
సాక్షి, చిత్తూరు : నగరిలో ఓ టీడీపీ నేత నిర్వాకం బట్టబయలైంది. టీడీపీ నేత పురుషోత్తం నాయుడు లాక్‌డౌన్ నిబంధనలకు తూట్లు పొడిచాడు. నగరి సమీపంలోని ఎస్వీపురంలో గత మూడు రోజులుగా భౌతికదూరం పాటించకుండా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు. పురుషోత్తం నాయుడుతో పాటు పదుల సంఖ్యలో జనాలు గుమిగూడి విందు భోజనాలతో జల్సాలు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే రెడ్ జోన్‌లో నగరి ఉన్నప్పటికీ పట్టించుకోకుండా భౌతిక దూరం పాటించకుండా విందు భోజనాలు చేయడం గమనార్హం. (కరోనా: సింగరేణి రూ. 40 కోట్ల భారీ విరాళం )
పురుషోత్తం నాయుడు తాను బిర్యానీ తింటూ ఇతరులకు పెడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా టీడీపీ తరపున ఎంపీటీసీగా పురుషోత్తం నాయుడు నామినేషన్ దాఖలు చేశాడు. (ఈ ఫోటోకి ఏం అవార్డు ఇస్తారు?)
Comments
Please login to add a commentAdd a comment