సాక్షి, తిరుపతి: తిరుమల విషయంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి సర్కార్ అధికారంలో ఉండగా జరుగుతున్నదేమిటి? అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా వైఫల్యం చెందిందన్న భూమన.. చంద్రబాబు పాలనలో మద్యం, మాంసం తిరుమలలో పట్టుబడుతున్నాయని దుయ్యబట్టారు.
‘‘శ్రీవారి ఆలయానికి సమీపంలో గుడ్డు బిర్యాని పట్టుబడిందంటే.. టీటీడీ వైఫల్యం మరోసారి బట్టబయలైంది. మారణాయుధాలలతో వచ్చిన పట్టించుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎల్లో మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేశారు. టీడీపీ నాయకులు సేవలో టీటీడీ చైర్మన్ పని చేస్తున్నారు, భక్తులను పట్టించుకోవడం లేదు.
..తిరుమల కొండపై ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ 4సార్లు పట్టు బడ్డారు. 40 సార్లు పట్టుబడకుండా తప్పించుకు తిరిగి ఉంటారు. లడ్డూ ప్రసాదం విషయంలో మాపై నింద మోపారు. మాపై నేరారోపణలు చేశారు. సనాతన హిందూ ధర్మం కోసం పీఠాధిపతులు, హిందుత్వ సంఘాలు.. పవన్ కల్యాణ్, చంద్రబాబును ప్రశ్నించాలని కోరుతున్నామని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment