇవ్వాలంటే వ్యక్తిగత సమాచారంతోపాటు పాన్, ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు షేర్ చేయాలని కోరుతున్నారంటే అది మోసమని గ్రహించాలి. ► ఆన్లైన్లో జాబ్ ఇస్తామని ప్రకటనల రూపంలో వచ్చే వెబ్‌లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దు. -
జాబ్ ఇంటర్వ్యూలో అరెస్టయిన యువతి.. ఈ కిలాడి మోసం గురించి తెలిస్తే అవాక్కవుతారు!
చైనాలో భారీ వేతన మోసం బట్టబయలైంది. ఒక యువతి వివిధ కంపెనీలను మోసం చేస్తూ ఏకకాలంలో 16 ఉద్యోగాలు చేస్తూ పట్టుబడినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. మారుపేరుతో మరొక ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరైన గ్వాన్ యూ అనే యువతిని అధికారులు అరెస్టు చేశారు. వివిధ కంపెనీల్లో పలు పేర్లతో ఏకకాలంలో 16 ఉద్యోగాలు చేస్తున్న ఆ యువతి.. ఎప్పుడూ ఆఫీస్‌కు వెళ్లలేదు. ఆయా కంపెనీల యాజమాన్యాలను నమ్మించేందుకు ఎప్పటికప్పుడు క్లయింట్లను కలుస్తున్నట్లు ఫొటోలు సృష్టించి వాటిని వర్క్ గ్రూప్ చాట్లలో షేర్ చేసేది. జాబ్ టైటిల్స్, బ్యాంక్ ఖాతా నంబర్లు, జాయినింగ్ డేట్స్ ఇలా ప్రతి సమాచారాన్ని పకడ్బందీగా నిర్వహిస్తూ వచ్చింది. ఇలా ప్రతి జాబ్ ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగాన్ని చేజిక్కించుకుని ఇతరులకు ఇచ్చి వాటి ద్వారా వచ్చే జీతంపై కమీషన్ తీసుకుంటోందని చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తాపత్రిక Xinminని ఉటంకిస్తూ బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. గ్వాన్, ఆమె భర్త చెన్ కియాంగ్ ఇద్దరూ ఇలా జాబ్ మోసాలు చేయడంలో సిద్ధహస్తులు. ఇలాంటి 13 కేసుల్లో ఇరుక్కున్న చెన్ చట్టాల్లో లొసుగులను వాడుకుని వాటన్నింటినీ గెలిచాడు. ఇలా కంపెనీలను మోసం చేస్తూ జాబ్‌ల ద్వారా వారు గణనీయమైన సంపాదించారు. ఎంతలా అంటే ఈ జంట షాంఘైలోని బౌషన్ జిల్లాలో ఒక విల్లాను కొన్నారు. యువతి సమర్పించిన పత్రాలలో వ్యత్యాసాలను గుర్తించిన ఓ టెక్ కంపెనీ యజమాని లియు జియాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి నేరపూరిత కుట్ర బట్టబయలైంది. గ్వాన్ గ్యాంగ్‌లోని 53 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో నేరస్తులు 7 మిలియన్ డాలర్లకు (రూ.58 కోట్లు) పైగా సంపాదించినట్లు వెల్లడైంది. -
'కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి' ఆప్తులమంటూ నమ్మించి.. మోసం!
కర్ణాటక: బెస్కాంలో మీటర్ రీడర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు దండుకొని నకిలీ నియామక పత్రాలు జారీ చేసి పంగనామం పెట్టిన ఘటన జిల్లాలోని లింగసూగూరు తాలూకాలో వెలుగు చూసింది. పదో తరగతి, ఐటీఐ పాసైన 15 మంది నిరుద్యోగ యువకుల నుంచి దేవదుర్గ తాలూకా గబ్బూరుకు చెందిన సురేష్, బసప్ప, నేతాజీ, వేణు, హసన్ అనే వ్యక్తులు తాము కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆప్తులమంటూ నమ్మించి డబ్బు వసూలు చేశారు. అనంతరం బెంగళూరు ఎంఎస్ భవన్లో అభ్యర్థులకు నకిలీ ఇంటర్వ్యూలు జరిపించారు. అనంతరం ఐడియా ఇనఫిటి కంపెనీలో శిక్షణకు సిఫార్సు చేసినప్పుడు అసలు బండారం బయట పడింది. లింగసూగూరుకు చెందిన విక్రం సింగ్ రూ.13 లక్షలు, శరణప్ప రూ.12 లక్షలు, ప్రభుగౌడ రూ.9 లక్షలు, ఆనంద్ రూ.6 లక్షలు, దేవరాజ్ రూ.12 లక్షలు, బలరాం రూ.12 లక్షలు, వెంకట సింగ్ రూ.12లక్షలు, రాజు రూ.7 లక్షలు, రాహుల్ రూ.7లక్షలు, ముస్తాఫా రూ.3 లక్షలు ఇచ్చినట్లు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రైల్వే ఉద్యోగం..8 గంటల డ్యూటీ, వచ్చే పోయే రైళ్లను లెక్కించడమే పని!
Railway Recruitment Scam: ప్రైవేట్ ఉద్యోగంలో ఆర్ధిక మాంద్యం భయాలు, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుదామంటే బోలెడంత కాంపిటీషన్. అయినా సరే కాలంతో పోటీ పడుతూ కోరుకున్న జాబ్‌ను దక్కించుకునేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఆ కోచింగ్, ఈ ఈవెంట్లు అంటూ ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. ఆ అవసరాన్నే క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తమిళనాడుకు చెందిన 28 మంది యువకులకు రైల్వే శాఖలో ఉద్యోగం. ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్(టీటీఈ), ట్రాఫిక్ అసిస్టెంట్, క్లర్క్ విభాగాల్లో జాబ్ డిజిగ్నేషన్ కోసం ఈ ఏడాది జూన్ - జులై నెలలో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఆ ట్రైనింగ్ ఏంటో తెలుసా? న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆయా ప్లాట్‌ఫామ్‌లలో నెలకు ఎన్ని ట్రైన్స్ వెళ్తున్నాయి. ఎన్ని రైళ్లు వస్తున్నాయో లెక్కపెట్టడమే. ఇందుకోసం ఆ యువకులు ఒక్కొక్కరు రూ.2లక్షల నుంచి రూ.24 లక్షల వరకు..మొత్తంగా రూ.2.67 కోట్లు చెల్లించారు. పాపం సుబ్బుసామి తమిళనాడు విరుదునగర్ జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన సుబ్బుసామి మాజీ సైనికుడు. మంచి వ్యక్తి. తన ఊరిలో, లేదంటే తనకు తెలిసిన యువకులకు ఉపాధి కల్పించాలని నిత్యం ఆరాటపడుతుంటారు. ఈ తరుణంలో సుబ్బుసామి పనిమీద ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌కు వెళ్లగా.. అక్కడ కోయంబత్తూరు నివాసి శివరామన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంలో తనకు ఎంపీలు, మంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయని, డబ్బులు చెల్లిస్తే నిరుద్యోగులకు రైల్వే ఉద్యోగం వచ్చేలా చేస్తానని శివరామన్.. సుబ్బుసామిని నమ్మించాడు. రూ.2.67 కోట్లు వసూలు అతని మాటలు నమ్మిన సుబ్బుసామి ముగ్గురు నిరుద్యోగుల్ని శివరామన్‌కు ఫోన్లో పరిచయం చేయించాడు. ఉద్యోగం కావాలంటే ఢిల్లీకి రావాల్సిందేనని ఆదేశించాడు. ఇలా ముగ్గురు నిరుద్యోగులు కాస్తా.. 25మంది అయ్యారు. దీంతో నిందితుడు తాను వేసిన మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా బాధితుల్ని ఢిల్లీకి రప్పించాడు. అక్కడ అభ్యర్ధులకు వికాస్ రాణా’తో మాట్లాడించాడు. ఉద్యోగం, ట్రైనింగ్, మెటీరియల్, ఆఫర్‌లెటర్, జాబ్ డిజిగ్నేషన్ ఏంటో క్లుప్తంగా వివరించిన రాణా.. వారి వద్ద నుంచి రూ.2.67 కోట్ల వరకు వసూలు చేశాడు. వచ్చే, పోయే రైళ్లను లెక్కేయడమే ఉద్యోగం అనంతరం డబ్బులు తీసుకున్న కేటుగాళ్లు అభ్యర్ధులకు రైల్వే సెంట్రల్ హాస్పిటల్, కన్నాట్ ప్లేస్‌లో వైద్య పరీక్షల కోసం పిలిపించారు. ఆపై ఉత్తర రైల్వేలోని జూనియర్ ఇంజనీర్, శంకర్ మార్కెట్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు. ఒక నెల ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్‌లో రోజుకి 8 గంటల పాటు ఢిల్లీ రైల్వే స్టేషన్లో వచ్చే, పోయే రైళ్లు, రైళ్లకు ఉన్న భోగీలు లెక్కించారు. ట్రైనింగ్ కూడా పూర్తయింది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అనంతరం వికాస్ రాణా వారికి ఆఫర్ లెటర్లు అందించాడు. ఆ ఆఫర్ లెటర్లు తీసుకొని న్యూ ఢిల్లీ రైల్వే శాఖ అధికారుల్ని ఆశ్రయించడంతో ఈ ఘరనా మోసం వెలుగులోకి వచ్చింది. నిందితులు చేతుల్లో మోసపోయామని భావించిన అభ్యర్ధులు న్యాయం చేయాలని పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బుసామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక సుబ్బు సామి యువకుల్ని మోసం చేసిన కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని, ఈ జాబ్ స్కామ్‌లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపారు. వికాస్ రాణా పచ్చి మోసగాడు డబ్బు వసూలు కోసం వికాస్ రాణా ఎప్పుడూ తమను బయట కలుస్తుంటాడని, ఏ రైల్వే భవనంలోకి తీసుకెళ్లలేదని బాధితులు చెబుతున్నారు. శిక్షణకు సంబంధించిన ఆర్డర్లు, గుర్తింపు కార్డులు, శిక్షణ పూర్తయిన సర్టిఫికెట్లు, అపాయింట్మెంట్ లెటర్లు వంటి అన్ని పత్రాలను రైల్వే అధికారులతో క్రాస్ వెరిఫై చేయగా నకిలీవని తేలిందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. -
ఇది మాకు పునర్జన్మ.. తిరిగి ఇండియాను చూడమనుకున్నాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంబోడియాకు ఉద్యోగం కోసం వెళ్లిన తాము నరక కూపం నుంచి బయటపడ్డామని.. తిరిగి ఇండియాకు వస్తామనుకోలేదని.. ఇది తమకు పునర్జన్మ అని.. ఐదుగురు యువకులు వెల్లడించారు. గురువారం ఉదయం కరీంనగర్‌కు చేరుకున్నాక యువకులు ఉద్వేగానికి లోనయ్యారు. ‘సాక్షి’తో ప్రత్యేకంగా తమ ఆవేదనను పంచుకున్నారు. ఎన్నో ఆశలతో కాంబోడియాలో అడుగుపెట్టిన తమకు వెళ్లగానే ఆశలు ఆవిరయ్యాయన్నారు. అక్కడ కంపెనీ నిర్వాహకులు తమ పాస్‌పోర్టులు లాక్కుని, సైబర్ నేరాలు చేయాలని తొలిరోజే ఒత్తిడి తెచ్చారన్నారు. చేతిలో పాస్‌పోర్టులు లేక, ఎవరిని సంప్రదించాలో తెలియక, ఆకలితో నకనకలాడుతూ తాము ఎంతో మానసికవేదన అనుభవించామన్నారు. బయటికి వెళదామని ప్రయత్నించినా.. తమను చుట్టూ ఎత్తైన గోడలు, వాటికి కరెంటు కంచెలు, భారీ భద్రత నడుమ తమను బంధీ చేశారన్న విషయం తెలుసుకుని మరింత కుంగిపోయామని వాపోయారు. కానీ..‘సాక్షి’ చొరవతో ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేసి తిరిగి తమను మాతృభూమిని చేరేలా చేశాయన్నారు. ‘సాక్షి’కి తాము ఎంతో రుణపడి ఉంటామని వివరించారు. ఈ సందర్భంగా ఐదుగురు యువకులు కాంబోడియాలో చైనా సైబర్ స్కాం ముఠా చేతిలో అనుభవించిన బాధలను పంచుకున్నారు. భారతీయులు చాలామంది ఉన్నారు మాలాగే ఉపాధి ఆశతో అక్కడ సైబర్ నేరస్తుల ముఠా చేతిలో పడిన వారు చాలామంది ఉన్నారు. ఇండియాతోపాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందిన అనేకమంది అమాయకులు వారి వద్ద బందీలుగా ఉన్నారు. అందరితో ఇవే పనులు చేయిస్తున్నారు. ఎదురుతిరిగితే ఇక అంతే సంగతులు. బంధీలకు ఆత్మహత్య తప్ప మరే గత్యంతరమే లేదు. –షారూఖ్‌ఖాన్ ఏజెంట్లు గోల్మాల్ చేశారు మా విషయంలో ఇద్దరు ఏజెంట్లు గోల్మాల్ చేశారు. మమ్మల్ని కాంబోడియా చేర్చగానే విషయం అర్థమైంది. మమ్మల్ని అబ్దుల్ నుంచి అమెరికన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశామని చైనీయులు చెప్పారు. వచ్చీరాని ఇంగ్లిష్‌లో తాము చెల్లించిన డబ్బులు కట్టే వరకు విడిచి పెట్టమంటూ ఒక గదిలో బంధించారు. – నవీద్ సెల్‌ఫోన్ తాకట్టుపెట్టాను మేం వెళ్లిన తొలిరోజు నుంచే చైనీయులు మమ్మల్ని నేరాలు చేయాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. మేము ససే మీరా అంటే వారు వినిపించుకోలేదు. చివరికి మమ్మల్ని ఆ చెర నుంచి విడిపించిన రోజు మా చేతుల్లో చిల్విగవ్వలేదు. దీంతో నేను నా సెల్‌ఫోన్‌ను తాకట్టుపెట్టాను. ఆకలి ఇబ్బంది పెడుతున్నా మేం కడుపునింపుకోలేదు. ఆ డబ్బులతో మా చిన్నచిన్న ఖర్చులు భరించుకున్నాం. – షాబాజ్‌ఖాన్ మమ్మల్ని అమ్మేశారని అర్థమైంది మేం వెళ్లగానే మా పాస్‌పోర్టులు లాగేసుకున్నారు. చెప్పినట్లు చేయాలని బెది రింపులకు దిగారు. ఉద్యోగానికి బదులు బెదిరింపులు రాగానే.. మమ్మల్ని అమ్మేశారని అర్థమైంది. ఇక అక్కడ నుంచి బయటపడటం గగనమే అనుకున్నాం. సైబర్ నేరాలు చేయలేక, అక్కడ నుంచి బయటపడే మార్గం లేక నరక యాతన అనుభవించాం. – సలీమ్ హోటల్ వైఫైతో వీడియో పంపాం చైనీయుల ఆఫీసులో బంధీ కాగానే తొలుత ఆందోళన చెందాం. డబ్బులు కడితేగానీ పంపేదిలేదని చైనీయులు తెగేసి చెప్పడంతో భయపడ్డాం. తిరిగి ఇల్లు చూస్తామనుకోలేదు. హోటల్ వైఫై పాస్ వర్డ్ తెలుసుకుని వెంటనే మా దయనీయ స్థితి ని వివరిస్తూ వీడియో చేసి ‘సాక్షి’కి పంపించాం. అదే మమ్మల్ని కాపాడింది. – హాజీబాబా -
కన్సల్టెన్సీలకు అనుమతులు ఉన్నాయా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విదేశాలకు పంపుతామంటూ కరీంనగర్లో ఇష్టానుసారంగా కన్సల్టెన్సీలు వెలుస్తున్నాయి. తాజాగా కంబోడియాలో ఐదుగురు యువకులను సైబర్ స్కాం ముఠా చేతిలో బందీలుగా చిక్కడంతో ఈ కన్సెల్టెన్సీల విశ్వసనీయతపై ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. విదేశాల్లో చదువుకోవడం, కొలువులు చేయడం కొన్నేళ్లుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా విద్యార్థులు, నిరుద్యోగులకు సాధారణ విషయం. ఇలాంటి వ్యవహారాల్లో విద్యార్థులకు పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. అడ్మిషన్ ఖరారయ్యాక నేరుగా వర్సిటీకి వెళ్లి చదువుకుంటారు. కానీ.. ఉపాధి చూపిస్తామని వెలిసే కన్సల్టెన్సీలకు అన్ని అనుమతులు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాయా? అంటే ఈ విషయానికి సమాధానం నిర్వాహకులే చెప్పాలి. మరోవైపు ఐదుగురు యువకుల క్షేమంపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి వారిని కాంబోడియాకు పంపామని, మరోసారి రూ.3 లక్షలు చెల్లించే స్థోమత లేదని వాపోతున్నారు. వీలైనంత త్వరగా వారిని క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. ● నగరంలో ఇష్టానుసారంగా వెలుస్తున్న కన్సల్టెన్సీలు ● నిరుద్యోగులకు ఉపాధి ఆశచూపి విమానమెక్కిస్తున్న ఏజెంట్లు ● వెళ్లినవారిలో షాబాజ్‌ఖాన్‌ది దయనీయ గాధ ● పెళ్లైన వారానికే కంబోడియాకు ప్రయాణం ● తమవారి క్షేమంపై కుటుంబసభ్యుల ఆందోళన భారతీయ నిరుద్యోగులను విదేశాలకు పంపి ఉపాధి చూపించే కన్సెల్టెన్సీలు విధిగా పాటించాల్సిన నిబంధనలను కేంద్ర విదేశాంగశాఖ తన వెబ్సైట్లో స్పష్టంగా పేర్కొంది. 1. ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 (సెక్షన్ 10) ప్రకారం.. ఎవరైతే భారతీయులకు విదేశాల్లో ఉపాధి కల్పన చేయాలనుకునే రిక్రూటింగ్ ఏజెన్సీలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసు కోవాలి. 2. ఐదు సంవత్సరాల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోసం రూల్.నెం.7 ప్రకారం.. రూ.25 వేలు చెల్లించాలి. 3. ఈ దరఖాస్తు ఫారాలు emigrate.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. 4. ఈ క్రమంలో ప్రతీ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గ్యారెంటీ కింద రూ.50 లక్షలు బ్యాంకులో జమచేయాలి. 5. రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకుడి వ్యక్తిగత ప్రవర్తన, ఇతర విషయాల్లో పోలీసులు విచారణ జరిపి ఉండాలి. 6. అయితే.. చేతిలో రూ.నాలుగైదు లక్షలు ఉన్న ప్రతీవారు కన్సెల్టెన్సీలు, రిక్రూట్మెంట్ ఏజెన్సీ పెళ్లైన వారానికే విమానమెక్కిన కంబోడియాలో చిక్కుకున్న ఆరుగురిలో షాబాజ్‌ఖాన్‌ది అత్యంత దయనీయ పరిస్థితి. షాబాజ్‌కు ఇటీవలే వివాహం అయింది. తన మేనమామకు ఆరోగ్యం బాగాలేదని అతను ఉండగానే వివాహం చేసుకోవాలని.. పెద్దలు హడావిడిగా పెళ్లి చేశారు. ఆగస్టు 25 తేదీన రిసెప్షన్ జరిగింది. ఓ వైపు రిసెప్షన్ జరుగుతుండగానే.. షాబాజ్ మేనమామ మరణించారు. వారంతా ఈ బాధలో మునిగిపోయారు. వీసా వచ్చిందన్న సమాచారంతో వెంటనే నూతన వధువైన తన భార్య, కుటుంబ సభ్యులను వదిలి ఆగస్టు 31వ తేదీన కంబోడియా విమానమెక్కాల్సి వచ్చింది. తాను అక్కడ చైనా వారు చెప్పే సైబర్ నేరాలు చేయలేకపోతున్నానని.. వెంటనే ఇంటికి తీసుకువచ్చే ఏర్పాటు చేయాలని కుటుంబీకులకు ఫోన్లో విలపిస్తూ వేడుకుంటున్నాడు. మా సోదరుడిని కాపాడండి మా సోదరుడు షాబాజ్ ఖాన్‌కు వీసా ఇప్పిస్తానని మేనాజ్ అలీ నమ్మబలికాడు. కెసీనోలో మంచి జీతం (800 డాలర్లు) వస్తుందని, ప్రతిరోజూ టిప్పులు కూడా దొరుకుతాయని ఆశపెట్టాడు. అందుకే.. మేము రూ.2 లక్షలు ఖర్చు అయినా పంపేందుకు వెనకాడలేదు. షాబాజ్‌కు ఆగస్టులో నెలలో వివాహమైంది. వీసా రావడంతో రిసెప్షన్ అయిన నాలుగైదురోజుల అనంతరం విదేశాలకు పంపాం. తీరా అక్కడికెళ్లాక మావాడిని బందించారు. రూ.3 లక్షలు లేదా 3,000 డాలర్లు ఇవ్వాలంటున్నారు. – అఫ్జల్, షాబాజ్ సోదరుడు, మానకొండూరు మా తమ్ముడిని అమ్ముకున్నరు కంబోడియా వీసా సిద్ధంగా ఉందని ఏజెంట్లు మేనాజ్ అలీ, అబ్దుల్ రహీం మా తమ్ముడు నవీద్ అబ్దుల్‌కు చెప్పారు. అందరికీ చెప్పినట్లుగా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని, రూ.2 లక్షలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎలాంటి సమస్య రాదని, అన్ని బాధ్యతలు తీసుకుంటామన్నారు. తీరా ఇప్పుడు మా తమ్ముడికి ఇబ్బందులు వస్తున్నాయంటే.. తనకేం సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. రూ.3 లక్షలు చెల్లిస్తే తాను విడిపిస్తానని చెబుతున్నాడు. – అబ్దుల్ ముహీద్, నవీద్ సోదరుడు, సిరిసిల్ల ముందే అంతా వివరించా కంబోడియాకు వెళ్లిన ఆరుగురి యువకుల విషయంలో నా తప్పిదమేమీ లేదు. నేను వారికి ఉద్యోగం ఎలా ఉంటుంది? అన్న విషయం స్పష్టంగా వివరించాను. కెసెనీలో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ అని చెప్పాను. వారూ అంగీకరించే వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక.. వారు ఇలా ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదు. – మేనాజ్ అలీ, కన్సల్టెన్సీ నిర్వాహకుడు -
యూకేలో ఉద్యోగమంటూ.. మాయ మాటలతో బుట్టలో వేసుకొని
సాక్షి, హిమాయత్‌నగర్: యూకేలో ఉద్యగమంటూ నమ్మించారు.. డాక్యుమెంట్లకు డబ్బులన్నారు. అలా ఆశ పెట్టి నగర వాసి నుంచి ఉన్నవన్నీ ఊడ్చేశారు సైబర్ నేరగాళ్లు. నగర వాసి ఉద్యోగం కోసం తన రెజ్యూమ్ని ఆన్లైన్ పెట్టాడు. రెజ్యూమ్ చూసిన సైబర్ నేరగాడు నగర వాసితో మాటలు కలిపాడు. యూకేలో అయితే మంచి హోదా, ప్యాకేజీతో మీ చదువుకు తగిన ఉద్యోగం వస్తుందన్నాడు. అతను చెప్పిన మాయ మాటలకు బుట్టలో పడ్డాడు. డాక్యుమెంట్స్ కోసమని, వీసా కోసమని డబ్బులు కావాలన్నాడు. ఆ తర్వాత తాము చెన్నై ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని మరికొన్ని డాక్యుమెంట్స్ అవసమరమన్నారు. ఇలా డాక్యుమెంట్స్ పేరు చెప్పి నగర వాసికి ఆశ చూపి పలు దఫాలుగా రూ.11లక్షల 14వేలు కాజేశారు. మరో వ్యక్తి ఆర్బీఎల్ బ్యాంక్ కస్టమర్ కేర్ కోసం ప్రయత్నించగా..తాము సాయ పడతామని చెప్పారు. మొబైల్లో ఎనీడెస్క్ యాప్ ఇన్స్టాల్ చేయించి నగర వాసి అకౌంట్లో నుంచి రూ.2లక్షల 56వేలు స్వాహా చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. చదవండి: సాయితో సోనీ వివాహేతర సంబంధం.. చంపుతానని భర్త బెదిరించడంతో.. -
ఉద్యోగాల పేరిట మోసం.. మాజీ మంత్రి అరెస్టు
సాక్షి, చెన్నై(తమిళనాడు): ఉద్యోగాల పేరిట రూ. 3 కోట్ల కేసులో మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీని విరుదునగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అన్నాడీఎంకే హయంలో పాడి పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కేటీ రాజేంద్రబాలాజీ మీదున్న ఆరోపణలు, నమోదైన కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఆవిన్సంస్థలో ఉద్యోగాల పేరిట రూ. 3 కోట్లు ఆయన మోసం చేసిన వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగానే పరిగణించారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించి భంగ పడ్డ రాజేంద్ర బాలాజీ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు గత నెల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కోసం 8 బృందాలు రంగంలోకి తీవ్రంగా గాలిస్తూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో తలదాచుకుని ఉన్న ఆయన్ను విరుదునగర్ పోలీసులు బుధవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. అనంతరం అక్కడి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాలతో విరుదునగర్‌కు తరలించారు. -
సైబర్ మోసాలకు గురయ్యారా.. ఈ నంబర్‌కు కాల్ చేయండి!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో ఇప్పటివరకు 50 సైబర్ నేరాలు జరిగాయి. ఆయా కేసులను ఛేదించిన సైబర్ క్రైమ్ పోలీసులు రూ.68 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందించినట్లు రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్ హరినాథ్ తెలిపారు. కస్టమర్ కేర్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, ఫిష్పింగ్ కాల్స్, ఓటీపీ మోసాలు, హనీ ట్రాప్స్, గిఫ్ట్, పెట్టుబడి మోసాలు వంటి వివిధ ఆన్లైన్ మోసాలకు సంబంధించి కేసులు కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. విచారణ సమయంలో ఒక ఖాతా నుంచి అనేక ఇతర అకౌంట్లు, వ్యాలెట్లకు నిధుల బదిలీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని సంబంధిత బాధితుల ఖాతాల్లోకి తిరిగి రికవరీ చేపించారు. కొన్ని సందర్భాలలో బాధితులు మోసానికి గురయ్యామని తెలిసిన తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 155260కి ఫిర్యాదు చేయడంతో ఆయా బాధితుల ఖాతాను హోల్డ్‌లో ఉంచి.. నేరగాళ్ల ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దర్యాప్తు బృందాలు నిరంతరం విచారణ జరిపి బాధితులకు పోగొట్టుకున్న మొత్తాలను వాపస్ చేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఈ– మెయిల్స్ ద్వారా వచ్చే నకిలీ సందేశాలు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కేవైసీ అప్డేట్, కస్టమర్ కేర్ సర్వీస్ అంటూ అపరిచిత వ్యక్తుల కాల్స్‌కు స్పందిచకూడదని రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్. హరినాథ్ సూచించారు. సైబర్ మోసాలకు గురైన తక్షణమే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 155260 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును రికవరీ అయ్యే అవకాశముందని తెలిపారు. -
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం: మాజీ మంత్రిపై కేసు
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ.3.30 కోట్లు నగదు వసూలు చేసి.. మోసం చేశారంటూ మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీపై కేసు నమోదు చేశారు. విరుదునగర్ జిల్లా క్రైం విభాగం పోలీస్‌స్టేషన్‌లో సాతనూరుకు చెందిన రవీంద్రన్ ఓ గతంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీమంత్రి రాజేంద్రబాలాజీ, బలరామన్, బాబురామ్, ముత్తుపాండిపై విరుదునగర్ జిల్లా క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఫ్రెండ్ అని నమ్మి.. అక్కాచెల్లెళ్లు రూ. 8 లక్షలు ఇచ్చారు.. తీరా చూస్తే
ఇటీవలే బి.టెక్ పూర్తి చేసిన చంద్రిక (పేరు మార్చడమైనది) ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఓ రోజు ఫేస్బుక్లో ఆనంద్(పేరుమార్చడమైనది) అనే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అతని ప్రొఫైల్ నచ్చి చంద్రిక యాక్సెప్ట్ చేసింది. తన పోస్టులకు స్పందించడంతో పాటు, మెసెంజర్ ద్వారా సరైన సూచనలు చేయడం, సంభాషణ నచ్చడంతో కొన్ని రోజుల్లోనే చంద్రికకు ఆనంద్‌తో స్నేహం కుదిరింది. ఆనంద్ ఫోన్లోనూ చంద్రికతో మాట్లాడుతుండేవాడు. ఇద్దరి స్నేహం వ్యక్తిగత విషయాలు పంచుకునేంతగా ఎదిగింది. డబ్బు ఇస్తే సులువా? సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పింది చంద్రిక. ‘నాకు ప్రముఖ కంపెనీలలో స్నేహితులున్నారు. నేను చెబితే నీకు ఉద్యోగం సులువుగా వచ్చేస్తుంది. కాకపోతే కొంత డబ్బు ఖర్చవుతుంది’ అని చెప్పాడు ఆనంద్. అతను చెప్పిన విషయాలు చంద్రికకు బాగా నచ్చాయి. ఆ ఖర్చు భరిస్తానని చెప్పింది. అంతేకాదు, తన అక్క లహరి (పేరు మార్చడమైనది)కి కూడా జాబ్ చూడమని, కరోనా కారణంగా జాబ్ పోయిందని చెప్పింది. ఆనంద్ సరేనన్నాడు. రెండు రోజుల్లో తను ఏయే కంపెనీలవారితో మాట్లాడిందీ చెప్పి, రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంద’న్నాడు. ఆనంద్ చెప్పిన అమౌంట్‌ను అతని అకౌంట్‌కు బదిలీ చేశారు అక్కాచెల్లెళ్లు. ఫోన్ ఇంటర్వ్యూతో బురిడీ రెండు రోజుల తర్వాత ఓ పేరున్న కంపెనీ నుంచి అంటూ చంద్రికకు ఫోన్ వచ్చింది. హెచ్ఆర్గా పరిచయం చేసుకున్న వ్యక్తి వెరిఫికేషన్ అంటూ సర్టిఫికెట్ పేపర్లు ఆన్లైన్ ద్వారా తీసుకున్నాడు. వెరిఫికేషన్, ఇంటర్వ్యూ అంటూ వారం రోజులు ఫోన్లోనే సంభాషణలు జరిగాయి. కంపెనీలో జాబ్ కన్ఫర్మ్ కావాలంటే ఏయే దశల్లో ఎంత మొత్తం చెల్లించాలో కూడా ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో దఫ దఫాలుగా అక్కాచెల్లెల్లిద్దరూ రూ.8 లక్షల వరకు నగదు మొత్తాన్ని బదిలీ చేశారు. అందుకు లహరి తను గతంలో ఉద్యోగం ద్వారా సంపాదించిన మొత్తం, తల్లిదండ్రుల నుంచి తీసుకున్న డబ్బును బదిలీ చేశారు. కరోనా సమయం కాబట్టి, కొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంటుందని, మెయిల్ ద్వారా కంపెనీ నుంచి జాయినింగ్ లెటర్ వస్తుందని సదరు వ్యక్తి చెప్పాడు. చంద్రిక, లహరి సరే అన్నారు. నెల రోజులైనా కంపెనీ నుంచి ఎలాంటి మెయిల్, ఫోన్ కాల్ రాలేదు. తాము డబ్బు చెల్లించిన వ్యక్తికి ఫోన్ చేస్తే స్విచ్డాఫ్ వస్తోంది. ఫేస్బుక్లో పరిచయమైన ఆనంద్‌కు ఎన్ని మెసేజ్‌లు చేసినా రిప్లై లేదు. ఆ తర్వాత అతని ఫేస్బుక్ అకౌంట్ కూడా కనిపించలేదు. మోసపోయామని గుర్తించేలోపు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయారు. ∙∙ స్కామ్‌లను ఇలా గుర్తించవచ్చు.. సంభాషణల్లోనే ఇంటర్వ్యూ అంటూ, ఆ వెంటనే ఉద్యోగం వస్తుందని త్వరపెడతారు. మెసేజ్‌ల ద్వారా ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేస్తారు. ∙నిజానికి ఏ కంపెనీలు ఉద్యోగం పేరిట డబ్బు అడగవు.సెక్యూరిటీ డిపాజిట్ లేదా సర్వీస్ ఫీజు చెల్లించమని కోరవు. అనేక స్కామ్ ఇ–మెయిల్లు నిజమైన కంపెనీల నుండి వచ్చినట్లు కనిపిస్తాయి. కానీ, అవి వృత్తి పరమైనవి కావు. వారి అధికారిక డొమైన్ ఇ–మెయిల్‌లకు బదులు గూగుల్/యాహూ ఖాతాల నుండి మెయిల్స్ వస్తాయి. ఉదాహరణకు: jobs@bankofamerica.comకు బదులు ఇలా jobs@bankof-america.com ఏదో ఒక లెటర్ తేడాతో ఇ–మెయిల్ ఉంటుంది. విరామచిహ్నాలు, కామాలు, పుల్‌స్టాప్‌లు, పేరాలు, వ్యాకరణ దోషాలు.. వంటివి ఉంటాయి. ఇ–మెయిల్ ఐడీ కూడా నకిలీది ఇవ్వచ్చు. తనిఖీ సాకుతో మన వ్యక్తిగత సమాచారాన్ని (ఆధార్, పాన్, పాస్‌పోర్ట్ కాపీలు) ఇవ్వమని అడిగితే, చట్టబద్ధమైన ఇ–మెయిల్ ఐడికి మాత్రమే పంపించామా లేదా అనేది నిర్ధారించుకోవాలి. కొన్ని ఆన్లైన్ జాబ్ స్కామ్‌లు అర్హత లేకపోయినా అధికారిక ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారానే ఉద్యోగం పొందవచ్చని చెబుతారు. సులభమైన ఆఫీసు పనిని ఇంటి నుంచే చేయవచ్చని ఆఫర్ చేస్తారు. పెనాల్టీ క్లాజ్ ఉన్న సాధారణ డేటా ఎంట్రీ ఉద్యోగం చేయడానికి ఒప్పంద పత్రంపై సంతకం చేయమని, ఇరకాటంలో పెడతారు. కొన్ని సాధారణ పనుల ద్వారానే (ఫాలో, లైక్, షేర్, కామెంట్..) ఆదాయం పొందవచ్చనే ఆఫర్ ద్వారా ఆకర్షణకు లోనుచేస్తారు. విదేశాలలో విద్య/ఉద్యోగం.. వీసా గ్యారెంటీతో భారీగా ఛార్జీలు వసూలు చేస్తారు. జాబ్ స్కామ్‌లో చిక్కుకోకుండా ఉండాలంటే.. ఫీజు కోసం అంటూ ముందస్తుగా డబ్బు చెల్లించవద్దు. ఇంటి నుంచి ఆన్లైన్ వర్క్ చేయడానికి మీరు డబ్బు చెల్లించని పనిని తీసుకోండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంపించవద్దు. ఒక చిన్న పని కోసం కంపెనీ పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తుందంటే, అస్సలు నమ్మద్దు. ఉద్యోగం కోసం ఏదైనా కంపెనీకి ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వద్దు. అలా ఇచ్చే సందర్భాలలో ఆ కంపెనీలలో పని చేసే, మీతో పాటు చదువుకున్న స్నేహితుల సూచనలు తీసుకోవడం మంచిది. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Cyber Crime: తల్లికి తన గురించి చెప్పిందని.. పొరుగింటి కుర్రాడే గృహిణిపై -
యువకులకు ఉద్యోగాలు.. రైతులకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి..
సాక్షి, నల్లగొండ క్రైం: నిరుద్యోగులకు ఆకర్శణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని, రైతులకు 40శాతం, 60శాతం సబ్సిడీతో ట్రాక్టర్, మోటార్సైకిల్లు, జేసీబీలు, ఇప్పిస్తామని కుచ్చుటోపీ పెట్టిన నేరస్తుడితోపాటు సహకరించిన మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ప్రకటనలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి యాదాద్రి జిల్లా రామాజపురం గ్రామానికి చెందిన వీరవల్లి ప్రదీప్‌రెడ్డి చైర్మన్‌గా మరో 14మంది సభ్యులతో వీఎస్‌వీపీ ప్రైవేటు కంపెనీ నిర్వహిస్తున్నారు. వీరు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 100 మంది వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. రంగారెడ్డి , ఖమ్మం, భూపాలపల్లి, కామారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, జనగాం జిల్లాల నందు వీఎస్‌వీపీ ప్రైవేటు కంపెనీ పేరిట ఉద్యోగాలు, రైతులకు ట్రాక్టర్లు, జేసీబీలు , బైక్‌లు ఇప్పిస్తామని లక్షల్లో వసూలు చేసి వారికి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రూ. 3కోట్లకు పైగా వసూలు... 2019లో ఉద్యోగాలు, ట్రాక్టర్లు, జేసీబీలు ఇప్పిస్తామని రూ.1.8కోట్లు వసూలు చేయగా 2020లో 2కోట్లపైగా వసూలు చేశారు. సంస్థ పేరు మీద నమ్మదగిన ప్రకటనలు ఇస్తూ మాయ మాటలు చెప్పి నిరుద్యోగులు, రైతులను మోసగించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే 100 మంది నిరుద్యోగులు 5లక్షలోపు ఉద్యోగాల కోసం చెల్లించినట్లు , రైతులకు సబ్సిడీ పై జేసీబీలు, ట్రాక్టర్లు , బైక్‌లు ఇప్పిస్తామని ఈఎంఐలు కంపెనీ చెల్లిస్తుందని రైతులు తమ వాటాగా లక్షన్నర కడితే సరిపోతుందని నమ్మబలికి వసూలు చేశారు. ఇలా వెలుగులోకి .. పేపర్లో వీఎస్‌వీపీ కంపెనీ పేరిట ఉద్యోగాలు ఇస్తామని 2019లో ప్రకటన రావడంతో ఈఏడాది ఏప్రిల్19న నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకట్‌రెడ్డి వీఎస్‌వీపీ కంపెనీ నందు కాంట్రాక్టు ఉద్యోగం కోసం రూ.1.50లక్షలు చెల్లించాడు. బీఎస్ఎన్ఎల్లో కాంట్రాక్టు జాబ్ ఇప్పిస్తామని చెప్పి వీఎస్‌వీపీలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్‌గా ఎంపికైనట్లు జాయినింగ్ ఆర్డర్‌ను ఇచ్చారు. శిక్షణ పేరుతో కాలయాపన చేస్తూ జీతాలు ఇవ్వకుండా అనేక మంది నిరుద్యోగుల నుంచి డీడీల రూపంలో డబ్బులు తీసుకుని కంపెనీలోనే జాయిన్ చేసుకున్నారు. వందలాదిమందికి ఉద్యోగాలపై శిక్షణ ఇస్తున్నట్లుగా నమ్మబలికించారు. నిరుద్యోగులంతా సంస్థ చైర్మన్ వీరవల్లి ప్రదీప్‌రెడ్డిని ఇంకెంతకాలం అంటూ నిలదీయడంతో సంస్థకు అగ్రికల్చర్ ప్రాజెక్టు వచ్చిందని అందులో పనిచేస్తేనే జీతాలు ఇస్తామని నిరుద్యోగులను బెదిరించి సంస్థలో పని చేయించుకున్నారు. 13 మందికి ట్రాక్టర్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ద్వారా 13మందికి ట్రాక్టర్లు, ఇద్దరికి బైక్‌లు సంస్థ సబ్సిడీ ఇస్తుందని ఇప్పించారు. ఒకొక్క రైతు నుంచి 1లక్ష50వేలు వీఎస్‌వీపీ సంస్థకు చెల్లించారు. 60శాతం సబ్సిడీ వస్తుందని నమ్మబలికారు. ఈఎంఐలు తామే కడుతామని చెప్పారు. ఈఎంఐలు కట్టకుండా వీఎస్‌వీపీ సంస్థవారు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇదే కేసులో కుశాయిగూడ కామారెడ్డి పోలీస్ స్టేషన్లో సంస్థ చైర్మన్ వీరవల్లి ప్రదీప్‌రెడ్డి, డైరెక్టర్ నవీన్‌రెడ్డిల పై గతంలో కేసులు నమోదయ్యాయి. ఇలా పట్టుకున్నారు నల్లగొండలోని రవీంద్రనగర్ కాలనీలో వీఎస్‌వీపీ కార్యాలయానికి వస్తుండగా సంస్థ చైర్మన్ ప్రదీప్‌రెడ్డి, నవీన్‌రెడ్డి , సంస్థలో పనిచేస్తున్న బిట్ల సాయి, జ్ఞానేశ్వర్, శ్రీనులను పట్టుకున్నట్లు తెలిపారు. పరారీలో మరి కొందరు.. బారీ ఎత్తున ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి కోట్లాదిరూపాయలు వసూలు చేసిన వారిలో కొందరు నేరస్తులు పరారీలో ఉన్నారు. కారుకొండ వరప్రసాద్ , వీరవల్లి స్వాతి, కలమతుల్ల సతీష్‌రెడ్డి, కోమట్ల నవీర్‌రెడ్డి, సంజయ్ , శరత్, జలజ, సాయిరాం, అనుపమ, దివ్వా, తదితరులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆంతర్యమేంటి..? నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్న పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏ ఉద్యోగానికి ఎంత డబ్బులు తీసుకున్నారు ..? ఏఏ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికించారు...? ఉద్యోగాల జాయినింగ్ ఆర్డర్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీ ఎక్కడ ప్రింట్ చేశారు. ...? ఇతర వివరాలేవీ వెల్లడించకపోవడంతోపాటు మీడియా ముందు ప్రవేశపెట్టకపోవడంపై అనేక చర్చలకు దారితీస్తుంది. -
ఉద్యోగాల పేరుతో కిలేడీ చీటింగ్.. కోట్లు కొట్టేసి మాస్టర్ ప్లాన్..
సాక్షి, బొబ్బిలి(విజయనగరం): ఉద్యోగాలిప్పిస్తానని పలువురిని మోసం చేసి సుమారు రూ.కోటి వసూలు చేసిన మండలంలోని రాముడువలసకు చెందిన కిలేడీ బుట్ట సరస్వతి ఎట్టకేలకు అరెస్టు అయ్యింది. అసలు పేరును కాదని విజయరాణిగా చలామణి అవుతూ పలువురిని మోసగించింది. తనకు పెద్దలతో పరిచయాలున్నాయని ఒకొక్కరి నుంచి రూ.50వేల నుంచి ఆరు లక్షల వరకు వసూలు చేసింది. అంగన్వాడీ కార్యకర్త, మండల కో ఆర్డినేటర్, 104 అంబులెన్సు డ్రైవర్, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్, ఫార్మాసిస్టు, కార్యదర్శి తదితర ఉద్యోగాల పేరు చెప్పి సుమారు 13 మంది నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈమెను పట్టణంలోని గుర్తించిన బాధితులు డబ్బులు ఎప్పుడిస్తావని నిలదీయడంతో శనివా రం రాత్రి గొడవ జరిగిన విషయం పాఠకులకు తెలిసిందే. ఎస్ఐలు వెలమల ప్రసాదరావు, చదలవాడ ప్రసాదరావు దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేశారు. ఆదివారం రిమాండ్ నిమిత్తం తరలించినట్టు చెప్పారు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
కేటుగాళ్ల మాయ.. 19 లక్షలు స్వాహా
సాక్షి, ఆదిలాబాద్ : ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు కాజేసిన ఘటన నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం బాధితుడు రాజన్న, మంచిర్యాల రూరల్ సీఐ కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని సీసీసీ కార్నర్ రామ్‌నగర్‌లో నివాసం ఉంటూ గంధం రాజన్న మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో పని చేస్తున్నాడు. కరీంనగర్లో నివాసం ఉండే దూరపు బంధువులు ముద్దసాని అన్వేష్, ముద్దసాని అభిలాష్ అనే అన్నదమ్ములు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ రాజన్నను నమ్మబలికారు. అభిలాష్ ఏ పని లేకుండా తిరుగుతుండగా.. అన్వేష్ కరీంనగర్‌లోని జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అన్వేష్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో నమ్మిన రాజన్న అన్నదమ్ములు ఇద్దరికి విడతల వారీగా మొత్తం రూ. 19 లక్షల 80వేలు ముట్టజెప్పాడు. బాధితుడికి నకిలీ జాయినింగ్ లెటర్.. రాజన్న తన ఉద్యోగం విషయం అన్నదమ్ములను పలుమార్లు అడుగడంతో కేటుగాళ్లు ఏకంగా నకిలీ జాయినింగ్ లెటర్ సృష్టించారు. కరీంనగర్ జిల్లా గంగాధర ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చిందని, 17–07–2020న ఉదయం 10.30 నిమిషాలకు రిపోర్ట్ చేయాలని, గంగాధర తహసీల్దార్ కార్యాలయం స్టాంప్, తహసీల్దార్ సంతకంతో కూడిన ఒక నకిలీ పత్రాన్ని సృష్టించారు. అయితే రాజన్న అది నకిలీ పత్రమని గుర్తించి తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వమని వారిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. వారు స్పందించకపోవడంతో రాజన్న మోసపోయానని గ్రహించి సీసీసీ నస్పూర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల రూరల్ సీఐ కుమారస్వామి తెలిపారు. చదవండి: ఓఎల్ఎక్స్ మోసం.. దొంగ దొరికేశాడుగా! -
టీవీలో యాంకర్ చాన్స్‌లు, కంపెనీలలో ఉద్యోగాలంటూ..
సాక్షి, త్రిపురారం(నల్లగొండ): టీవీలో యాంకర్ చాన్స్‌లు, జ్యోతిష్యం, ఉద్యోగాలు, కంపెనీల్లో వాటాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని త్రిపురారం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇటీవల రూ.6లక్షల50వేలు తీసుకొని మోసం చేశాడని మండలంలోని లోక్యాతండాకు చెందిన మెగావత్ హనుమంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన కోనాల అచ్చిరెడ్డిపై ఫిర్యాదు చేశాడు. ఈమేరకు నిందుతుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరిపారు. కోనాల అచ్చిరెడ్డి టీవీలో యాంకర్ చాన్స్‌లు, జ్యోతిష్యం, ఉద్యోగాలు, కంపెనీల్లో వాటాలు ఇప్పిస్తానంటూ మోసం చేయడమే వృత్తిగా పెట్టుకున్నాడన్నారు. ఖమ్మంలో ఓ యువతికి టీవీలో యాంకరింగ్, మరో మహిళకు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యో గం, మరో మహిళకు రైల్వే అసిస్టెంట్ ఉద్యోగం అంటూ మోసం చేశాడని తెలిపారు. ఇటీవల నల్లగొండ పట్టణంలో హనుమాన్ నగర్‌కు చెందిన ఓ యువకుడు, విజయవాడకు చెందిన ఓ యువతికి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ టీ వీ చానల్ యాంకర్ అవకాశం, నల్లగొండలో జ్యోతిష్యం పేరిట మరో వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా స్టేషన్ల్లో సైతం కేసులు నమోదయ్యాయని ఎస్ఐ చెప్పారు. ఎస్పీ రంగనాథ్ ఆదేశాల మేరకు నిందితుడిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు. -
సైబర్ క్రైమ్‌లో మరో కోణం!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో ఉద్యోగాల పేరుతో ప్రటకనలు ఇవ్వండి.. ఫోన్ ఇంటర్వ్యూల పేరుతో హడావుడి చేయడం.. నకిలీ ఆఫర్ లెటర్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి అందినకాడికి దండుకోవడం.. ఇలాంటి సైబర్ నేరాలను తరచూ చూస్తూనే ఉంటాం. అయితే శుక్రవారం సిటీలో ఓ కొత్త తరహా సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. ఓ యువతికి ఆన్లైన్లో ఉద్యోగం ఇచ్చిన నేరగాళ్లు ఆమె పనిలో క్వాలిటీ లేదంటూ బెదిరించి రూ.1.5 లక్షలు కాజేశారు. బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బేగంపేట్‌కు చెందిన ఓ యువతి ఉన్నత విద్యనభ్యసించారు. ఆమెకు కొన్ని రోజుల క్రితం ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. రోటీన్ పనులకు భంగం కలగకుండా, తమ కోసం రోజులో కొద్ది సమయం కేటాయించాలని, అలా తాము చెప్పే ఉద్యోగం చేస్తే మంచి జీతం ఇస్తామంటూ ఆమె ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దాన్ని చూసిన బాధితురాలు ఆ నంబర్లను సంప్రదించింది. సైబర్ నేరగాళ్లు ఆమెకు డాటా ఎంట్రీ వర్క్ అప్పగించారు. అతవలి వ్యక్తులు పంపిన వర్క్‌ను ఆమె నిర్ణీత సమయంలో పూర్తిచేసి పంపింది. వర్క్‌లో క్వాలిటీ రాలేదని, తమ ఒప్పందాన్ని ఉల్లంఘించావంటూ పేర్కొన్నారు. దీని వల్ల తమకు జరిగిన నష్టంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామంటూ బెదిరించారు. నకిలీ లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో బెదిరిపోయిన ఆమె వారు చెప్పినట్లే రూ.1.5 లక్షలు చెల్లించింది. అయినా ఆగకుండా మరికొంత మొత్తం కావాలంటూ బెదిరిస్తుండటంతో శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరో రెండు ఘటనల్లో.. ఎర్రమంజిల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇండియా మార్ట్‌లో ఏసీలు కొనాలని భావించారు. ఇంటర్నెట్ నుంచి తీసుకున్న ఫోన్ నంబర్లో సంప్రదించగా.. ఏసీలు పంపిస్తామంటూ నమ్మబలికిన నేరగాళ్లు రూ.99 వేలు కాజేశారు. వెంకటరమణ కాలనీకి చెందిన ఓ మహిళ ఆన్లైన్లో ఓ వస్తువును ఖరీదు చేశారు. నెల రోజులకూ అది తనకు చేరకపోవడంతో ఆ సంస్థను సంప్రదించాలని భావించాడు. వారి నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి అందులో ఉన్న నకిలీ కస్టమర్ కేర్ నంబర్ తీసుకున్నారు. సైబర్ నేరగాళ్లు ఆమె బ్యాంకు ఖాతా వివరాలు తీసుకొని ఖాతానుంచి రూ.1.55 లక్షలు కాజేశారు. ఈ రెండు ఉదంతాల పైనా కేసులు నమోదయ్యాయి. -
గన్నవరం విమానాశ్రయంలో ఉద్యోగాలంటూ..
సాక్షి, కృష్ణా : గన్నవరం విమానాశ్రయంలో ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు ఇస్తామంటూ ఆన్లైన్ మోసానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. ఉద్యోగంలో చేరండి అంటూ మోసగాళ్లు ఆన్లైన్లో అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తుండటంతో నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆశతో ఉద్యోగంలో చేరేందుకు వెళ్లిన యువకులకు మోసం అని తెలియడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ విషయంపై గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ.. ఆన్లైన్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పే వారి మాటలు నమ్మొద్దని సూచించారు. గన్నవరం విమానాశ్రయంలో ఉద్యోగం ఇస్తామని మోసం చేసినట్లు కొంత మంది ఫోన్ ద్వారా తెలియజేశారని వెల్లడించారు. ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళు ఎయిర్ లైన్స్ నిజమైన వెబ్సైట్లో చూసి వెళ్లాలని తెలిపారు. ఎయిర్ లైన్స్‌లో ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. ముందస్తుగా నగదు డిపాజిట్ చేయించి అపాయింట్మెంట్ లెటర్ ఆన్లైన్లో పంపిస్తే అది ఫేక్‌గా గుర్తించాలని పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిస్తే ఎయిర్ పోర్ట్ అథారిటీ ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఉద్యోగాలు పేరిట మోసపోకుండా ముందస్తుగా తెలుసుకునేందుకు ఓ ఫోన్ నంబర్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. గతంలో కూడా మోసపోయిన వారు తమ దృష్టికి తీసుకురావడంతో విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. -
ఉద్యోగం ఇప్పిస్తానని యువతిపై అత్యాచారం
రాంగోపాల్‌పేట్: రైల్లో పరిచయమైన యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్లో శనివారం అర్ధరాత్రి జరిగింది. డీఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర బుసావల్‌కు చెందిన ఓ యువతి (24) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. చర్లపల్లి రైల్వే కాలనీకి చెందిన వివేకానంద (42) రియల్ ఎస్టేట్ వ్యాపారి. వ్యాపారం పనిమీద 15 రోజుల క్రితం మహారాష్ట్రకు వెళ్లాడు. అక్కడ స్నేహితుడి ద్వారా వివేకానందకు సదరు యువతి రైల్లో పరిచయమైంది. తనకు ఉద్యోగం కావాలని వివేక్‌తో చెప్పింది. దీంతో ఆమెకు తన మొబైల్ నంబర్ ఇచ్చాడు. రెండు వారాల నుంచి ఇద్దరు ఫోన్లో చాటింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ వస్తే ఉద్యోగం చూపిస్తానని ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె ఈ నెల 18న ఉదయం మహారాష్ట్ర నుంచి సికింద్రాబాద్‌కు వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేసింది. శనివారం రాత్రి 10.30గంటల సమయంలో తన స్నేహితుడు రాజుతో కలిసి వివేకానంద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆ యువతిని కారులో ఎక్కించుకున్నాడు. కారులోనే స్నేహితుడితో కలిసి మద్యం తాగారు. యువతికి కొన్ని చిరుతిళ్లు బలవంతంగా తినిపించారు. దీంతో ఆమెకు కొద్దిగా మగతగా అనిపించడంతో తననను హోటల్ వద్ద డ్రాప్ చేయాలని చెప్పగా అతను నిరాకరించాడు. అనంతరం అక్కడే ఉన్న ఓ హోటల్‌కు మారాలని ఆ యువతిపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో మరోసారి హోటల్‌కు రమ్మని చెప్పి రాత్రి 11.30 గంటల సమయంలో అక్కడ హోటల్‌ను తనే బుక్ చేశాడు. ఆమెను పైకి వెళ్లమని చెప్పి కొద్దిసేపటి తర్వాత తనతో పాటు ఉన్న రాజును కిందనే ఉంచి బ్యాగును తీసుకుని హోటల్ గదికి వెళ్లాడు. మళ్లీ ఎందుకు వచ్చావని ఆమె ప్రశ్నించడంతో బ్యాగు ఇచ్చేందుకు అని చెప్పి ఆమెను చంపుతానని బెదిరించాడు. అప్పటికే ఆమెకు కొద్దిగా మగతగా ఉండి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి గదిలో నుంచి బయటకు వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆమెకు మెలకువ వచ్చింది. విషయం తెలుసుకుని 100 డయల్‌కు ఫోన్ చేసింది. వెంటనే గోపాలపురం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ సదరు హోటల్‌కు వెళ్లి బాధితురాలి ఫిర్యాదు స్వీకరించారు. అనంతరం ఆమె నగరంలోనే ఉన్న బంధువులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న రాజు కారులో వివేక్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులు నిందితుడు వివేక్‌తో పాటు అతనికి సహకరించిన రాజును ఆదివారం అరెస్టు చేశారు. -
బురిడీ కొట్టించి ‘దృశ్యం’ చూపిస్తాడు
భోపాల్: కొన్ని సినిమాలు నేరగాళ్లకు ప్రేరణగా నిలుస్తున్నాయి. తప్పు చేసి తప్పించుకోవడమెలా అనేవాటిని కేటుగాళ్లకు సులువుగా నేర్పిస్తున్నాయి. తాజాగా భోపాల్‌లో వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం..! వివరాలు.. భోపాల్‌లోని జలంధర్‌కు చెందిన సిమ్రన్ సింగ్ నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. పైకి హుందాగా కనిపిస్తూ అలవోకగా ఇంగ్లిష్ మాట్లాడుతూ నిరుద్యోగులను బుట్టలో పడేశాడు. స్వదేశంలోనైనా, విదేశంలోనైనా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదంటూ మాయమాటలు చెప్పేవాడు. ఇంటర్వ్యూల పేరిట హోటల్‌కు పిలిచి మత్తుమందు కలిపిన టీ, కాఫీ ఇచ్చి స్పృహ తప్పిపోగానే తన అసలు స్వరూపం చూపిస్తాడు. నగదు, నగలు ఇలా అందినకాడికి దోచుకుంటాడు. దేశంలోని ఎనిమిది నగరాల్లో 30కి పైగా అతని బాధితులు ఉన్నారు. ముంబైకి చెందిన రాజేంద్ర గుణేకర్కు ‘యూరోపియన్ వర్క్ వీసా’ ఇప్పిస్తానని భోపాల్‌కు రప్పించి బురిగడీ కొట్టించాడు. అతనికి మత్తుమందు ఇచ్చి రూ.2 లక్షల నగదు, గోల్డ్ రింగ్‌తో ఉడాయించాడు. అదే నగరానికి చెందిన పెట్రోకెమికల్ ఇంజనీర్, అతని మిత్రడికి కూడా మత్తుపదార్థాలు ఇచ్చి వారి ఏటీఎమ్‌లను దొంగిలించి రూ.2 లక్షలు విత్‌డ్రా చేసుకున్నాడు. భోపాల్‌లోని ఓ కల్నల్ దగ్గరనుంచి రూ.7 లక్షలకు పైగా దోచుకున్నాడు. ఇక అతని బాధితుల లిస్టులో మహిళల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. ముంబైకు చెందిన ఓ మహిళను మధ్యప్రదేశ్‌కు రప్పించి ఆమె దగ్గర రూ.2 లక్షలు దొంగిలించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పోలీసులకు దొరక్కుండా దృశ్యం సినిమాను తలెదన్నేలా ఎత్తులు వేశాడు. ఎప్పటికప్పుడు సిమ్‌కార్డులు మార్చుతూ, నేరం చేసిన తర్వాత బాధితుల ఫోన్లను దొంగిలించి ట్రైన్లు, బస్సుల నుంచి విసిరేసి ఆధారాలు లేకుండా చేసేవాడు. అయితే ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని బండారం బయటపడింది. రంగంలోకి దిగిన భోపాల్ పోలీసులు అతని నుంచి ఫేక్ ఆధార్ కార్డులను, నిద్రమాత్రలను స్వాధీనం చేసుకున్నారు. కొసమెరుపు ఏంటంటే.. సిమ్రన్ సింగ్ కూడా గతంలో ఈ విధంగానే మోసపోయాడు. అతన్ని కెనడాకు పంపిస్తానని చెప్పి ఓ వ్యక్తి రూ.2.25 లక్షలు తీసుకొని మోసగించాడు. ఆ తర్వాత సిమ్రన్ సింగ్ ‘పోయిన చోటే వెతుక్కోవాలి’అనే తీరుగా ఈ మోసాలకు తెరతీశాడు. -
భార్యల పోషణ కోసం మోసం; నిందితుల అరెస్ట్
భోపాల్: స్థానిక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే ఎర వేసి మహిళలను మోసం చేసిన నిందితులను ఎట్టకేలకు మధ్యప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఎయిమ్స్ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఈ కేసును స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు అప్పగించారు. ఎస్టీఎస్ పోలీసులు కేసుపై పలు కోణాల్లో దర్యాప్తు చేసి మోసానికి పాల్పడ్డ ఇద్దరు నిందితుల ముఠాను పట్టుకుని అరెస్ట్ చేశారు. ఎస్టీఎఫ్ ఏడీజీ అశోక్ అవస్థీ వివరాల ప్రకారం.. ఈ ముఠా భోపాల్‌లోని ఎయిమ్స్‌లో నర్సుగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు సుమారు 50 మంది మహిళలను మోసం చేసినట్లు తెలిపారు. పట్టుబడిని ప్రధాన నిందితుడు దిల్షాద్ ఖాన్ జబల్పూర్ వాసి కాగా, సహచరుడు అలోక్ కుమార్ భోపాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దిల్షాద్ ఖాన్‌కు ఐదుగురు భార్యలు ఉన్నారని, భార్యలతో కుటుంబ పోషణ భారంగా మారటంతో ఇలాంటి మోసాలు పాల్పడుతున్నాడని వెల్లడించారు. నిందితుడు దిల్షాన్.. తన భార్యల్లో ఒకరు జబల్పూర్లో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నారని, అలోక్ కుమార్ భార్య ప్రభుత్వ హాస్టల్లో సూపరింటెండెంట్‌గా పని చేస్తుందని పోలీసులకు వెల్లడించారు. ఈ ఇద్దరు మహిళలకు ప్రత్యక్షంగా ఈ కేసుతో సంబంధం లేకున్నా.. పరోక్ష పాత్ర ఉందనే కోణంలో విచారణ జరుపుతామని అశోక్ అవస్థీ వెల్లడించారు. అదేవిధంగా ఈ ముఠా చేతిలో మోసపోయిన నగర, గ్రామీణ మహిళల వివరాలను తెలుకోవడానికి ఎస్టీఎఫ్ బృందం ప్రయత్నం చేస్తోందని తెలిపారు. -
పోలీసుల అదుపులో మాయలేడి
సాక్షి, బెల్లంపల్లి: కోల్‌బెల్ట్ ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉద్యోగాల పేరిట కోట్లు వసూలు చేసిన మాయలేడీని కాసిపేట పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన ఠాకూర్ సుమలత గత మూడేళ్లుగా ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసిన ఉద్యోగాల విషయంలో జైపూర్, దేవాపూర్ పవర్ప్లాంట్లలో ఉద్యోగాలు పెట్టిస్తానంటూ నిరుద్యోగులను కలిసి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు బాధితుల నుంచి వసూలు చేసింది. అనంతరం నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తుండటంతో బాధితులు విసిగి వేసారి వడ్డీ నష్టపోతున్నామని వాదనకు దిగారు. ఆరు నెలల క్రితం మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో సైతం మోసం చేసినట్లు విన్నవించారు. దీంతో విషయం తెలుసుకున్న సుమలత కోర్టు నుంచి ఐపీ తెచ్చుకొని నోటీసులు పంపించింది. బాధితులు సుమారు రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు చెబుతుండగా నిందితురాలు రూ.80 లక్షలు వరకు వసూలుపై ఐపీ తెచ్చుకుంది. ఉద్యోగాల పేరిట మోసపోయింది పోయి తిరిగి ఐపీ కింద కోర్టు నుంచి నోటీసులు అందుకోవడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాసిపేట, సోమగూడెం, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్‌నగర్, వరంగల్, పర్కాల, హన్మకొండ, రంగారెడ్డి, సికింద్రాబాద్‌లలో సైతం ఉద్యోగాల పేరిట వసూలు చేసినట్లు తెలిసింది. కాగా బాధితుల ఫిర్యాదుపై విచారణ చేపట్టి సుమలత కోసం గాలించగా గత కొన్ని నెలలుగా తప్పించుకు తిరిగింది. ఎట్టకేలకు బుధవారం కాసిపేట పోలీసులు బెల్లంపల్లిలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు. -
ఉద్యోగాల పేరుతో రైల్వే ఉద్యోగుల మోసం
సాక్షి, గాజువాక(విశాఖ) : రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను గాజువాక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసులో రైల్వే ఉద్యోగులైన మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కె.రఘునాథరావు, పి.శ్రీనివాసరావు పలువురు నిరుద్యోగులను నమ్మించారు. ఇద్దరు రైల్వే ఉద్యోగుల అండతో 2017, 2018వ సంవత్సరంలో 43 మంది నుంచి రూ.2.50కోట్లు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేశారు. వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లను కూడా తయారు చేసి ఇవ్వడంతోపాటు వైద్య పరీక్షలను కూడా చేయించి ఉద్యోగాల్లో చేరాలని చెప్పారు. నిరుద్యోగులు ఆ ఆర్డర్లను తీసుకొని భువనేశ్వర్‌లోని ఈస్టుకోస్టు రైల్వే ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆ ఆర్డర్లను పరిశీలించిన రైల్వే అధికారులు అవి నకిలీ ఉత్తర్వులని నిర్థారించారు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న నిరుద్యోగులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అప్పటి నుంచి నిందితుల కోసం గాలిస్తున్నారు. చివరకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడటంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు గాజువాక సీఐ సూరినాయుడు తెలిపారు. -
చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో కుచ్చుటోపీ!
సాక్షి, అమరావతి : అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. లక్షలు ముట్టజెప్పితే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, ఒక ముఠాగా ఏర్పడి నిరుద్యోగ యువతను అడ్డంగా మోసగించారు. మోసపోయిన ఒక అభ్యర్థి ధైర్యం చేసి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నంద్యాలకు చెందిన నరాల శివనాగార్జునరెడ్డి కర్నూలు జిల్లా శిరువెళ్ల మండలానికి చెందిన చాకలి మనోహర్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3.80 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సబార్డినేట్‌గా నకిలీ అపాయింట్మెంట్ లెటర్‌ను సృష్టించారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రూ.30 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. లెటర్ అందజేసి మిగిలిన మొత్తాన్ని తీసుకోవాలని పథకం రచించారు. ఈ లెటర్‌పై అనుమానం రావడంతో మనోహర్ ఈ నెల 16న విషయాన్ని సచివాలయ అధికారుల దృష్టికి తేసుకెళ్లాడు. వారు దాన్ని నకిలీ అపాయింట్మెంట్ లెటర్‌గా ధృవీకరించడంతో మోసపోయానని గ్రహించి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రధాన నిందితుడు మాజీ మంత్రి మనవడు గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు నిందితులను గురువారం ఉదయం తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రెడ్డి గౌతమ్ టీడీపీకి చెందిన మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనవడు. మిగిలిన ముగ్గురు నరాల శివనాగార్జునరెడ్డి, సతీష్, మిథున్ చక్రవర్తి టీడీపీ నాయకులు. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్‌తో తీసుకున్న ఫొటోలను ఎరగా వేసి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏడుగురు అభ్యర్థుల నుంచి రూ.14 లక్షలు వసూలు మొత్తం ఏడుగురు నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తుళ్లూరు ఎస్ఐ వెంకటప్రసాద్ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని విచారించగా ఏడుగురు అభ్యర్థుల నుంచి రూ.14 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరుతో కూడా డబ్బులు వసూలు చేసినట్లు చెప్పారు. గతేడాది నవంబర్ నుంచి వీరు దందా మొదలు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉద్యోగమూ లేదు..డబ్బులు రావు
సాక్షి, శ్రీకాకుళం : ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు వేయిస్తానని నమ్మించి ఐదుగురు నిరుద్యోగుల నుంచి రూ.9.38 లక్షలు వసూలు చేసిన ఉదంతం పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో సంచలనంగా మారింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం నూకవానిపేట గ్రామానికి చెందిన కీలు సందీప్ తన తల్లిదండ్రులతో కలిసి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి నగదు కాజేశాడు. తల్లిదండ్రులు పరారవుతూ సోమవారం కాశీబుగ్గ పోలీసులకు చిక్కారు. సందీప్ పరారీలో ఉన్నాడు. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో చదవుతున్నప్పుడు ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకునిగా ప్రచారం చేసుకుని విద్యార్థులతో పరిచయాలు పెంచుకున్నాడు. అందరి ఫోన్ నంబర్లు సంపాదించాడు. ఎయిర్‌ఫోర్స్‌కు దరఖాస్తులు చేసి వాటి హాల్‌టిక్కెట్‌ను చూపించి త్వరలో ఉద్యోగం వస్తుందని నమ్మించాడు. హాల్‌టిక్కెట్‌ను కాస్త ఉద్యోగం వచ్చినట్లు తర్జుమా చేసి యువకులను మోసగించాడు. ఖరీదైన కారును అద్దెకు తీసుకుని దానిలో యువకులను తిప్పుతూ ఉద్యోగం వచ్చిందని అందరికీ పార్టీలు ఇచ్చి సందడి చేశాడు. వారికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించడంతో (డమ్మీ హాల్‌టిక్కెటు చూపించి) కాశీబుగ్గకు చెందిన పసార మహేష్‌బాబు రూ.1.47లక్షలు, పలాస శివాజీనగర్‌కు చెందిన బమ్మిడి కుమార్ రూ.3.50లక్షలు, మెళియాపుట్టి మండలం పరుశురాంపురం(మురికింటిపద్ర) గ్రామానికి చెందినటువంటి ఉప్పాడ మహేష్ వద్ద రూ.2లక్షలు, వీరితోపాటుగా సాహు రూ.3లక్షలు, లక్ష్మణ్ పాసర రూ.1లక్షా 47వేలు సందీప్ తల్లిదండ్రులు కీలు ధనలక్ష్మి, గోపాలరావు ఖాతాల్లో వేశారు. ఉద్యోగమూ లేదు..డబ్బులు లేవు.. డబ్బులు ఇచ్చి ఏడాది కావస్తున్నా ఉద్యోగాలు రాలేదు. దీంతో అనుమానం వచ్చి డబ్బులు తిరిగి ఇచ్చేయాలని సందీప్‌ను బాధితులు అడిగారు. అదుగోఇదుగో అంటూ చెప్పి తప్పించుకున్నాడు. తీరా సెల్‌ఫోన్ స్వీచ్‌ఆఫ్ రావడంతో సందీప్‌ను, తల్లిదండ్రులను నిరుద్యోగులంతా వెతకడం ప్రారంభించారు. సందీప్ స్వగ్రామం వజ్రపుకొత్తూరు మండలం నూకవానిపేటకు వెళ్లగా అక్కడ ఆచూకీ దొరకలేదు. తల్లిదండ్రులతో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 16వ వార్డులోని మహేశ్వరమ్మ దేవాలయం వెనుకభాగంలో ఉన్న రోడ్డులో అద్దె ఇంట్లో రహస్యంగా నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్నారు. అక్కడకి వెళ్లగా ఆ ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. వజ్రపుకొత్తూరు మండలం తేరపల్లి గ్రామంలో బంధువులు ఇంటి వద్ద ఉన్నారని తెలుసుకుని తల్లిదండ్రులతో కలిసి అక్కడకు వెళ్లారు. వీరిపై సందీప్ తల్లిదండ్రులు దాడి చేశారు. మళ్లీ కాశీబుగ్గలోని అద్దెంటికి సందీప్ తల్లిదండ్రులు వచ్చారని బాధితులు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అక్కడ నుంచి పరారయ్యేందుకు సందీప్ తల్లిదండ్రులు ప్రయత్నించారు. బాధితులు కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి నుంచి పరారవుతున్న సందీప్ తల్లిదండ్రులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అనేక ప్రాంతాల్లో ఉద్యోగాల పేరుతో యువతను మోసగించారు. విజయనగరం జిల్లా ఎస్‌కోటలో విజయ అనే యువతి వద్ద రూ.4లక్షలు తీసుకున్నట్లు ఎస్‌కోట పోలీస్ స్టేషన్లో కేసు సైతం నమోదైనట్లు సమాచారం. బాధితులు సోమవారం కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించి సీఐ వేణుగోపాలరావు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. అనేకమందిని మోసగించిన సోమ్ముతో సొంత గ్రామంలో ఇంటిని అందంగా నిర్మించుకున్నాని బాధితులు సీఐకు తెలియజేశారు. -
మంచిర్యాలలో మాయలేడి
సాక్షి, మంచిర్యాలక్రైం/బెల్లంపల్లి: ఉద్యోగాల కల్పన పేరుతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమాయకులైన నిరుద్యోగులను తన మాయమాటలతో నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేసింది. ఊరు, పేరు తెలియకపోయినా.. కేవలం పరిచయమైతే చాలు.. బుట్టలో వేసుకోవడంలో ఆమెకామె సాటి. ఏం ఉద్యోగం చేస్తున్నావని, ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆత్మీయురాలిగా కుశలప్రశ్నలు వేసి ఆకట్టుకోవడంలో దిట్ట. ఇలా ఆ మహిళ ఒక్కరుకాదు.. ఇద్దరు కాదు ఏకంగా 100 మందిని బోల్తాకొట్టించింది. రూ.కోట్లు వసూలు చేసి చివరికి ఐపీ పెట్టింది. నోటీసులు అందుకున్న బాధితులు మంచిర్యాల డీసీపీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. డిగ్రీ చదివిన ఓ ఇల్లాలు బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి కన్నాల బస్తీ (ఇందిరమ్మ కాలనీ)కి చెందిన సుమలత డిగ్రీ చదువుకుంది. ఓ కొడుకు జన్మించాక భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయినట్లు సమాచారం. అప్పటినుంచి సదరు మహిళ మోసాలు చేయడం అలవా టు చేసుకున్నట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి బజారుఏరియా, గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న ఓ ఇద్దరు యువకులను అసిస్టెంట్లుగా పెట్టుకుని దందాకు తెరతీసినట్లు ప్రచారంలో ఉంది. నిరుద్యోగులే టార్గెట్ సుమలత దూర ప్రాంతాల నిరుద్యోగులను ఎంచుకుంది. ప్రభుత్వం ఏదైనా నోటిఫికేషన్ జారీ చేస్తే చాలు.. ఆమె పంట పండినట్లే. అసిస్టెంట్లతో కలిసి అద్దెకారులో బయల్దేరి నిరుద్యోగులను వెదికేవారు. ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్నట్లు అసిస్టెంట్లు నిరుద్యోగులకు పరిచయం చేసి.. సింగరేణి, ఏసీసీ, జైపూర్ విద్యుత్ ఫ్లాంట్, దేవాపూర్ ఓసీసీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏ రకమైనా ఉద్యోగమైనా సరే ఉన్నతాధికారులతో మాట్లాడి పెట్టిస్తుందని, ఆమె తలుచుకుంటే ఏదైనా సాధ్యమని నమ్మించి వలలో వేసుకునేవారు. అలా ఒక్కొక్కరి నుంచి కని ష్టంగా రూ.లక్ష.. గరిష్టంగా రూ.5లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులను వంచించడంలో ఆమె ఎంతగానో ఆరితేరింది. అవసరాలకు అనుగుణంగా నేతల పేర్లు సుమలత ఏమాత్రం అనుమానం రాకుండా నిరుద్యోగుల వద్ద రాజకీయ నాయకుల పేర్లు ఎన్నోసార్లు వాడుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. అధికార పార్టీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పి ఉద్యోగాలు పెట్టిస్తానని నమ్మబలికేది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల పేర్లనూ వదలలేదని సమాచారం. బాధితుల సంఖ్య పెరగడం, ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడం.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు తీవ్ర ఒత్తిడి తేవడం ప్రారంభించారు. దీంతో సదరు కిలేడీ ఐపీ పెట్టినట్లు తెలుస్తోంది. డీసీపీని కలిసిన బాధితులు గురుకులంలో ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పి సదరు సుమలత 132 మంది నిరుద్యోగులను మోసం చేసి చివరికి ఐపీ నోటీసులు పంపడంతో న్యాయం చేయలంటూ బాధితులు మంచిర్యాల డీసీపీని కలిశారు. డబ్బులు తీసుకుని కొంతకాలం ఉద్యోగాల విషయం కోర్టుకేసులో ఉందని, ఎన్ని కల కోడ్ ఉందని కాలయాపన చేసి ఇప్పుడు నిం డా ముంచిందని, తీసుకున్న డబ్బులకు ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, బాండ్‌పేపర్‌పై అగ్రిమెంట్ కూడా రాసిచ్చిందని విన్నవించారు. ఈనెల14న ఐపీ నోటీసులు పంపిన సుమలత తన సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిందని పేర్కొన్నారు. పుస్తెలతాడు అమ్మిచ్చి డబ్బులు తీసుకుంది.. గురుకులంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటే వెళ్లి కలిశాం. నేను ఏఎన్ఎం పోస్టుకు దరఖాస్తు చేసుకున్న. ఉద్యోగానికి రూ.లక్ష అవుతుందని నమ్మిచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్తామంటే ఇప్పుడే ఇవ్వాలంది. లేదంటే పనికాదంది. డబ్బుల్లేవంటే నీ మెడలో పుస్తెలతాడు, రింగులున్నయి కదా.. అవి అమ్మియ్యుమని దగ్గరుండి మరీ మార్కెట్లో అమ్మిచ్చి డబ్బులు తీసుకొని వెళ్లిపోయింది. నా బంగారం పోయింది. ఉద్యోగం రాలే. – రత్నం భారతి, బెల్లంపల్లి అప్పులపాలయినం... ఉద్యోగం వస్తుందంటే నాలుగు పైసల వడ్డీకి తెచ్చి రూ.4లక్షలు అప్పు చేసి ఇచ్చినం. రెండున్నరేళ్లుగా వడ్డీలు కట్టలేక అప్పులపాలైనం. ఉద్యోగం ఇప్పించకపోగా.. మాపేనే కేసులు పెట్టింది. ఉన్నతాధికారులు స్పందించి సుమలతపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి. – రామటెంకి తిరుపతి, కాసిపేట