Tour postponed
-
సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన వాయిదా
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూళ్లూరుపేట పర్యటన వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంవో కార్యాలయం ప్రకటించింది. మంగళవారం.. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా రాయదరువు వద్దగల మాంబట్టు ఎస్ఈజెడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వద్ద నుంచే సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సింది ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు. త్వరలోనే రీ షెడ్యూల్ ప్రకటించనున్నారు. బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. నెల్లూరు నగరంలో పాటు రాపూరు, కలువాయి, చేజర్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని, నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. చదవండి: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం -
తెలంగాణ: ప్రధాని మోదీ పర్యటన వాయిదా!
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 19వ తేదీన ఆయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులతో పాటు వందే భారత్ రైలును ప్రారంభించాల్సి ఉంది. అయితే.. ఈ పర్యటన వాయిదా పడినట్లు బుధవారం బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బిజీ షెడ్యూల్ వల్లే వాయిదా పడిందని చెబుతూ.. అతి త్వరలోనే పర్యటన తేదీని ప్రకటిస్తామని తెలిపాయి. అయితే.. ప్రధాని పర్యటన తాత్కాలికంగానే వాయిదా పడిందని, ప్రధాని రాష్ట్ర పర్యటన షెడ్యూల్ త్వరలోనే వెల్లడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. దీంతో వందే భారత్ రైలు ప్రారంభంపై సందిగ్ధత ఏర్పడినట్లయ్యింది. -
శ్రీలంకలో దక్షిణాఫ్రికా పర్యటన వాయిదా
జొహన్నెస్‌బర్గ్: శ్రీలంకలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు పర్యటన వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం ఈ జూన్‌లో ఇరు దేశాల మధ్య మూడేసి వన్డేలు, టి20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ అదుపులోకి రాకపోగా... రోజురోజుకీ మహమ్మారి ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో సింహళ దేశంలో క్రికెట్ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు దక్షిణాఫ్రికా బోర్డు వర్గాలు తెలిపాయి. ‘ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో మా ఆటగాళ్లు సిరీస్‌కు సన్నద్ధంగా లేరు. పైగా అన్నింటికి మించి ఆటగాళ్ల ఆరోగ్యం ప్రధానమైంది. వాయిదా వేయాలనే నిర్ణయం భారమైనా... తప్పలేదు. మళ్లీ క్రికెట్ మొదలయ్యాక భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)లోని వెసులుబాటును బట్టి ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను రీషెడ్యూల్ చేసుకుంటాం’ అని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్వెస్ ఫాల్ తెలిపారు. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ను వాయిదా వేయడం వల్ల తమ జట్టు టి20 ప్రపంచకప్ సన్నాహకానికి ఎదురుదెబ్బని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న టి20 ప్రపంచకప్ అక్టోబర్–నవంబర్లలో జరుగనుంది. -
భారత్‌లో 30 కోవిడ్ కేసులు
న్యూఢిల్లీ: ప్రపంచం నలుమూలలకీ అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కోవిడ్ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. వైరస్ విజృంభణతో ప్రపంచ ప్రజల దైనందిన జీవితంలోనూ పెనుమార్పులు సంభవిస్తున్నాయి. విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు పెరిగాయి. పాఠశాలలు, ప్రార్థనాలయాలు మూతపడ్డాయి. చైనాలో వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోంటే, ఇటలీ, ఇరాన్ లాంటి ఇతర దేశాల్లో తీవ్రతరమౌతోంది. కరోనా కలకలం అంతర్జాతీయంగా దాదాపు 30 కోట్ల మంది విద్యార్థులను వారంపాటు విద్యాలయాలకు దూరం చేసింది. భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరడంతో ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం మూసివేసింది. ఇటలీ, దక్షిణ కొరియాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. విదేశీయులను కోవిడ్ సోకలేదని వైద్యుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని భారత్ కోరుతోంది. భారత్‌లో 30 కోవిడ్ కేసులు ఇటలీకి చెందిన పర్యాటకులతో సహా మార్చి 4వ నాటికి భారత్‌లో 29 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పార్లమెంట్లో ప్రకటించారు. 28,529 మందిని వైద్యపరిశీలనలో ఉంచినట్టు వెల్లడించారు. ఇటీవలే ఇరాన్లో పర్యటించి వచ్చిన ఘజియాబాద్‌కు చెందిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది. వైరస్‌ను గుర్తించేందుకు జిల్లా, గ్రామస్థాయిల్లో బృందాలను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. (చదవండి: కోవిడ్‌ను జయించిన కేరళ విద్యార్థిని) మొత్తం 95 వేల మంది.. ప్రపంచవ్యాప్తంగా 95,000 మంది ప్రజలకు వైరస్ సోకగా, 3,200 మంది మరణించారు. ఇప్పటి వరకు 80 దేశాలకు కోవిడ్–19 వ్యాపించింది. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి, చైనాలో కన్నా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరిస్తోంది. గురువారం 31 మంది మృతిచెందగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య 3,012కి చేరింది. 80,400 మందికి వైరస్ సోకినట్టు తేలింది. అమెరికాలో కోవిడ్ మృతుల సంఖ్య 11కు చేరడంతో కరోనాపై పోరాడేందుకు 8 బిలియన్ డాలర్లను వెచ్చించాలని అమెరికన్ కాంగ్రెస్ తీర్మానించింది. ఇరాన్లో మృతుల సంఖ్య 107కి చేరింది. 3,515 మందికి వైరస్ సోకినట్టు చేరింది. ఇటలీలోనూ కరోనా మృతుల సంఖ్య 107, బాధితులు 3000 మంది. దక్షిణ కొరియాలో బాధితుల సంఖ్య 6,000కు చేరింది. జీసస్ జన్మస్థలమైన పాలస్తీనాలోని బెత్లెహాం చర్చ్‌ని తాత్కాలికంగా మూసివేశారు. జపాన్, ఫ్రాన్స్‌లలో పాఠశాలలు మూసివేశారు. ఢిల్లీలోని మొగల్ గార్డెన్‌లోకి ప్రజల సందర్శనలను నిలిపి వేస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఫ్లూతో బాధపడే ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 16 ఏళ్ల భారతీయ బాలికకు కోవిడ్ సోకినట్టు తేలింది. చాలా దేశాలు ఏమీ చేయడం లేదు.. ప్రపంచంలోని చాలా దేశాలు కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు తగు చర్యలు తీసుకోవడం లేదని, ఇది సరైన విధానం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ముప్పునకు తగ్గ చర్యలు తీసుకోవడంలో పట్టుదల చూపడం లేదని తెలిపింది. మోదీ బెల్జియం పర్యటన వాయిదా యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరగాల్సిన సదస్సు వాయిదా పడినట్లు భారత్ తెలిపింది. ఈ నెల 13న ఈ సమావేశం కోవిడ్ కారణంగా ఈ పర్యటన వాయిదా పడింది. ఇరు వర్గాలకూ కుదిరే మరో సమయంలో భేటీ జరుగనుంది. ఆక్టెమ్రాతో కోవిడ్‌కు చెక్? ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు దొరికిందా? అవును అంటోంది స్విట్జర్లాండ్ ఫార్మా కంపెనీ రోష్! ఆర్థరైటిస్ రోగుల్లో మంట/వాపులను తగ్గించేందుకు ఉపయోగించే అక్టెమ్రా అనే మందు కరోనా వైరస్ కట్టడికీ ఉపయోగపడవచ్చునని రోష్ చెబుతోంది. వ్యాధికి కేంద్రబిందువైన చైనాలో అక్టెమ్‌రాను వాడేందుకు ఇప్పటికే చైనా ప్రభుత్వ అనుమతి పొందిన రోష్ సుమారు 20 లక్షల డాలర్ల విలువైన మందులను చైనా ప్రభుత్వానికి ఉచితంగా అందజేసింది. అక్టెమ్‌రాను వైద్య పరిభాషలో టోసిలిజుమాబ్ అని పిలుస్తారు. 2010 నుంచి దీనిని అమెరికాలో ఆర్థరైటిస్ చికిత్సలో వాడుతున్నారు. దీంట్లో అత్యధిక మోతాదులో తెల్ల రక్తకణాలు విడుదల చేసే ప్రొటీన్లు ఉంటాయి. చైనా ప్రచురించిన మార్గదర్శకాల ప్రకారం కరోనా కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న వారికి అక్టెమ్‌రాను వాడవచ్చు. -
సందిగ్ధంలో భారత్-జింబాబ్వే సిరీస్!
ప్రసారకర్తలతో వివాదమే కారణం హరారే: వచ్చే నెలలో జింబాబ్వేలో జరగాల్సిన భారత క్రికెట్ జట్టు పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టూర్లో భాగంగా భారత్ 3 వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ సిరీస్ నిర్వహణపై సందేహం నెలకొందని, ఇప్పుడు కాకపోతే ఏడాది తర్వాతే ఇది సాధ్యమవుతుందని జింబాబ్వే క్రికెట్ బోర్డు (జెడ్సీ) ప్రకటించింది. జింబాబ్వేలోని మ్యాచ్‌లకు అధికారిక ప్రసారకర్త అయిన టెన్ స్పోర్ట్స్, బీసీసీఐ మధ్య ఉన్న వివాదమే దీనికి కారణమని తెలుస్తోంది. గతంలో కొన్ని సమస్యల కారణంగా టెన్ స్పోర్ట్స్ ఈ సిరీస్‌ను ప్రసారం చేయకూడదని భావిస్తోంది. దాంతో జెడ్సీ అటు టెన్‌స్పోర్ట్స్, ఇటు బీసీసీఐతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే పనిలో పడింది. సోమవారం నుంచి బార్బడోస్‌లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశం సందర్భంగా బీసీసీఐ పెద్దలతో మాట్లాడాలని జెడ్సీ చైర్మన్ విల్సన్ మనసే నిర్ణయించారు. ‘సాధ్యమైనంత త్వరగా దీనికి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. అది జరగకపోతే ఇదే టూర్‌ను వచ్చే ఏడాది నిర్వహించే విధంగా బీసీసీఐతో చర్చిస్తాం’ అని మనసే వెల్లడించారు. బంగ్లాదేశ్ పర్యటన తర్వాత జూలైలో జింబాబ్వేలో భారత్ పర్యటించాల్సి ఉంది. -
రాహుల్ పర్యటన వాయిదా
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వాయదా పడింది. ట్విట్టర్ ద్వారాను, ఇంకా పలు రకాలుగా రాహుల్ పర్యటన గురించి చెప్పినా.. ఉన్నట్టుండి పర్యటనను వాయిదా వేసుకున్నారు. లోక్‌సభ సమావేశాలను పొడిగించడం వల్లే ఆయన పర్యటన వాయిదా పడిందని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతంలో ఈనెల 12వ తేదీన రాహుల్ పర్యటించాల్సి ఉండగా, 15వ తేదీకి ఆ పర్యటన వాయిదా వేశారు. ఆరోజు నిర్మల్‌లో ఆయన 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. -
జగన్మోహన్రెడ్డి పర్యటన ఒక రోజు వాయిదా
సాక్షి, చిత్తూరు : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి నాలుగో విడత సమైక్యశంఖారావం, ఓదార్పు యాత్ర ఒకరు రోజు వాయిదా పడిందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కే.నారాయణస్వామి గురువారం తెలిపారు. శుక్రవారం నుంచి సాగాల్సిన యాత్ర శనివారానికి వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర ఉంటుందని వెల్లడించారు. కార్యకర్తలు, అభిమానులు, నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. రేపు నగరి నియోజకవర్గ పర్యటన నగరి, న్యూస్‌లైన్ : ముందుగా ప్రకటించినట్లుగా జగన్మోహన్ రెడ్డి 17వ తేదీన వడమాలపేట, పుత్తూరు పట్టణాల్లో పర్యటించడం లేదని కార్యక్రమం 18వ తేదీకి వాయిదా పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఆర్కే రోజా తెలిపారు. గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన పర్యటించే మార్గంలోనూ మార్పు చోటుచేసుకుందన్నారు. శనివారం ఉదయం జగన్మోహన్రెడ్డి రేణిగుంట విమానాశ్రయం నుంచి బైపాస్ సర్కిల్, కేఎల్ఎం హాస్పిటల్, గాజుల మండ్యం, షుగర్ ఫ్యాక్టరీ, అత్తూరు క్రాస్, కదిరి మంగళం క్రాస్, పూడి, పూడి బీసీ కాలనీ, కాయం ఎస్సీ కాలనీ, కాయం, కాయంపేట, బ్రాహ్మణపట్టు మీదుగా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలంలోని పత్తిపుత్తూరుకు వస్తారన్నారు. అప్పలాయగుంట, యనమలపాళెం, తిరుమణ్యం, టీఆర్ కండ్రిగ, వేమాపురం, వేమాపురం ఎస్సీ కాలనీ, గొల్లకండ్రిగ, వడమాల, వడమాలపేట, ఎస్వీపురం, తడుకు రైల్వేస్టేషన్, మజ్జిగ గుంట, తడుకు, గొల్లపల్లి, అగ్రహారం ప్రాంతాల్లో పర్యటిస్తూ పున్నమి జంక్షన్ నుంచి పుత్తూరు పట్టణంలోకి ప్రవేశిస్తారని, అక్కడి నుంచి ధర్మరాజుల గుడి వీధి, బజారు వీధి మీదుగా వచ్చి సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకుంటారని అక్కడ భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. -
బాబు పర్యటన నేటికి వాయిదా
సాక్షి, కాకినాడ : జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం జరపాల్సిన పర్యటన మంగళవారానికి వాయిదా పడింది. ముందు అనుకున్న ప్రకారం చంద్రబాబు విశాఖ జిల్లా నుంచి సోమవారం ఉదయం 10 గంటలకు తుని చేరుకోవాల్సి ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన రాక కోసం తునిలోని తాండవ సుగర్ ఫ్యాక్టరీ గెస్ట్‌హౌస్ వద్ద వేచి చూశా రు. అయితే చంద్రబాబు రాత్రి 8.30 గంటలకు గానీ తుని చేరుకోలేక పోయారు. విశాఖ జిల్లాలో పర్యట న పూర్తి కాకపోవడమే జాప్యానికి కారణమని పార్టీ వర్గాలు తెలిపాయి. తుని నుంచి ఆయన అన్నవరం చేరుకుని దేవస్థానం అతిథిగృహంలో బస చేశారు. కాగా జిల్లాలో సోమవారం జరగాల్సిన బాబు పర్యటన యథాతథంగా మంగళవారం జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు చినరాజప్ప తెలిపారు.