సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బుధ, గురువారాల్లో జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న రహదారుల దిగ్బంధానికి సహకరిం చాలని పార్టీ నాయకులు కోరారు. రెండు రోజులు బస్సులను నిలిపేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ కే.నారాయణస్వామి సోమవారం ఆర్టీసీ తిరుపతి రీజనల్ మేనేజర్‌ను కోరారు. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి తుడ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో రహ దారులను దిగ్బంధిస్తారు. చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం నేతృత్వంలో కార్యక్రమం చేపట్టనున్నారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, సమన్వయకర్త షమీమ్ అస్లాం, యువజన విభాగం అధ్యక్షుడు ఉదయకుమార్ ఆధ్వర్యంలో దిగ్బంధిస్తారు. చిత్తూరు సమన్వయకర్త ఏఎస్.మనోహర్ నాయకత్వంలో రహదారులను అడ్డుకోనున్నారు.
కుప్పం సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి నాయకత్వంలో ఎన్‌హెచ్ 219 కృష్ణగిరి జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు. పీలేరులో చిం తల రామచంద్రారెడ్డి ఆధ్వర్యం లో దిగ్బంధిస్తారు. శ్రీకాళహస్తి, పల మనేరు, గంగాధరనెల్లూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోనూ దిగ్బంధం ఉం టుంది. పూతలపట్టులో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తలుపులపల్లి బాబురెడ్డి నాయకత్వంలో రోడ్డును దిగ్బంధిస్తారు.
ఏపీఎన్జీవో, ప్రజాసంఘాలు సహకరించాలి
రహదారుల దిగ్బంధానికి ఎన్జీవోలు, ప్రజాసంఘాలు, ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నేతలు సహకరించాలని నారాయణస్వామి కోరారు. ఆయనతో పాటు సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ బీరేంద్రవర్మ, సింగిల్ విండో అధ్యక్షులు టీ.హరిశ్చంద్రారెడ్డి ఉన్నారు.