
సాక్షి, చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడటంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కత్తులు, రాడ్డులతో దాడులు చేసుకున్నారు. దాడిలో కుప్పం మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ తమ్ముడు వినయ్ తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘర్షణలో న్యాయవాది కుమారుడు, రాజకీయ నేతల కుమారులు ఉన్నట్లు తెలిసింది. టీడీపీ కార్యకర్త వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘర్షణలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: గనుల శాఖలో బదిలీల ‘వేలం’
Comments
Please login to add a commentAdd a comment