‘ఆ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే’ | Unemployment suicides are all government murders, says YSRCP | Sakshi
Sakshi News home page

‘నిరుద్యోగ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే’

Published Fri, Oct 13 2017 2:14 PM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

Unemployment suicides are all government murders, says YSRCP - Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీని ఆత్మహత్యల ప్రదేశ్‌గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, పైలా సోమినాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నిరుద్యోగ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. యువత భయపడొద్దు. వైఎస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుంది. నిరుద్యోగుల ఆత్మహత్యలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు. ఇప్పటివరకూ రైతులు, చేనేత, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకన్నారు. ఇప్పుడు విద్యార్థులు బలవంతపు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు నివారించడంలో చంద్రబాబు సర్కార్‌ విఫలమైంది. ఏపీలో విద్యా వ్యవస్థ కార్పొరేట్‌మయమైపోయింది. మంత్రులు వైఎస్‌ జగన్‌ను విమర్శించడానికే తప్ప...రాష్ట్ర సమస్యలపై స్పందించడం లేదు.’  అని మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement