సాక్షి, చిత్తూరు : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత సమైక్యశంఖారావం, ఓదార్పు యాత్ర ఒకరు రోజు వాయిదా పడిందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కే.నారాయణస్వామి గురువారం తెలిపారు.
శుక్రవారం నుంచి సాగాల్సిన యాత్ర శనివారానికి వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర ఉంటుందని వెల్లడించారు. కార్యకర్తలు, అభిమానులు, నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
రేపు నగరి నియోజకవర్గ పర్యటన
నగరి, న్యూస్‌లైన్ : ముందుగా ప్రకటించినట్లుగా జగన్‌మోహన్ రెడ్డి 17వ తేదీన వడమాలపేట, పుత్తూరు పట్టణాల్లో పర్యటించడం లేదని కార్యక్రమం 18వ తేదీకి వాయిదా పడిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఆర్కే రోజా తెలిపారు. గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన పర్యటించే మార్గంలోనూ మార్పు చోటుచేసుకుందన్నారు.
శనివారం ఉదయం జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయం నుంచి బైపాస్ సర్కిల్, కేఎల్‌ఎం హాస్పిటల్, గాజుల మండ్యం, షుగర్ ఫ్యాక్టరీ, అత్తూరు క్రాస్, కదిరి మంగళం క్రాస్, పూడి, పూడి బీసీ కాలనీ, కాయం ఎస్సీ కాలనీ, కాయం, కాయంపేట, బ్రాహ్మణపట్టు మీదుగా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలంలోని పత్తిపుత్తూరుకు వస్తారన్నారు.
అప్పలాయగుంట, యనమలపాళెం, తిరుమణ్యం, టీఆర్ కండ్రిగ, వేమాపురం, వేమాపురం ఎస్సీ కాలనీ, గొల్లకండ్రిగ, వడమాల, వడమాలపేట, ఎస్వీపురం, తడుకు రైల్వేస్టేషన్, మజ్జిగ గుంట, తడుకు, గొల్లపల్లి, అగ్రహారం ప్రాంతాల్లో పర్యటిస్తూ పున్నమి జంక్షన్ నుంచి పుత్తూరు పట్టణంలోకి ప్రవేశిస్తారని, అక్కడి నుంచి ధర్మరాజుల గుడి వీధి, బజారు వీధి మీదుగా వచ్చి సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకుంటారని అక్కడ భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.
జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఒక రోజు వాయిదా
Published Fri, Jan 17 2014 2:57 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement