'బిడ్డను నీటితొట్టిలో వేసి చంపేసింది' | Mother Killed her 10-Day-old Baby in tirupati rural | Sakshi
Sakshi News home page

'బిడ్డను నీటితొట్టిలో వేసి చంపేసింది'

Published Mon, Jun 30 2014 9:31 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

'బిడ్డను నీటితొట్టిలో వేసి చంపేసింది' - Sakshi

'బిడ్డను నీటితొట్టిలో వేసి చంపేసింది'

చిత్తూరు : చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లిలో దారుణం జరిగింది. రక్తం పంచుకు పుట్టిన బిడ్డను తల్లే కర్కశంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పది రోజుల ఆడ శిశువును నీటితొట్టిలో వేసి చంపివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తల్లిని విచారిస్తున్నారు.

అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆడపిల్ల అవటం వల్లే తల్లి ఈ దారుణానికి పాల్పడిందా, లేక ఇతర కారణాల అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా రెండో సంతానం కూడా పాపే కావటంతో తల్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement