
మాట్లాడుతున్న ఆటో యూనియన్ నాయకులు
సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పట్టణంలో నడుస్తున్న ఆటో చార్జీలను పెంచడం తప్పదని ఆటో యూనియన్ జేఏసీ నాయ కులు వెల్లడించారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీలో ఆటో యూనియన్ జేఏసీ సమావేశంలో రాములు, ఎస్‌ఏ శ్యామ్, శ్రీనివాసులు, అంబదాస్ మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. పట్టణంలో రూరల్ ఆటోలు తిరుగడం వల్ల పట్టణ ఆటోలను నమ్ముకుని జీవిస్తున్న వారికి గిరాకీ తగ్గుతున్నాయనే భావన వస్తుందన్నాను. ఈ అంశంపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పట్టణంలో చార్జీల పెంపుపై త్వరలోనే మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. చార్జీలు పెంచడానికి జేఏసీ తీర్మానించిందని, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రాజు, శ్రీనివాస్, వెంకట్, విజయ్‌కుమార్, సత్యం, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment