సాక్షి, తిరుపతి: ఏపీలో వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని దళితుల ఇళ్లపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేయాడం అమానుషమని మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేదన్నారు. బాబు అధికారంలో ఉన్న ప్రతీసారీ ఇదే జరుగుతోందన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘నగరి మండలం తడుకుపేటలో దళితులపై దాడి ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని దళితులు ఇళ్లపై దాడి, వాహనాలు ధ్వంసం అమానుషం. చుండూరు, కారంచేడు ఘటనల్ని తలపించేలా తడుకుపేట ఘటన జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యానాదులపై కూడా ఇదే తరహాలో దాడులు చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేదు’ అంటూ బాబు సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ..‘తడుకుపేట దళితులపై దాడి ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టి కు తీసుకువెళ్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దళితులపై దాడులు ఎక్కువ అయ్యాయి. దళిత హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment