తిరుపతిలో జంట హత్యల కలకలం.. వెలుగులోకి సంచలన నిజాలు | Tirupati Double Murder: Maharashtra Man Kills His Wife And Her Brother In Law At Hotel - Sakshi
Sakshi News home page

Tirupati Double Murder Case: తిరుపతిలో జంట హత్యల కలకలం.. వెలుగులోకి సంచలన నిజాలు

Published Fri, Oct 6 2023 11:33 AM | Last Updated on Fri, Oct 6 2023 12:37 PM

Tirupati Double Murder: Husband Kills Wife And Her Brother At Hotel - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతిలోని కపిలతీర్థం సమీపంలోని ఓ ప్రైవేట్ హోటట్‌లో జంట హత్యలు కలకలం రేపుతోంది. అన్న, చెల్లెల్లను బావ పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశాడు. మృతులను మహారాష్ట్ర నాందేడ్‌కు చెందినవారుగా గుర్తించారు. బావ యువరాజ్.. భార్య మనీషా తోపాటు, బావమరిది హర్ష వర్ధన్‌ను హత్య చేసి పరారయ్యాడు.

వివరాలు.. నాందేడ్‌కు చెందిన యువరాజ్‌కు 12 ఏళ్ల క్రితం మనీషాతో వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు షక్షమ్(6), ప్రజ్ఞాన్ (4) ఉన్నారు. బావమరిది హర్షవర్ధన్‌తో కలిసి యువరాజ్‌, మనీషా నాలుగు రోజుల క్రితం తిరుపతికు వచ్చినట్లు సమాచారం. వీరంతా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి నందిసర్కిల్‌ ఉన్న ప్రవేట్ హోటల్‌లో దిగారు.

శుక్రవారం తెల్లవారుజామున ఈ  డబుల్ మర్డర్ వెలుగు చూసింది. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. హోటల్‌ యాజమాన్యం పోలీసులలకు సమాచారం అందించారు. సంఘటన ప్రాంతాన్ని తిరుపతి ఈస్ట్‌ డీఎస్పీ సురేందర్ రెడ్డి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అలిపిరి పోలీసులు విచారిస్తున్నారు

వెలుగులోకి వాస్తవాలు..
తిరుపతి డబుల్ మర్డర్ కేసులో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. మనీషాకు నిందితుడు యువరాజ్‌ అన్నతో వివాహేతర  సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాదికాలంగా మనీషా, యువరాజ్‌ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. రాజీ కుదుర్చేందుకు బావమరిది హర్ష వర్ధన్, మనీషాతో పాటు ఇద్దరు పిల్లల్ని యువరాజ్‌ తిరుపతికు రప్పించినట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం నంది సర్కిల్‌లో ప్రవేట్ హోటల్ 302 రూమ్‌లో దిగారు. అర్థరాత్రి 2 గంటలు సమయంలో ఇద్దరినీ యువరాజ్‌ హత్య చేశాడు.
చదవండి: ఇంట్లో చెప్పకుండా.. వెళ్లిన నేపాల్‌ బాలిక ఒక్కసారిగా ఇలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement