ఇవ్వంరా.. ఏం చేస్తావ్? | tdp leaders fight on ysrcp Councillor | Sakshi
Sakshi News home page

ఇవ్వంరా.. ఏం చేస్తావ్?

Published Wed, Jan 6 2016 3:59 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

ఇవ్వంరా.. ఏం చేస్తావ్? - Sakshi

ఇవ్వంరా.. ఏం చేస్తావ్?

నగరి : నగరి నియోజకవర్గంలో నిర్వహించిన జన్మభూమి సభలో ఓ టీడీపీ నాయకుడు వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన కౌన్సిలర్‌ను అసభ్యంగా మాట్లాడారు. కేవీపీఆర్ పేటలో మంగళవారం జరిగిన జన్మభూమికు స్థానిక ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో అర్హులకు పింఛన్లు ఇవ్వాలని వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన కౌన్సిలర్ రాజలింగం అధికారులను కోరారు.

ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకుడు శ్రీను వేదికపైకి దూసుకొచ్చి ‘‘పింఛను ఇవ్వంరా... నీవల్ల అయ్యింది చేసుకో’’ అంటూ అధికారులు, పోలీసుల సమక్షంలోనే అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement