రాష్ట్ర విభజనకు సహకరించాలి
Published Tue, Sep 3 2013 2:51 AM | Last Updated on Mon, Jun 18 2018 8:13 PM
నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల విభజనకు సహకరించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కోరారు. సోమవారం నిర్మల్ పట్టణంలో టీ వీవీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అన్ని పార్టీలు అనుకూలమని ప్ర కటించి కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన అనంతరం యూటర్ను తీసుకోవడం విచారకరమన్నారు. ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టేందుకు తెలంగాణ ప్రజలను మోసం చేసేందు కు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది తానేనని ప్రకటించడంతో సీమాంధ్ర వైఖరి బయటపడిందన్నారు.
ఇదే ధోరణిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవలంభిస్తున్నారని ఆరోపించారు. తె లంగాణ ప్రాంతంలో ప్రత్యే క రాష్ట్రం కోసం ఉద్యమం జరిగినప్పుడు తన చేతుల్లో ఏమీ లేదని, ఢిల్లీ నాయకు ల చేతిలోనే ఉందని చెప్పిన ఆయన ఇప్పుడు సమైఖ్యాంద్రకు మద్దతుగా మాట్లాడటం శోచనీయమన్నారు. దీంతో ఆంధ్రా నాయకుల వైఖరి తేటతెల్లమయ్యిందన్నా రు. ముల్కీ అమరవీరుల స్మృతి ర్యాలీని ఈ నెల 7న హైదరాబాద్‌లో నిర్వహించ డం జరుగుతుందన్నారు. జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఐక్యంగా ఉండి వ్యక్తిత్వం కోల్పోకుండా ముందుకు సాగాలన్నారు. ఇం దులో జేఏసీ జిల్లా కన్వీనర్ కొట్టె శేఖర్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, నాయకులు కృష్ణంరాజు, కామారపు జగదీశ్వర్, పాకాల రాంచందర్, ముత్యంరెడ్డి, గంగాధర్, వై.సాయన్న, కిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement