సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. 11రోజులు పాటు 512 ఎకరాల్లో సారా తయారు చేస్తున్న వారిపై పోలీసులు దాడులు చేశారు. సారా తయారు చేయడానికి గంజాయి మొక్కల ధ్వంసం కారణంగా బహిరంగ మార్కెట్లో 76 కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. కాగా అక్రమంగా సారా తయారు చేస్తున్న 15మందిని అరెస్ట్ చేశామని, 13 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.
ఇప్పటి వరకు 84వేల 115 లీటర్ల సారా ధ్వంసం చేస్తున్నామని, గత ఐదు నెలల్లో అక్రమ దుకాణాలపై 4010 కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. రాత్రి 8 గంటలకే మధ్యం దుకాణాలు మూతపడుతుండటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి చెందిన వ్యక్తులే గతంలో పెద్ద ఎత్తున మద్యం దుకాణాలు నడిపేవారని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment