k.narayanaswamy
-
ముమ్మరంగా ఎక్సైజ్ శాఖ దాడులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. 11రోజులు పాటు 512 ఎకరాల్లో సారా తయారు చేస్తున్న వారిపై పోలీసులు దాడులు చేశారు. సారా తయారు చేయడానికి గంజాయి మొక్కల ధ్వంసం కారణంగా బహిరంగ మార్కెట్లో 76 కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. కాగా అక్రమంగా సారా తయారు చేస్తున్న 15మందిని అరెస్ట్ చేశామని, 13 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 84వేల 115 లీటర్ల సారా ధ్వంసం చేస్తున్నామని, గత ఐదు నెలల్లో అక్రమ దుకాణాలపై 4010 కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. రాత్రి 8 గంటలకే మధ్యం దుకాణాలు మూతపడుతుండటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి చెందిన వ్యక్తులే గతంలో పెద్ద ఎత్తున మద్యం దుకాణాలు నడిపేవారని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి విమర్శించారు. -
జగన్మోహన్రెడ్డి పర్యటన ఒక రోజు వాయిదా
సాక్షి, చిత్తూరు : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి నాలుగో విడత సమైక్యశంఖారావం, ఓదార్పు యాత్ర ఒకరు రోజు వాయిదా పడిందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కే.నారాయణస్వామి గురువారం తెలిపారు. శుక్రవారం నుంచి సాగాల్సిన యాత్ర శనివారానికి వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర ఉంటుందని వెల్లడించారు. కార్యకర్తలు, అభిమానులు, నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. రేపు నగరి నియోజకవర్గ పర్యటన నగరి, న్యూస్‌లైన్ : ముందుగా ప్రకటించినట్లుగా జగన్మోహన్ రెడ్డి 17వ తేదీన వడమాలపేట, పుత్తూరు పట్టణాల్లో పర్యటించడం లేదని కార్యక్రమం 18వ తేదీకి వాయిదా పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఆర్కే రోజా తెలిపారు. గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన పర్యటించే మార్గంలోనూ మార్పు చోటుచేసుకుందన్నారు. శనివారం ఉదయం జగన్మోహన్రెడ్డి రేణిగుంట విమానాశ్రయం నుంచి బైపాస్ సర్కిల్, కేఎల్ఎం హాస్పిటల్, గాజుల మండ్యం, షుగర్ ఫ్యాక్టరీ, అత్తూరు క్రాస్, కదిరి మంగళం క్రాస్, పూడి, పూడి బీసీ కాలనీ, కాయం ఎస్సీ కాలనీ, కాయం, కాయంపేట, బ్రాహ్మణపట్టు మీదుగా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలంలోని పత్తిపుత్తూరుకు వస్తారన్నారు. అప్పలాయగుంట, యనమలపాళెం, తిరుమణ్యం, టీఆర్ కండ్రిగ, వేమాపురం, వేమాపురం ఎస్సీ కాలనీ, గొల్లకండ్రిగ, వడమాల, వడమాలపేట, ఎస్వీపురం, తడుకు రైల్వేస్టేషన్, మజ్జిగ గుంట, తడుకు, గొల్లపల్లి, అగ్రహారం ప్రాంతాల్లో పర్యటిస్తూ పున్నమి జంక్షన్ నుంచి పుత్తూరు పట్టణంలోకి ప్రవేశిస్తారని, అక్కడి నుంచి ధర్మరాజుల గుడి వీధి, బజారు వీధి మీదుగా వచ్చి సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకుంటారని అక్కడ భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. -
రహదారుల దిగ్బంధానికి సహకరించండి
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బుధ, గురువారాల్లో జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న రహదారుల దిగ్బంధానికి సహకరిం చాలని పార్టీ నాయకులు కోరారు. రెండు రోజులు బస్సులను నిలిపేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ కే.నారాయణస్వామి సోమవారం ఆర్టీసీ తిరుపతి రీజనల్ మేనేజర్‌ను కోరారు. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి తుడ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో రహ దారులను దిగ్బంధిస్తారు. చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం నేతృత్వంలో కార్యక్రమం చేపట్టనున్నారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, సమన్వయకర్త షమీమ్ అస్లాం, యువజన విభాగం అధ్యక్షుడు ఉదయకుమార్ ఆధ్వర్యంలో దిగ్బంధిస్తారు. చిత్తూరు సమన్వయకర్త ఏఎస్.మనోహర్ నాయకత్వంలో రహదారులను అడ్డుకోనున్నారు. కుప్పం సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి నాయకత్వంలో ఎన్‌హెచ్ 219 కృష్ణగిరి జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు. పీలేరులో చిం తల రామచంద్రారెడ్డి ఆధ్వర్యం లో దిగ్బంధిస్తారు. శ్రీకాళహస్తి, పల మనేరు, గంగాధరనెల్లూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోనూ దిగ్బంధం ఉం టుంది. పూతలపట్టులో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తలుపులపల్లి బాబురెడ్డి నాయకత్వంలో రోడ్డును దిగ్బంధిస్తారు. ఏపీఎన్జీవో, ప్రజాసంఘాలు సహకరించాలి రహదారుల దిగ్బంధానికి ఎన్జీవోలు, ప్రజాసంఘాలు, ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నేతలు సహకరించాలని నారాయణస్వామి కోరారు. ఆయనతో పాటు సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ బీరేంద్రవర్మ, సింగిల్ విండో అధ్యక్షులు టీ.హరిశ్చంద్రారెడ్డి ఉన్నారు.