
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూళ్లూరుపేట పర్యటన వాయిదా పడింది.
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూళ్లూరుపేట పర్యటన వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంవో కార్యాలయం ప్రకటించింది.
మంగళవారం.. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా రాయదరువు వద్దగల మాంబట్టు ఎస్‌ఈజెడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వద్ద నుంచే సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సింది ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు. త్వరలోనే రీ షెడ్యూల్ ప్రకటించనున్నారు.
బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. నెల్లూరు నగరంలో పాటు రాపూరు, కలువాయి, చేజర్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని, నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు.
చదవండి: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం