
తిరుపతి, సాక్షి: అమ్మాయిలను మోసం చేసి వాళ్ల డబ్బుతో విలాసజీవితం గడిపే పరమనీచుడు వ్యక్తి కిరణ్ రాయల్ అని, జనసేన అధినేత పవన్ మద్దతు చూసుకునే రెచ్చిపోతున్నారని, అలాంటి వాడిపై తన పోరాటం కొనసాగుతుందని లక్ష్మి మరోసారి ఉద్ఘాటించారు. తిరుపతిలో శనివారం ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చి.. కిరణ్ రాయల్‌పై మరికొన్ని సంచలన ఆరోపణలు గుప్పించారు.
‘‘కిరణ్ రాయల్(Kiran Royal) అనే వ్యక్తి ఎవరు?. అతనేం బిజినెస్ చేస్తున్నాడు?. జనాన్ని మోసం చేయడం తప్ప ఎలాంటి వ్యాపారం చేయడు. అమ్మాయిలను మోసం చేసి విలాసజీవితం గడిపే వ్యక్తి. ఆడవాళ్ల దగ్గర డబ్బులు దోచుకుని రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్నాడు. అతనిలా మేం మోసాలు చేసి బతకలేదు. నా డబ్బుతో నేను బతుకుతున్నా. కిరణ్ రాయల్ బాధితులు ఎందరో ఉన్నారు. పరమ నీచుడైన కిరణ్ రాయల్.. కొందరిని దుర్మార్గంగా కొట్టాడు. అందుకు అతని భార్య రేణుక, కూతురే సాక్ష్యం. త్వరలో మరింత మంది బాధితులు బయటకు వస్తారు.
నేను ఏ పార్టీకి చెందిన దాన్ని కాదు. నిజాలు బయటపెడతానని నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. కిరణ్ రాయల్ వ్యవహారాలపై అన్నింటికి ఆధారాలు ఇచ్చాం. నేను న్యాయపోరాటం చేస్తుంటే.. వైఎస్సార్‌సీపీ నేతలకు అంటకడుతున్నారు. భూమన కుటుంబంతో నాకేం సంబంధం?. నాకు, భూమన కుటుంబ సభ్యులకు సంబంధం అంటగట్టి కిరణ్ రాయల్ నీచ ప్రచారం చేస్తున్నారు. నాకు అండగా ఎవరూ లేరనే భయం ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది.
మా అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) నా వెనక ఉన్నాడని కిరణ్ రాయల్ తరచూ నాతో చెప్తుండేవాడు. ఆ మద్దతు చూసుకునే చెలరేగిపోతున్నారు. ఇది నిజమో కాదో.. పవనే చెప్పాలి. కిరణ్ రాయల్ ఎంతో మంది ఆడవాళ్లను వేధించాడు. ఆ అరాచకాలపై నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గతంలో కిరణ్ రాయల్ అరెస్ట్ అయితే.. తన భర్తను బయటకు రప్పించాలని ఓ బాధితురాలిని రేణుక బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు’’ అని లక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు.
తన డబ్బు తనకు వచ్చేదాకా పోరాటం ఆగదని, ఆయన వెనకాల ఉన్నవారిపై దర్యాప్తు చేయాలని, కిరణ్ రాయల్‌లాంటి నీచుడ్ని ఎవరూ నమ్మొద్దని లక్ష్మి(Laxmi) విజ్ఞప్తి చేశారు.
