కొత్తపేట: తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం ఆలమూరులోని హోల్‌సేల్ కూరగాయాల మార్కెట్లో రైతులు, ఆటో సంఘాల మధ్య బుధవారం ఉదయం వివాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి నుంచి మార్కెట్ వరకు కూరగాయల తరలింపునకు తమ ఆటోలనే వినియోగించుకోవాలని ఆటో సంఘాలు డిమాండ్ చేశాయి.
దీంతో రైతులు ఆటో సంఘాలపై ఎదురు తిరిగారు. ఆటో డ్రైవర్ల వైఖరికి వ్యతిరేకిస్తూ రైతులు నిరసనకు దిగారు. 16వ నంబరు జాతీయ రహదారిపై కూరగాయలు పారబోసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు పరిస్థితిని సమీక్షించి రైతులను శాంతింపజేశారు.