
సాక్షి, హైదరాబాద్ : కొత్తపేట చౌరస్తాలోని వీఎం హోం వద్ద శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎత్తున నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉన్న వీఎం హోం గ్రౌండ్‌ను అధికారులు మూసివేయడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వీఎం హోంను తెరవాలని దాదాపు రెండు వేల మంది నిరుద్యోగులు కొత్తపేట చౌరస్తాలో బైఠాయించి, ప్రధాన రహదారిపైనే వ్యాయామాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితోపాటూ స్థానిక ప్రజా సంఘాల నేతలు సంఘటనా స్థలానికి చేరుకొని నిరుద్యోగులకు బాసటగా నిలిచారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు నిరుద్యోగ యువతకు సర్దిచెప్పి, ఆందోళన కార్యక్రమాన్ని విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment