auto unions
-
ఆటోవాలాకు రూ.10 వేలు
సాక్షి, అనంతపురం: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటోడ్రైవర్లకు ప్రతి సంవత్సరం రూ.10 వేలు అందజేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన పాదయాత్రలో ఆటో కార్మికుల కష్టాలను చూసి చలించిపోయారు. తాము అధికారంలోకి వస్తే సొంత ఆటో నడుపుతున్న కార్మికులకు ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇతరత్రా వాటికోసం ప్రతి ఏటా రూ.10 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. తాజాగా రూ.10 వేలు అందజేసేందుకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలోని దాదాపు 40వేల మంది ఆటో కార్మికులకు లబ్ధి కలగనుంది. లబ్ధిదారుల గుర్తింపు, నెలాఖరులోగా ఆర్థికసాయం అందజేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తమకిచ్చిన మాట నిలబెట్టుకున్నారని కొనియాడుతున్నారు. -
టీడీపీ నేతలు రుణాలు రాకుండా చేస్తున్నారన్నా..
అంబాజీపేట: ఆటోలు నడుపుకుంటూ జీవిస్తున్న తమకు టీడీపీ నాయకులు ఏ విధమైన రుణాలు రానీయకుండా చేస్తున్నారని జననేత వద్ద శనివారం శ్రీ సాయిరామ్ ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు ఫిర్యాదు చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఆయనకు ఈమేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్నామని టీడీపీ నాయకులు కక్ష కట్టి ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నారని వాపోయారు. టీడీపీ నాయకుల నుంచి సమస్య వస్తే మీరే ఆదుకోవాలని కోరారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆటో కార్మికుల చొక్కాను జననేత ధరించడంతో వారందరూ సందడి చేశారు. -
మాట తప్పని నేత వైఎస్ జగన్ : భూమన
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పరని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ సీఎం కాగానే ఆటో కార్మికులను ఆదుకుంటారని భూమన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం నిర్వహించిన ఆటో కార్మికుల సమావేశంలో భూమన పాల్గొన్నారు. ఆటో కార్మికులతో భూమన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఆటో కార్మికులు ఏనాడూ ఇబ్బందులు పడలేదన్నారు. కానీ చంద్రబాబు పాలనలో ఆటో కార్మికులను పోలీసులు వేధిస్తున్నారని విమర్శించారు. ప్రతి ఆటో కార్మికుడికి 10 వేల రూపాయలు ఇస్తామని ఇప్పటికే మాట ఇచ్చిన వైఎస్ జగన్ తప్పకుండా ఆ మాటను నిలబెట్టుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కేతం జయచంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సమావేశమైంది. నాలుగేళ్ల చంద్రబాబు పాలన వల్ల నష్టపోతున్న ఏపీ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన జననేత వైఎస్ జగన్ ఇటీవల తన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆటోకార్మికులను కలుసుకున్నారు. డీజిల్ ధరలు పెరిగాయని, తమ వద్ద పోలీసులు ఇతరత్రా వసూళ్లు చేస్తున్నారని కార్మికులు జననేతకు సమస్యలు చెప్పుకున్నారు. తప్పకుండా ఆటో కార్మికులను ఆదుకుంటామన్న వైఎస్ జగన్.. అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇచ్చి అండగా ఉంటామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఆటో యూనియన్లకు వైఎస్ జగన్ భరోసా!
సాక్షి, మామిడికుదురు : ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదే సమయంలో తమ కష్టాలు, బాధలను జననేత, రాజన్న తనయుడు వైఎస్ జగన్‌కు చెప్పుకుని పరిష్కారం చూపించండన్నా అని అడుగుతున్నారు. 198వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మామిడికుదురులో శ్రీ విజయదుర్గా ఆటో యూనియన్ సభ్యులు తమ సమస్యలు వివరిస్తూ వైఎస్ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఆదుకోవాలని కోరుతూ కొన్ని అంశాలను వినతిపత్రంలో పేర్కొన్నారు. డీజిల్ రేట్లు అధికం కావడంతో కార్మికులకు సరైన కనీస వేతనం కూడా గిట్టుబాటు కావడం లేదని వైఎస్ జగన్‌కు ఆటో యూనియన్ బృందం తమ గోడును వెల్లబోసుకుంది. గత 8 ఏళ్లుగా సరైన ఆటోస్టాండ్ లేదని, ఆ సౌకర్యం కల్పించేందుకు తమకు సాయం చేయాలని జననేతను కోరారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో మామిడికుదురు శ్రీ విజయదుర్గా ఆటో యూనియన్ అధ్యక్షులు కడలి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు, తదితరులున్నారు. కాగా, మరోవైపు మిడికుదురు, కైకాలపేట గ్రామాలలో ప్రజాసంకల్పయాత్రకు భారీ సంఖ్యలో స్థానికులు తరలివచ్చి జననేతతో కలిసి అడుగులు వేస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను వైఎస్ జగన్‌కు వివరిస్తున్నారు. మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. -
ఆటోచార్జీలు పెంచడం తప్పదు
సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పట్టణంలో నడుస్తున్న ఆటో చార్జీలను పెంచడం తప్పదని ఆటో యూనియన్ జేఏసీ నాయ కులు వెల్లడించారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీలో ఆటో యూనియన్ జేఏసీ సమావేశంలో రాములు, ఎస్ఏ శ్యామ్, శ్రీనివాసులు, అంబదాస్ మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. పట్టణంలో రూరల్ ఆటోలు తిరుగడం వల్ల పట్టణ ఆటోలను నమ్ముకుని జీవిస్తున్న వారికి గిరాకీ తగ్గుతున్నాయనే భావన వస్తుందన్నాను. ఈ అంశంపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పట్టణంలో చార్జీల పెంపుపై త్వరలోనే మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. చార్జీలు పెంచడానికి జేఏసీ తీర్మానించిందని, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రాజు, శ్రీనివాస్, వెంకట్, విజయ్‌కుమార్, సత్యం, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉబెర్, ఓలాకు పోటీగా బీ-ట్యాగ్
సాక్షి, బెంగళూర్ : క్యాబ్ సర్వీసులు తమకు పోటీగా వస్తుండటంతో బెంగళూర్ ఆటోవాలాలు ఓ నిర్ణయానికి వచ్చారు. సరికొత్త యాప్‌తో రంగంలోకి దిగేందుకు సిద్ధమైపోయారు. ‘బీ-ట్యాగ్’(b-Tag) పేరిట ఓ యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. టాక్సీ డ్రైవర్ యూనియన్ అసోషియేషన్లు కూడా ఇందుకు మద్ధతు ప్రకటించటం విశేషం. యాప్ రూపకల్పన సంస్థ బీ-ట్రాన్స్పోర్ట్ సోల్యూషన్ చైర్మన్ ఎన్ఎల్ బసవరాజు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘12 యూనియన్లకు చెందిన 9 వేల మంది ఆటో డ్రైవర్లు ఇందులో సభ్యత్వం నమోదు చేసుకున్నారు. సీఐటీయూ మద్ధతు కూడా మాకే ఉంది. త్వరలోనే బీ-ట్యాగ్ యాప్ సర్వీసులను ప్రారంభిస్తాం’’ అని బసవ రాజు పేర్కొన్నారు. క్యాష్ లెస్ పేమెంట్ల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ... ‘‘ఓలా, ఉబెర్‌లు ప్రయాణికులను తక్కువ ఛార్జీల పేరిట దారుణంగా మోసం చేస్తున్నాయి. ఈ ప్రభావం ఆటోవాలాలపై దారుణంగా పడుతోంది. కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇకపై అలాంటిది కొనసాగకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాం. త్వరలో దేశవ్యాప్తంగా ఆటో యూనియన్ల సమావేశం నిర్వహించి ఇతర నగరాల్లో కూడా ఇలా ప్రత్యేక యాప్‌ల రూపకల్పన ఆలోచన చేస్తాం’’ అని అన్నారు. కాగా, 2014లోనే ఓలా ఆటో సర్వీసులను బెంగళూర్ నగరంలో ప్రవేశపెట్టగా.. మొన్నీమధ్యే ఉబెర్ కూడా సర్వీసులను ప్రారంభించేసింది. -
ఆటో యూనియన్లతో చర్చలు విఫలం
హైదరాబాద్: ఆటో యూనియన్లతో ఆర్టీఏ అధికారులు జరిపిన చర్చలు విఫలమైయ్యాయి. దీంతో ఆదివారం అర్థరాత్రి నుంచి ఆటో యూనియన్లు సమ్మె బాటపట్టనున్నాయి. హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వాధికారులతో ఆటో యూనియన్ నాయకులు జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో యూనియన్ నాయకులు నిరవధిక ఆటోబంద్‌కు పిలుపినిచ్చారు. రవాణా, పోలీసు అధికారుల స్పెషల్‌డ్రైవ్‌కు వ్యతిరేకంగా తమపై కొనసాగుతున్న వేధింపులను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని సుమారు లక్షా 30 వేల ఆటోలు ఆదివారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. ఆటోమీటర్ ట్యాంపరింగ్, పరిమితికి మించిన ప్రయాణికుల తరలింపు, డ్రైవింగ్ లెసైన్సు లేకుండా ఆటోలు నడపడం, ప్రయాణికులపై దౌర్జన్యం, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేయడం వంటి వివిధ రకాల ఉల్లంఘనలపై ఈ నెల 16 నుంచి పోలీసులు, ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన సంగతి విదితమే. -
16 నుంచి ఆటోలు బంద్
హైదరాబాద్: నగరంలో రవాణా శాఖ యంత్రాంగం తీరుకు నిరసనగా ఆటో యూనియన్లు బంద్‌కు పిలుపునిచ్చాయి. ట్రాఫిక్, రవాణా, తూనికలు కొలతల అధికారుల వేధింపులు ఆపాలంటూ ఈ నెల 16 నుంచి ఆటో యూనియన్లు బంద్‌కు ప్రకటించాయి. ఈ మేరకు శుక్రవారం సంబంధిత శాఖల అధికారులకు యూనియన్ల నాయకులు నోటీసులు అందజేశారు. -
జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో
కొత్తపేట: తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం ఆలమూరులోని హోల్‌సేల్ కూరగాయాల మార్కెట్లో రైతులు, ఆటో సంఘాల మధ్య బుధవారం ఉదయం వివాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి నుంచి మార్కెట్ వరకు కూరగాయల తరలింపునకు తమ ఆటోలనే వినియోగించుకోవాలని ఆటో సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో రైతులు ఆటో సంఘాలపై ఎదురు తిరిగారు. ఆటో డ్రైవర్ల వైఖరికి వ్యతిరేకిస్తూ రైతులు నిరసనకు దిగారు. 16వ నంబరు జాతీయ రహదారిపై కూరగాయలు పారబోసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు పరిస్థితిని సమీక్షించి రైతులను శాంతింపజేశారు.