cooperate
-
ఆటోచార్జీలు పెంచడం తప్పదు
సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పట్టణంలో నడుస్తున్న ఆటో చార్జీలను పెంచడం తప్పదని ఆటో యూనియన్ జేఏసీ నాయ కులు వెల్లడించారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీలో ఆటో యూనియన్ జేఏసీ సమావేశంలో రాములు, ఎస్ఏ శ్యామ్, శ్రీనివాసులు, అంబదాస్ మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. పట్టణంలో రూరల్ ఆటోలు తిరుగడం వల్ల పట్టణ ఆటోలను నమ్ముకుని జీవిస్తున్న వారికి గిరాకీ తగ్గుతున్నాయనే భావన వస్తుందన్నాను. ఈ అంశంపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పట్టణంలో చార్జీల పెంపుపై త్వరలోనే మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. చార్జీలు పెంచడానికి జేఏసీ తీర్మానించిందని, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రాజు, శ్రీనివాస్, వెంకట్, విజయ్‌కుమార్, సత్యం, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మయన్మార్‌తో చర్చలకి భారత్ సహకరించాలి
-
హోదా ఉద్యమానికి సహకరించండి
ఎస్కేయూ : ప్రత్యేక హోదా ఉద్యమానికి సహకరించాలని ఎస్కేయూ వీసీ ఆచార్య కె.రాజగోపాల్, జేఎన్టీయూ వీసీ ఆచార్య ఎం.సర్కార్లను రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కోరారు. అటు ఎస్కేయూలో, ఇటు జేఎన్టీయూలో శనివారం వైస్ చాన్సలర్లను వేర్వేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనే విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులకు సహకరించాలన్నారు. తెలంగాణ ఉద్యమం విశ్వవిద్యాలయాల్లోనూ జరిగిన తీరును ఈ సందర్భంగా ఆయన వివరించారు. అనంతరం ఎస్కేయూ విద్యార్థి నాయకులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమ తరహాలో ప్రత్యేక హోదా పోరును ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వీసీలను కలిసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మీసాల రంగన్న, కనగానిపల్లి జెడ్పీటీసీ సభ్యుడు ఈశ్వరయ్య, వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు జీవీ లింగారెడ్డి, నరేంద్రరెడ్డి, జయచంద్ర, భానుప్రకాష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి
సీపీ సుధీర్‌బాబు పోలీస్ క్రికెట్కప్–2016 ప్రారంభం వరంగల్ : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గ్రామాల్లో యువత.. పోలీసులకు ప్రతినిధులుగా వ్యవహరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు సహMýరించాలని పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రికెట్ కప్–2016 టోర్నమెంట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. హన్మకొండలోని పోలీసు మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీ పాల్గొని మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో యువత భాగస్వాములు కావాలన్నారు. పోలీసులకు యువత చేరువ కావాలన్న ధ్యేయంతోనే ఈ క్రికెట్ కప్–2016ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్–ఏ, వరంగల్–బీ జట్ల మధ్య మ్యాచ్ జరగగా కమిషనర్ టాస్ వేయడంతో పాటు బౌలింగ్ చేయగా హన్మకొండ ఏసీపీ శోభన్‌కుమార్ బ్యాటింగ్ చేశారు. కాగా, తొలుత ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో డీసీపీ యాదయ్య, ఏసీపీలు ఈశ్వర్రావు, శోభన్‌కుమార్, సురేంద్రనాథ్, రవీందర్రావు, సీఐలు సంపత్‌రావు, ఎస్ఎం.అలీ, కిషన్, రవికుమార్, శ్రీనివాస్, శివరామయ్య, రమేష్, వేణు, ప్రభాకర్‌రావు, సత్యనారాయణ, ఆర్ఐలు శ్రీనివాస్, నాగయ్య, సిటీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్, క్రికెట్ కోచ్ జైపాల్ పాల్గొన్నారు. వరంగల్ – ఏ, వరంగల్ – బీ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ‘ఏ’ జట్టు విజయం సాధించింది. -
నయీంకు సహకరించిన వారి పేర్లను వెల్లడించాలి
నల్లగొండ టౌన్ : నయీం సమాంతర పాలనకు, వేలాది కోట్ల రూపాయలను సంపాదించడానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లను ప్రజలకు వెల్లడించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి పాలకులు నయీంను పెంచిపోషించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని హత్యలు, దాడులను చేయించారని ఆరోపించారు. ఇప్పుడు అదే నయీం పాలకులను బెదిరింపులకు పాల్పడినందున మట్టుబెట్టారన్నారు. నయీండైరీలో ఉన్నటువంటి పేర్లను వెల్లడించాలని, ఆయనకు సహకరించిన వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు. నయీం నేరసామ్రాజ్యంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బలవంతంగా లాగుకున్న భూములన్నింటిని బాధితులకు అందజేసి వారికి న్యాయం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తిరందాసు గోపి, తుమ్మల వీరారెడ్డి, ఎం.రాములు, జహంగీర్, కె.నర్సింహ పాల్గొన్నారు. -
రహదారుల దిగ్బంధానికి సహకరించండి
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బుధ, గురువారాల్లో జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న రహదారుల దిగ్బంధానికి సహకరిం చాలని పార్టీ నాయకులు కోరారు. రెండు రోజులు బస్సులను నిలిపేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ కే.నారాయణస్వామి సోమవారం ఆర్టీసీ తిరుపతి రీజనల్ మేనేజర్‌ను కోరారు. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి తుడ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో రహ దారులను దిగ్బంధిస్తారు. చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం నేతృత్వంలో కార్యక్రమం చేపట్టనున్నారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, సమన్వయకర్త షమీమ్ అస్లాం, యువజన విభాగం అధ్యక్షుడు ఉదయకుమార్ ఆధ్వర్యంలో దిగ్బంధిస్తారు. చిత్తూరు సమన్వయకర్త ఏఎస్.మనోహర్ నాయకత్వంలో రహదారులను అడ్డుకోనున్నారు. కుప్పం సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి నాయకత్వంలో ఎన్‌హెచ్ 219 కృష్ణగిరి జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు. పీలేరులో చిం తల రామచంద్రారెడ్డి ఆధ్వర్యం లో దిగ్బంధిస్తారు. శ్రీకాళహస్తి, పల మనేరు, గంగాధరనెల్లూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోనూ దిగ్బంధం ఉం టుంది. పూతలపట్టులో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తలుపులపల్లి బాబురెడ్డి నాయకత్వంలో రోడ్డును దిగ్బంధిస్తారు. ఏపీఎన్జీవో, ప్రజాసంఘాలు సహకరించాలి రహదారుల దిగ్బంధానికి ఎన్జీవోలు, ప్రజాసంఘాలు, ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నేతలు సహకరించాలని నారాయణస్వామి కోరారు. ఆయనతో పాటు సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ బీరేంద్రవర్మ, సింగిల్ విండో అధ్యక్షులు టీ.హరిశ్చంద్రారెడ్డి ఉన్నారు. -
విభజనకు సహకరించండి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు ముల్కీ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో మంగళవారం భోజన విరామ సమయంలో తెలంగాణ ఉద్యోగులు సీమాంధ్ర ఉద్యోగులకు పుష్పగుచ్ఛాలు అందించి నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో వివిధ శాఖల ఉద్యోగులు టీఎన్జీఓస్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రదర్శనగా నినాదాలు చేస్తూ వివిధ కార్యాలయాలకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కలెక్టరేట్లోని సీపీవో కార్యాలయంలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఇ.రత్నబాబు, జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణ, జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సుబ్బయ్య, ఆర్ఎంఓ డాక్టర్ శోభాదేవిలకులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీమాంధ్ర అధికారులతో జై తెలంగాణ నినాదాలు చేయించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీమాంధ్ర ఉద్యోగులు సహకరించాలని కోరారు. తెలంగాణ సాధన కోసం ఉద్యోగులు ఉద్యమిస్తుంటే సీమాంధ్ర అధికారులు ఉద్యోగులను వేధిస్తున్నారని అన్నారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తే సంహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజీవోస్ నుంచి వై.వెంకటేశ్వర్లు, లింగయ్య, డ్రైవర్ల సంఘం నాయకులు కోటేశ్వరరావు, టీఎన్జీవోస్ నుంచి పి.లక్ష్మీనారాయణ, నందగిరి శ్రీను, వల్లోజు శ్రీనివాస్, సాగర్, రమణయాదవ్, వేలాద్రి, జడ్పీ రవి, రాజేష్, బడ్జెట్ శ్రీను, సీపీఓ నుంచి రమేష్, రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర విభజనకు సహకరించాలి
నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల విభజనకు సహకరించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కోరారు. సోమవారం నిర్మల్ పట్టణంలో టీ వీవీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అన్ని పార్టీలు అనుకూలమని ప్ర కటించి కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన అనంతరం యూటర్ను తీసుకోవడం విచారకరమన్నారు. ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టేందుకు తెలంగాణ ప్రజలను మోసం చేసేందు కు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది తానేనని ప్రకటించడంతో సీమాంధ్ర వైఖరి బయటపడిందన్నారు. ఇదే ధోరణిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవలంభిస్తున్నారని ఆరోపించారు. తె లంగాణ ప్రాంతంలో ప్రత్యే క రాష్ట్రం కోసం ఉద్యమం జరిగినప్పుడు తన చేతుల్లో ఏమీ లేదని, ఢిల్లీ నాయకు ల చేతిలోనే ఉందని చెప్పిన ఆయన ఇప్పుడు సమైఖ్యాంద్రకు మద్దతుగా మాట్లాడటం శోచనీయమన్నారు. దీంతో ఆంధ్రా నాయకుల వైఖరి తేటతెల్లమయ్యిందన్నా రు. ముల్కీ అమరవీరుల స్మృతి ర్యాలీని ఈ నెల 7న హైదరాబాద్‌లో నిర్వహించ డం జరుగుతుందన్నారు. జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఐక్యంగా ఉండి వ్యక్తిత్వం కోల్పోకుండా ముందుకు సాగాలన్నారు. ఇం దులో జేఏసీ జిల్లా కన్వీనర్ కొట్టె శేఖర్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, నాయకులు కృష్ణంరాజు, కామారపు జగదీశ్వర్, పాకాల రాంచందర్, ముత్యంరెడ్డి, గంగాధర్, వై.సాయన్న, కిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.