నయీంకు సహకరించిన వారి పేర్లను వెల్లడించాలి
Published Thu, Aug 11 2016 12:19 AM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM
నల్లగొండ టౌన్ : నయీం సమాంతర పాలనకు, వేలాది కోట్ల రూపాయలను సంపాదించడానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లను ప్రజలకు వెల్లడించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి పాలకులు నయీంను పెంచిపోషించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని హత్యలు, దాడులను చేయించారని ఆరోపించారు. ఇప్పుడు అదే నయీం పాలకులను బెదిరింపులకు పాల్పడినందున మట్టుబెట్టారన్నారు. నయీండైరీలో ఉన్నటువంటి పేర్లను వెల్లడించాలని, ఆయనకు సహకరించిన వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు. నయీం నేరసామ్రాజ్యంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బలవంతంగా లాగుకున్న భూములన్నింటిని బాధితులకు అందజేసి వారికి న్యాయం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తిరందాసు గోపి, తుమ్మల వీరారెడ్డి, ఎం.రాములు, జహంగీర్, కె.నర్సింహ పాల్గొన్నారు.
Advertisement
Advertisement