
ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
పోలీసుల అదుపులో నిందితుడు
నిర్మల్‌అర్బన్:
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన ఓ వ్యక్తిని నిర్మల్ పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేసి కటకటాలకు పంపించారు. పట్టణ ఎస్సై సునీల్ కథనం ప్రకారం. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన శక్కావార్ బాలాజీ ఫిజియోథెరఫిస్ట్‌గా పని చేస్తున్నారు. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగ యువకులను మోసం చేశాడు.
హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మామడ మండలం దిమ్మదుర్తికి చెందిన సుంకటి రమణ వద్ద నుంచి రూ. 40వేలు తీసుకున్నాడు. అటు ఉద్యోగం ఇప్పించకుండా, ఇటు డబ్బులు ఇవ్వకపోవడంతో పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. విచారణ జరిపిన ఎసై సునీల్ గురువారం బాలాజీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.