
నగరి(చిత్తూరు): నేనూ బీసీ ఇంటి కోడలినే అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. సోమవారం ఆమె నగరిలోని క్యాంపు కార్యాలయంలో జయహో బీసీ మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ బీసీలను వెనుకబడిన వారిగా కాకుండా, వారే రాష్ట్రానికి వెన్నెముక అని గుర్తించిన ఏకైక సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు.
విజయవాడలో నిర్వహించే జయహో బీసీ మహాసభను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా 139 బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి జగనన్న బీసీల పక్షపాతిగా నిరూపించుకున్నారని చెప్పారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లోనూ 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. బీసీ వర్గాలు అంటే కేవలం ఓటు బ్యాంకుగా భావించి, ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తు తెచ్చుకునే చంద్రబాబుకు ఈ సారి గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు