Nagari constituency
-
వైఎస్సార్సీపీకి ఓటేస్తే దాడులు చేస్తారా?: భూమన
సాక్షి, తిరుపతి: ఏపీలో వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దళితుల ఇళ్లపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేయాడం అమానుషమని మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేదన్నారు. బాబు అధికారంలో ఉన్న ప్రతీసారీ ఇదే జరుగుతోందన్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘నగరి మండలం తడుకుపేటలో దళితులపై దాడి ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దళితులు ఇళ్లపై దాడి, వాహనాలు ధ్వంసం అమానుషం. చుండూరు, కారంచేడు ఘటనల్ని తలపించేలా తడుకుపేట ఘటన జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యానాదులపై కూడా ఇదే తరహాలో దాడులు చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేదు’ అంటూ బాబు సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరోవైపు, తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ..‘తడుకుపేట దళితులపై దాడి ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టి కు తీసుకువెళ్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దళితులపై దాడులు ఎక్కువ అయ్యాయి. దళిత హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నగరిలో లోకేష్ కి ఘోర అవమానం
-
నేనూ బీసీ ఇంటి కోడలినే: మంత్రి రోజా
నగరి(చిత్తూరు): నేనూ బీసీ ఇంటి కోడలినే అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. సోమవారం ఆమె నగరిలోని క్యాంపు కార్యాలయంలో జయహో బీసీ మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ బీసీలను వెనుకబడిన వారిగా కాకుండా, వారే రాష్ట్రానికి వెన్నెముక అని గుర్తించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహించే జయహో బీసీ మహాసభను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా 139 బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి జగనన్న బీసీల పక్షపాతిగా నిరూపించుకున్నారని చెప్పారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లోనూ 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. బీసీ వర్గాలు అంటే కేవలం ఓటు బ్యాంకుగా భావించి, ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తు తెచ్చుకునే చంద్రబాబుకు ఈ సారి గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు -
నేషనల్ హైవేపై దృష్టి సారించిన ఎమ్మెల్యే రోజా
-
చిత్తూరు జిల్లాలో రూ.50 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల నాడు నేడు
-
CM YS Jagan: జరీ అంచుపై సీఎం జగనన్న ఫొటో
సాక్షి, నగరి: నగరి చేనేత పరిశ్రమను ప్రగతి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞతగా నగరి చేనేత కార్మికులు వారి చిత్రాలను హాఫ్‌సిల్క్ శారీ జరీ బోర్డర్‌పై నేశారు. నేత పరిశ్రమను సాంకేతికత వైపు మళ్లించేందుకు ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఆమె భర్త, రాయలసీమ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కేసెల్వమణి హిందూపూర్ నేత పరిశ్రమ వారితో చర్చించి నగరి మునిసిపాలిటీకి అధునాతన డిజైన్లలో చీరలు నేసే జకార్డ్ యంత్రాలు తెప్పించారు. ఈ ఆధునిక యంత్రాల్లో చీర నేయడాన్ని ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం ప్రారంభించారు. చదవండి: Disha App: ‘దిశ’ యాప్ కేరాఫ్ మన అన్న.. -
పుత్తూరులో వైస్ ఆర్ సీపీ లో చేరిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
-
నగరిలో టీడీపీ నేత నిర్వాకం బట్టబయలు
సాక్షి, చిత్తూరు : నగరిలో ఓ టీడీపీ నేత నిర్వాకం బట్టబయలైంది. టీడీపీ నేత పురుషోత్తం నాయుడు లాక్డౌన్ నిబంధనలకు తూట్లు పొడిచాడు. నగరి సమీపంలోని ఎస్వీపురంలో గత మూడు రోజులుగా భౌతికదూరం పాటించకుండా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు. పురుషోత్తం నాయుడుతో పాటు పదుల సంఖ్యలో జనాలు గుమిగూడి విందు భోజనాలతో జల్సాలు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే రెడ్ జోన్లో నగరి ఉన్నప్పటికీ పట్టించుకోకుండా భౌతిక దూరం పాటించకుండా విందు భోజనాలు చేయడం గమనార్హం. (కరోనా: సింగరేణి రూ. 40 కోట్ల భారీ విరాళం ) పురుషోత్తం నాయుడు తాను బిర్యానీ తింటూ ఇతరులకు పెడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా టీడీపీ తరపున ఎంపీటీసీగా పురుషోత్తం నాయుడు నామినేషన్ దాఖలు చేశాడు. (ఈ ఫోటోకి ఏం అవార్డు ఇస్తారు?) -
కరోనా నియంత్రణ కోసం పోరాడుతున్న వారికి ధన్యవాదాలు
-
జగన్ ఖాతాలో గ్యారెంటీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తమిళనాడుకు సరిహద్దు నియోజకవర్గం నగరి. అందుకే ఇటు తెలుగు.. అటు తమిళ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తారు. నియోజకవర్గం ఏర్పడక ముందు తమిళనాడులోని తిరుత్తణి, నగరి కలిసి తిరుత్తణి తాలుకాలో ఉండేది. ఆ సమయంలో ఈ తాలుకాకు ఇద్దరు శాసనసభ్యులుండేవారు. నగరి అసెంబ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా ఇక్కడినుంచి గెలిచిన శాసన సభ్యుడు తమిళనాడు అసెంబ్లీకే వెళ్లేవారు. సరిహద్దు నియోజకవర్గాల్లో ఎదురయ్యే సమస్యలు అధికం కావటం.. పరిష్కారానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో 1961లో పటాస్కర్ అవార్డుతో నగరి నియోజకవర్గం ఆవిర్భవించింది. దీంతో తొలిసారి నగరి నియోజకవర్గానికి 1962లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆర్కే రోజా, టీడీపీ నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ బరిలో ఉన్నారు. పునర్విభజన తర్వాత.. 2009 పునర్విభజనకు ముందు నియోజకవర్గంలోని నగరి, పుత్తూరు రెండు అసెంబ్లీ సెగ్మెంట్లుగా ఉండేవి. పునర్విభజన తర్వాత నగరి, పుత్తూరు మునిసిపాలిటీగా ఏర్పడ్డాయి. అంతకుముందు నగరి, పుత్తూరు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఉండేవి. ప్రస్తుతం నగరి, పుత్తూరు, వడమాలపేట, విజయపురం, నిండ్ర మండలాలతో కలిపి నగరి నియోజకవర్గంగా ఉంది. అందుకే ఇక్కడి ప్రజలపై తమిళ సినీనటులు, అక్కడి నాయకుల ప్రభావం అధికంగా ఉంది. నగరి నియోజకవర్గ ప్రజలు చేనేత, నూలు వస్త్రాల తయారీ, మామిడి, చెరుకు సాగుపైన ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. గత ఎన్నికల చరిత్ర 1962లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి గోపాల్రాజు కాంగ్రెస్ అభ్యర్థి గోపాల్నాయుడిపై గెలుపొందారు. ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే 7 పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మూడుసార్లు టీడీపీ, ఒకసారి వైఎస్సార్సీపీ గెలుపొందారు. రెడ్డివారి చెంగారెడ్డి 8 దఫాలు పోటీచేసి ఐదుసార్లు విజయం సాధించారు. సినీ కళాకారులను ఆదరించిన నగరి నిర్మాత వీఎంసీ దొరస్వామిరాజు 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలవగా, రెండోసారి 1999లో ఓడిపోయారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ సినీ రంగంలో హీరోయిన్గా వెలుగొందిన ఆర్కే రోజా 2004లో పరాజయం పాలయ్యారు. 2014లో విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్కే రోజా టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడిపై సంచలన విజయం సాధించారు. టీడీపీకి సొంత ఇంటిలోనే వ్యతిరేకత నగరి అసెంబ్లీలో ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య పోటీ నెలకొని ఉంది. వైఎస్సార్సీపీ తరఫున అభ్యర్థిగా ఆర్కే రోజా మరోసారి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ పోటీ చేస్తున్నారు. ఇతని అభ్యర్థిత్వం పట్ల కన్నతల్లి ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ, సోదరుడు జగదీష్ వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా సొంత పార్టీలో అసంతృప్తులు, మరోవైపు జన్మభూమి కమిటీల దాష్టీకాలు, స్థానిక ప్రజాప్రతినిధులపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆర్కే రోజా దూసుకెళ్తుండగా, అసమ్మతిని చల్లార్చే పనిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ తలమునకలై ఉన్నారు. వార్ వన్ సైడ్..! వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సినీ నటి, ఎమ్మెల్యే రోజా మరోసారి విజయపథాన దూసుకెళ్తున్నారు. ఐదేళ్లూ టీడీపీ ప్రభుత్వం నగరి నియోజకవర్గంపై వివక్ష చూపింది. అదే విధంగా మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఆమె అనుచరులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సొంత నిధులతో నియోజకవర్గంలో ఆమె పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలనే లక్ష్యంతో ‘రాజన్న క్యాంటిన్’ ప్రారంభించి భోజనం అందిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు రూ.2లకే 20 లీటర్ల మినరల్ వాటర్ సరఫరా చేస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓటర్ల వివరాలు మొత్తం 1,86,227 పురుషులు 91,720 మహిళలు 94,495 ఇతరులు: 12 – తిరుమల రవిరెడ్డి, సాక్షి ప్రతినిధి, తిరుపతి -
నగరి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా ఆర్కే రోజ నామినేషన్
-
టీడీపీలో అసమ్మతి 'రాజు'కుంటోంది
టీడీపీలో క్షత్రియ సామాజిక వర్గం ప్రాభవం.. ప్రాధాన్యత రెండూ కోల్పోయింది. పుంగనూరు నుంచి వెంకటరమణ రాజును పక్కకు తప్పించిన అధినేత నగరిలో అశోక్‌రాజుకు మొండిచెయ్యి చూపారు. మరో వైపు టీటీపీ అధినేత ముందస్తు అభ్యర్థుల ప్రకటన నగరిలో బూమ్రాంగ్ అయ్యింది. గాలి భాను అభ్యర్థిత్వంపై అసమ్మతి సెగలు కక్కుతోంది. ఒకే కుటుంబానికి ఏళ్ల తరబడి అవకాశం కల్పిస్తుండడంపై పాతకాపులు ఒక్కటవుతున్నారు. అధినేత వద్ద తాడోపేడో తేల్చుకొనేందుకు అమరావతికి పయనమవుతున్నారు. పుత్తూరు: టీడీపీ అధినేత క్షత్రియ సామాజిక వర్గానికి మొండిచెయ్యి చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుంగనూరు అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని వెంకటరమణరాజు నుంచి తప్పించి అనీషా రెడ్డికి ప్రకటించిన చంద్రబాబునాయుడు, నగరి టీడీపీ పగ్గాలను దివంగత ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్‌కు కట్టబెట్టడంపై క్షత్రియ సామాజిక వర్గం ఆగ్రహం తో రగలిపోతోంది. అధినేత తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోనే కాకుండా రాయలసీమ ప్రాంతం నుంచి∙క్షత్రియ సామాజిక వర్గానికి చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పుంగనూరు, నగరి, గంగాధర నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో క్షత్రియ సామాజిక వర్గం బలంగా ఉంది. గతంలో నగరి నియోజకవర్గం నుంచి డి.రాజగోపాలరాజు, టీడీపీ తరఫున ఈవీ గోపాలరాజు, దొరస్వామిరాజు ఎమ్మెల్యేలుగా గెలిచారు. పుంగనూరు నుంచి వెంకటరమణరాజును పక్కన పెట్టడంతో నగరి నుంచి క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్‌రాజుకు అవకాశం కల్పిస్తారనే ప్రచారంతో ఆ సామాజిక వర్గం మొత్తం ఆశగా ఎదురుచూసింది. అధినేత రిక్తహస్తం చూపడంతో క్షత్రియ సామాజిక వర్గం భగ్గుమంటోంది. బయటపడుతున్న విభేదాలు.. నగరి టీడీపీలో విభేదాలు బయటపడుతున్నాయి. గాలి భానుప్రకాష్ అభ్యర్థిత్వంపై పాతకాపులు ఒక్కటవుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ముద్దుకృష్ణమనాయుడికే అధిష్టానం అవకాశం కల్పించింది. మళ్లీ ఇప్పుడు వాళ్ల కుటుంబానికే ప్రాధాన్యతనివ్వడంపై అసమ్మతి రాజుకుంటోంది. ముద్దు మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని ఆయన భార్య సరస్వతమ్మకు కట్టబెట్టిన అ«ధినేత నగరి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కూడా వారి కుటుంబానికే ఇవ్వడంపై ఆశావహులు ఆక్రోశం వెళ్ల్లగక్కుతున్నారు. ముద్దుకృష్ణమ ఉన్నంత వరకు ఆయన అడుగులకు మడుగులు ఒత్తే వాళ్లకే పార్టీలో, ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటి వాళ్ల అభిప్రాయాలు తీసుకొని గాలి భాను అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తీరుపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అమరావతికి పయనం.. టీడీపీకి అయువుపట్టయిన ఒక సామాజిక వర్గంలోనే గాలి భానుప్రకాష్ అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఆర్థికంగా, సామాజికంగా అండగా ఉన్న నాయకులు వ్యతిరేకిస్తున్నారు. నగరికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణమూర్తినాయుడు, పుత్తూరు ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ కీలక నాయకుడు కొరపాటి నరేంద్రబాబు, నిండ్ర, విజయపురం మండలాల్లోని సామాజిక వర్గం నాయకులు గాలి భాను అభ్యర్థిత్వాన్ని తీవ్రస్థాయిలో ఆక్షేపిస్తున్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గం నుంచి పాకా రాజా, క్షత్రియ సామాజిక వర్గం నుంచి అశోక్‌రాజు, కమ్మ సామాజిక వర్గం నుంచి కృష్ణమూర్తినాయుడుకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌తో శనివారం అమరావతికి పయనమవుతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అశావహుల్లో ముఖ్యడైన అశోక్‌రాజు మాత్రం ప్రస్తుతానికి గుంభనంగానే ఉన్నారు. -
నగరిపై మొదటి నుంచి కక్ష సాధింపే
►విద్యుత్ బిల్లులు చెల్లించని వారిపై కేసులు పెడితే ఉద్యమిస్తాం ►ముఖ్యమంత్రి తీరుపై ఎమ్మెల్యే రోజా ధ్వజం పుత్తూరు: నగరి నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటి నుంచి కూడా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. బుధవారం పుత్తూరు ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ బిల్లులు చెల్లించాలం టూ ప్రభుత్వం దళితులను వేధించడాన్ని ఎమ్మెల్యే రోజా ఆక్షేపించారు. గత ప్రభుత్వ హయాం నుంచి దళిత, గిరిజన గృహాలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఉందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 50 నుంచి 70 యూనిట్లకు పెంచా మని ఆర్భాటపు ప్రకటనలిస్తూ క్షేత్రస్థాయిలో మాత్రం వారిని బిల్లులు చెల్లించాలని వేధించడాన్ని ఆమె తప్పుపట్టారు. కరెంట్బిల్లు చెల్లించని దళితులు, గిరిజ నులపై రాష్ట్రప్రభుత్వం కేసులు నమోదుచేస్తే ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా తాగునీటి ఎద్దడి పొంచి ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్డబ్ల్యూఎస్, ఇతర ఇంజినీరింగ్ అధికారులను కుప్పంకు డిప్యుటేషన్‌పై పంపడం సరికాదన్నారు. మొదటిసారి ప్రకటించిన కరువు మండలాల జాబితాలో నగరి నియోజకవర్గం మొత్తానికి చోటు కల్పించకపోవడమే అందుకు ఉదాహరణ అన్నారు. ఎంపీడీవోలు, జేబీ కమిటీలతో కుమ్మక్కై అనర్హులకు సామాజిక భద్రతా పింఛన్లను కట్టబెడుతున్నారని ఆమె మండిపడ్డారు. నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కుప్పానికి తరలించిన అధికారులను వెంటనే యథాస్థానానికి పంపించే విధంగా కలెక్టర్ చొరవ తీసుకోవాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్ ఏలుమలై, నాయకులు రవిశేఖర్‌రాజు, దిలీప్‌రెడ్డి, ప్రతాప్, నారాయణ బాబు, మాహీన్, వడమాలపేట ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సురేష్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
నగరిలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సంబరాలు
చిత్తూరు : ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గమంతటా నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి... మిఠాయిలు పంచుకున్నారు. రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రోజా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీకి రోజా హాజరు కావచ్చని హైకోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాపై ఏపీ అసెంబ్లీ ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇవ్వంరా.. ఏం చేస్తావ్?
నగరి : నగరి నియోజకవర్గంలో నిర్వహించిన జన్మభూమి సభలో ఓ టీడీపీ నాయకుడు వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్‌ను అసభ్యంగా మాట్లాడారు. కేవీపీఆర్ పేటలో మంగళవారం జరిగిన జన్మభూమికు స్థానిక ఎమ్మెల్యే ఆర్కే రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో అర్హులకు పింఛన్లు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్ రాజలింగం అధికారులను కోరారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకుడు శ్రీను వేదికపైకి దూసుకొచ్చి ‘‘పింఛను ఇవ్వంరా... నీవల్ల అయ్యింది చేసుకో’’ అంటూ అధికారులు, పోలీసుల సమక్షంలోనే అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడారు. -
నేతన్నకు గిట్టుబాటెక్కడ?
VIPరిపోర్టర్ ఆర్.కె. రోజా,నగరి ఎమ్మెల్యే ‘పడకేసిన మగ్గం - చేదెక్కిన చెరకు’ నగరి నియోజకవర్గంలో నేత కార్మికులు, చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.ఒకప్పుడు దర్జాగా బతికిన నేతన్న.. ఇప్పుడు ముడిసరుకుల ధర పెరగడం.. గిట్టుబాటు ధర లేకపోవడంతో డీలాపడిపోయాడు. పెట్టుబడిలేక.. ప్రభుత్వాలు ఆదుకోక కూలీగా మారిపోయాడు. చెరకు రైతుల పరిస్థితీ అంతే. పది మందికీ పట్టెడన్నం పెట్టే అన్నదాత పిడికెడు మెతుకుల కోసం వెంపర్లాడుతున్నాడు. ఒక పక్క వర్షాభావం.. మరో పక్క గిట్టుబాటు ధరలేక అల్లాడాల్సి వస్తోంది. వీటిని పరిష్కరించి.. తమ బతుకులు కుదురుకునేదెప్పుడోనని కుమిలిపోతున్నారు. వీరి కష్టాలు.. కన్నీళ్లు తెలుసుకునేందుకు నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే.రోజా ‘సాక్షి’ తరపున విలేకరిగా మారారు. నియోజకవర్గంలోని చింతలపట్టెడ, కొత్తపేట, ఏకాంబరకుప్పం, గొల్లపల్లె, తడుకు గ్రామాల్లోని రైతులు, నేతన్నల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్కే రోజా: నమస్తే అన్నా.. నేను ఎమ్మెల్యే రోజాని. ‘సాక్షి’ తరపున విలేకరిగా వచ్చా. ఏం బాగున్నారా.. చేనేతకు ఉచిత కరెంట్ ఇస్తున్నారా? ఉదయన్ (నేతన్న): సుమారు 30 ఏళ్లుగా మగ్గం నేస్తా ఉండా. ఎవరూ మాకు చేసిందేమీ లేదు. ఉచితంగా కరెంటు ఇయ్యడం లేదు. తమిళనాడులో ఇచ్చే విధంగా రెండు నెలలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తే బాగుంటుంది. అట్లా ఇస్తేనన్నా కరెంటు బిల్లు కట్టే కష్టమన్నా తగ్గుతుంది. ప్రభుత్వం వారు పట్టించుకోవడంలేదు మేడం.. ఆర్కేరోజా: ప్రభుత్వం మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఏం చేస్తే సమస్య తీరుతుంది? జగన్నాథం (నేతన్న): పెభుత్వం వాళ్లు మమ్మల్ని మరమగ్గ కార్మికులమని గుర్తించి గుర్తింపు కార్డులు ఇస్తే మేలు. తమిళనాడులాగా కుటుంబానికి ఒక కార్డు ఇయ్యాల. ఆ కార్డుల ఆధారంగా పింఛన్లు ఇయ్యాల. ఆ కార్డులు గవర్నమెంటు అధికారులే ఇంటింటికీ తెచ్చి ఇయ్యాల. గత పెభుత్వం నేత రుణాలు రద్దు చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకూ రూపాయి కూడా రద్దు కాలేదు. బ్యాంకులో కొత్త అప్పులు పుట్టడంలేదు. ఏం చేసేదో అర్థం కావడం లేదు. ఆర్కే రోజా: నూలు అందడంలో ఏవైనా ఆటంకాలు ఉన్నాయా? మీ ప్రాంతంలో ఈటీపీ (రసాయ న నీటి శుద్ధీకరణ ప్లాంటు) కట్టారు కదా? అది మీకు ప్రయోజనకరమేనా? నీలమేఘం (మాస్టర్ వీవర్): వ్యవసాయదారుడు ఎంత ముఖ్యమో నేత కార్మికుడు కూడా అంతే ముఖ్యం. అయితే వ్యవసాయానికి విత్తనాలు సబ్సిడీ పై అందించే ప్రభుత్వం మాకు నూలును మాత్రం ఆ రకంగా అందించడం లేదు. ఈటీపీ ప్లాంటు కట్టడం మంచిదే. అయితే దాన్ని తొందరగా ప్రారంభించాలని కోరుతున్నాను. డైయింగ్ యూనిట్ల నుంచి వచ్చే నీళ్ల కారణంగా నీటి కాలుష్యం అవుతోంది. ఈ నీటిని ప్లాంటులో శుభ్రపరుస్తారు కాబట్టి ఆ సమస్య తీరుతుంది. అయితే డైయింగ్ యూనిట్లకు మీటర్లు ఏర్పాటుచేసి నీటిని తెప్పించి ట్రయల్ రన్ చేస్తామని చెప్పిన అధికారులు ఆ పనులను నానుస్తున్నారు. ఆర్కేరోజా: మహిళా నేత కార్మికుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేకసదుపాయాలేమైనా కల్పిస్తోందా? శారద (నేత కార్మికురాలు): అట్టాంటిదే మీ లేదమ్మా. మాకేం ప్రత్యేక సదుపాయాలులేవు. తమిళనాడులో అయితే చాలా చేస్తా ఉండారు. మా అక్క సొరకాయపేటలో ఉం ది. అక్కడ మగ్గం నడిపే ఆడోళ్లకి గర్భం వస్తే ప్రభుత్వమే నెలనెలా డబ్బు ఇస్తుంది. ఇక్కడ అలాంటిదేమీ లేదు. ఎంతకష్టమైనా భార్యాభర్తలిద్దరూ భరించాల్సిందే. ఆర్కేరోజా: పట్టువస్త్రాల తయారీలో లాభాలు ఉన్నాయా? సొంతంగా తయారు చేస్తున్నారా, కూలీకి నేసి ఇస్తున్నారా? ఆలూరు నరసింహులు, సుబ్రమణ్యం (చేనేత కార్మికులు): పట్టువస్త్రాల తయారీకి ఆర్డర్లు తగ్గాయి. ముడిసరకుల ధర పెనుభారంగా మారింది. లాభాలు అనే మాట మరిచిపోయాం. వేలకు వేలు పెట్టుబడి పెట్టి ముడి సరకులు కొనుగోలు చెయ్యలేక అవస్థలు పడుతున్నాం. ఈ కారణంగా చీర ధర పెరుగుతోంది. అమ్మకాలు తగ్గాయి. సొంతంగా తయారుచేయలేక.. ముడిసరకులు ఇచ్చేవారికి కూలికి నేసి ఇస్తున్నాం. ఆర్కేరోజా: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నేతన్నలకు పని కల్పించడానికి జనతా వస్త్రాల తయారీ విధానం ప్రవేశపెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం అలా పనికల్పిస్తోందా? హరిహరన్ (నేతన్న): ఎన్టీఆర్ కల్పించిన సదుపాయం ఇప్పుడు లేదు. పనిలేని సమయాల్లో నేతకార్మికులు చాలా కష్టపడుతున్నారు. నలుగురూ పనిచేసినా ఇల్లు గడవని పరిస్థితి ఉంది. తమిళనాడులో పనిలేని సమయాల్లో పనికల్పించడం కోసం ప్రభుత్వమే చీరలు, పంచెల ఆర్డర్లు ఇస్తోంది. చేనేత, మరమగ్గ కార్మికులు అనే భేదాభిప్రాయం లేకుం డా అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు సీఎంలుగా పనిచేసినా ఇక్కడి నేతకార్మికులకు ఎలాంటి సదుపాయాలు కల్పించకపోవడం మా దౌర్భాగ్యం. దయనీయంగా చెరకు రైతు ఆర్కేరోజా: ప్రస్తుతం చెరకు పంట సీజన్ నడుస్తోంది కదా? మీ పరిస్థితి ఎలావుంది. పాత బకాయిలను ఫ్యాక్టరీలు చెల్లించాయా? రామూర్తిరెడ్డి (చెరకు రైతు): చెరకు రైతులకు బకాయిలు ఇంకా ఇవ్వలేదు. జిల్లా వాసి చంద్రబాబు సీఎం ఉన్నారు. ఏం ప్రయోజనం.. ఆయనకు చీమకుట్టినట్లు కూడా లేదు. చిత్తూరు కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో రైతులకు లక్షలకొద్దీ బకాయిలు నిలిచిపోయాయి. నాకు నాలుగు లక్షలదాకా రావాలి. ఇలా ఉంటే పంట సాగు ఎలా చెయ్యగలం. మేం పండించి ఇచ్చిన పంటను తీసుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యం మాకు డబ్బులు ఇవ్వకుండా కాలం వెళ్లదీస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పరిస్థితి కొనసాగితే రైతులు ఆత్యహత్యలు చేసుకోవాల్సిందే. ఆర్కేరోజా: వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఏ మేరకు అందుతోంది? 9 గంటల కోతలేని విద్యుత్ అందిస్తున్నారా? శ్రీనివాసులు రెడ్డి (రైతు): అబ్బే లేదమ్మా. రోజుకి 6 గంటలు కూడా సక్రంగా ఇవ్వడం లేదు. అది కూడా అర్ధ రాత్రి ఇస్తున్నారు. కయ్యల్లో నీరు కట్టడానికి నానా తిప్పలు పడుతున్నాం. కూలోళ్లు కూడా రావడం లేదు. దీన్ని వదిలేసి వేరే పని చేసుకుందామనుకున్నా కొత్తగా ఏ పనీ రాకపోయే. మా పరిస్థితి చెప్పుకుంటే ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. ఆర్కేరోజా: చెరకురైతు పట్ల ప్రభుత్వ నిర్లిప్తతపై మీరేమంటారు? రవిశేఖర్‌రాజు (రైతు): గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సీఎంలు అయ్యారు. వీరిద్దరూ జిల్లా వాసులే. అయినప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఎలాంటి కృషీ చేయలేదు. రెండేళ్లుగా బకాయిలు పేరుకుపోతు న్నా యాజమాన్యాలతో చర్చించలేదు. బకాయిలు అందే విధంగా ఎవ్వరూ చొరవ తీసుకోవడంలేదు. ఇది చాలా బాధకలిగిస్తోంది. మనస్సు కుంగదీస్తోం ది. ఇప్పుడు మళ్లీ క్రషింగ్ మొదలైంది. చెరకు ఏ వి ధంగా వారికి తోలాలని ఆలోచనలో పడ్డాం. ఈ నెల 30న సహకార చక్కెర పరిశ్రమ మేనేజింగ్ డెరైక్టర్లతో సీఎం చంద్రబాబు చర్చిస్తామంటున్నారు. ఆ చర్చలేమైనా ఫలితాన్ని ఇస్తాయో లేదో.. చూడాల్సి ఉంది. లేకుంటే ధర్నాలకు దిగడం తప్ప మరోదారి లేదు. చెరకు రైతుల గోడు నగరి నియోజకవర్గంలో చెరకు రైతులెక్కువ. ఇక్కడ సుమారు 6 వేల హెక్టార్ల వరకు చెరకు పండిస్తారు. గానుగాడలేని వారు సమీపంలోని ఎస్వీ షుగర్స్, ప్రుడెన్షియల్, సాగర్ షుగర్ ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు. కానీ ప్రభుత్వాలు చెరకు రైతులను చిన్నచూపు చూస్తున్నాయి. పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలేదు. దీనికితోడు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఏళ్లతరబడి బకాయిలు చెల్లించకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నేతన్నల ఆక్రందన నగరి నియోజకవర్గం నేత కార్మికులకు పెట్టింది పేరు. ఇక్కడి వస్త్రాలు దేశ విదేశాలకూ ఎగుమతి అవుతుంటాయి. జిల్లాలో 25 వేల మరమగ్గాలుంటే అందులో నగరి నియోజకవర్గంలోనే 530 క్లస్టర్ యూనిట్లు ఉన్నాయి. వీటిపై 24 వేల మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాదికి 2000 మిలియన్ మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. వీరికి నేతపని తప్ప మరేపనులూ తెలి యవు. మగ్గమాడితేగాని డొక్కలేవని పరిస్థితి. పక్కనే ఉన్న తమిళనాడు ప్రభుత్వం రైతులకు అన్ని వసతులు కల్పిస్తోంది. కానీ ఇక్కడి పాలకులు ఆదిశగా చర్యలు చేపట్టకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. ఆర్.కె.రోజా హామీలు మీ గ్రామానికి విలేకరిగా వచ్చా. సమస్యలు అడిగి తెలుసుకున్నాను. నేతన్నలు తమిళనాడు తరహాలో తమకు ఎలాంటి సదుపాయాలూ లేవని, ఈ కారణంగా వృత్తిలో ముందడుగు వేయలేక పోతున్నామని చెప్పారు. చక్కెర ఫ్యాక్టరీలు తమకు బకాయిలు చెల్లించడం లేదని, దానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని, విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని చెరకు రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడుతా. రైతులకు, నేతన్నలకు అండగా ఉంటా. ప్రెజెంటేషన్: మైనంపాటి అన్నయ్య,కోనేరి చంద్రమోహన్ -
జగన్మోహన్రెడ్డి పర్యటన ఒక రోజు వాయిదా
సాక్షి, చిత్తూరు : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి నాలుగో విడత సమైక్యశంఖారావం, ఓదార్పు యాత్ర ఒకరు రోజు వాయిదా పడిందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కే.నారాయణస్వామి గురువారం తెలిపారు. శుక్రవారం నుంచి సాగాల్సిన యాత్ర శనివారానికి వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర ఉంటుందని వెల్లడించారు. కార్యకర్తలు, అభిమానులు, నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. రేపు నగరి నియోజకవర్గ పర్యటన నగరి, న్యూస్‌లైన్ : ముందుగా ప్రకటించినట్లుగా జగన్మోహన్ రెడ్డి 17వ తేదీన వడమాలపేట, పుత్తూరు పట్టణాల్లో పర్యటించడం లేదని కార్యక్రమం 18వ తేదీకి వాయిదా పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఆర్కే రోజా తెలిపారు. గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన పర్యటించే మార్గంలోనూ మార్పు చోటుచేసుకుందన్నారు. శనివారం ఉదయం జగన్మోహన్రెడ్డి రేణిగుంట విమానాశ్రయం నుంచి బైపాస్ సర్కిల్, కేఎల్ఎం హాస్పిటల్, గాజుల మండ్యం, షుగర్ ఫ్యాక్టరీ, అత్తూరు క్రాస్, కదిరి మంగళం క్రాస్, పూడి, పూడి బీసీ కాలనీ, కాయం ఎస్సీ కాలనీ, కాయం, కాయంపేట, బ్రాహ్మణపట్టు మీదుగా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలంలోని పత్తిపుత్తూరుకు వస్తారన్నారు. అప్పలాయగుంట, యనమలపాళెం, తిరుమణ్యం, టీఆర్ కండ్రిగ, వేమాపురం, వేమాపురం ఎస్సీ కాలనీ, గొల్లకండ్రిగ, వడమాల, వడమాలపేట, ఎస్వీపురం, తడుకు రైల్వేస్టేషన్, మజ్జిగ గుంట, తడుకు, గొల్లపల్లి, అగ్రహారం ప్రాంతాల్లో పర్యటిస్తూ పున్నమి జంక్షన్ నుంచి పుత్తూరు పట్టణంలోకి ప్రవేశిస్తారని, అక్కడి నుంచి ధర్మరాజుల గుడి వీధి, బజారు వీధి మీదుగా వచ్చి సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకుంటారని అక్కడ భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. -
‘సమైక్య శంఖారావం’ ఒకరోజు వాయిదా
* రేపటి నుంచి నగరి నియోజకవర్గంలో పునఃప్రారంభం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17 నుంచి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పునఃప్రారంభించాల్సిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర ఒకరోజు వాయిదా పడింది. జగన్‌కు తీవ్రమైన మెడనొప్పి కారణంగా యాత్ర వాయిదా పడిం దని, 18వ తేదీ నుంచి పర్యటన తిరిగి ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.